Jump to content

3 నెలల్లోగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలి


RamaSiddhu J

Recommended Posts

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌లో మూడు నెలల్లోగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ఆదేశించింది. పంచాయతీల కాల పరిమితి ముగియడంతో ప్రత్యేక అధికారులతో పాలన కొనసాగించేలా ప్రభుత్వం ఇటీవల జీవో 90ని తీసుకొచ్చింది. దీన్ని సవాల్‌ చేస్తూ మాజీ సర్పంచులు హైకోర్టును ఆశ్రయించారు. కాల పరిమితి ముగిసిన పంచాయతీలకు ప్రభుత్వం ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు నిర్వహించకుండా కాలయాపన చేస్తోందని వారు పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రత్యేక అధికారుల పాలన వల్ల గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడిందని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై వాదోపవాదాలు విన్న హైకోర్టు మూడు నెలల్లోగా రాష్ట్రంలోని అన్ని పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది

Link to comment
Share on other sites

4 hours ago, Gunner said:

Vatiki inka 1yr time vundi

Panchayati elections conduct cheyakapovatam mistake.... BJP/JS ki vapu ki balupu ki teda telusthundi

asalu Panchayithi lo strong ye ga TDP and YCP, what is stopping them to take this step ahead. 

Link to comment
Share on other sites

పంచాయతీ ఎన్నికల పట్ల హైకోర్టు తీర్పుపై చంద్రబాబు స్పందన
23-10-2018 18:36:44
 
636759167106109825.jpg
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై సీఎం చంద్రబాబు నాయుడు ఫస్ట్ టైం స్పందించారు. మంగళవారం విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. పంచాయతీ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామన్నారు. రిజర్వేషన్ల అంశం కోర్టు పరిధిలో ఉందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. రిజర్వేషన్ల అంశం తేలగానే ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమని బాబు తేల్చిచెప్పారు.
 
 
కాగా.. ఏపీలో రానున్న 3నెలల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని కోర్టు ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. స్పెషల్ ఆఫీసర్ల పాలనపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ మాజీ సర్పంచ్‌లు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం ఈ మేరకు తీర్పునిచ్చింది. స్పెషల్‌ ఆఫీసర్ల పాలనను కొనసాగిస్తూ జారీ చేసిన జీవో నెంబర్‌ 90ను కోర్టు కొట్టివేసింది.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...