Jump to content

Less Corrupt State in Country - Andhra Pradesh


RKumar

Recommended Posts

అవినీతి తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఏపీకి మూడో స్థానం 
 తొలి రెండు స్థానాల్లో గుజరాత్‌, కేరళ 
 అట్టడుగున తమిళనాడు, పంజాబ్‌, ఉత్తరప్రదేశ్‌ 
 ఏపీలో రిజిస్ట్రేషన్‌, భూ రెవెన్యూ శాఖల్లోనే ఎక్కువ లంచవతారాలు 
 ఇండియన్‌ కరప్షన్‌ సర్వే-2018లో వెల్లడి 
ఈనాడు - అమరావతి 
12ap-main6a.jpg

దేశంలో అవినీతి తక్కువగా ఉన్న రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్‌ మూడో స్థానంలో నిలిచింది. ఈ అంశంలో గుజరాత్‌, కేరళలు మొదటి రెండు స్థానాల్లో ఉండగా..తమిళనాడు, పంజాబ్‌, ఉత్తరప్రదేశ్‌లు అట్టడుగు స్థానంలో నిలిచాయి. ట్రాన్స్‌పెరెన్సీ ఇంటర్నేషనల్‌ ఇండియా, లోకల్‌ సర్కిల్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన ఇండియన్‌ కరప్షన్‌ సర్వే-2018 ఈ విషయాన్ని వెల్లడించింది. దేశంలోని మొత్తం 13 రాష్ట్రాల్లో ఈ ఆన్‌లైన్‌ సర్వే నిర్వహించారు. అవినీతి నిరోధక బిల్లు (సవరణ)-2018 ఇటీవల పార్లమెంటులో ఆమోదం పొందిన నేపథ్యంలో ఈ ప్రజాభిప్రాయసేకరణ చేపట్టారు. అవినీతి తక్కువగా, ఎక్కువగా ఉన్న తొలి మూడు రాష్ట్రాలను ప్రకటించారు. 
* ఏయే రాష్ట్రాల్లో ఆన్‌లైన్‌ సర్వే నిర్వహించారంటే: దిల్లీ, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, పంజాబ్‌, రాజస్థాన్‌, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌, గుజరాత్‌, ఆంధ్రప్రదేశ్‌ 
* ఆయా రాష్ట్రాల్లోని 215 జిల్లాల నుంచి 50 వేల మంది నుంచి ప్రజాభిప్రాయాన్ని సేకరించారు. వారి నుంచి 1.60 లక్షల స్పందనలు వచ్చాయి. 
* సర్వేలో అభిప్రాయం చెప్పిన వారిలో: 33 శాతం మంది మహిళలు, 67 శాతం మంది పురుషులు.

దేశవ్యాప్తంగా ఇదీ పరిస్థితి...
* ప్రశ్న: అవినీతి, లంచాల వ్యవహారాలపై ఫిర్యాదు చేసేందుకు మీ రాష్ట్రంలో ప్రత్యేక హాట్‌లైన్‌ వ్యవస్థ ఉందా? (సర్వేలో పోలైన ఓట్లు: 8,694) 
* ప్రత్యేక వ్యవస్థ లేదు, ఉన్నప్పటికీ ఆ నెంబరు గురించి అవగాహన లేదన్న వారు: 91 శాతం
* ప్రశ్న: అవినీతి నిరోధానికి మీ రాష్ట్ర ప్రభుత్వాలు గతేడాదిలో ఎలాంటి చర్యలు తీసుకున్నాయి? (సర్వేలో పోలైన ఓట్లు: 9,363) 
* అవినీతి తగ్గించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు, తీసుకున్నా అవి ప్రభావవంతంగా లేవన్న వారు: 82 శాతం
* ప్రశ్న: ఏయే శాఖల అధికారులుకు ఎక్కువగా లంచాలు చెల్లిస్తున్నారు? (సర్వేలో పోలైన ఓట్లు: 7,836) 
* ఆస్తుల రిజిస్ట్రేషన్‌, భూ వ్యవహారాల శాఖకు: 30 శాతం 
* పోలీసులకు: 25 శాతం 
* పురపాలక సంస్థలకు: 18 శాతం
* ప్రశ్న: గతేడాది కాలంలో ప్రభుత్వాధికారులతో పనులు చేయించుకోవడానికి లంచం చెల్లించారా? (సర్వేలో పోలైన ఓట్లు: 8,755) 
* చెల్లించాం: 56 శాతం
12ap-main6c.jpg* ప్రశ్న: సీసీటీవీలు ఉన్న ప్రదేశాల్లోనూ లంచాలు చెల్లించారా? (సర్వేలో పోలైన ఓట్లు: 8,234) 
* అవునూ: 13 శాతం
12ap-main6b.jpg
* ప్రశ్న: లంచాలను ఎక్కువగా ఏ రూపంలో చెల్లిస్తున్నారు? (సర్వేలో పోలైన ఓట్లు: 8,411) 
* నగదు రూపంలో చెల్లిస్తున్నామన్న వారు: 39 శాతం 
* ఏజెంట్ల ద్వారా చెల్లిస్తున్నామన్న వారు: 36 శాతం
12ap-main6e.jpg
12ap-main6d.jpg
Link to comment
Share on other sites

