Jump to content

Recommended Posts

రేపు చంద్రబాబుతో గెహ్లాట్ భేటీ
09-11-2018 17:29:03
 
636773813448019406.jpg
 
మోదీ వ్యతిరేక కూటమిపై చంద్రబాబు ప్రయత్నాలు మరింత ఊపందుకుంటున్నాయి. రాహుల్ గాంధీతో చర్చల తర్వాత కాంగ్రెస్ కూడా ఈ ప్రయత్నాల్లో వేగం పెంచింది. రాహుల్ దూతగా చంద్రబాబుతో మాట్లాడేందుకు అశోక్ గెహ్లాట్ శనివారం అమరావతి వస్తున్నారు. భవిష్యత్‌ రాజకీయ కార్యాచరణపై వారు చర్చించనున్నట్లు సమాచారం.
 
 
ఎన్డీయే నుంచి చంద్రబాబు బయటకు వచ్చిన తర్వాత దేశంలోని ప్రాంతీయ పార్టీలతోపాటు మొత్తం అన్ని పార్టీలను ఏకం చేసే పనిలో పడ్డారు. రాహుల్ గాంధీతో భేటీ అయిన తర్వాత దేశంలో రాజకీయ పక్షాల్లో ఇదో పెద్ద సంచలనంగానే భావించాలి. చంద్రబాబు నిన్న కర్ణాటక వెళ్లి మాజీ ప్రధాని దేవెగౌడ, ఆయన కుమారుడు, సీఎం కుమారస్వామితో భేటీ అయ్యారు. శుక్రవారం సాయంత్రం చెన్నైవెళ్లి అక్కడ స్టాలిన్‌ను కలిసే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్డీయేకు వ్యతిరేకంగా జరుగుతున్న కూటమిలో భాగంగా అన్ని రాజకీయ పార్టీలను, ఆయా పార్టీల అధ్యక్షులను, కీలక నేతలను ఆయన కలుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాహుల్ దూతగా అశోక్ గెహ్లాట్ రేపు అమరావతికి వస్తున్నారు.
Link to comment
Share on other sites

  • Replies 173
  • Created
  • Last Reply
4 hours ago, sonykongara said:

 

 

These guys will come and talk about seat sharing in AP, don't succumb to it.. CBN and this fight is bigger than mere alliance with Congress. Don't make this some kind of UPA3, please :adore:

Link to comment
Share on other sites

దిల్లీ వేదికగా భేటీ
22న భాజపాయేతర పార్టీల సమావేశం
అజెండా, కార్యాచరణపై కసరత్తు
భావసారూప్య నేతలందరికీ ఆహ్వానం
స్వయంగా పిలవనున్న రాహుల్‌, చంద్రబాబు
తెదేపా అధినేతతో గహ్లోత్‌ సమావేశం
3 దశల్లో పార్టీలు జట్టు కడతాయన్న సీఎం
10hyd-main4a.jpg

ఈనాడు, అమరావతి: దేశవ్యాప్తంగా భాజపా వ్యతిరేక పార్టీలను కూడగడుతున్న తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ప్రయత్నాల్లో భాగంగా అత్యంత కీలకమైన భావసారూప్య పార్టీల తొలి కీలక భేటీకి ముహూర్తం ఖరారైంది. దిల్లీ వేదికగా ఈనెల 22న ఈ సమావేశం జరగనుంది. భాజపాపై పోరుకు అజెండా రూపకల్పన, భవిష్యత్తు కార్యాచరణ, కూటమి సంస్థాగత నిర్మాణంపై ఈ భేటీలో పార్టీలు చర్చలు జరపబోతున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, తెదేపా అధినేత చంద్రబాబు ఆయా పార్టీల నాయకులకు ఆహ్వానాలను పంపనున్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతికి రాహుల్‌ గాంధీ దూతగా వచ్చిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అశోక్‌ గహ్లోత్‌ శనివారం చంద్రబాబుతో భేటీ అయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. దిల్లీలో జరిగే తొలి భేటీలో భాజపాయేతర పార్టీల మధ్య చర్చలు జరగనున్నట్లు వెల్లడించారు.

