Jump to content

Better close CBI


APDevFreak

Recommended Posts

http://www.andhrajyothy.com/artical?SID=652286

సీబీఐలో లంచం
22-10-2018 01:18:30
 
636757679089309412.jpg
  • రూ.3 కోట్ల ముడుపుపై రచ్చకెక్కిన ఉన్నతాధికారులు
  • స్పెషల్‌ డైరెక్టర్‌ రాకేశ్‌ అస్థానాపైనే కేసు నమోదు చేసిన సీబీఐ
  • మనీలాండరింగ్‌ కేసు మాఫీకి హామీ
  • రూ.2 కోట్లు పుచ్చుకున్నారని ఆరోపణ
  • హైదరాబాదీ ఫిర్యాదుతో ఎఫ్‌ఐఆర్‌
  • కాల్స్‌, వాట్సాప్‌ సందేశాలు ఆధారం
  • మధ్యవర్తిగా రా ఉన్నతాధికారి పాత్ర
  • బ్రోకర్‌ అరెస్టుతో విషయం బట్టబయలు
  • అస్థానా ప్రధాని మోదీకి సన్నిహితుడు
  • గుజరాత్‌ కేడర్‌ ఐపీఎస్‌ అధికారి
  • డైరెక్టర్‌ అలోక్‌ కుట్రే అంటున్న అస్థానా
  • అలోక్‌ కోసమే డబ్బు తీసుకున్నట్టు వ్యాఖ్య
 
ప్రధాని నరేంద్ర మోదీ సర్కారుకు మరో మచ్చ. దేశంలో అవినీతి వ్యవహారాలను దర్యాప్తు చేసే అత్యున్నత సంస్థ సీబీఐ అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయింది. సీబీఐలో మొదటి రెండు స్థానాల్లో ఉన్న అధికారులిద్దరూ కేసులను కొట్టేయించేందుకు కోట్ల రూపాయల ముడుపులు తీసుకున్నారంటూ పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకుంటూ కేసులు నమోదు చేసుకొనే వరకు వచ్చింది.
 
 
న్యూఢిల్లీ, అకోబరు 21: ప్రధాని మోదీ ఏరికోరి తెచ్చుకొని సీబీఐలో నంబర్‌-2గా ప్రతిష్ఠించిన గుజరాత్‌ కేడర్‌ ఐపీఎస్‌ అధికారి రాకేశ్‌ అస్థానా వివాదంలో ఇరుక్కున్నారు. స్పెషల్‌ డైరెక్టర్‌ అస్థానాపై స్వయంగా సీబీఐ ఈ నెల 15న ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. ఢిల్లీకి చెందిన మాంసం ఎగుమతిదారు మొయిన్‌ ఖురేషీపై మనీలాండరింగ్‌ కేసుకు సంబంధించి హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త సతీశ్‌ సనాను వేధించకుండా ఉండేందుకు రూ.5 కోట్లు డిమాండ్‌ చేసి, మూడు కోట్లు ముడుపులు పుచ్చుకున్నారన్నది ఆరోపణ. సతీశ్‌ సనా తన పేరు బయటకు రాకుండా చూసేందుకు దుబాయిలో ఉండే ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్‌ మనోజ్‌ ప్రసాద్‌ ద్వారా 10 నెలల వ్యవధిలో ఈ మొత్తాన్ని ముట్టజెప్పారు. సతీశ్‌ సనా నుంచి ఫిర్యాదు తీసుకొని సీబీఐ రాకేశ్‌ అస్థ్థానాపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. ఖురేషీ కేసును అస్థ్థానా నేతృత్వంలోని సిట్‌ దర్యాప్తు చేస్తోంది. తాను మూడు కోట్లు స్వీకరించింది అస్థ్థానా కోసమేనని మనోజ్‌ ఒక మెజిస్ట్రేట్‌ సమక్షంలో అంగీకరించారని సీబీఐ చెబుతోంది. ముడుపుల వాయిదా సొమ్మును స్వీకరించేందుకు అక్టోబరు 16న దుబాయి నుంచి వచ్చిన మనోజ్‌ ప్రసాద్‌ను సీబీఐ అరెస్టు చేసింది. లక్నోకు చెందిన మనోజ్‌ ప్రసాద్‌, అతని సోదరుడు సోమేశ్‌లు ముడుపుల వ్యవహారంలో మధ్యవర్తులుగా ఉన్నారు. ఖురేషీని ఈడీ గత ఏడాది ఆగస్టులోనే అరెస్టు చేసింది. ఎఫ్‌ఐఆర్‌లో అస్థ్థానాతో పాటు భారత గూఢచార సంస్థ ‘‘రా’’లో నెంబర్‌ టూగా ఉన్న గల్ఫ్‌ వ్యవహారాల ప్రతినిధి, స్పెషల్‌ డైరెక్టర్‌ సామంత్‌ కుమార్‌ గోయల్‌ పేరు కూడా ఉంది. ఆయన్ను ప్రస్తుతానికి నిందితుడిగా పేర్కొనలేదు. గోయల్‌ తరచూ దుబాయిలో ఖురేషీని కలిసేవారని, అస్థ్థానాతో టచ్‌లో ఉండేందుకు సాయం చేశారని మనోజ్‌ ప్రసాద్‌ సీబీఐకి తెలిపారు. మూడు కోట్ల ముడుపులు అస్థ్థానా కోసమేనని చెప్పారు. ముడుపుల కోసం సీబీఐ అధికారులు తనను వేధించే వారని సతీశ్‌ సనా వెల్లడించారు. ఖురేషీ నుంచి ముడుపులు తీసుకున్నారన్న ఆరోపణలపై సీబీఐ డైరెక్టర్‌ ఏపీ సింగ్‌ అవమానకర పరిస్థితుల్లో 2014లో పదవి నుంచి తప్పుకున్నారు. తాజాగా ఖురేషీ కేసులోనే అస్థ్థానా బుక్‌ అయ్యారు.
 
