Jump to content

లగడపాటితో కేసీఆర్ చేయించిన సర్వేలో ఏం తేలిందంటే...!!


sonykongara

Recommended Posts

లగడపాటితో కేసీఆర్ చేయించిన సర్వేలో ఏం తేలిందంటే...!!
15-10-2018 10:37:25
 
636751968749021930.jpg
  • కేసీఆర్‌ సంక్షేమ పథకాలు దేశంలోనే ప్రథమం
  • సర్వేల్లో సీఎంపై 50 శాతం సానుకూలత..
  • పాస్‌ మార్కులు రాని ఎమ్మెల్యేలు 40 మంది
  • ‘ఆంధ్రజ్యోతి’తో రాజకీయ విశ్లేషకుడు, మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్‌రావు
 
‘టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌పై ప్రజల్లో సానుకూలత వ్యక్తమవుతున్నది.. తాజా మాజీ శాసనసభ్యులపై ప్రజల్లో ప్రతికూల అభిప్రాయాలు వినవస్తున్నాయి.. ఈ వ్యతిరేకతే కాంగ్రెస్‌కు కలిసివచ్చే అవకాశం ఉంది.. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పోటాపోటీగా తలపడతాయి’ అని రాజకీయ విశ్లేషకుడు, మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్‌రావు అన్నారు. ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ ఎన్నికలపై తన అభిప్రాయాలను తెలిపారు.
 
 
కరీంనగర్‌: ‘తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్‌పై ప్రజల్లో సానుకూలత వ్యక్తమవుతున్నది.. సరికొత్త సంక్షేమ పథకాల అమలుతో ఆయన దేశంలోనే ప్రథమంగా నిలుస్తున్నారు.. తాజా మాజీ శాసనసభ్యులపై ప్రజల్లో ప్రతికూల అభిప్రాయాలు వినవస్తున్నాయి.. వారిపై 30 శాతం మించి సానుకూలతకు సర్వేల్లో కనిపించడం లేదు.. ఈ నేపథ్యంలోనే ప్రజలు టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్సేనని భావిస్తున్నారు.. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులపై వ్యతిరేకతే కాంగ్రెస్‌కు కలిసివచ్చే అంశంగా మారుతున్నది.. 25 నుంచి 30 మంది అభ్యర్థులను మార్చుకుంటే టీఆర్‌ఎస్‌కు అనుకూల ఫలితాలు వస్తాయనే అభిప్రాయం కలుగుతున్నది.. ఇప్పటి వరకు రాష్ట్ర ముందస్తు ఎన్నికల నేపథ్యంలో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీలు, ఇతర సంస్థలు నిర్వహించిన అన్ని సర్వేల్లోనూ దాదాపుగా ఇదే విషయం తేలింది.. గతంలో కరీంనగర్‌ సహా ఉత్తర తెలంగాణ జిల్లాలన్నీ టీఆర్‌ఎస్‌కు అండగా ఉండగా ఇప్పుడు ఈ జిల్లాల్లో పోటాపోటీ పరిస్థితి నెలకొన్నది’.. అని రాజకీయ విశ్లేషకుడు, ఆర్టీసీ మాజీ చైర్మన్‌, మాజీ శాసనసభ్యుడు గోనె ప్రకాశ్‌రావు అన్నారు. ఆయన కరీంనగర్‌కు వచ్చిన సందర్భంగా ముందస్తు ఎన్నికలపై ‘ఆంధ్రజ్యోతి’తో ప్రత్యేకంగా మాట్లాడారు.
 
 
ఆంధ్రజ్యోతి: రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరగడానికి కారణం ఏమిటి?
గోనె ప్రకాశ్‌రావు: ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పలు సర్వేలు జరిపించుకున్నారు. ఆయన సర్వేల్లో రెండు ఎన్నికలు ఒకేసారి వస్తే జాతీయ సమస్యలు ప్రధానంగా తెరపైకి వచ్చి టీఆర్‌ఎస్‌కు నష్టం జరిగే పరిస్థితి ఉన్నదని తేలిందని సమాచారం. ప్రజలు ఎక్కువగా విశ్వసించే లగడపాటి రాజగోపాల్‌ నిర్వహించిన సర్వేలో కూడా లోక్‌సభ ఎన్నికలతో కలిసి వెళ్తే టీఆర్‌ఎస్‌కు, కేసీఆర్‌కు నష్టం వాటిల్లుతుందని తేలింది. ఆ నష్టం జరగకుండా చూసుకోవడానికే అసెంబ్లీ ఎన్నికలకు ముందస్తుగా వెళ్లాలని కేసీఆర్‌ నిర్ణయించుకున్నారు.
 