భవిష్యత్తు కార్యాచరణకే: చంద్రబాబు
‘కాంగ్రెస్‌ పార్టీ ఆహ్వానాలు పంపుతుంది. నేనూ పంపుతా. అందరం కలిసి చర్చించుకుంటాం. భాజపాయేతర కూటమిలో 3 దశల్లో పార్టీలు జట్టు కడతాయని స్పష్టం చేశారు. తొలుత 5 రాష్ట్రాల ఎన్నికల ముందు కొన్ని పార్టీలు కలుస్తాయని చెప్పారు. ఆ తర్వాత పార్లమెంటు ఎన్నికల ముందు కొన్ని పార్టీలు చేరతాయని, పార్లమెంటు ఎన్నికల తర్వాత వచ్చి చేరే పార్టీలూ ఉంటాయని వివరించారు. శివసేన, నవీన్‌ పట్నాయక్‌లనూ కలుపుకొని వెళ్తారా అని ప్రశ్నించగా... ‘మొదట భాజపాయేతర వేదికగా ఏర్పాటు చేస్తాం. కాంగ్రెస్‌ ప్రధాన ప్రతిపక్షమైనందున ఆ పార్టీ భాగస్వామి అవుతోంది’ అని చెప్పారు. తాను కలిసిన నాయకులంతా ఈ సమావేశానికి హాజరయ్యేందుకు అంగీకరించారని చంద్రబాబు తెలిపారు. ఒకరిద్దరు నాయకులకు ఎన్నికలవల్ల కొన్ని రిజర్వేషన్లు ఉన్నాయని, వారు 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాతైనా, పార్లమెంటు ఎన్నికల తర్వాతైనా ఈ వేదికలోకి వచ్చి చేరతారని పేర్కొన్నారు. 5 రాష్ట్రాల ఎన్నికల్లో కలిసి ప్రచారం చేసే అంశంపై మాట్లాడుకోలేదని వివరించారు. దేశంలో ఉన్నవి రెండే వేదికలని, ఒకటి భాజపా అనుకూల, రెండు భాజపా వ్యతిరేక వేదికలని చెప్పారు. భాజపా వ్యతిరేక వేదికలోకి రాని ఏ పార్టీ అయినా భాజపాకు మద్దతిస్తున్నట్లేనని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రభుత్వమూ భాజపా అజెండాతోనే వెళ్తోందని పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌తో కలిసి ప్రచారం చేస్తారా? అని ప్రశ్నించగా.. చర్చించి నిర్ణయిస్తామని సమాధానమిచ్చారు. యూపీఏలో చేరుతున్నట్లేనా? అని ఒక విలేకరి ప్రశ్నించగా... కొన్ని పక్షాలు యూపీఏలో ఉన్నాయని, మరికొన్ని రాజకీయ పక్షాలు స్వతంత్రంగా ఉన్నాయని, ఎవరు ఎక్కడున్నారన్నది కాదని, ఇది భాజపా వ్యతిరేక ప్రజాస్వామ్య పరిరక్షణ వేదికని చంద్రబాబు స్పష్టం చేశారు.

