Jump to content

Loan Waiver in AP


MadhuNTR

Recommended Posts

  • 3 weeks later...
  • 3 weeks later...
  • 4 weeks later...
సంక్రాంతి తర్వాత సంపూర్ణ మాఫీ

 

తేదీలను ముందుగానే ప్రకటిస్తాం
సాగుకు 9 గంటల విద్యుత్తు
మోదీ అబద్ధాలకు ఒక్క ఓటూ పడదు
 జగన్‌ కేసులను మొదటికి తెచ్చేందుకే హైకోర్టు విభజన
జన్మభూమిలో ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలు
రాజాం - న్యూస్‌టుడే

5ap-main1a_1.jpg

విశాఖలో జగన్‌పై దాడి కేసును కేంద్రం ఎన్‌ఐఏకి అప్పగించింది. ఇది కావాలని చేసిందే. జగన్‌ అభిమానినని, సానుభూతి వస్తుందనే ఈ పనిచేశానని దాడి చేసిన వ్యక్తే స్పష్టంగా చెప్పాడు. అలాంటి కేసునూ ఎన్‌ఐఏకి అప్పగించారంటే.. ఏం చెప్పాలో ఆలోచించండి.
‘కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవడానికి కేంద్రం, ఆర్బీఐ, బ్యాంకులు సహకరించకపోయినా.. ఎవరు వద్దన్నా.. రూ.24 వేల కోట్ల రుణమాఫీ చేశాం. ప్రభుత్వం వద్ద డబ్బుల్లేకున్నా.. 10% వడ్డీతో వారి రుణాలు చెల్లించే బాధ్యత తీసుకున్నాం. మిగిలిన రుణాలను సంక్రాంతి దాటాక పూర్తి స్థాయిలో మాఫీ చేస్తాం. ఏయే తేదీల్లో మాఫీ చేసేది ముందుగానే ప్రకటిస్తాం’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గం పొగిరిలో శనివారం నిర్వహించిన ‘జన్మభూమి-మా ఊరు’ సభలో ఆయన మాట్లాడారు. వ్యవసాయానికి ఇకపై తొమ్మిది గంటల విద్యుత్తును అందిస్తానని చెప్పారు. వచ్చే ఏడాది ఖరీఫ్‌ నాటికి యాప్‌ ద్వారా వ్యవసాయ పనిముట్లు పొలానికి వస్తాయని చెప్పారు. నాగావళి, వంశధార, గోదావరి, కృష్ణా, పెన్నా నదులను అనుసంధానం చేస్తున్నామని, గోదావరి నీటిని శ్రీకాకుళం వరకు తెచ్చి.. వంశధారకు అనుసంధానం చేస్తామని వెల్లడించారు. ‘25 లక్షల మంది కౌలుదారులకు రూ.9,411 కోట్ల రుణాలు మంజూరు చేసిన ఘనత తమదే. 4.76 లక్షల మంది రైతులకు ట్రాక్టర్లు, కోత మిషన్లను రూ.1300 కోట్ల రాయితీతో అందించాం. ఇకపై   ట్రాక్టరు కావాలంటే.. యాప్‌ కొడితే చాలు. మీ స్మార్ట్‌ఫోన్‌లో ఒక బటన్‌ నొక్కితే.. మిషన్‌ వచ్చే ఏర్పాటు చేస్తాను. తక్కువ ఖర్చుతో పనవుతుంది...’ అని వివరించారు. ప్రతి ఇంటికి ఒక స్మార్ట్‌ఫోన్‌ ఇస్తానన్నారు. ‘డ్వాక్రా సంఘాలే నా శక్తి. వారే నా మానస పుత్రికలు. వాళ్లే ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించారు. ఎప్పుడూ ఎల్లవేళలా వారికి అండగా ఉంటాను...’ అంటూ కొనియాడారు.

