Jump to content

Recommended Posts

  • Replies 173
  • Created
  • Last Reply
మీ పలుకుబడితో పార్టీలను ఏకం చేయండి
చంద్రబాబుకు అఖిలేశ్‌ ఫోన్‌
1న దిల్లీకి చంద్రబాబు
0801313010AKHILESHHA.JPG

అమరావతి: తెదేపా అధినేత, ఏపీ సీఎం చంద్రబాబుకు సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు, యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌ ఫోన్‌ చేశారు. కాంగ్రెస్‌ సహా అన్ని విపక్షాలను ఒకే వేదికపైకి తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉందని చంద్రబాబుతో అఖిలేశ్‌ చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే బాధ్యత మనపై ఉందన్నారు. భాజపాయేతర భావజాలం ఉన్న పార్టీలన్నీ ఒకే వేదికపైకి రావాలని, జాతీయస్థాయిలో ఉన్న పలుకుబడితో పార్టీలను ఏకం చేయాలని చంద్రబాబును అఖిలేశ్‌ కోరారు. నిరంకుశ పోకడల నుంచి దేశాన్ని కాపాడాలన్నారు. లౌకికవాదం ప్రమాదంలో పడిందని, ప్రజాస్వామ్య విలువలు కాపాడాలని అఖిలేశ్‌ అభిప్రాయపడ్డారు. తెదేపా ప్రయత్నాలకు సమాజ్‌వాదీ నుంచి సహకారం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. కేవలం నాలుగేళ్లలోనే ఏపీ గొప్ప అభివృద్ధి సాధించిందని కొనియాడారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసిందన్నారు. నిరర్ధక ఆస్తులు నాలుగున్నరేళ్లలో ఆరేడు రెట్లు పెంచేశారని ఆరోపించారు. దేశంలోని ఎస్సీ, ఎస్టీ, ముస్లింలలో అభద్రతా భావం పెరిగిందని అఖిలేశ్‌తో చంద్రబాబు చెప్పారు. తెలుగుదేశం ప్రయత్నాలకు సహకరించాలని ఈ సందర్భంగా అఖిలేశ్‌ను కోరారు. దీనికి ఆయన స్పందిస్తూ పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు.

మరోవైపు నవంబర్‌ ఒకటో తేదీన సీఎం చంద్రబాబు దిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. భాజపాయేతర పక్షాలను ఏకతాటిపైకి తీసుకురావడమే అజెండాగా సీఎం దిల్లీ పర్యటన కొనసాగనుంది.

Link to comment
Share on other sites

రేపు ఢిల్లీలో కీలక ఘట్టం.. రాహుల్‌తో చంద్రబాబుతో భేటీ!
31-10-2018 16:13:55
 
636765992817930420.jpg
అమరావతి: రేపు ఢిల్లీలో కీలక పరిణామాలు జరగబోతున్నాయి. హస్తిన వేదికగా విపక్ష నేతలు కలవబోతున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఉదయం శరద్‌ పవార్‌, ఫరూక్‌ అబ్దుల్లాతో చంద్రబాబు సమావేశం అవుతారు. మధ్యాహ్నం వామపక్ష నేతలతో, సాయంత్రం అఖిలేష్‌ యాదవ్‌తో చంద్రబాబు భేటీకానున్నారు.
 
 
'సేవ్‌ నేషన్‌' పేరుతో బీజేపీకి ప్రత్యామ్నాయంగా జాతీయ స్థాయిలో చంద్రబాబు కూటమి ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీకి అన్యాయం చేస్తున్న బీజేపీ తీరును ఎండగట్టాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేవారితో కలిసి వెళ్లేందుకు ఆ దిశగా తెలుగుదేశం పార్టీ అడుగులు వేస్తోంది.
 
Tags : Rahul Gandhi, chandrababunaidu, Delhi
Link to comment
Share on other sites

రాహుల్‌తో రేపు చంద్రబాబు భేటీ?

04230031BRK119-RAHUL.JPG

అమరావతి: దిల్లీలో గురువారం కీలక రాజకీయ పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. భాజపాయేతర కూటమి ఏర్పాటుకు కీలక సమాలోచనలు జరగనున్నాయి. ‘సేవ్‌ నేషన్‌’ నినాదంతో భాజపాయేతర పార్టీలన్నింటనీ ఏకతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా తెదేపా అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు గురువారం దిల్లీకి వెళ్తున్నారు. ఈ పర్యటనలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతోనూ భేటీ అయ్యే అవకాశం ఉంది. ఈ వారంలో చంద్రబాబు దిల్లీకి వెళ్లడం రెండోసారి కానుంది. భాజపాయేతర కూటమి ఏర్పాటులో కీలక అడుగులు వేస్తున్న చంద్రబాబు మొన్న జరిగిన పర్యటనలో పలువురు జాతీయ స్థాయి నాయకులతో భేటీ అయ్యారు. దీనికి కొనసాగింపుగానే రేపటి దిల్లీ పర్యటన కొనసాగే అవకాశం ఉన్నట్టు సమాచారం.

భాజపా యేతర కూటమిపై క్లారిటీ వచ్చేనా?

ఈ రోజు మధ్యాహ్నం అమరావతిలోని సచివాలయంలో అందుబాటులో ఉన్న మంత్రులతో లంచ్‌ మీటింగ్‌ ఏర్పాటు చేసిన చంద్రబాబు వారితో కీలక అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌తో భేటీ అంశం చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. రేపటి దిల్లీ పర్యటనలో చంద్రబాబు రాహుల్‌ను కలిసే అవకాశం ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. భాజపాయేతర కూటమి ఏర్పాటుపై వడివడిగా అడగులు వేయాలని చంద్రబాబు భావిస్తున్న నేపథ్యంలోనే ఆయన రాహుల్‌తో భేటీ కానున్నట్టు సమాచారం. ఈ పర్యటనలో సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్‌ యాదవ్‌, ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధినేత ఫరూక్‌ అబ్దుల్లా తదితరులతో భేటీ కానున్నారు. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల దృష్ట్యా ఈ భేటీ కీలకం కానుంది. అలాగే, భాజపాయేతర కూటమి ఏర్పాటుపైనా రేపు ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Link to comment
Share on other sites

దేవెగౌడ , కేజ్రీవాల్ , అఖిలేష్ తో మాట్లాడా మాయావతి, శరద్ యాదవ్ ని కలిశాను CPI & CPM లతో మాట్లాడా మమత తో రెగ్యులర్ గా మాటాడుతూనే ఉన్నా రేపు రాహుల్ ని కలవబోతున్నా : NCBN

Link to comment
Share on other sites

4 minutes ago, Kiran said:

Aithe congress websites cover chesthai anamata

Evaro okaru chesthunnaru ga. Modi batch entha addukunna, kaneesam deno dantlo coverage vachidhi ga. Ippudaithe atu itu kakunda aipoyindhi ga maa paristhithi.

Link to comment
Share on other sites

2 minutes ago, ravikia said:

Evaro okaru chesthunnaru ga. Modi batch entha addukunna, kaneesam deno dantlo coverage vachidhi ga. Ippudaithe atu itu kakunda aipoyindhi ga maa paristhithi.

Monna congress websites kuda sarigga cover cheyala, so ippudu Raul baba kosam delhi kabatti coverage chestharemole antunna

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...