Jump to content

చందమామ.. మేడిన్‌ చైనా ఆకాశంలోకి కృత్రిమ జాబిల్లి


sonykongara

Recommended Posts

చందమామ.. మేడిన్‌ చైనా
ఆకాశంలోకి కృత్రిమ జాబిల్లి
  వీధి దీపాల అవసరాన్ని తప్పించేందుకు చైనా వినూత్న ఆలోచన
19ap-main2a.jpg

బీజింగ్‌: పగటిపూటకు రారాజు సూర్యుడు! రాత్రి రేడు చందమామ!! ప్రచండ భానుడి వెలుగులతో పగటి సమయంలో మనకు సరిపడా కాంతి లభ్యమవుతోంది. చంద్రుడి వెన్నెల అరకొర వెలుగులనే ఇస్తోంది. అందువల్ల రాత్రి పూట ఇళ్లల్లో, వీధుల్లో విద్యుత్‌ దీపాలు అవసరమవుతున్నాయి. వీధి దీపాల అవసరాన్ని తప్పించేందుకు చైనా పరిశోధకులు వినూత్న ఆలోచన చేశారు. కృత్రిమ చందమామల పేరుతో ప్రకాశవంతమైన ఉపగ్రహాలను అభివృద్ధి చేస్తున్నారు. అసలైన జాబిల్లి కన్నా ఇవి 8 రెట్లు ప్రకాశవంతంగా ఉంటాయి. సిచువాన్‌ ప్రావిన్స్‌లోని చెంగ్డు నగరంలో ఈ కృత్రిమ చందమామ వెలుగులను పంచనున్నారు. దీనికింద మొదటి ప్రయోగాత్మక ఉపగ్రహాన్ని సిచువాన్‌లోని అంతరిక్ష కేంద్రం నుంచి పంపుతారు. అది సాఫీగా పనిచేస్తే 2022లో మరో మూడు ఉపగ్రహాలను ప్రయోగిస్తారు.

పనిచేసేది ఇలా..: సూర్యకాంతిని పరావర్తనం చెందించడం ద్వారా నిజ చందమామ వెలుగులీనుతుంది. మానవ నిర్మిత జాబిలి కూడా ఇదే సూత్రం ఆధారంగా పనిచేస్తుంది. ఫలితంగా లక్షిత ప్రాంతంలో వీధి దీపాల అవసరం తప్పుతుంది. ఈ చందమామలు 50 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో వెలుగులు నింపుతాయనుకుంటే ఏటా 17 కోట్ల డాలర్ల మేర విద్యుత్‌ ఆదా అవుతుందని అంచనా.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...