మోదీకి ప్రజలు గుణపాఠం చెబుతారు
‘ఒకప్పుడు నరేంద్రమోదీ మాటలగారడీతో ఓట్లు పడ్డాయి. ఇప్పుడు ఆయన చెప్పే అబద్ధాలతో ఒక్క ఓటు పడదు. ప్రజలు గుణపాఠం చెబుతారు. అసత్యాలను పదే పదే పలికి మభ్యపెట్టాలని చూస్తున్నారు...’ అని చంద్రబాబు పేర్కొన్నారు. దీనికి అవునంటే గట్టిగా చప్పట్లు కొట్టాలంటూ.. ప్రజలతో చప్పట్లు కొట్టించారు. రాష్ట్ర అధికారాలను హస్తగతం చేసుకుంటున్నారని ఆరోపించారు. ‘మోదీ పరిపాలన అన్ని రంగాల్లో పూర్తిగా విఫలమైంది. యుద్ధ విమానాల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారు. ముస్లిం మైనార్టీలపై తలాక్‌ తెచ్చి.. వాళ్లపై కేసులు పెడతామంటూ కుటుంబవ్యవస్థను సర్వనాశనం చేసే స్థాయికి దిగజారారు. షెడ్యూల్డ్‌ కులాలపైనా దాడులు పెంచుతున్నారు. జాతీయస్థాయిలో నదుల అనుసంధానం చేసి నీటి సమస్యను పరిష్కరించాల్సిన కేంద్రం...కర్ణాటక, తమిళనాడులో నీటి సమస్యలు సృష్టించి.. రెండు రాష్ట్రాల మధ్య విరోధం పెడుతోంది. మనకు, తెలంగాణాకు మధ్య విభేదాలు సృష్టిస్తోంది. విభజన చట్టాన్ని అమలు చేయాలి. ప్రత్యేకహోదా ఇవ్వాలి. అన్ని రాష్ట్రాలతో సమానంగా పైకి వచ్చే వరకు చేయూతనివ్వాలని డిమాండ్‌ చేస్తే.. అణగదొక్కే పరిస్థితికి వచ్చారు...’ అని సీఎం చెప్పారు.

5ap-main1b_1.jpg

ఓట్ల కోసం మళ్లీ డబ్బు ఖర్చు చేయాలా?
‘జనం కోసమే మేం కష్ట పడుతున్నాం. వేదిక మీదున్న వారంతా ప్రజల అభివృద్ధికే కష్టపడుతున్నారు. ఇంత చేస్తున్నప్పుడు ఎన్నికల్లో ఓట్ల కోసం మళ్లీ డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం ఏముంది...’ అని చంద్రబాబు పేర్కొన్నారు. ‘బ్యాంకులను దోపిడీ చేసిన వారంతా మోదీ హయాంలో విదేశాలకు వెళ్లిపోయారు. మళ్లీ వాళ్లను తీసుకొస్తామని ఇప్పుడంటున్నారు. అగ్రిగోల్డ్‌ వ్యవహారం కోర్టులో ఉన్నా తెదేపా ప్రభుత్వం గట్టిగా పోరాడుతోంది. బాధితులకు అండగా ఉంటాం. మేము న్యాయంగా ఆలోచిస్తూ జనం డబ్బులు వారి చేతికే అందే పరిస్థితి తెస్తున్నాం. ఈ ఉదాహరణతోనే... మోదీ పాలనకు.. మన పాలనకు తేడా తెలుస్తుంది...’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు.

