Jump to content

శ్రీకాకుళాన విరాళం ప్రకటించిన ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ Updated : 15-Oct


sonykongara

Recommended Posts

శ్రీకాకుళానికి
విరాళం ప్రకటించిన ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ Updated : 15-Oct-2018 : 12:05
 
 
636752020822939004.jpg
‘తితలీ’ బాధితులకు యంగ్ టైగర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ విరాళం ప్రకటించి ఇండస్ట్రీలోని వారందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. గత కొద్దిరోజులుగా.. ‘తితలీ’ తుఫానుతో శ్రీకాకుళం జిల్లాలోని 169 గ్రామాలు అతలాకుతలమయ్యాయి. ఈ తుఫాను పెను బీభత్సానికి చెట్లు, పూరిగుడిసెలు, ఇళ్లు నేలమట్టమయ్యాయి. వందల కుటుంబాలు నివాసముండేందుకు ఇళ్లు లేక నిరాశ్రయులైనట్లుగా తెలుస్తోంది.
 
ఇలాంటి తరుణంలో కేరళకు స్పందించిన మాదిరిగానే తమకు తోచినంతగా సిక్కోలు ప్రజలకు సాయం చేసి ఆదుకోవాలని సినీ హీరోలు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు నడుంబిగించారు. ఇదివరకే టాలీవుడ్ హీరో బర్నింగ్ స్టార్ సంపూర్ణేశ్ బాబు రూ.50 వేలు ఆర్థిక సాయం ప్రకటించడం జరిగింది. ఇక్కడ్నుంచే సిక్కోలుకు సినీ ఇండస్ట్రీ సాయం మొదలైంది. అనంతరం విజయ్ దేవరకొండ తనవంతుగా రూ.5 లక్షల విరాళాన్ని ప్రకటించాడు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ రూ.15 లక్షల విరాళాన్ని, కల్యాణ్‌రామ్ రూ.5 లక్షల విరాళాన్ని ప్రకటించారు. అలాగే డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా రూ.లక్ష విరాళాన్ని ప్రకటించారు.
Link to comment
Share on other sites

బాలకృష్ణ అభిమానుల విరాళం 1.71 లక్షలు
16-10-2018 03:15:28
 
  • ప్రభుత్వ కాలేజీల లెక్చరర్స్‌ ఒక రోజు వేతనం
తితలీ తుఫాను బాధితులకు సినీనటుడు నందమూరి బాలకృష్ణ అభిమానులు రూ.1,71,346 విరాళం ఇచ్చారు. మన బాలయ్య డాట్‌ కాం నిర్వాహకుడు పుల్లెల గౌతమ్‌ సోమవారం ఉండవల్లిలోని ప్రజావేదికలో ఆ విరాళాన్ని ముఖ్యమంత్రికి అందజేశారు. ఏపీ గవర్నమెంట్‌ కాలేజ్‌ లెక్చరర్స్‌ అసోసియేషన్‌ ఒకరోజు వేతనాన్ని సీఎం సహాయనిధికి అందజేసింది.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...