Jump to content

నెల్లూరులో వైసీపీ, జనసేన చేసిన పనికి చంద్రబాబే అవాక్కయ్యారట?


sonykongara

Recommended Posts

నెల్లూరులో వైసీపీ, జనసేన చేసిన పనికి చంద్రబాబే అవాక్కయ్యారట?
20-10-2018 12:05:08
 
636756345553658621.jpg
నెల్లూరు జిల్లా రాజకీయాల్లో తొండాట ఎవరిది? మంత్రి నారాయణ పేరు వింటేనే వైసీపీ వాళ్లు భయపడిపోతున్నారా? చంద్రబాబును ఆశ్చర్యానికి గురిచేసిన ఆ సంఘటన ఏంటి? వైసీపీ నేతలంటే జనానికి ఎందుకంత ఆగ్రహం? ఆసక్తికరమైన ఈ ప్రశ్నలకు సమాధానాలేంటో ఈ కథనంలో తెలుసుకోండి.
 
 
     నెల్లూరుజిల్లాలో అధికార టీడీపీ పటిష్టంగానే ఉన్నా.. నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్‌ నియోజకవర్గాల్లో మాత్రం ఆ పార్టీ పరిస్థితి అంతంత మాత్రమే. దీంతో ఈసారి ఎలాగైనా ఆ రెండు స్థానాలను కైవసం చేసుకోవాలనే పట్టుదలతో టీడీపీ ఉంది. అందుకు అవసరమైన కసరత్తులు చేస్తోంది. నెల్లూరు సిటీ నియోజకవర్గం బాధ్యతను మంత్రి నారాయణ, నెల్లూరు రూరల్ బాధ్యతను మాజీమంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి తీసుకున్నారు. ఎన్నికల సందర్భంగా వారొక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ప్రజలకు శాశ్వతంగా మేలుచేసే అభివృద్ధి పనులు చేపట్టాలని అనుకున్నారు. అందులో భాగంగా నగరంలో సత్వరం 23 వేల ఇళ్లు, విడతల వారీగా మొత్తం 56 వేల ఇళ్లు పేద, మధ్యతరగతి ప్రజలకు నిర్మించి ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 40వ డివిజన్ నుంచి 54వ డివిజన్ వరకు మొత్తం 7 వేలమంది లబ్దిదారులుంటే.. ముందుగా వెంకటేశ్వరపురం ఎన్‌టీఆర్ కాలనీలో 4 వేల 8 వందల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తిచేశారు. మిగిలిన వారికి అల్లీపురంలో నిర్మిస్తున్న పది వేల ఇళ్లలో కేటాయింపులు చేశారు. షీర్‌వాల్ టెక్నాలజీ అంటే మలేషియా సాంకేతిక పరిజ్ఞానంతో శరవేగంగా ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి.
 
 
       అయితే ఈ అభివృద్ధి పనులను చూసి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ నేతలు షాక్‌ తింటున్నారట. నగరంలో 56 వేల ఇళ్లు పూర్తయితే.. ఇంటికి రెండు ఓట్లు అనుకున్నా దాదాపు లక్ష ఓట్లకు పైగా టీడీపీ ఖాతాలోకి వెళతాయన్నది వాళ్ల భయం. అందులోనూ తమ ఓటుబ్యాంకుగా లెక్క వేసుకుంటున్న నిరుపేద వర్గాలు ఎక్కడ ఖాతా మార్చుకుని తమను దెబ్బకొడతారో అన్న ఆందోళన ఆ పార్టీ నేతల్ని వేధిస్తోంది.
 
 
       ఇళ్ల నిర్మాణ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మంత్రి నారాయణ ఎప్పటికప్పుడు పనుల్ని పర్యవేక్షిస్తున్నారు. సంబంధిత అధికారులను తరుముతున్నారు. ఇంజనీర్లకి సలహాలు ఇస్తూ, లబ్దిదారులు కోరినట్టు ఇళ్లనిర్మాణం ఉండేలా చూసుకుంటున్నారు. ఇళ్లే కాక.. పెన్నా బ్యారేజీ, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, వాటర్ స్కీం, మినరల్ వాటర్ సరఫరా వంటి అభివృద్ధి పనులపైనా దృష్టి సారించారు. దీంతో తమ ఓటుబ్యాంక్‌‌ తరిగిపోతుందన్న బాధతో నారాయణ మీద ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు వైసీపీ నేతలు.
 