10hyd-main4b.jpg

ఇలాగే రద్దు చేసుకుంటూ పోతారా?: గహ్లోత్‌
‘అన్ని వ్యవస్థలనూ భాజపా నాశనం చేస్తోంది. రాజ్యాంగ వ్యవస్థలను దెబ్బతీసింది. నాలుగున్నరేళ్ల మోదీ పాలనలో రైతులు, యువత, దళితులు, మైనారిటీలు, చిన్న వ్యాపారులు ఇలా అన్నివర్గాలూ ఆందోళనలో ఉన్నాయి. ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నాం చేశారు. నోట్ల రద్దుతో నల్లధనం నియంత్రణ, నక్సలిజం, ఉగ్రవాదం అంతమవుతుందని చెప్పారు. అవేమీ జరగకపోయేసరికి.. ఆర్థిక మంత్రి స్పందించి ఇవన్నీ నోట్ల రద్దులో తమ అజెండా కానే కాదు. రెవెన్యూ పెంచడమేనని ప్రకటించారు. సమర్థ ఆర్థిక నిర్వహణతో రెవెన్యూ పెరుగుతుంది. నోట్ల రద్దుతోనే రెవెన్యూ పెరిగితే మున్ముందు ఇలాగే నోట్లు రద్దు చేసుకుంటూ పోతారా?.. దేశంలో అప్రకటిత అత్యయిక పరిస్థితి ఉంది. అందువల్లే చంద్రబాబు తొలిసారి కాంగ్రెస్‌తో కలిసి ఒకే వేదికపైకి రావడానికి నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబుతో చర్చలు బాగా జరిగాయి’ అని అశోక్‌ గహ్లోత్‌ పేర్కొన్నారు.
చంద్రబాబు, గహ్లోత్‌లు దాదాపు గంటసేపు ముఖాముఖీ భేటీ అయ్యారు. భాజపాయేతర పక్షాల తొలి భేటీకి అజెండా, వేదిక, ఏయే పార్టీల నేతల్ని ఆహ్వానించాలన్న అంశాలపై ప్రధానంగా వారిద్దరి మధ్య చర్చ జరిగింది. భాజపాను వ్యతిరేకించే రాజకీయ పార్టీలైనప్పటికీ... కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్‌, ఇతర పార్టీలు రాజకీయ ప్రత్యర్ధులుగా ఉన్నాయని, ఇలాంటి వాటి విషయంలో ఎలాంటి వైఖరి అనుసరించాలన్న అంశం చర్చకు వచ్చింది. జాతీయ స్థాయిలో భాజపాను వ్యతిరేకించే పక్షాల సమావేశం కనుక అత్యధిక పార్టీల అగ్రనేతలు హాజరవుతారనే అభిప్రాయానికి వారు వచ్చారు. ఎన్నికల సమయంలో ఐటీ దాడులు జరుగుతుండటం ప్రస్తావనకు వచ్చింది. ఎన్నికల సమయంలో ప్రతిపక్షాల్ని బలహీనపరిచేందుకు అన్ని రకాల దర్యాప్తు సంస్థల్ని వాడుకుంటున్న తీరుపై ఉద్యమించటంలో అన్ని పక్షాలనూ భాగస్వాముల్ని చేయాలని అనుకున్నారు. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఛైర్మన్‌ పదవిలో ఉన్న అధికారికి ఇటీవలే రెండేళ్ల పొడిగింపు ఇచ్చారని, అలాంటి వారు తటస్థంగా పని చేస్తారని ఎలా అనుకుంటామన్న ప్రస్తావన సమావేశంలో వచ్చినట్లు పార్టీవర్గాల కథనం. 22న దిల్లీలో భేటీ అనంతరం భాజపాను వ్యతిరేకించే పార్టీల అగ్రనేతలంతా కలిసి రాష్ట్రపతి, కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనరు, సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషనరు తదితరులతో సమావేశమై... కేంద్ర ప్రభుత్వ వైఖరి, వ్యవస్థల్ని భాజపా అనుకూలంగా వాడుకుంటున్న తీరుపై ఫిర్యాదు చేయాలన్న ఆలోచన చేశారు.

