Jump to content

Live updates: CBN crucial Delhi tour


nvkrishna

Recommended Posts

  • Replies 460
  • Created
  • Last Reply
డెమోక్రసీని కాపాడటం కోసమే రాహుల్‌ను కలిశా
భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు, రాహుల్

0521291BRK122-BABURAHUL.JPG

దిల్లీ: కేంద్ర ప్రభుత్వం అన్ని వ్యవస్థలనూ భ్రష్టు పట్టించిందని.. ఇలాంటి పరిస్థితుల్లో దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసమే కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీని కలిశానని సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు. రాహుల్‌తో చర్చలు జరిపిన చంద్రబాబు.. దేశాన్ని ఎలా కాపాడుకోవాలన్న అంశంపైనే చర్చించినట్టు వివరించారు. దిల్లీలో రాహుల్‌ నివాసంలో భేటీ అనంతరం ఇద్దరు నేతలు సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. ‘‘దేశాన్ని కాపాడదాం.. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిద్దాం’’ అనే నినాదంతో ఇరు పార్టీలు కలిసి పనిచేస్తాయని చంద్రబాబు స్పష్టంచేశారు. విభజన సమస్యల పరిష్కారానికి కూడా రాహుల్‌ మద్దతిచ్చారని, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరగా.. అందుకు ఆయన అంగీకరించారని వెల్లడించారు. రఫేల్‌ పోరాటాన్నిరాహుల్‌ ప్రజల్లోకి బాగా తీసుకెళ్లారని ప్రశంసించారు. భాజపాకు వ్యతిరేకంగా అన్ని రాజకీయపార్టీలను ఏకతాటిపైకి తీసుకొచ్చి భవిష్యత్తు ప్రణాళికను సిద్ధం చేస్తామని తెలిపారు. ఆర్బీఐ, సీబీఐ, ఈడీ, ఐటీ, గవర్నర్ల‌ వ్యవస్థ.. ఇలా అన్ని వ్యవస్థలూ సంక్షోభంలో కూరుకుపోతున్నాయని చంద్రబాబు ఆందోళన వ్యక్తంచేశారు. అన్ని రాజకీయ పార్టీలతో చర్చించి ఒక ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్తు కార్యాచరణను రూపొందిస్తామన్నారు.

పాత విషయాల జోలికి వెళ్లం.. రాహుల్‌

వచ్చే ఎన్నికల్లో భాజపాను ఓడించి.. ప్రజాస్వామ్యాన్ని, ప్రభుత్వ వ్యవస్థలను కాపాడమే లక్ష్యంగా తమ భేటీ మంచి వాతావరణంలో సాగిందని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ వెల్లడించారు. భాజపాను ఓడించడమే లక్ష్యంగా తమ పార్టీలు కలిసి పనిచేస్తాయని తెలిపారు. దేశాన్నికాపాడుకునేందుకు భాజపా వ్యతిరేక పార్టీలన్నింటినీ ఏకం చేసి ఒకే వేదికపైకి తీసుకొస్తామని చెప్పారు. గతంలో తమ పార్టీల మధ్య వైరుధ్యాలు ఉన్న మాట వాస్తవమే అయినప్పటికీ.. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులపైనే చర్చించినట్టు రాహుల్‌ తెలిపారు. తాము పాత విషయాల జోలికి పోవడంలేదన్నారు. ప్రస్తుత, భవిష్యత్తులో జరగబోయే అంశాలపైనే దృష్టి పెడుతున్నట్టు చెప్పారు. దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఎలా ముందుకు వెళ్లాలో చంద్రబాబుతో భేటీలో చర్చించినట్టు చెప్పారు. భాజపా అన్ని వ్యవస్థలపైనా దాడి చేస్తోందని రాహుల్‌ ఆందోళన వ్యక్తంచేశారు. రాజ్యాంగ వ్యవస్థలపై జరుగుతున్న దాడిని ఆపడమే తమ లక్ష్యమన్నారు. ఉమ్మడి కార్యాచరణను ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. నిరుద్యోగం, రైతు సమస్యలు, భాజపా కుంభకోణాలపై ఉద్యమిస్తామని రాహుల్‌ వివరించారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...