Jump to content

Live updates: CBN crucial Delhi tour


nvkrishna

Recommended Posts

“We are clear on one thing — if the BJP has to be kept out of power, all parties opposed to them have to join hands,” said a senior Trinamool Congress leader who did not want to be named.

“But it is too early to predict what shape the alliance will take or if it is going to be a different formula in states where regional parties are on a strong footing and a different formula nationally.”

Link to comment
Share on other sites

  • Replies 460
  • Created
  • Last Reply
శరద్‌ పవార్‌తో చంద్రబాబు భేటీ

0158350111BRK94A.JPG

దిల్లీ: దిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈరోజు మధ్యాహ్నం ఎన్‌సీపీ అధ్యక్షుడు శరద్ పవార్‌‌తో భేటీ అయ్యారు. భాజపా వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేసే కార్యాచరణలో భాగంగా చంద్రబాబు హస్తిన పర్యటనకు వెళ్లారు. ఈ క్రమంలోనే దిల్లీ విమానాశ్రయంలో కాంగ్రెస్‌ సీనియర్‌నేత గులాంనబీ ఆజాద్‌ చంద్రబాబును కలిశారు. దేశ రాజకీయాలపై ఇద్దరు నేతలు కాసేపు ముచ్చటించారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరిన చంద్రబాబు ఎన్‌సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌ నివాసానికి చేరుకున్నారు. అక్కడ పవార్‌తో పాటు జమ్మూకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్‌ అబ్దుల్లా తదితరులు ఆయనకు స్వాగతం పలికారు.
సాధారణ ఎన్నికలు, దేశంలో జరుగుతున్న పరిణామాలు, కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు, వివిధ రాజకీయ పార్టీల నేతలు, సంస్థలపై జరుగుతున్న ఐటీ దాడులు తదితర అంశాలపై చంద్రబాబు, పవార్‌ చర్చించారు. అనంతరం చంద్రబాబు ఫరూక్‌ అబ్దుల్లాతోనూ భేటీ కానున్నారు. దిల్లీ పర్యటనలో చంద్రబాబు వెంట మంత్రులు యనమల రామకృష్ణడు, కళా వెంకట్రావు, ఎంపీలు సీఎం రమేశ్‌, మాగంటి బాబు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు తదితరులు ఉన్నారు. మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో చంద్రబాబు భేటీ కానున్నారు.
Link to comment
Share on other sites

ఢిల్లీలో చంద్రబాబు బిజీబిజీ.. అగ్ర నేతలతో కీలక చర్చలు
01-11-2018 14:49:12
 
636766805928940865.jpg
ఢిల్లీ: ఏపీ సీఎం చంద్రబాబు హస్తినలో బిజీబిజీగా గడుపుతున్నారు. మహాకూటమి ఏర్పాటు దిశగా చంద్రబాబు చర్చలు చేపట్టారు. పర్యటనలో భాగంగా శరద్‌పవార్, ఫరూక్ అబ్దుల్లాతో చంద్రబాబు భేటీ అయ్యారు. పలు అంశాలపై మంతనాలు నిర్వహించారు. అనంతరం ఫరూక్ అబ్దుల్లా మాట్లాడారు. సీబీఐ, ఆర్బీఐలలో ఏం జరుగుతోందో చర్చించామని తెలిపారు. అలాగే సాధారణ ఎన్నికలు, దేశంలో జరుగుతున్న పరిణామాలపై కూడా చర్చించామన్నారు. కేంద్ర వ్యవస్థల నిర్వీర్యం వంటి అంశాలు కూడా చర్చకు వచ్చామని తెలిపారు.
 
శరద్‌పవర్‌ మాట్లాడుతూ.. సేవ్ కంట్రీ, సేవ్ డెమోక్రసీ అనే నినాదంతో ముందుకెళ్తున్నామన్నారు. దేశం క్లిష్ట పరిస్థితులల్లో ఉందని, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకోసమే ప్రజాస్వామ్య పరిరక్షణకు కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు.
 