 
ఆంధ్రజ్యోతి: కేసీఆర్‌ సర్వేల్లోగాని, ఇతరుల సర్వేల్లోగాని తేలిన అంశాలేమైనా మీ దృష్టికి వచ్చాయా?
గోనె ప్రకాశ్‌రావు: కేసీఆర్‌తో సహా అన్ని పార్టీల సర్వేలు, ఇతరులు నిర్వహించిన సర్వేల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌పై 50 శాతం వరకు సానుకూలత వ్యక్తమయింది. ఆయన అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలు సానుకూలంగా ఉన్నారు. ఎమ్మెల్యేలపై మాత్రం ప్రతికూల అభిప్రాయాలు ప్రజల్లో బలంగా వ్యక్తమయ్యాయి. ఎమ్మెల్యేలెవరికి కూడా 20 నుంచి 30 శాతం మార్కులు రాలేదని సర్వేలు తెలిపాయి. ప్రస్తుతం తాజా మాజీ ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహిస్తున్న సందర్భంలో వారికి ఎదురవుతున్న పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం. అవి సర్వేల్లో వాస్తవమే తేలిందనే అభిప్రాయానికి బలమిస్తున్నాయి.
 
 
ఆంధ్రజ్యోతి: రాష్ట్రంలో కాంగ్రెస్‌ పరిస్థితి ఏమిటి?
గోనె ప్రకాశ్‌రావు: రాష్ట్రంలో ప్రజలు టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్‌ అని భావిస్తున్నారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులపై ఉన్న వ్యతిరేకత కాంగ్రెస్‌కు కలిసి వచ్చే అంశంగా మారుతున్నది. ప్రస్తుత పరిస్థితుల్లో రాహుల్‌గాంధీ గ్రాఫ్‌ పెరిగిపోతున్నది. కొన్నిచోట్ల మోదీ గ్రాఫ్‌ను మించిపోతున్నది. రాహుల్‌గాంధీకి 40 నుంచి 45 శాతం సానుకూలత ఉన్నట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోనైతే కాంగ్రెస్‌కు ఐదు శాతం మార్కులు రానిచోట రాహుల్‌గాంధీకి 45 శాతం సానుకూలత వ్యక్తం కావడం విశేషం.
 
 
ఆంధ్రజ్యోతి: ముఖ్యమంత్రి కేసీఆర్‌ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ప్రభావం ఏమి ఉండదా?
గోనె ప్రకాశ్‌రావు: రాష్ట్రంలో కేసీఆర్‌ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలోనే మొదటి స్థానంలో ఉంటాయనడంలో సందేహం లేదు. వాటి ప్రభావం తప్పకుండా ఉంటుంది. ప్రజలు ప్రజాస్వామిక పరిస్థితులకు, విలువలకు కూడా ప్రాధాన్యం ఇస్తారు. ముఖ్యమంత్రిని ఎవరూ కలిసే అవకాశం లేకపోవడంపై ప్రజలు ఆలోచిస్తున్నారు. ధర్నాలు, ఆందోళనలకు అవకాశాలు లేకపోవడాన్ని, ఉద్యమ నాయకుడైన కేసీఆర్‌ వాటిని లేకుండా చేయడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇవి కొంత మేరకు టీఆర్‌ఎస్’కు నష్టం కలిగించవచ్చు.
 
 
ఆంధ్రజ్యోతి: ప్రత్యర్థి పార్టీలు అభ్యర్థులను ప్రకటించిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది?
గోనె ప్రకాశ్‌రావు: అన్ని పార్టీల అభ్యర్థులు వచ్చిన తర్వాత ప్రజలు అభ్యర్థులను బేరీజు వేసుకుంటారు. ఎవరు మంచివారు అన్న విషయాలను అంచనా వేసుకొని పార్టీల వ్యవహారాలను కూడా పరిగణలోకి తీసుకొని ఓటు ఎవరికి వేయాలన్నది నిర్ణయించుకుంటారు. అప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తేడాలు ఉండే అవకాశం లేకపోలేదు.
 