కేసుల బూచితో మోదీకి జగన్‌ సరెండర్‌
‘ఇక్కడ కోడి కత్తి పార్టీ ఉంది. ఆ కేసును కేంద్రం నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ(ఎన్‌ఐఏ)కి అప్పగించింది. ఇది కావాలని చేసిందే. విశాఖలో జగన్‌పై దాడి చేసిన వ్యక్తి షెడ్యూల్డ్‌వర్గానికి చెందిన వారు. నేను జగన్‌ అభిమానినని. సానుభూతి వస్తుందనే ఈ పనిచేశానని.... ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. అలాంటి.. కోడి కత్తి కేసును కూడా.. ఎన్‌ఐఏకి అప్పగించారంటే.. ఏం చెప్పాలో ఆలోచించండి. ఆ కేసు కోర్టులో ఉంది. మొత్తం రికార్డును మీ ముందు ఉంచుతాం. మీరు ఏది చెబితే అది చేయమంటాం... అని మేం చెబితే.. కాదూ.. మేమే విచారణ చేస్తామని.. రాష్ట్ర అధికారాన్ని హస్తగతం చేసుకునే విధంగా కేంద్రం ప్రవర్తిస్తోంది. ఇదెక్కడి న్యాయం...’ అని చంద్రబాబు ప్రశ్నించారు. జగన్మోహన్‌రెడ్డి రూ.43 వేల కోట్ల అవినీతి చేశారని... సీబీఐ నివేదిక ఇస్తే ఏడాదిలోగా చర్యలు తీసుకుంటామన్న నరేంద్రమోదీ..ఏ చర్యలూ చేపట్టలేదు. జగన్‌...మోదీకి పూర్తిగా సరెండరయ్యారు. సీబీఐ కేసుల్ని చూపించి.. మేం చెప్పినట్లు చేయకపోతే.. జైలుకు పంపిస్తామనడంతో... భయపడిపోయే పరిస్థితికి వచ్చారు. ఇది ఎంత దుర్మార్గమో మీరే ఆలోచించాలి. మరో పది రోజులు ఉంటే మొత్తం పూర్తయ్యే కేసును.. మొదటికి తెచ్చేందుకే హైకోర్టును విభజించారు...’ అని పేర్కొన్నారు.

‘చుక్కల భూముల’కు 25లోగా పరిష్కారం
ఈనాడు డిజిటల్‌, అమరావతి: చుక్కల భూముల సమస్యను ప్రభుత్వమే సుమోటోగా తీసుకుని ఈ నెల 25లోగా పరిష్కరిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. ఆ దిశగా అధికారులు ఫిర్యాదుదారులకు న్యాయం చేయాలని ఆదేశించారు. జన్మభూమిపై శనివారం టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రాష్ట్ర ప్రగతికి రథాలు ప్రజలు, ఉద్యోగులేనన్నారు. ముప్ఫై, నలభై ఏళ్లు హైదరాబాద్‌తో ఉన్న అనుబంధాన్ని వదులుకుని ఉద్యోగులు, లాయర్లు ఇక్కడికి వచ్చారని, వారు నిలదొక్కుకునేందుకు ప్రభుత్వంఅండగా ఉంటుందని చెప్పారు. సొంతిల్లు లేని ప్రతి ఉద్యోగికి గృహ వసతి కల్పిస్తామన్నారు. జన్మభూమి-మా ఊరు ఆరోవిడతలో ప్రజల భాగస్వామ్యం పెరిగి ఫిర్యాదుల సంఖ్య సగానికి తగ్గడం నాలుగున్నరేళ్ల మన శ్రమకు ఫలితమని వ్యాఖ్యానించారు. ప్రతి గ్రామంలో, వార్డులో చేసిన అభివృద్ధి.. ప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలు అందుతున్న తీరే ఇందుకు కారణమని చెప్పారు.

