Jump to content

All set for Vizag fintech festival


sonykongara

Recommended Posts

నేటి నుంచి విశాఖలో ఫిన్‌టెక్‌ ఫెస్టివల్‌
22-10-2018 05:37:17
 
విశాఖపట్నం: విశాఖ వేదికగా మరో అంతర్జాతీయ సదస్సు నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నెల 22 నుంచి 26 వరకు విశాఖలో ఫిన్‌టెక్‌ ఫెస్టివల్‌ నిర్వహించనుంది. రెండేళ్ల కిందట విశాఖలో ఏర్పాటు చేసిన ఫిన్‌టెక్‌ టవర్‌ను మరోస్థాయికి తీసుకెళ్లేందుకు ఈ ఫెస్టివల్‌ నిర్వహిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ స్టార్టప్‌ కంపెనీలను విశాఖపట్నం తీసుకువచ్చేందుకు ఈ సదస్సుకు ఉపకరిస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఐదు రోజులపాటు నిర్వహించనున్న సదస్సులో దేశ, విదేశాలకు చెందిన వందలాది మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. సీఎం చంద్రబాబు, ఐటీ శాఖా మంత్రి లోకేశ్‌, 15 దేశాలకు చెందిన ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొంటారు. ప్రపంచంలో తొలి మానవ రోబో ‘సోఫియా’ ఈ సదస్సుకి హాజరు కానుండడం ప్రత్యేక ఆకర్షణ. సదస్సులో దేశ, విదేశాలకు చెందిన ఐటీ, స్టార్టప్‌ కంపెనీలతో ఒప్పందాలు చేసుకోనున్నారు.
Link to comment
Share on other sites

దేశాభివృద్ధికి ఉపకరించే ఆవిష్కరణలు చేయాలి
రాష్ట్రాన్ని ఇన్నోవేషన్‌ వ్యాలీగా అభివృద్ధి చేస్తున్నాం
ఫిన్‌టెక్‌ ఫెస్టివల్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు

01402323BRK87A.JPG

విశాఖపట్నం: సమాజ హితానికి, దేశ అభివృద్ధికి ఉపకరించే ఆవిష్కరణలు చేయాలని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. విశాఖపట్నంలో జరుగుతున్న ఫిన్‌టెక్ ఫెస్టివల్ ప్రారంభ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పారిశ్రామిక వేత్తలతో మాట్లాడుతూ.. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని రాష్ట్ర ప్రభుత్వం వివిధ రంగాల్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆధారిత యాంత్రిక వ్యవస్థను అమలు చేస్తోందని తెలిపారు. ముఖ్యంగా పారిశ్రామిక అభివృద్ధికి, వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ పరిశ్రమల అభివృద్ధికి తోడ్పడే ముఖ్యమైన అంశాలపై దృష్టి సారించామన్నారు.

నదీ జలాలు, భూగర్భ జలాలు, భూసారం, పర్యావరణం, విద్యుత్‌, రవాణా, నైపుణ్యం కలిగిన మానవ వనరులు మొదలైన అంశాలను ఈ-ప్రగతి ద్వారా అనుసంధానించి అవసరమైన విజ్ఞానాన్ని అందిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. రియల్ టైం గవర్నెన్స్ లో సమయం, ఖచ్చితత్వాలను పాటించి మెరుగైన ఫలితాలను సాధిస్తామన్నారు. రాష్ట్ర డీజీపీ ప్రస్తుతం 10.3శాతం ఉందని.. దాన్ని 15శాతం సాధిస్తేనే తృప్తి ఉంటుందన్నారు. జాతీయ స్థాయిలో వివిధ రంగాల్లో అభివృద్ధి సాధించిన గ్రామాల జాబితాల్లో ఆంధ్రప్రదేశ్ 55శాతం అవార్డులు గెలుచుకున్నట్లు హర్షధ్వానాల మధ్య తెలిపారు. సహజ వనరులు గుర్తించి, విజ్ఞానాన్ని వినియోగించి అభివృద్ధి సాధించడంలోనే నాయకత్వ పటిమ తెలుస్తుందన్నారు. రాష్ట్రాన్ని ఇన్నోవేషన్ వ్యాలీగా అభివృద్ధి చేయాలని సంకల్పించామని, పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం ద్వారా దానికి అవసరమైన సహాయాన్ని అందిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సీఎం పిలుపునిచ్చారు. వారికి అవసరమైన సహకారాన్ని ప్రభుత్వం ఇస్తుందన్నారు.

01401623BRK87B.JPG

రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఐటీ రంగాన్ని పారిశ్రామిక, విద్య, వైద్య, వ్యవసాయ రంగాలకు అనుసంధానం చేస్తున్నట్లు తెలిపారు. మౌలిక సదుపాయాలను అందించడం, వాతావరణ పరిస్థితులను తెలియపరచడం ద్వారా గత సంవత్సరం రాష్ట్రంలో 18శాతం వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పటికీ 24శాతం వ్యవసాయాభివృద్ధి సాధించగలిగామని, ఈ సంవత్సరం 24శాతం వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొంటూ కూడా 16శాతం అభివృద్ధి సాధిస్తున్నామని చెప్పారు. రహదారుల నిర్మాణం నాణ్యతలో డ్రోన్లను వినియోగిస్తున్నామని, సౌర విద్యుత్‌ను అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు. అనంతరం ఔత్సాహిక యువ పారిశ్రామిక వేత్తలు అడిగిన సందేహాలకు ఆయన సమాధానాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ట్రాయ్ ఛైర్మన్ ఆర్.ఎస్.శర్మ, ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చిన రాజప్ప, రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఐటీ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి విజయానంద్, రాష్ట్ర ప్రభుత్వ ఐటి సలహాదారు, ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేఏ.చౌదరి, జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

01401023BRK87C.JPG

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...