ఆంధ్రాలో తగ్గిన అవినీతి
13-10-2018 02:02:56
 
636749929778601170.jpg
  • 8వ స్థానంలో తెలంగాణ, 11లో ఏపీ
  • తొలిస్థానంలో యూపీ, చివరిగా గుజరాత్‌
  • ఇండియా కరప్షన్‌ సర్వే 2018 ఫలితాలు
అమరావతి, అక్టోబరు 12(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి తగ్గుముఖం పట్టింది. తెలంగాణలో గత ఏడాది ఏ స్థాయిలో అవినీతి ఉందో ఇప్పుడూ అదే స్థాయిలో ఉంది. అయితే రెండు తెలుగు రాష్ట్రాలలోనూ చిన్నపాటి అవినీతి(పెట్టీ కరప్షన్‌) తగ్గింది. పౌర సేవల కోసం లంచాలు ఇవ్వాల్సి వస్తోందని దేశవ్యాప్తంగా 56 శాతం మంది ప్రజలు అంగీకరిస్తుంటే రెండు తెలుగు రాష్ట్రాలలోనూ అంతకన్నా తక్కువ స్థాయిలోనే అవినీతి ఉండటం ఆసక్తికరమైన అంశం. అదే సమయంలో దేశవ్యాప్తంగా గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది బాగా పెరిగింది. నొయిడా కేంద్రంగా పనిచేసే ‘లోకల్‌ సర్కిల్‌’ కమ్యునిటీ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌, ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్‌ ఇండియాతో కలిసి నిర్వహించిన సర్వే పలితాలను ‘ఇండియా కరప్షన్‌ సర్వే 2018’ పేరుతో విడుదల చేసింది.
 
అవినీతి ర్యాంకులు...
సర్వే నిర్వహించిన 13 రాష్ట్రాలలో ఉత్తరప్రదేశ్‌ 59 శాతంతో మొదటి స్థానంలో నిలబడింది. పంజాబ్‌ 56శాతంతో రెండో స్థానంలో ఉంటే మూడవ స్థానాన్ని 52శాతంతో తమిళనాడు ఆక్రమించింది. మధ్యప్రదేశ్‌ 50, మహరాష్ట్ర 47, ఢిల్లీ 46, పశ్చిమ బెంగాల్‌ 43శాతంతో 7వ స్థానంలో ఉండగా తెలంగాణ 43 శాతంతో 8వ స్థానంలో ఉంది. ఆ తరువాతి స్థానాలలో కర్ణాటక 43, రాజస్థాన్‌ 39 శాతంతో 10వ స్థానంలో ఉండగా ఏపీ 38శాతంతో 11వ స్థానంలో నిలిచింది. కేరళ, గుజరాత్‌లు 31శాతంతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
 
రాష్ట్ర స్థాయి సర్వే:
‘లోకల్‌ సర్కిల్‌’ దేశంలోని 13 రాష్ట్రాలలో ప్రత్యేకంగా స్వల్ప అవినీతి(పెట్టీ కరప్షన్‌)పై సర్వే చేసింది. ఈ సర్వేలో గుజరాత్‌, కేరళ, ఆంధ్రప్రదేశ్‌ అతి తక్కువ అవినీతి కలిగిన రాష్ట్రాలుగా నిగ్గు తేలాయి. యూపీ, పంజాబ్‌, తమిళనాడు అత్యధికంగా అవినీతి పేరుకుపోయిన రాష్ట్రాలుగా బయటపడ్డాయి.
 
