Jump to content

Rahul Gandhi in Telangana


RKumar

Recommended Posts

ఇద్దరూ లూటీదారులే 
కేసీఆర్‌.. మోదీ.. అవినీతిపరులే 
నోరు తెరిస్తే అబద్ధాల వాగ్దానాలు 
ప్రాజెక్టుల పునరాకృతి పేరిట కుంభకోణాలు 
రఫేల్‌లో అనిల్‌కు రూ. 30,000 కోట్ల లబ్ధి 
తెలంగాణలో కేసీఆర్‌ కుటుంబ రాజ్యం 
మోదీకి మద్దతుగా తెరాస, మజ్లిస్‌ 
ఏడాదిలో లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తాం 
ఒకే దఫాలో రూ. 2 లక్షల రుణమాఫీ 
పత్తికి క్వింటాలుకు రూ.7 వేల మద్దతు 
ఆత్మహత్యలు లేని తెలంగాణ మా లక్ష్యం 
భైంసా, కామారెడ్డి, హైదరాబాద్‌ ఎన్నికల ప్రచార సభల్లో రాహుల్‌ గాంధీ 
20hyd-main1a.jpg
రాష్ట్రంలో కేసీఆర్‌, కేంద్రంలో మోదీ ఇద్దరూ అవినీతికి పాల్పడుతున్నారు. రఫేల్‌ కుంభకోణంలో మోదీ.. దేశ ప్రజలకు చెందిన రూ.30,000 కోట్ల సొమ్మును తన స్నేహితుడికి ధారపోశారు. ప్రజల కాపలాదారు.. చోరీ చేశారు. ఆ కాపలాదారు రైతుల రుణ మాఫీ చేయలేదు, యువతకు ఉద్యోగాలు ఇవ్వలేదు. ఇటు కేసీఆర్‌, అటు మోదీ.. వీరిద్దరి మధ్య స్నేహం ఉంది. కేసీఆర్‌ భాజపాకు మేలు చేస్తున్నారు. భాజపా ఏ నిర్ణయం తీసుకున్నా కేసీఆర్‌ మద్దతు తెలుపుతారు. పెద్దనోట్ల రద్దు మంచి నిర్ణయం కాదని, విఫల యత్నమని ప్రపంచ ఆర్థికవేత్తలు చెప్పారు. కానీ కేసీఆర్‌ మోదీకి అండగా ఉన్నారు. మోదీకి మద్దతుగా కేసీఆర్‌తోపాటు ఎంఐఎం కూడా ఉంది.

నేనెప్పుడూ తప్పుడు హామీలు ఇవ్వను. కావాలంటే కేసీఆర్‌, నరేంద్రమోదీ సభలకు వెళ్లండి. అక్కడ అన్నీ అబద్ధాలే వినిపిస్తాయి. నిజం వినాలంటే కాంగ్రెస్‌ సభకు రావాలి. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆదివాసీ హక్కులు, అటవీ భూములపై హక్కులకు రక్షణ కల్పిస్తాం. మీ భూములు మీకు వెనక్కు ఇప్పిస్తాం. నాలుగైదు కిస్తుల్లో కాకుండా రైతులకు ఒకేసారి రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తాం. యువతకు ఉద్యోగాలు కల్పించేలా రోజూ 18 గంటల పాటు మా సీఎం పనిచేస్తారు. ఏడాదిలో లక్ష ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకుంటాం. నిరుద్యోగులకు రూ. 3,000 భృతి కల్పిస్తాం.