 
Link to comment
Share on other sites

లెఫ్ట్‌తోనూ రైట్‌
20-11-2018 02:09:14
 
636782765553412132.jpg
  • రాష్ట్రంలోనే వామపక్షాలతో ఫైట్‌
  • జాతీయ స్థాయిలో దోస్తీకి సిద్ధం
  • కేంద్రంలో బీజేపీపై ఉమ్మడి పోరాటం
  • బాబుతో భేటీలో మమత స్పష్టీకరణ
  • కూటమి కూర్పుపై ఇరువురి చర్చలు
  • కొత్త పేరుతో ప్రజల్లోకి.. కీలక నిర్ణయం
  • ‘యూపీఏ’పై కాంగ్రెస్‌ పట్టుపడితే...
  • రెండు కూటములుగా బీజేపీతో పోరు
అమరావతి, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వామపక్షాలతో ఉప్పూ నిప్పులా ఉన్నప్పటికీ... కేంద్రంలో బీజేపీని గద్దెదించేందుకు లెఫ్ట్‌తో దోస్తీకి సిద్ధమని తృణమూల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు, బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేర్కొన్నారు. దేశం, ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉన్నప్పుడు బీజేపీ చర్యలకు వ్యతిరేకంగా అందరితో కలిసి పనిచేయడానికి తాము సిద్ధమని ఆమె తెలిపారు. బీజేపీ వ్యతిరేక పార్టీలను ఏకతాటిపైకి తేవడంలో భాగంగా తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు సోమవారం కోల్‌కతాలో మమతా బెనర్జీతో భేటీ అయ్యారు. సుమారు 70 నిమిషాలపాటు ఆమెతో చర్చలు జరిపారు. బీజేపీ వ్యతిరేక కూటమిని ఆచరణాత్మకంగా, బలోపేతంగా తీర్చిదిద్దడంపై చర్చించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం... ‘‘కొన్ని సందర్భాల్లో పార్టీలు రాష్ట్ర స్థాయిలో పరస్పరం పోటీ పడాల్సి వస్తుంది. ఆ పోటీలను రాష్ట్రాలకే పరిమితం చేసి జాతీయ స్థాయిలో కలిసి పనిచేయాలి. కేరళలో కాంగ్రెస్‌, వామపక్షాలు పరస్పరం పోటీపడతాయి. బెంగాల్‌లో మేం... వామపక్షాలు కలిసి పోటీచేయలేకపోవచ్చు.
 
అలాగే మరి కొన్ని రాష్ట్రాల్లో వేరే పరిస్థితులు ఉండవచ్చు. వాటిని ఆ ప్రాంతాలకే పరిమితం చేయాలి. జాతీయ స్థాయికి తీసుకురాకూడదు. ఏ రాష్ట్రంలో ఏ పార్టీ బలంగా ఉంటే అక్కడ కూటమి నాయకత్వం ఆ పార్టీకి ఇవ్వాలి. కూటమిలోని మిగిలిన పార్టీలతో సమన్వయం... కలిసి పోటీచేయడం వంటి అంశాలను ఆ పార్టీ చూసుకోవాలి. ఏ రాష్ట్రానికా రాష్ట్రాన్ని ఒక యూనిట్‌గా పరిగణించి ఎక్కడి అంశాలను అక్కడే పరిష్కరించుకోవడం మంచిది. జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాల సమస్యలను ఢిల్లీలో పరిష్కరించాలంటే కుదిరే పని కాదు’’ అని మమత అభిప్రాయపడ్డారు. కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్‌, బీఎస్పీ మధ్య ఏర్పడిన సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఆమె ఈ సూచన చేసినట్లు చెబుతున్నారు. ఈ అభిప్రాయం బాగుందని, మిగిలిన పార్టీల వైఖరి కూడా తెలుసుకుని.. ఈ పద్ధతిలోనే ముందుకు వెళ్దామని చంద్రబాబు చెప్పారు. ఒక బలమైన నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని కూడా నిశ్చయించారు. బీజేపీ హఠావో... దేశ్‌ కో బచావో వంటి ప్రజాకర్షక నినాదాన్ని దేనినైనా ఎంచుకొని వెళ్లాలని అనుకున్నారు.
 
కూటమికి పేరేమి?
బీజేపీయేతర పార్టీల కూటమికి కొత్త పేరును ఎంపిక చేసి దానిని ప్రచారంలోకి తీసుకెళ్లాలని చంద్రబాబు, మమత నిశ్చయించారు. కాంగ్రెస్‌ నాయకత్వంలోని కూటమికి ప్రస్తుతం యూపీఏ అని పేరుంది. ఆ కూటమి అలాగే ఉండాలని కాంగ్రెస్‌ కోరుకుంటే... యూపీఏలో లేని పార్టీలు మరో పేరుతో కూటమిని ఏర్పాటు చేసుకోవాలని, రెండు కూటములు కలిసికట్టుగా ఎన్నికల్లోకి వెళ్లాలని అనుకున్నారు. యూపీఏ పేరుపై పట్టింపు లేదని కాంగ్రెస్‌ చెబితే అప్పుడు అన్ని పార్టీలు కలిసి కొత్త పేరుతో ఫ్రంట్‌గా ఏర్పాటు కావాలని నిర్ణయించారు.
 