సీబీఐలో యుద్ధం
సీబీఐ డైరెక్టర్‌ అలోక్‌ వర్మకు, స్పెషల్‌ డైరెక్టర్‌ రాకేశ్‌ అస్థ్థానాకు మొదటి నుంచీ ఉప్పు నిప్పుగానే ఉండేది. ఖురేషీ కేసుకు సంబంధించి అలోక్‌ వర్మ ముడుపులు తీసుకున్నారంటూ రెండు నెలల క్రితం రాకేశ్‌ అస్థ్థానా కేంద్ర కేబినెట్‌ కార్యదర్శికి లేఖ రాశారు. రివర్స్‌లో అదే ఆరోపణపై ఇప్పుడు అస్థ్థానాపై సీబీఐ కేసు నమోదు చేయడం గమనార్హం. అలోక్‌ వర్మ, సీబీఐ, ఈడీల్లోని మరికొందరు అధికారులు కలిసి తనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని, అందులో భాగంగానే సతీశ్‌ సనాతో ఫిర్యాదు చేయించారని అస్థ్థానా ఆరోపించారు. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కుటుంబ సభ్యులపై ఐఆర్‌సీటీసీ కుంభకోణంలో జరుగుతున్న దర్యాప్తులో డైరెక్టర్‌ అలోక్‌ వర్మ జోక్యం చేసుకుంటున్నారంటూ కొద్ది నెలల క్రితం అస్థ్థానా సీవీసీకి ఫిర్యాదు చేశారు. ఆ ఆరోపణలను సీబీఐ తోసిపుచ్చింది. అస్థ్థానాయే అర డజను అవినీతి కేసుల్లో దర్యాప్తును ఎదుర్కొంటున్నారని పేర్కొంది. అస్థ్థానా కీలకమైన అగస్టా వెస్ట్‌లాండ్‌ హెలికాప్టర్ల కుంభకోణం, విజయ మాల్యా బ్యాంకు రుణాల కుంభకోణం లాంటి పెద్ద పెద్ద కేసుల దర్యాప్తునకు నేతృత్వం వహిస్తున్నారు. ఆయన ఆగస్టు 24న కేంద్ర కేబినెట్‌ కార్యదర్శికి ఒక లేఖ రాశారు. సీబీఐ డైరెక్టర్‌ అలోక్‌ వర్మ అవినీతికి పాల్పడ్డారంటూ పది కేసులను ఉదహరించారు. అందులో సతీశ్‌ సనా నుంచి ముడుపులు స్వీకరించడం ఒకటి. ఈ లేఖను కేబినెట్‌ కార్యదర్శి సీవీసీకి పంపించారు. ఆ తర్వాత అక్టోబరు 15న రివర్స్‌లో అస్థ్థానాపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. సీబీఐ డైరెక్టర్‌ అలోక్‌ వర్మ అవినీతికి పాల్పడ్డారని అస్థ్థానా ఏ ముడుపుల వ్యవహారాన్ని ప్రస్తావించారో అదే వ్యవహారంలో తనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడం గమనార్హం. దాంతో అస్థ్థానా అక్టోబరు 19న సీవీసీకి ఒక లేఖ రాశారు. సతీశ్‌ సనాను తాను విచారించాలని అనుకుంటున్నానని పేర్కొన్నారు. ఈ మేరకు సెప్టెంబరు 20నే సీబీఐ డైరెక్టర్‌కు ప్రతిపాదనను పంపానన్నారు. ఆయన నాలుగు రోజులు ఫైలును తొక్కిపట్టి సెప్టెంబరు 24న ప్రాసిక్యూషన్‌ డైరెక్టర్‌కు పంపారని తెలిపారు. ప్రాసిక్యూషన్‌ డైరెక్టర్‌ కేసును సంబంధించిన అన్ని ఆధారాలు సమర్పించాలని కోరారని అస్థ్థానా వెల్లడించారు. సతీశ్‌ సనా దేశం నుంచి పారిపోయేందుకు ప్రయత్నించారని, తాను లుకౌట్‌ నోటీసు జారీ చేయడం వల్లే వెళ్లలేక పోయారని అస్థ్థానా పేర్కొన్నారు. ప్రాసిక్యూషన్‌ డైరెక్టర్‌ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు రాసి అక్టోబరు 3న డైరెక్టర్‌కు పంపానని, ఇంతవరకు ఆయన నుంచి స్పందన లేదని తెలిపారు. అక్టోబరు 1న సతీశ్‌ సనాను తన నేతృత్వంలోని సిట్‌ ప్రశ్నించిందని అస్థ్థానా తెలిపారు. డైరెక్టర్‌ అలోక్‌ వర్మతో మాట్లాడి ఖురేషీ కేసులో పేరు తన పేరు రాకుండా చూస్తానని ఒక రాజకీయ నాయకుడు హామీ ఇచ్చారని సతీశ్‌ సనా తమ సిట్‌కు తెలిపారన్నారు.
 