ప్రభుత్వ చర్యలు శూన్యం:
‘‘అవినీతిని తగ్గించటానికి చాలా రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న చర్యలు లేశమాత్రమే. చాలా రాష్ట్రాలు ప్రభుత్వ కార్యాలయాలలో సీసీ టీవీ కెమెరాలు పెట్టడం, ఏసీబీ హెల్ప్‌లైన్‌ నంబర్లను ప్రముఖంగా ఉంచటం వంటి చర్యలు చేపట్టడంలో విఫలమయ్యాయి. కొన్ని చోట్ల సీసీటీవీ కెమెరాలు పెట్టినా అవి పనిచేయటం లేదు. చాలా రాష్ట్రాలలో లోకాయుక్త శక్తిమంతంగా లేదు’’ అని లోకల్‌ సర్కిల్స్‌ చైర్మన్‌, సీఈవో సచిన్‌ టపారియా అన్నారు. రాష్ట్రాల్లో ఏసీబీ హెల్ప్‌లైన్‌ నంబరు ఉన్నట్లు దేశంలో 91ు మందికి తెలియదు.
 
అవినీతి నిరోధక చట్టం సవరణ సరికాదు:
సచిన్‌ టపారియా సర్వే ఫలితాలను విశ్లేషిస్తూ, ‘‘2017లో 45శాతంగా ఉన్న పెట్టీ కరప్షన్‌ శాతం ఈ ఏడాది పెరిగింది. దీనికి ఎన్నికలు దగ్గర పడటం, ఎన్నికల అవసరాలను తట్టుకోవటం కోసం నేతలు అధికారులకు టార్గెట్లు పెట్టడం ఒక కారణం కావచ్చు. 2017లో తగ్గుదలకు నోట్ల రద్దు, నోట్ల లభ్యత తక్కువగా ఉండటం కారణం కావచ్చు. అవినీతి నిరోధక చట్టంకు తెచ్చిన సవరణతో మంచికన్నా చెడే ఎక్కువగా జరుగుతుందని మేం భయపడుతున్నాం. ఎందుకంటే లంచం ఇచ్చిన వాడిని వెంటనే అరెస్టు చేసే అవకాశం ఉండగా, లంచం తీసుకుంటున్న వారిని పట్టుకోవటానికి మాత్రం అనుమతులు అవసరంఅవుతున్నాయి’’ అని అన్నారు. లంచం ఇచ్చే వారికి ఏడేళ్ల వరకూ శిక్ష పడుతుందని చట్ట సవరణ చేసిన తర్వాత కూడా 23 శాతం మంది తమ పనులు చక్కబెట్టుకొనేందుకు లంచాలు ఇస్తున్నట్లు సర్వేలో తేలింది.
 
 
సర్వే విస్తృతి
దేశవ్యాప్తంగా 220 మండలాలలో సర్వే చేశారు. 1.60లక్షల మంది అభిప్రాయాలను సేకరించారు. 30రోజుల పాటు సర్వే నిర్వహించారు. మొత్తం 11 ప్రశ్నలున్నాయి. కొంతమంది 2 ప్రశ్నలకే జవాబు చెపితే, మరికొంతమంది మొత్తం ప్రశ్నలకు స్పందించారు. వీరిలో వారిలో 42ు మెట్రో నగరాల నుంచి ఉంటే... 28ు మంది ద్వితీయ శ్రేణి నగరాల నుంచి, 30ు మంది పట్టణాలు, చిన్న పట్టణాల నుంచి స్పందించారు.
 