భైంసా, కామారెడ్డి బహిరంగ సభల్లో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ
భైంసా, కామారెడ్డి నుంచి ఈనాడు ప్రతినిధులు
కేంద్రంలో నరేంద్రమోదీ.. రాష్ట్రంలో కేసీఆర్‌.. ఇద్దరూ ఇద్దరేనని, ఇద్దరూ అవినీతిపరులేనని కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ విమర్శించారు. కేసీఆర్‌ రూ. 38,000 కోట్ల ప్రాజెక్టు అంచనాలను రూ. లక్ష కోట్లకు పెంచితే.. కేంద్రంలోని మోదీ రఫేల్‌ ఒప్పందంలో రూ. 30,000 కోట్లు అనిల్‌ అంబానీ జేబులో వేశారని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజల ఆశయాలకు కేసీఆర్‌ తూట్లు పొడిచారని, ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మోసం చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో కుటుంబ రాజ్యాన్ని స్థాపించారని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీ.. ఇక్కడి ప్రజల కలలు పూర్తిచేసే బాధ్యత తీసుకుంటుందని వెల్లడించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన రాహుల్‌ గాంధీ శనివారం భైంసా, కామారెడ్డి బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణలో కేసీఆర్‌ పాలనపైన, కేంద్రంలో మోదీపైనా తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఇద్దరూ ప్రజాధనాన్ని లూటీ చేశారని విమర్శించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రైతులకు ఏకకాలంలో రూ. 2 లక్షల రుణమాఫీతో పాటు ఏడాదిలో లక్ష ఉద్యోగాలను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజాశక్తితో తెలంగాణ ఏర్పాటైందని, కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ప్రజల శక్తితో కూడిన ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకుంటోందన్నారు. ఎన్నికల తరువాత నవ తెలంగాణను సృష్టిస్తామని ప్రకటించారు.
20hyd-main1b.jpg
అంబేడ్కర్‌ను అవమానించారు.. 
‘‘సీఎం కేసీఆర్‌కు అంబేడ్కర్‌ పేరు నచ్చదు. అంబేడ్కర్‌ పేరిట ఉన్న నీటిపారుదల ప్రాజెక్టు పేరును కాళేశ్వరంగా మార్చివేసి అవమానించారు. రూ.39,000 కోట్ల ఖర్చుతో చేయాల్సిన ప్రాజెక్టు అంచనాలను రూ.లక్ష కోట్లకు పెంచారు. రూ.2,500 కోట్ల అంచనాలతో కూడిన రాజీవ్‌గాంధీ, ఇందిరాసాగర్‌ ప్రాజెక్టుల అంచనాలను పునరాకృతి పేరిట రూ.12,000 కోట్లకు పెంచారు. ఎక్కడ చూసినా అవినీతి. రాష్ట్రంలో ఆయన కుటుంబానికి, బంధువులకు మాత్రమే లబ్ధి జరుగుతోంది.

రైతులకు పరిహారం లభించకూడదని.. 
ఏజెన్సీల్లో అడవి, నీరు, భూమిపై పూర్తి హక్కులు ఆదివాసీలకే లభించేలా ఆదివాసీ బిల్లు తీసుకువచ్చాం. గతంలో భూసేకరణ పేరిట సీఎంలు ఆదివాసీలు, రైతుల నుంచి భూములను తీసుకుని సరైన పరిహారం ఇచ్చేవారు కాదు. రైతులను అడగకుండా భూములను తీసుకునే అవకాశం లేకుండా, మార్కెట్‌ ధరకు నాలుగింతల పరిహారం అందించేలా భూసేకరణ బిల్లును తీసుకువచ్చాం. కానీ కేంద్రంలో మోదీ అధికారంలోకి రాగానే రైతులకు సరైన పరిహారం లభించకూడదన్న ఉద్దేశంలో ఆ బిల్లును రద్దు చేసేందుకు మూడుసార్లు ప్రయత్నించారు. కాంగ్రెస్‌ ప్రతిఘటించడంతో.. ఆ బిల్లును రాష్ట్రాలు రద్దు చేసుకోవాలంటూ సూచించారు. ఈ మేరకు కేసీఆర్‌ తెలంగాణలో దానిని రద్దు చేశారు. ఇప్పుడు రైతుల భూములు లాక్కుంటున్నారు. ఆదివాసీలకు ఇచ్చిన భూములను వెనక్కు తీసుకుంటున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆదివాసీ బిల్లు, భూసేకరణ బిల్లును అమలు చేసి తీరుతాం. రైతులు, ఆదివాసీలకు హక్కులిచ్చి చూపిస్తాం.

ఎటుచూసినా రైతు ఆత్మహత్యలే.. 
దేశంలో, రాష్ట్రంలో మద్దతు ధరలు లభించకపోవడంతో వేలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే ఒకేసారి రూ.2 లక్షల వరకు రుణమాఫీతో పాటు, సరైన మద్దతు ధరలు ఇప్పిస్తాం. పత్తి క్వింటాలుకు కనీసం రూ. 7,000 అందిస్తాం. ఈ దేశాన్ని రైతులు, కార్మికులు, చిన్న దుకాణదారులు, యువత నిర్మించారు.  మోదీ, కేసీఆర్‌ ఇద్దరూ మోసపూరిత హామీలు ఇస్తున్నారు.

20hyd-main1c.jpg
ఆహార భద్రత లాక్కున్నారు 
నేను 15 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాను. మీతో తప్పుడు హామీలు, మాటలు చెప్పను. దేశవ్యాప్తంగా రైతులకు ఒకేసారి రూ.70,000 కోట్ల అప్పులను కాంగ్రెస్‌ మాఫీ చేసి చూపించింది. పేదలకు భూములపై హక్కులు, ఉపాధిహామీ, ఆహార భద్రత చట్టాలతో రక్షణ కల్పించాం. నరేంద్రమోదీ ఉపాధి హామీని వెనక్కు తీసుకున్నారు. ఆహార భద్రతను లాక్కున్నారు. రఫేల్‌లో తన మిత్రుడు అనిల్‌ కోసం రూ.30,000 కోట్ల అవినీతి చేశారు. పదేళ్లలో యూపీఏ సర్కారు కోట్లాది మందిని పేదరికం నుంచి బయటపడేసేందుకు ప్రయత్నించింది.