పెద్ద కొడుకులా సీఎం అండగా నిలిచాడు
85 ఏళ్ల వృద్ధురాలు కాములమ్మ

శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం పొగిరి గ్రామంలో శనివారం తన పర్యటన సందర్భంగా 85 ఏళ్ల స్థానిక వృద్ధురాలు ఏనుగుతల కాములమ్మతో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై ఆయన ఆరా తీశారు. కొన్ని మాటలు ఆమెకు వినిపించకపోవటంతో చెవిలో చెప్పారు. ప్రతి నెలా అందిస్తున్న రూ. వెయ్యి పింఛనుతో పెద్దకొడుకులా అండగా నిలిచావంటూ సీఎంనుద్దేశించి ఆమె వ్యాఖ్యానించడంతో చంద్రబాబు మురిసిపోయారు. కాములమ్మ భర్త, నలుగురు కుమారులు చనిపోయిన నేపథ్యంలో ఆమె యోగక్షేమాలను చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. కాములమ్మకు ఆర్థిక భరోసాగా రూ. 50 వేలు ఇవ్వాలంటూ అక్కడే ఉన్న కలెక్టర్‌ ధనంజయరెడ్డిని ఆయన ఆదేశించారు.
Link to comment
Share on other sites

రుణమాఫీకి అప్పు పుట్టినట్లే!

 

రూ.8000 కోట్లు తెచ్చేందుకు రంగం సిద్ధం

ఈనాడు-అమరావతి: రైతు రుణమాఫీ సొమ్ములు చెల్లించేందుకు రంగం సిద్ధమవుతోంది. బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చాయి. త్వరలో తేదీలు ప్రకటించి సంబంధిత ఖాతాలకు సొమ్ములు జమ చేస్తామని ఇటీవలే ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించిన విషయం విదితమే. రైతు సాధికార సంస్థ ద్వారానే ప్రత్యేకంగా రూ.8వేల కోట్ల రుణం తీసుకోనున్నారు. ఈ మేరకు పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు, ఆంధ్రా బ్యాంకు, పంజాబ్‌ సింధ్‌ బ్యాంకుల నుంచి ఈ మొత్తాన్ని తీసుకునేందుకు దాదాపు అవగాహన కుదిరిందని సమాచారం.  మరో వారం పది రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. ఇక జలవనరుల కార్పొరేషన్‌ ద్వారా రూ.10వేల కోట్ల రుణానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ శాఖలో రూ.4000కోట్లు, నీరు చెట్టు కింద మరో రూ.1500 కోట్ల వరకు బిల్లులు చెల్లించాల్సి ఉంది. రుణం సమకూరితే తప్ప వీటిని చెల్లించే పరిస్థితి కనిపించడం లేదు. వివిధ శాఖలకు సంబంధించి రూ.11వేల కోట్ల వరకు కూడా బిల్లులు నిలిచిపోయాయి. ఇందులో పౌరసరఫరాలు, ఇంధన శాఖల రాయితీ మొత్తాలే ఎక్కువగా ఉన్నాయి.

ఓవర్‌ డ్రాఫ్టులోనే రాష్ట్రం: నాలుగో త్రైమాసికంలోనూ రాష్ట్రం ఓవర్‌ డ్రాఫ్టులోకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే రూ.1400 కోట్ల వరకు వెళ్లింది. గత మూడు నాలుగు నెలలుగా జీతాలు, పింఛన్లు చెల్లింపు నాటి నుంచే ఈ పరిస్థితి నెలకొంది. కేంద్రం నుంచి రెవెన్యూ లోటు, పోలవరం నిధుల విడుదల సరిగా లేకపోవడం... ప్రస్తుతం ఆర్థిక కష్టాలకు కారణమని చెబుతున్నారు. ఈ నెల 20 తర్వాత విడుదలయ్యే కేంద్ర పన్నుల వాటా నిధులు, జీఎస్టీ చెల్లింపుల కోసం ఎదురుచూస్తున్నారు. అలాగే సెక్యూరిటీల అమ్మకం ద్వారా రూ.1500 కోట్ల వరకు అప్పు తీసుకునేందుకు యత్నిస్తున్నారు.

 

Link to comment
Share on other sites

  • 3 weeks later...
1 hour ago, niceguy said:

Ippudu loan enti..already money ready annaru gaaa..at dwacra lo thaggisthe ikkada easy ayyaedhi gaa..

sagu ki pettubadi pathakam ki ivvalai ga,dani ni munde istharu,leka pothe ibbandulu vasthayi ani, dani taruvtha runa mafi ki nidulu vadulu taru

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...