కాల్స్‌, వాట్సాప్‌ మెసేజ్‌లు
సతీశ్‌ సనా సీబీఐ అధికారి అస్థ్థానాతో నేరుగా గానీ, ఫోన్‌ ద్వారా గానీ కాంటాక్ట్‌ అయినట్లు ఎఫ్‌ఐఆర్‌లో ఎక్కడా పేర్కొనలేదు. డబ్బులు చెల్లించినట్లుగా లేదు. సీబీఐ తొమ్మిది ఫోన్‌ కాల్స్‌, కొన్ని వాట్సప్‌ మెసేజ్‌ల ఆధారంగా అస్థ్థానాకు ముడుపులు అందినట్లు నిర్ధారణకు వచ్చింది. అస్థ్థానాకు, రా స్పెషల్‌ డైరెక్టర్‌ గోయల్‌కు, మధ్యవర్తి మనోజ్‌ ప్రసాద్‌కు, సోమేశ్‌కు, మనోజ్‌ ప్రసాద్‌ భార్యకు మధ్య జరిగిన సంభాషణలే కేసుకు ఆధారాలు. మనోజ్‌ ప్రసాద్‌ సోదరుడు సోమేశ్‌ ప్రసాద్‌కు అన్న 16న అరెస్టయిన విషయం తెలియగానే ‘‘రా’’లో ఉండే మిత్రుడికి కాల్‌ చేసి చెప్పాడు. మరు నిమిషంలో రా ఉన్నతాధికారి నుంచి సోమేశ్‌ ప్రసాద్‌కు కాల్‌ వచ్చింది. మర్నాడు రా అధికారి తన మిత్రుడు అస్థ్థానాకు కాల్‌ చేశారు. మనోజ్‌ ప్రసాద్‌ పరిస్థితి గురించి ఆరా తీశారు. మరో మూడు సార్లు మాట్లాడుకున్నారు. మనోజ్‌ ప్రసాద్‌ భార్యతో కూడా రా అధికారి మాట్లాడినట్లు తెలుస్తోంది. మనోజ్‌ ప్రసాద్‌ ఫోన్లో వాట్సాప్‌ మెసేజ్‌లను కూడా సీబీఐ ఆధారంగా చేసుకుంది.
 