ప్రజల కలలు కల్లలయ్యాయి 
నీళ్లు, నిధులు, నియామకాలు నినాదంతో తెలంగాణ ఉద్యమం కొనసాగింది. రాష్ట్రం కోసం యువత, ప్రజలు, మహిళల మనసుల నుంచి ఆ నినాదం వచ్చింది. ప్రత్యేక రాష్ట్ర కలను కాంగ్రెస్‌ నెరవేర్చింది. గత ఎన్నికల్లో కేసీఆర్‌ గెలవగానే, మీ నమ్మకాన్ని ఆయన భుజాలపై పెట్టారు.  పేదలు, రైతులు, కార్మికులు, దళితులు, ఆదివాసీలు, మైనార్టీల కోసం ప్రభుత్వం నడుస్తుందని భావించారు. మీ కలలు నెరవేరలేదు. సీఎం వాటిని విఫలం చేశారు.

రైతుల చేతులకు బేడీలు.. 
రాష్ట్రంలో 4,500 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వరంగల్‌, ఖమ్మంలలో రైతుల చేతులకు బేడీలు వేశారు. మిర్చి రైతులను మోసం చేశారు. రాష్ట్రంలో కుటుంబ పాలన నెలకొల్పారు. ప్రజలను అప్పుల్లోకి నెట్టారు. ఈరోజు రాష్ట్రంపై రూ.2 లక్షల కోట్ల అప్పు ఉంది. రాష్ట్రంలో ప్రతి కుటుంబంపై రూ. 2.6 లక్షలు, ప్రతి వ్యక్తిపై తలసరి అప్పు భారం రూ.60,000 అయింది.

20hyd-main1d.jpg
రుణమాఫీపై కర్ణాటకలో అడగండి 
నిజామాబాద్‌ నుంచి చాలామంది ప్రజలు ఉపాధి కోసం గల్ఫ్‌ వెళ్లి పనిచేస్తున్నారు. కేసీఆర్‌ గల్ఫ్‌ బాధితుల కోసం రూ. 500 కోట్లు అని చెప్పి ఒక్కపైసా ఇవ్వలేదు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే గల్ఫ్‌ బాధితులకు సహాయం చేస్తాం. రైతులకు ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీ చేస్తాం. మీరు కర్ణాటకలో ఎవరినైనా అడగండి. రాహుల్‌ చెప్పినట్లు రుణమాఫీ అయిందా.. లేదా? అని అందరూ చెబుతారు. అక్కడ ఎలా అమలు చేశామో.. ఇక్కడా అలాగే చేస్తాం.

కాపలాదారే దొంగతనం చేశారు 
‘నేను ప్రధానిని కాదు.. మీకు కాపలాదారు’ అని మోదీ అన్నారు. ఆ విషయం మీకు గుర్తుంది. కానీ ఎవరికి కాపలాదారుగా ఉన్నారో తెలుసా? పెట్టుబడిదారులైన 15 మందికి మాత్రమే. నీరవ్‌మోదీ, విజయ్‌మాల్యా, లలిత్‌మోదీ, అనిల్‌అంబానీలకు కాపలాదారుగా వ్యవహరించారే కానీ.. పేదలకు మాత్రం కాదు. యూపీఏ ప్రభుత్వం ఒక్కో విమానం రూ. 526 కోట్ల చొప్పున హిందుస్థాన్‌ ఏరోనాటికల్‌ సంస్థకు రఫేల్‌ ఒప్పందం చేసుకుంది. ఆ సంస్థ 70 ఏళ్లుగా విమానాలు తయారు చేస్తోంది. సుఖోయ్‌, జాగ్వార్‌, మిగ్‌ తదితర విమానాలు తయారు చేసిన అనుభవముంది. మోదీ ఆ సంస్థను కాదని అనిల్‌ అంబానీకి కట్టబెట్టారు. ఒక్కో విమానాన్ని రూ.1600 కోట్లకు కొనుగోలు చేశారు. అనిల్‌ అంబానీకి రూ. 45,000 కోట్ల అప్పు ఉంది. ఆయన మోదీతో కలిసి రాయబార బృందంలో వెళ్లారు. ఫ్రాన్స్‌తో ఒప్పందం చేసుకోవాలంటే, అనిల్‌కు కాంట్రాక్టు ఇవ్వాలని మోదీ షరతు పెట్టారు.