 
ఆంధ్రజ్యోతి: అసెంబ్లీని రద్దు చేయడంతోపాటు ఆ వెనువెంటనే రాష్ట్రంలోని 119 స్థానాలకుగాను 105 స్థానాల అభ్యర్థులను ప్రకటించడం వంటి ధైర్యం చేసిన ముఖ్యమంత్రి మీ గుర్తులో ఎవరైనా ఉన్నారా?
గోనె ప్రకాశ్‌రావు: రాజకీయాల్లో ఇటువంటి నిర్ణయం ఎప్పుడు జరగలేదు. ఇదే ప్రథమం అయితే దీనిపై ప్రజల్లో రియాక్షన్‌ వస్తున్నది. పలు సర్వేల్లో 40 మంది ఎమ్మెల్యేలపై ప్రజలు ప్రతికూల అభిప్రాయాలు వ్యక్తం చేశారు. వారెవరికి కూడా 20 నుంచి 35 శాతం మార్కులు దాటలేదు. అలాంటి వారిని ఎవరితో చర్చించకుండా మళ్లీ అభ్యర్థులుగా ప్రకటించడాన్ని ప్రజలు స్వీకరించలేకపోతున్నారనడానికి నియోజకవర్గాల్లో వారిపై వ్యక్తమవుతున్న నిరసనలే నిదర్శనం. ప్రస్తుతం ప్రకటించిన అభ్యర్థుల్లో కేసీఆర్‌ కనీసం 25 నుంచి 30 మందిని మార్చితేనే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
 
 
ఆంధ్రజ్యోతి: జిల్లా రాజకీయ ప్రస్తుత పరిస్థితులపై మీ అవగాహన, అంచనాలు ఏమిటి?
గోనె ప్రకాశ్‌రావు: పాత కరీంనగర్‌ జిల్లా పరిధిలోనే కాకుండా ఆదిలాబాద్‌, వరంగల్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో పరిస్థితులు గత ఎన్నికలకు ఇప్పటికీ భిన్నంగా ఉన్నాయి. గత ఎన్నికల్లో ప్రజలు టీఆర్‌ఎస్‌కు ఏకపక్షంగా మద్దతుగా నిలిచి గెలిపించారు. ఈసారి ఉత్తర తెలంగాణ జిల్లాల్లో టీఆర్‌ఎస్‌, కాంగ్రె్‌సకు పోటాపోటీ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇతర పార్టీల అభ్యర్థుల ప్రకటన తర్వాత పరిస్థితి గురించి మాట్లాడ టం లేదు. ఇప్పుడైతే కరీంనగర్‌ జిల్లాలో నాలుగైదు స్థానాలు మినహాయించి అన్నింటా నువ్వానేనా అనే పరిస్థితి ఉన్నది. ఈ నాలుగు జిల్లాల్లోని 44 స్థానాల్లో టీఆర్‌ఎ్‌సకు 24, కాంగ్రె్‌సకు 19 స్థానాల్లో సానుకూలత కనిపిస్తున్నది.
Link to comment
Share on other sites

22 minutes ago, sonykongara said:
ఆంధ్రజ్యోతి: జిల్లా రాజకీయ ప్రస్తుత పరిస్థితులపై మీ అవగాహన, అంచనాలు ఏమిటి?
గోనె ప్రకాశ్‌రావు: పాత కరీంనగర్‌ జిల్లా పరిధిలోనే కాకుండా ఆదిలాబాద్‌, వరంగల్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో పరిస్థితులు గత ఎన్నికలకు ఇప్పటికీ భిన్నంగా ఉన్నాయి. గత ఎన్నికల్లో ప్రజలు టీఆర్‌ఎస్‌కు ఏకపక్షంగా మద్దతుగా నిలిచి గెలిపించారు. ఈసారి ఉత్తర తెలంగాణ జిల్లాల్లో టీఆర్‌ఎస్‌, కాంగ్రె్‌సకు పోటాపోటీ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇతర పార్టీల అభ్యర్థుల ప్రకటన తర్వాత పరిస్థితి గురించి మాట్లాడ టం లేదు. ఇప్పుడైతే కరీంనగర్‌ జిల్లాలో నాలుగైదు స్థానాలు మినహాయించి అన్నింటా నువ్వానేనా అనే పరిస్థితి ఉన్నది. ఈ నాలుగు జిల్లాల్లోని 44 స్థానాల్లో టీఆర్‌ఎ్‌సకు 24, కాంగ్రె్‌సకు 19 స్థానాల్లో సానుకూలత కనిపిస్తున్నది.