 
సర్వే పరిమితులు
భౌతికంగా ఆయా ప్రాంతాలకు వెళ్లి సర్వే చేయకపోవటం దీనికి ఉన్న ఒక పరిమితి. ఏళ్ల తరబడి నిర్వహిస్తున్న జాతీయ స్థాయి సర్వే ప్రామాణికతను సంతరించుకుంది. అయితే రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన సర్వే రెండు ప్రశ్నలకే పరిమితమయ్యింది. అవి కూడా గత ఏడాది ఇచ్చిన ప్రశ్నలకు భిన్నంగా ఉన్నాయి. అంతర్జాతీయ సంస్థ నిర్వహించే ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్‌ ఇండియా కరప్షన్‌ ఇండెక్స్‌కు ఈ సర్వే భిన్నమైంది.
 
 
లంచావతారాలున్న శాఖలు ఇవే...
తెలంగాణలో అత్యధికంగా 68శాతం మంది ఆస్తుల రిజిస్ట్రేషన్‌, భూ సంబంధ విషయాల కోసం లంచాలు ఇవ్వాల్సి వస్తుందని చెప్పారు. ఆ తరువాతి స్థానాలలో పోలీసులు, మునిసిపల్‌ కార్పొరేషన్‌ నిలిచాయి. అదే ఆంధ్రప్రదేశ్‌లో 50 శాతం లంచాలు రిజిస్ట్రేషన్‌, రెవెన్యూ శాఖలకు ఇవ్వాల్సి వస్తోందని ప్రజలు స్పష్టం చేశారు. ఆ తరువాతి స్థానాలలో పోలీసులు, విద్యుత్‌, రవాణా శాఖలు నిలిచాయి.
 
 
లంచంగా డబ్బే కావాలి...
నోట్లే లంచంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. అధికారులకే నేరుగా డబ్బులు ఇచ్చామని 39శాతం మంది చెప్పారు. కొన్ని శాఖలలో ఏజెంట్లు, మధ్యవర్తులు లంచాలు వసూలు చేస్తున్నారని, బహుమతులు రూపంలోనూ, ఇతర సహాయాల రూపంలోనూ లంచాలు తీసుకునే వారూ ఉన్నారని ప్రజలు తెలిపారు.
 
తెలుగు రాష్ట్రాల పరిస్థితి...
2017 సర్వేతో పోల్చితే రెండు తెలుగు రాష్ట్రాలలోనూ చిన్నపాటి అవినీతి ఆరోపణలు తగ్గుముఖం పట్టాయి. అయితే గత ఏడాది అవినీతిలో 6వ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ 11వ స్థానానికి చేరింది. తెలంగాణ మాత్రం గత ఏడాది, ఈ ఏడాది కూడా 8వ స్థానంలోనే ఉండటం గమనార్హం. తెలంగాణలో అవినీతి ఏ మాత్రం తగ్గుముఖం పట్టకపోగా, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం గణనీయ స్థాయిలో అవినీతి తగ్గింది.
 
 
పటిష్ఠ చర్యల ఫలితమిది...
‘‘ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి నిర్మూలనా యజ్ఞం చేపట్టాం. ఆ కష్టానికి తగిన ఫలితం కనిపిస్తోంది. ఇండియా కరప్షన్‌ సర్వే 2018లో అవినీతిని అదుపు చేయడంలో ఆంధ్రప్రదేశ్‌ స్థానం మెరుగు పడిందని వెల్లడవటం సంతృప్తి కలిగిస్తోంది. మేం చేపట్టిన యజ్ఞానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరించింది. ఏసీబీ సిబ్బంది బాగా పనిచేశారు. ప్రజల్లో నమ్మకం పెరిగి సమాచారం ఇచ్చారు. ప్రణాళికా బద్ధంగా చేసిన కృషికి ఫలితాలు రావడం సంతృప్తి కరంగా ఉంది. ఉద్యోగులలో భయాందోళనలు వ్యక్తం కావటంతో ప్రభుత్వ కార్యాలయాలలో సీసీటీవీ కెమెరాలు పెట్టలేకపోయాం. అయినా దేశంలో అవినీతి రాష్ట్రాల్లో చివరి మూడింట్లో ఆంధ్రప్రదేశ్‌ నిలవడం చాలా మంచి పరిణామం’’ - డీజీపీ, ఏసీబీ డీజీ ఆర్పీ ఠాకూర్‌9TAKURaa.jpg
Link to comment
Share on other sites

Recent ga sub-registrar office ki vella oka property ki sambandinchina link documents kosam....application fill chesi submit cheyyamannaru...chesaanu...ivvala saturday evening monday evening vachchi mee document collect chesukondi annaru....intha takkuva time llo pani poorthi chesthaara anna doubt manasulo undhi..aiyna vellanu...attender mee document ready aiyyipoyindhi kurchondi seat llo pilusthaa annadu...5 minutes llone pilichaadu...document ichchaadu....athanu entho kontha money aduguthaadu kadha iddaam ane uddesaam tho akkade thachchaduthunna...sir mee pani aiyyopoyindhi..inkemanna help kaavala ani adigaadu...ledhu ani thanks cheppi bayataki vachchesaa...

