Jump to content

SiliconAndhra Sanjivani – The Multi-Specialty Hospital


sonykongara

Recommended Posts

ప్రజాధనంతో నిర్మాణం భేష్‌
సిలికానాంధ్ర ఆసుపత్రికి రూ.10 కోట్ల ప్రభుత్వ సాయం
  ఆసుపత్రి ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు
19ap-state2a.jpg

ఈనాడు, విజయవాడ: డబ్బు శాశ్వతం కాదని, మంచి కార్యక్రమాలకు సహకరించినప్పుడు ఎంతో తృప్తి కలుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. మన భాష, సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పిలుపునిచ్చారు. కృష్ణా జిల్లా కూచిపూడిలో గురువారం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌తో కలిసి ఆయన సిలికానాంధ్ర ఆధ్వర్యంలో నిర్మించిన 200 పడకల ఆసుపత్రిని ప్రారంభించారు.  నిర్మాణానికి విరాళాలు ఇచ్చిన దాతలు, ప్రవాస భారతీయులను అభినందించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. ప్రజల విరాళాలతో పెద్దఎత్తున ఆసుపత్రిని నిర్మించడం అభినందనీయమన్నారు. ఈ పనికి శ్రీకారం చుట్టిన సిలికానాంధ్ర వ్యవస్థాపకుడు కూచిభొట్ల ఆనంద్‌ను ఆయన ప్రశంసించారు. ఆసుపత్రికి  ప్రభుత్వం తరఫున రూ.10 కోట్లు మంజూరు చేస్తామన్నారు. ప్రపంచానికి అత్యుత్తమ నాట్యరీతిని అందించిన కూచిపూడిని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాల్సి ఉందని ఆకాంక్షించారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌ మాట్లాడుతూ.. కూచిపూడికి ఇంత పెద్ద ఆసుపత్రి రావడం ఆనందదాయకమని పేర్కొన్నారు. సిలికానాంధ్ర వ్యవస్థాపకుడు కూచిభొట్ల ఆనంద్‌ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపుమేరకు తాను కూచిపూడిని దత్తత తీసుకున్నానని వివరించారు. రూ.60 కోట్ల వ్యయంతో దీనిని ప్రారంభించామని తెలిపారు. తమ సంస్థ తరఫున రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 13 ఆసుపత్రులను నిర్మించేందుకూ సిద్ధంగా ఉన్నామని అన్నారు.

విరాళాలిచ్చిన వారికి సన్మానం: ఆసుపత్రి కోసం రూ.నాలుగు కోట్ల విరాళమిచ్చిన టీవీ9 సీఈవో రవిప్రకాశ్‌ను, మొదటి అంతస్తు నిర్మాణానికి రూ.కోటి విరాళం ఇచ్చిన కావూరి చలపతిరావు సతీమణి హైమావతి, ఆమె కుటుంబసభ్యులను ముఖ్యమంత్రి అభినందించారు. రూ.పది లక్షల విరాళమిచ్చిన విద్యార్థినులు నిత్య బోర (న్యూజెర్సీ), స్నిగ్ధ సింహాద్రి (కాలిఫోర్నియా)లను సత్కరించారు. సమావేశంలో శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌, ఎంపీ కొనకళ్ల నారాయణరావు, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...