Jump to content

It raids on cm ramesh house?


Saichandra

Recommended Posts

సీఎం రమేశ్‌పై ఐటీ దాడులు
కడప, హైదరాబాద్‌లోని ఇళ్లు, కార్యాలయాల్లో తనిఖీలు

09215411BRK56A.JPG

కడప: తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌ ఇళ్లు, కార్యాలయాల్లో ఆదాయపన్ను శాఖ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఆయన స్వగ్రామమైన కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తిలోని నివాసంతో పాటు హైదరాబాద్‌లోని ఇల్లు, ఆయనకు చెందిన సంస్థల కార్యాలయాల్లో సుమారు 30 మంది ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు.

 

ఈరోజు ఉదయం 8 గంటల సమయంలో పోట్లదుర్తిలోని సీఎం రమేశ్‌ నివాసానికి 15 మంది ఐటీ అధికారులు చేరుకున్నారు. ఆ సమయంలో రమేశ్‌ సోదరుడు సీఎం సురేశ్‌ మాత్రమే ఇంట్లో ఉన్నారు. అధికారులు ఆయన్ని బయటకు పంపించివేసి ఇంటి తలుపులు మూసివేశారు. ప్రస్తుతం ఐటీ అధికారులు అన్ని గదుల్లోనూ తనిఖీలు చేపడుతూ పలు దస్త్రాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. మరోవైపు జూబ్లీహిల్స్‌లోని సీఎం రమేశ్‌ నివాసంతో పాటు ఆయనకు చెందిన రుత్విక్‌ అనే సంస్థ కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు.

 

కక్షతోనే ఐటీ దాడులు:సీఎం రమేశ్‌

రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై కేంద్రాన్ని నిలదీస్తున్నందునే తనపై కక్షతో ఐటీ దాడులు జరిపిస్తున్నారని సీఎం రమేశ్‌ ఆరోపించారు. ప్రస్తుతం ఆయన దిల్లీలో ఉన్నారు. ఐటీ దాడులతో తనకు వచ్చిన ఇబ్బందేమీ లేదని స్పష్టం చేశారు.

 

గత వారం పది రోజులుగా ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ సోదాలు కలకలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. నెల్లూరుకు చెందిన తెదేపా నేత బీరం మస్తాన్‌రావు నివాసంలో సోదాలు జరిపిన ఐటీ అధికారులు.. ఆ తర్వాత విజయవాడ, గుంటూరులోని పలు కార్పోరేట్‌ సంస్థల కార్యాలయాల్లో తనిఖీలు చేశారు. మంత్రి నారాయణకు చెందిన నారాయణ విద్యాసంస్థల్లోనూ తనిఖీలు జరిపినట్లు వచ్చిన వార్తలు సంచలనం సృష్టించాయి. అయితే ఆ వార్తలను మంత్రితో పాటు ఐటీ అధికారులు సైతం ఖండించడంతో వివాదానికి తెరపడింది. ప్రస్తుతం సీఎం రమేశ్‌ను ఐటీ శాఖ లక్ష్యంగా చేసుకుని తనిఖీలు చేస్తుండటంపై తెదేపా శ్రేణులు మండిపడుతున్నాయి. కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని నేతలు ఆరోపిస్తున్నారు.

Link to comment
Share on other sites

Guest Urban Legend

sujana inti meedha kuda 

one by one operation garuda implementing 

ivi ikkaditho aagavu ...bediritharu bayapedatharu ...longedhi ledhu 

Link to comment
Share on other sites

Guest Urban Legend
1 minute ago, dusukochadu said:

Sujana ki IT raids enduku? Bank notice pampithe chalu :P 

3 days ayindhi anta ED raid chesi 

Link to comment
Share on other sites

Guest Urban Legend

మోడీ ఆపరేషన్ గరుడలో భాగంగా ఆంధ్రుల పై దాడి. హోదా తో పాటు ఇచ్చిన 18 హామీలు నెరవేర్చాలి అని నిలదీసినందుకు మోడీ ఆంధ్రప్రదేశ్ పై కక్ష కట్టారు.మొన్న బీద మస్తాన్ రావు,నిన్న సుజనా చౌదరి,ఈ రోజు సిఎం రమేష్. కడప ఉక్కు, ఆంధ్రుల హక్కు అని అన్నందుకు ఎంపీ సిఎం రమేష్ పై ఐటీ దాడులు.

Link to comment
Share on other sites

టీడీపీ రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్ ఇంటి పై ఐటీ దాడులు..

హైదరాబాద్..ప్రొద్దుటూరు లోని ఇళ్లపై ఒకే టైం లో మొదలైన సోదాలు.3 రోజులు కొనసాగే అవకాశం.

చెత్త రాజకీయం అంటే ఇదే కదా..

కావాలి నెల్లూరు లో బీదా మస్తాన్ రావు ఇంటిపై దాడులు చేస్తారు..అదే కావలి ఎమ్మెల్యే రియల్ ఎస్టేట్ టైకూన్ రామిరెడ్డి ప్రతాపరెడ్డి ని వదిలేస్తారు..

పోతుల రామారావు మీద దాడి చేస్తారు.. వేల కోట్ల కాంట్రాక్టులు చేసే yv సుబ్బారెడ్డి ని వదిలేస్తారు.

సీఎం రమేష్ మీద దాడి చేస్తారు.. మిషన్ భగీరథ లో వేల కోట్ల కాంట్రాక్టులు చేస్తున్న మిథున్ రెడ్డి..అవినాష్ రెడ్డి ని అస్సలు దేఖను కూడా దేఖరు.

అస్సలు అందరికంటే పెద్దదొంగ..11 కేసుల్లో ప్రధమ ముద్దాయి మీద కేసులని త్వరగా విచారించారు.

థు ??..బురద రాజకీయం.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...