..intha fast ga ela pani aiyyipoyindhi..adhi emi money theesukokunda...ani okkate ascharyam naaku....ratings ni nenu general ga nammanu kaani ground level llo aa maarpu gananiyanga kanapadathaandhi...

Link to comment
Share on other sites

12 minutes ago, chsrk said:

Recent ga sub-registrar office ki vella oka property ki sambandinchina link documents kosam....application fill chesi submit cheyyamannaru...chesaanu...ivvala saturday evening monday evening vachchi mee document collect chesukondi annaru....intha takkuva time llo pani poorthi chesthaara anna doubt manasulo undhi..aiyna vellanu...attender mee document ready aiyyipoyindhi kurchondi seat llo pilusthaa annadu...5 minutes llone pilichaadu...document ichchaadu....athanu entho kontha money aduguthaadu kadha iddaam ane uddesaam tho akkade thachchaduthunna...sir mee pani aiyyopoyindhi..inkemanna help kaavala ani adigaadu...ledhu ani thanks cheppi bayataki vachchesaa...

..intha fast ga ela pani aiyyipoyindhi..adhi emi money theesukokunda...ani okkate ascharyam naaku....ratings ni nenu general ga nammanu kaani ground level llo aa maarpu gananiyanga kanapadathaandhi...

Nuvvu cleaner thaaluka anukunnademo annai.. :run_dog:

 

Link to comment
Share on other sites

i applied for passport in mumbai 2010. i went to police station for verification . he asked me and my friend to sit in chairs . he ordered tea for us. he verified my residency proof and study proof. after verification my friend asked(in hindi) police " do you want some money" . 

police asked my friend " where did you learn this" . he didn't take bribe. 

Link to comment
Share on other sites

1 hour ago, ravindras said:

i applied for passport in mumbai 2010. i went to police station for verification . he asked me and my friend to sit in chairs . he ordered tea for us. he verified my residency proof and study proof. after verification my friend asked(in hindi) police " do you want some money" . 

police asked my friend " where did you learn this" . he didn't take bribe. 

But from MH/Mumbai most corrupt politicians are growing, they are no way less than our Jagan.

Link to comment
Share on other sites

10 hours ago, Vvnspsnrntr said:

Pichi kukka gadu pichi pttinattu avineethi avineethi ani morgugutjinnaduga vaadiki choopinchandi ee surveyni

kukka annaaka svabhaava reethyaa moruguthundhi, ee morige kukka karava(le)du, veetiki 14 injections avasaram ledhu..

kaapalaa kukka type annattu, evearu biscuit vesthe vaallani chuusi thoka vuuputhundhi, part time job, short time viswasam.

ee kukka raagaane veedhi lo pani leni chaallaa kukkalu vasthai, idhi endhuku morigindho theleepoinaa avi kuudaa inkaa gattigaa chaalaasepu moruguthai. appudappuduu evaro poinattu gaallo chuusthuu edusthuu moruthai.. 

ee madhya cycle meedha evaranna pothunte ventabadi moruguthunnai.. village lions.. aa vuuriki vere vuuru nunchee kontha mandhi flower gaallu vachchaaru.. ee kukkalu everini chuusi morigithe vaadaalla intiki policulni pampi donga ani janaalani nammistaaranta...

 

Link to comment
Share on other sites

@Govindu but bribery if any should be given by Ap people and Ap people’s money , for the service to be done in Ap only. To the employees of Ap. How does the nature of the state mater now? Mar be you don’t want to reduce the corruption. If you hate CNB tats fine , but tats hurting andhra people .,,,,,. Inka corruption taggali anukovali, zero vuvdali anukovali. Antea gaani.,,,, 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...