North TG lo ne ila vunte south (Mahaboob Nagar, Nalgonda, Khammam) lo inka tough fight vuntundemo kada

Link to comment
Share on other sites

12 minutes ago, TDP888 said:

Things changing drastically after resigned.. 2 months is more than enough to change mood

2 months lo mood changing anedi generally not possible unless there is any exceptional issues but alanti issues emi  eee 2 months lo jaragaledu 

so ippudu nijamgaaa change unteee survey wrong anukovali if not mana assumption wrong anukovali

I think survey in not wrong

Link to comment
Share on other sites

39 minutes ago, krish2015 said:

Lagadapati flash team survey already tv5 vadu telicast chesadu kada 90 seats ani 

adi trs flash survey tappa no chance of winning 90 seats

 

Latest info no one gets majority

 

50-55 seats trs

congress- 45-50 seats

Tdp -5-7 seats

Mim - 5-8

Bjp -2

Others - 1-3 seats

Idi trend ippudu

By election time if congress fights unitely it may touch 50+ seats

Telangana vaste ne 62 seats vachayi vellu em chesaru ani 90 seats vastayi??

 

Already 62 lo 40 sitting mla's meda chala anti undi congress and tdp kasta padithe 60+ easy ga touch avutayi

 

 

Link to comment
Share on other sites

 

38 minutes ago, swarnandhra said:

North TG lo ne ila vunte south (Mahaboob Nagar, Nalgonda, Khammam) lo inka tough fight vuntundemo kada

Nalgonda congress wins max seats one side voting untundi after telangana formation only district which was kept aside totally is Nalgonda nakincharu trs vallu.

 

Khamam congress, tdp ki favor undi

 

Mahaboob nagar tough fight

 

Link to comment
Share on other sites

3 hours ago, swarnandhra said:

North TG lo ne ila vunte south (Mahaboob Nagar, Nalgonda, Khammam) lo inka tough fight vuntundemo kada

North TG lo last time TRS ki 41 from 44.. praksha Rao cheppinattu TRS ki 25, congi ki 19 favour nijamaitey Congi govt pakkaa.. south TG and Greater hyd lo Maha kootami ki clear edge vundi 

Link to comment
Share on other sites

2 minutes ago, rk09 said:

No congress

Maha metha anuchara vargam

 

2 minutes ago, nbk@myHeart said:

83 lo tdp ticket tho gelichaadu.... 2004 tharuvatha congress anukunta.... independent gaa kooda won once I think

ohh auna...divangath gani sishyudanamata

Link to comment
Share on other sites

He is Sabbam Hari of Telangana - whether you like him politically or not but you can not ignore his election analysis statements (most of times)

Except north telangana numbers, everything what he said is right. 

 

north telangana - last 40-45 days lo emannaa change vatchindemo theliyadu...

Link to comment
Share on other sites

కేసీఆర్‌తో సహా అన్ని పార్టీల సర్వేలు, ఇతరులు నిర్వహించిన సర్వేల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌పై 50 శాతం వరకు సానుకూలత వ్యక్తమయింది. ఆయన అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలు సానుకూలంగా ఉన్నారు. 

- Can someone enlighten me what exactly are these welfare schemes he implemented and made him better than other CMs in the country?

Link to comment
Share on other sites

18 minutes ago, nbk@myHeart said:

కేసీఆర్‌తో సహా అన్ని పార్టీల సర్వేలు, ఇతరులు నిర్వహించిన సర్వేల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌పై 50 శాతం వరకు సానుకూలత వ్యక్తమయింది. ఆయన అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలు సానుకూలంగా ఉన్నారు. 

- Can someone enlighten me what exactly are these welfare schemes he implemented and made him better than other CMs in the country?

- sheep

- 4000 per acre

 

 

Link to comment
Share on other sites

15 hours ago, nbk@myHeart said:

కేసీఆర్‌తో సహా అన్ని పార్టీల సర్వేలు, ఇతరులు నిర్వహించిన సర్వేల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌పై 50 శాతం వరకు సానుకూలత వ్యక్తమయింది. ఆయన అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలు సానుకూలంగా ఉన్నారు. 

- Can someone enlighten me what exactly are these welfare schemes he implemented and made him better than other CMs in the country?

8k per acre 

Link to comment
Share on other sites

19 minutes ago, gnk@vja said:

8k per acre 

Idi baaga worked aa? Ekkuva polam unnollaki ekkuva advantage .... normal ga polam ekkuva undi balisina candidates Edo oka party lo already fixed ga untaaru.. they don't get influenced by the govt biscuits.... thakkuva polam unnollaki votes esentha advantage undaa?

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...