 
అన్నీ బయట పెట్టండి: కాంగ్రెస్‌
ఈ వ్యవహారానికి సంబంధించి అన్ని విషయాలను బయట పెట్టాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. ఆరు అవినీతి కేసులకు సంబంధించి ఎఫ్‌ఐఆర్‌లలో పేరుందనే కారణంతో ఆస్థానాకు స్పెషల్‌ డైరెక్టర్‌గా పదోన్నతి కల్పించవద్దని అభ్యంతరాలు వ్యక్తమైనా ఆయన్ను కేంద్ర ప్రభుత్వం బలవంతంగా తీసుకొచ్చి ఆ కుర్చీలో కూర్చోబెట్టిందని ఆరోపించారు. ఆయన గుజరాత్‌ నుంచి వచ్చినందునే మోదీ ఆయనకు ప్రాధాన్యం ఇచ్చారని వ్యాఖ్యానించారు. మీటీ జైన్‌ అనే మహిళా జర్నలిస్టు పెట్టిన వరుస ట్వీట్ల ద్వారా సీబీఐలో ముసలం వెలుగులోకి వచ్చింది. సీవీసీ ఆస్థానాను సీబీఐ స్పెషల్‌ డైరెక్టర్‌గా నియమించినపుడు ప్రముఖ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ సుప్రీంకోర్టులో సవాలు చేశారు. సీబీఐ డైరెక్టర్‌ కూడా ఆయన నియామకం పట్ల అభ్యంతరం తెలిపారు. ప్రభుత్వ విధుల్లో జోక్యం చేసుకోలేనంటూ కోర్టు పిటిషన్‌ను కొట్టేసింది. అలోక్‌ వర్మ విదేశీ పర్యటనలో ఉన్నపుడు సీవీసీ అవినీతి కేసులు ఎదుర్కొంటున్న ఆస్థానాను సీబీఐ ప్రతినిధిగా పేర్కొనడంపై అలోక్‌ వర్మ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ సమయంలో అధికారుల నుంచి కేసులను మార్చే విషయంలో అస్థానా అధికార దుర్వినియోగానికి పాల్పడే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య ఉప్పు నిప్పుగా ఉంది.
 
మోదీ ‘ఆస్థాన’ అధికారే!
రాకేశ్‌ అస్తానా 1984 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి. జార్ఖండ్‌లో పుట్టిన ఆయనకు గుజరాత్‌ కేడర్‌ ఇచ్చారు. గుజరాత్‌లో ఆయన వివిధ హోదాల్లో పనిచేశారు. వడోదర, సూరత్‌ల్లో కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 2002లో గోధ్రాలో సబర్మతి ఎక్స్‌ప్రెస్‌ కోచ్‌ దహన కేసును దర్యాప్తు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందానికి (సిట్‌) ఆయనే నేత. ఆ గుజరాత్‌ అల్లర్ల అనంతరం అప్పటి సీఎం నరేంద్ర మోదీకి ఆంతరంగిక పోలీసు అధికారుల్లో ఆయనా ఒకరు. మోదీకి ఆప్తుల్లో ఒకడైన రాకేశ్‌- 1994లో సీబీఐకి వెళ్లడానికీ మోదీ తోడ్పడ్డారు. లాలూ ప్రసాద్‌ యాదవ్‌ను దాణా కుంభకోణంలో దోషిగా చేసి గడ్డి కరిపించిన వ్యక్తిగా ఆయన ప్రసిద్ధుడు. మోదీ ప్రధాని అయ్యాక ఆయనను సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా నెల పాటు పనిచేశారు. ఆ తరువాత అపాయింట్‌మెంట్ల వ్యవహారాల కేబినెట్‌ కమిటీ ఆయనకు ప్రత్యేక డైరెక్టర్‌గా పదోన్నతినిచ్చింది. ఆ నియామకం చెల్లదని, స్టెర్లింగ్‌ బయోటిక్‌ ముడుపుల కేసులో ఆయన పేరూ ఉందని, స్టెర్లింగ్‌ డైరీల్లో ఆయనకు ముడుపలు ముట్టినట్లు ఉందని అడ్వొకేట్‌ ప్రశాంత్‌ భూషణ్‌ కేసు వేయగా సుప్రీంకోర్టు కొట్టేసింది.
Link to comment
Share on other sites