 
      నెల్లూరు జిల్లాలో వైసీపీ ఇప్పుడే ఒక అంశంపై దృష్టి సారించింది. అధికారపక్షం చేపట్టే అభివృద్ధి పనుల్లో లోసుగులను వెతకడమే పనిగా పెట్టుకుంది. షీర్‌వాల్ టెక్నాలజీతో చేపట్టిన ఈ ఇళ్ల నిర్మాణంలో కోట్ల రూపాయల అక్రమాలు జరుగుతున్నాయంటూ అధికారపక్షంపై ఆరోపణలు మొదలుపెట్టింది. అయితే ప్రైవేట్ గ్రూప్ హౌసింగ్ తరహాలో నిర్మించిన ఈ ఇళ్లని స్వయంగా చూసిన లబ్ధిదారులు వైసీపీ ఆరోపణలని ఏమాత్రం పట్టించుకోలేదు. "అక్రమాలు నిరూపిస్తాం. బహిరంగ చర్చకి రండి..'' అంటూ అప్పట్లో ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్ పిలుపునిచ్చారు. టీడీపీ నేతల కూడా చర్చకి సిద్ధపడ్డారు. ఈ నేపథ్యంలో గాంధీబొమ్మ సెంటర్‌కి అధికారపక్ష నేతలు రాగా, ఎమ్మెల్యే అక్కడ కనిపించలేదు. కానీ ఆయన అనుచరులు మాత్రం వచ్చారు. ఈ తరుణంలో ఉద్రిక్త పరిస్థితి తలెత్తడంతో పోలీసులు కల్పించుకున్నారు. ఇరు వర్గాలకు నచ్చజెప్పి పంపించేశారు.
 
 
      అదే సమయంలో లబ్ధిదారుల పేరుతో హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. ఇళ్లు కట్టిస్తున్న ప్రాంతం అనుకూలమైంది కాదంటూ స్టే తెచ్చుకున్నారు కొందరు. పిటిషన్ వేసిన వారితో నేరుగా మాట్లాడారు నెల్లూరు అర్బన్‌ డెవలప్‌మెంట్ అథారిటీ ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి. అయితే "అసలు విషయాలేవీ తమకు తెలియవు'' అని వారు చెప్పడంతో అవాక్కవడం ఆయన వంతైంది. ఎమ్మెల్యే కోటా కింద ఆ ఇళ్లు కేటాయిస్తామంటూ ఆధార్‌కార్డులు, ఇళ్ల కేటాయింపుల రసీదుల్ని వైసీపీ వాళ్లు తీసుకువెళ్లినట్టు వారు చెప్పారు. ఆ సంతకాలు కూడా తమవి కాదన్నారు. గతనెలాఖరున కోర్టులో స్టే వెకేట్ అయింది. ఈ నేపథ్యంలో నిరనసలు, ర్యాలీలు నిర్వహించి "ఇది వైసీపీ కుట్రే'' అంటూ అందరికీ తెలిపే ప్రయత్నంచేశారు కోటంరెడ్డి. తమ ఓటు బ్యాంకు ఎక్కడ చేజారిపోతుందో అన్న దుగ్ధతో వైసీపీ నేతలు కుతంత్రాలు పన్నుతున్నారని విమర్శించారు.
 
 
     వైసీపీ వాళ్ల నిర్వాకం బయటపడటంతో సింహపురివాసులు ముక్కున వేలేసుకుంటున్నారు. పేదలకు వచ్చే ఇళ్లను అడ్డుకోవడమేంటని మండిపడుతున్నారు. అయితే తొలుత కోర్టులో వేసిన పిటిషన్‌తో తమకు ఎలాంటి సంబంధం లేదని వైసీపీ నాయకులు వాదిస్తున్నారు. అదే సమయంలో స్థానిక జనసేన నాయకుడు రాజూ యాదవ్ తానే ఆ పిటిషన్ వేశానంటూ ప్రకటించారు. దీంతో జనసేన పైనా జనం గుర్రుగా ఉన్నారు. దీంతో జనసేన పార్టీ నష్టనివారణ చర్యలకి దిగింది. పిటిషన్ వేసిన వ్యక్తితో తమకెలాంటి సంబంధం లేదని వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.
 
 
      నెల్లూరులో వైసీపీ, జనసేన కుట్రరాజకీయాల గురించి సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తే ఆయన అవాక్కయ్యారట. ప్రజలకు మేలు చేస్తుంటే అడ్డుకోవడమేంటని ప్రశ్నించారట! పేదలందరికీ ఇళ్లు కట్టించే తీరదామని అన్నారట. ఇదిలా ఉంటే, తమ దగ్గరికి ఏ నాయకులు వచ్చినా "మీరు రాజకీయాలను పక్కనపెట్టి ముందు మాకు ఇళ్లు నిర్మించి ఇవ్వండి చాలు'' అంటున్నారట సింహపురివాసులు. చూద్దాం ఈ పరిణామం ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో!
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...