చంద్రబాబు మాట్లాడుతూ.. శరద్‌పవార్, ఫరూక్ అబ్దుల్లా దేశంలోనే సీనియర్‌ నేతలు అని చెప్పారు. దేశంలో పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతుందని వ్యాఖ్యానించారు. వ్యవస్థలు నిర్వీర్యం అవుతున్నాయని తెలిపారు. సీనియర్‌ నాయకులుగా మేమంతా ఆందోళన చెందుతున్నామని స్పష్టం చేశారు. అందరం కలిసి భవిష్యత్‌ కార్యాచరణ నిర్ణయిస్తామని పేర్కొన్నారు. భవిష్యత్‌ తరాలు, దేశాన్ని రక్షించడానికి పూనుకోవాలనుకున్నామని వివరించారు.
naeoi-500.jpg
Link to comment
Share on other sites

14 minutes ago, niceguy said:

SkinnyFewIndusriverdolphin-size_restrict

vadu sigguleni lajakoduku ,bjp vallau baga vethiki  vidu baga leki XXXXXXXXX, vidu ayithe siggulekunda edi ayina vagagaladu anukoni , vadiki  rajay sabha seat icchi AP meda ki pamperu, daily vadi ni amma na bhutu tidutunnaru entho mandi  block chesukuntunnadu,siggu leni vedva vadu..

Link to comment
Share on other sites

59 minutes ago, niceguy said:

SkinnyFewIndusriverdolphin-size_restrict

 

eeedu gujarathi PM daggara, andhrula athma gouravam thakattu petti tholu bomma laga, tholu vyaparam chestha unnadi chaalaka, neethi dramalu palukuthunnada! thuppalaki emanna puttada eedu?

Link to comment
Share on other sites

రాహుల్‌ గాంధీతో చంద్రబాబు భేటీ 0346411BRK112-RAHUL.JPG

దిల్లీ: భాజపాపై సమరశంఖం పూరించిన తెదేపా జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు నాయుడు మరో కీలక అడుగేశారు. ‘జాతిని రక్షిద్దాం... ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం’ అనే నినాదంతో ఎన్డీయే వ్యతిరేక పక్షాలన్నింటినీ ఒకే వేదికపైకి తెచ్చేందుకు స్వయంగా నడుం బిగించిన చంద్రబాబు.. కొద్దిసేపటి క్రితమే కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో భేటీ అయ్యారు. గత కొంతకాలంగా దేశంలో జరుగుతున్న అనేక రాజకీయ పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు కాంగ్రెస్‌తో స్నేహంపై వ్యూహాత్మంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే తొలి సంతకం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపైనే ఉంటుందని రాహుల్‌ ప్రకటించిన నేపథ్యంలో ఇరు పార్టీల మధ్య సఖ్యతకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. తాజాగా, భాజపాయేతర పార్టీలను ఏకతాటిపైకి తేవడమే లక్ష్యంగా చంద్రబాబు రాహుల్‌తో భేటీ అయ్యారు. దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయ కూటమి ఏర్పాటుపై ఆయనతో చర్చించనున్నారు. ఇదే అంశంపై ఇప్పటికే శరద్ పవార్‌, ఫరూక్‌ అబ్దుల్లాలతో సీఎం భేటీ అయినవిషయం తెలిసిందే. రాహుల్‌తో భేటీలో సీఎం వెంట ఎంపీలు సీఎం రమేశ్‌, గల్లా జయదేవ్‌, కనకమేడల రవీంద్రకుమార్‌, మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్‌ రావు ఉన్నారు.

రాహుల్‌ను కలిసేందుకు వెళ్తున్న క్రమంలో తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు షబ్బీర్‌ అలీ, బండ్ల గణేశ్‌ చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా వారు చంద్రబాబుకు శుభాకాంక్షలు చెప్పారు.

Link to comment
Share on other sites

10 minutes ago, sonykongara said:
 

రాహుల్‌ను కలిసేందుకు వెళ్తున్న క్రమంలో తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు షబ్బీర్‌ అలీ, బండ్ల గణేశ్‌ చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా వారు చంద్రబాబుకు శుభాకాంక్షలు చెప్పారు.

Bandla Ganesh ticket kosam lobying anukunta..

Link to comment
Share on other sites

మీరు చెయ్యగలరు చంద్రబాబు, మీ సామర్థ్యం మీద మాకు నమ్మకం ఉంది.. మీరు చొరవ తీసుకుని, ఏం చెప్తే దాన్ని చెయ్యటానికి మేము సిద్దంగా ఉన్నాము.. 
రాహుల్ గాంధీ ఈ విషయం మీకు స్వయంగా చెప్పమన్నారు. -గులాం నబీ ఆజాద్
....
దేశానికి మా చంద్రబాబు మీద ఉన్న నమ్మకం అలాంటిది

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...