సీఎం రమేష్‌ను ఇరికించేందుకు భారీ కుట్ర
22-10-2018 17:56:30
 
636758280763443982.jpg
 
హైదరాబాద్: టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌ను సీబీఐ కేసులో ఇరికించేందుకు ప్రయత్నించినట్లు తాజాగా వెల్లడైంది. సతీష్‌బాబు సానా అనే వ్యక్తి సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో రమేష్ పేరు ప్రస్తావించినట్లు ఒక స్టేట్‌మెంట్‌ను సృష్టించారు. ఆ స్టేట్‌మెంట్‌ను సృష్టించిన విచారణ అధికారి అయిన సీబీఐ డీఎస్పీ దేవేందర్‌కుమార్‌ని సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. సెప్టెంబర్ 26న ఢిల్లీలోని సీబీఐ కార్యాలయం సతీష్‌బాబు ఒక వాంగ్మూలాన్ని నమోదు చేసినట్లు దేవేందర్‌కుమార్ తప్పుడు సాక్ష్యాలను సృష్టించారు. అయితే ఆ రోజు సతీష్ ఢిల్లీలో లేరని విచారణలో వెల్లడైంది. దాంతో ఈ ఘటనపై పూర్తి స్థాయిలో అధికారులు విచారణ జరిపి దేవేందర్‌ను అరెస్ట్ చేశారు.
 
వాస్తవానికి విచారణలో సతీష్ సానా ఇచ్చిన వాంగ్మూలానికి దేవేందర్‌కుమార్ నమోదు చేసిన వాంగ్మూలానికి సంబంధం లేదని అధికారులు తేల్చారు. సీఎం రమేష్ పేరును సతీష్ సానా చెప్పకపోయినా డీఎస్పీ దేవేందర్ కుమార్ వాంగ్మూలాన్ని నమోదు చేసినట్లు గుర్తించారు. సతీష్ సానా ఢిల్లీలో ఎటువంటి వాంగ్మూలం ఇవ్వలేదని, సీబీఐ డీఎస్పీ దేవేందర్‌కుమార్ తప్పుడు స్టేట్‌మెంట్‌ను సృష్టించారని సీబీఐ అధికారులు వెల్లడించారు.
 
 
ఇటీవల సీఎం రమేష్‌ ఇంట్లో ఐటీ సోదాలు ఐటీ అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తిలోని రమేష్‌ నివాసంలో 10 గంటల పాటు ఐటీ అధికారులు సోదాలు చేశారు. రమేష్‌ సోదరుడు సురేష్‌ సమక్షంలో ఐటీ సోదాలు జరిగాయి. ఆస్తులకు సంబంధించి ఐటీ రిటర్న్స్‌ దాఖలుపై సురేష్‌ను అధికారులు విచారించారు. ఈ సందర్భంగా ఏబీఎన్- ఆంధ్రజ్యోతితో మాట్లాడిన సురేష్.. మా నుంచి ఎలాంటి పత్రాలను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకోలేదని స్పష్టం చేశాడు. నిజాయతీగా ఉన్నాం కాబట్టే 10 గంటల పాటు సోదాలు చేసినా ఐటీ అధికారులకు ఎలాంటి ఆధారాలు లభించలేదని సురేష్‌ చెప్పుకొచ్చాడు. ఐటీ అధికారుల సోదాలకు తామేం భయపడేది లేదని ఆయన తెలిపాడు. కడప జిల్లాకు ఉక్కు ఫ్యాక్టరీ అడిగినందుకే ఐటీ దాడులు జరిగాయన్నాడు.
Link to comment
Share on other sites

 CM RAMESH meda fake statement (personally met) ippincharu to divert issue

rakesh asthana(modi guy) planned cm ramesh verion:wall:

Vammo,Jagan-emaar case lo lancham nunchi started this whole issue started...

But they were caught with cm ramesh at one place and the fake statement dsp at other

xxxxx scams valle chesi, case kosam lancham teesukuni madyalo vere(tdp) vallani irikiddam ani sketch backfired

Intha daridram ga india systems ni evadu padu cheyyala

 

DqHTQQyVsAErMTR?format=jpg

Link to comment
Share on other sites

1 hour ago, sskmaestro said:

Congress million times better anipistondi when we hear the way these low level scums manipulate the central institutions.

 

CBI, judicial Nd election commission Anie villa isthaniki use chesukuntunaru baffas 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...