20hyd-main1e.jpg
కళ్లలో కళ్లు పెట్టి చూడరే.. 
కాపలాదారు దేశ ప్రజల ముందు చోరీ చేశారు. ఈ విషయమై మోదీని పార్లమెంటులో నిలదీశాను. రూ.30,000 కోట్ల ఉచిత బహుమతి ఎందుకు ఇప్పించారు. రూ.45,000 కోట్ల అప్పులున్న వ్యక్తికి కాంట్రాక్టు ఎందుకు ఇచ్చారు. ప్రజలు, పేదల సొమ్మును మిత్రుడికి ఎందుకు అప్పచెప్పారు? ఈ ప్రశ్నలు అడిగితే 56 అంగుళాల ఛాతీ ఉన్న మోదీ.. కళ్లలో కళ్లుపెట్టి చూడలేదు. ఎటో దిక్కులు చూస్తున్నారు. మోదీ ఎక్కడకు వెళ్లినా కోపం, ద్వేషం ప్రదర్శిస్తున్నారు. ఓప్రదేశానికి, ఓమతానికి, ఓవర్గానికి మరోవర్గానికి మధ్య విద్వేషం సృష్టిస్తున్నారు. నల్లధనంపై యుద్ధమంటూ మోదీ ప్రజలను రోడ్లపై వరుసల్లో నిలబెట్టారు. మీ జేబుల్లో సొమ్ము  ధనికులకు ఇచ్చారు. జీఎస్‌టీ స్థానంలో గబ్బర్‌ సింగ్‌ టాక్స్‌ తీసుకువచ్చి చిన్నవ్యాపారులను దెబ్బతీశారు’’ అని రాహుల్‌ పేర్కొన్నారు.

రైతులకు, విద్య, ఆరోగ్యానికి నిధులు ఉండవు. కానీ కేసీఆర్‌ ఇంటి కోసం రూ.300 కోట్లు ఉంటాయి. నివాస బంగ్లాకు రూ. 300 కోట్లు ఖర్చుపెట్టారు కాని, నిజాం షుగర్‌ ఫ్యాక్టరీ తెరిపించేందుకు నిధులే ఇవ్వలేదు. నేటికీ ఆ ఫ్యాక్టరీ మూతపడే ఉంది. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో కర్మాగారం తెరిపిస్తానన్న హామీ ఏమైంది? కేంద్రంపై వత్తిడి తీసుకువచ్చి నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు చేయించారా?

20hyd-main1g.jpg
తెలంగాణ యువత కోసం కేసీఆర్‌ ఇంటికో ఉద్యోగం అన్నారు. తెలంగాణలో ప్రతి కుటుంబానికి ఉద్యోగం ఇచ్చారా? ఎస్సీ, ఎస్టీలకు మూడెకరాలు ఇచ్చారా? రెండు పడక గదుల గృహాలు వచ్చాయా? ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్లు లభించాయా? ఇంటింటికీ తాగునీరు వచ్చిందా?.. ఇవన్నీ అమలయ్యాయో లేదో మీరే చెప్పండి. నరేంద్ర మోదీ చెప్పినట్లు ప్రతి కుటుంబానికీ బ్యాంకు ఖాతాలో రూ.15 లక్షలు వచ్చాయా? ప్రతి ఏటా యువతకు రూ. 2 కోట్ల ఉద్యోగాలు, రైతులకు సరైన ధరలు వచ్చాయా?
20hyd-main1f.jpg
ప్రభుత్వంలో లక్షకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. కేసీఆర్‌ ఈ నాలుగేళ్ల కాలంలో 10,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు. మా సీఎం తొలి ఏడాదిలో లక్ష ఉద్యోగాలు ఇచ్చేలా పనిచేస్తారు. ఇక్కడి ప్రజల ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కలను కాంగ్రెస్‌ నెరవేర్చింది. తెలంగాణ యువత రాష్ట్రం కోసం బలిదానాలు చేశారు. ఈరోజు కేసీఆర్‌ వారిని మోసం చేశారు. కానీ యువత కలల్ని కాంగ్రెస్‌ పార్టీ నెరవేరుస్తుంది. తెరాస మాదిరి ఒక కుటుంబ తరహా పాలన కాకుండా, సబ్బండ వర్గాల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. 
 
ఎంతోకాలం కొత్త రాష్ట్రం కోసం ఎదురుచూసిన పేదలు, ఆదివాసీలు, దళితులు, మైనార్టీలు తమకు సరైన స్థానం లభిస్తుందని ఐదేళ్లుగా ఆశించారు. కేసీఆర్‌ సీఎం అయిన తరువాత అవినీతి ప్రారంభమైంది. ఆయన తన కుటుంబానికి మాత్రమే మేలు చేసుకున్నారు. తెలంగాణ కలలను కల్ల చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం చాలా పనులు చేయాలి. అందరూ స్నేహపూర్వకంగా కలిసిమెలిసి జీవించేలా, ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా కాంగ్రెస్‌ అభివృద్ధి చేసి చూపిస్తుంది. ఎన్నికల తరువాత కొత్త తెలంగాణను సృష్టిస్తాం
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...