కలిసి కట్టుగా ఉన్నాం...
భేటీ అనంతరం మమత, చంద్రబాబు సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. మీ ప్రధాని అభ్యర్థి ఎవరని ప్రశ్నించగా... ‘‘మాలో అనేక మంది మోదీ కంటే రాజకీయంగా సీనియర్లమే. అర్హత కలిగినవారు చాలా మంది ఉన్నారు. ఎవరికి అవకాశమివ్వాలో అందరం కలిసి నిర్ణయించుకుంటాం’’ అని మమత చెప్పారు. భవిష్యత్‌ ప్రణాళికపై చంద్రబాబుతో చర్చించానన్నారు. ‘ఒక్కటి మాత్రం చెప్పగలను. దేశాన్ని కాపాడుకోవడంలో బీజేపీకి వ్యతిరేకంగా చేసే పోరాటంలో మేమంతా కలిసికట్టుగా ఉన్నాం. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మోదీ ప్రభుతానికి వ్యతిరేకంగా నడుస్తాం. పార్లమెంటు సమావేశాలకు ముందు కలిసి భావి ప్రణాళికను ఖరారుచేస్తాం’ అని వివరించారు.
 
ఒత్తిడిలో కీలక సంస్థలు: బాబు
మోదీ ప్రభుత్వ హయాంలో సీబీఐ, ఈడీ, ఊటీ, ఆర్‌బీఐ, కాగ్‌ సంస్థలు తీవ్ర ఒత్తిడిలో ఉన్నాయని చంద్రబాబు అన్నారు. దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని.. పై సంస్థలను సంరక్షించాల్సి బాధ్యత తమపై ఉందని తెలిపారు. ‘22న ప్రతిపాదించిన సమావేశాన్ని వాయుదా వేశాం. పార్లమెంటు సమావేశాల ముందు భేటీ కావాలని భావిస్తున్నాం. బీజేపీని వ్యతిరేకిస్తున్న వారంతా వచ్చి చర్చిస్తారు. దేశాన్ని రక్షించుకునేందుకు.. ప్రస్తుత సానుకూల వాతావరణాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి ఓ కార్యక్రమాన్ని రూపొందించుకుంటాం. ఏ తేదీన కలవనున్నదీ త్వరలోనే తేదీని ఖరారుచేస్తాం’ అని తెలిపారు.
 
70 నిమిషాలు ఆంతరంగిక చర్చలు..
చంద్రబాబుతోపాటు వెళ్లిన నేతలందరితో కలిసి అరగంటపాటు వివిధ అంశాలపై మమత చర్చించారు. ఈ భేటీ తర్వాత గంటా పది నిమిషాలపాటు చంద్రబాబుతో ఏకాంతంగా మాట్లాడారు. జాతీయ స్థాయిలో రాజకీయ పరిస్ధితి, రాష్ట్రాల వారీగా ప్రస్తుత పరిస్థితులు, ప్రతిపక్షాలు ఉమ్మడిగా చేపట్టాల్సిన కార్యాచరణ, దీనికి సంబంధించిన రోడ్‌మ్యాప్‌, కూటమిలోకి ఇంకా కలుపుకొని వెళ్లాల్సిన పార్టీలు, బీజేపీ ఎత్తుగడలు, వివిధ రాజ్యాంగ సంస్థలను బీజేపీ తన రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్న తీరు తదితర అంశాలు వారి మధ్య చర్చకు వచ్చాయని చెబుతున్నారు. చంద్రబాబుతోపాటు కోల్‌కతా వెళ్లినవారిలో కేంద్ర మాజీ మంత్రులు అశోక్‌ గజపతిరాజు, సుజనా చౌదరి, రాష్ట్ర మంత్రులు యనమల రామకృష్ణుడు, కళావెంకట్రావు, టీడీపీ ఎంపీలు సీఎం రమేశ్‌, కనకమేడల రవీంద్రకుమార్‌, ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్‌రావు ఉన్నారు. మమతకు చంద్రబాబు శాలువా కప్పి వేంకటేశ్వరస్వామి ప్రతిమను బహుకరించారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...