Jump to content
sonykongara

భాజపాలోకి దామోదర రాజనర్సింహ సతీమణి

Recommended Posts

భాజపాలోకి దామోదర రాజనర్సింహ సతీమణి

04244211BRK118-PADMINI.JPG

హైదరాబాద్‌: తెలంగాణలో ఎన్నికల వేళ కాంగ్రెస్‌ పార్టీలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్‌ ఎన్నికల మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్‌ దామోదర రాజనర్సింహ సతీమణి పద్మిని రెడ్డి భాజపాలో చేరారు. భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు, పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్‌ సమక్షంలో ఆమె కమలం తీర్థం పుచ్చుకున్నారు. భాజపాలో పద్మిని రెడ్డి చేరికను స్వాగతిస్తున్నట్టు నేతలు తెలిపారు. రాష్ట్రంలో భాజపాను బలోపేతం చేస్తామని ప్రకటించారు. దేవాలయాల పునరుద్ధరణకు పద్మిని రెడ్డి ఎంతగానో కృషిచేశారని, రాబోయే రోజుల్లో ఆమె సేవలను పార్టీకి వినియోగించుకుంటామని కమలనాథులు తెలిపారు. తెలంగాణలో ‘మార్పు కోసమే భాజపా’ అనే నినాదం ఇచ్చిన నేపథ్యంలో ఈ చేరికలు తమకు కొత్త బలాన్ని ఇస్తుందని మురళీధర్‌రావు చెప్పారు. మహిళలకు పెద్దపీట వేస్తున్న పార్టీగా భాజపాను గుర్తించి ఆమె చేరారని లక్ష్మణ్‌ తెలిపారు. తెరాసకు భాజపా మాత్రమే ప్రత్యామ్నాయం అని విశ్వసించి తమతో కలిసి పనిచేసేందుకే పద్మినిరెడ్డి వచ్చారన్నారు. ఆమెకు రాజకీయాలు, సంఘసేవ కొత్త కాదని లక్ష్మణ్‌ చెప్పారు.

04243611BRK118-PADMINI1.JPG

Share this post


Link to post
Share on other sites
ఉదయం సభ్యత్వం.. రాత్రి రాజీనామా

09360611BRK141-PADMINI.JPG

హైదరాబాద్‌: తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్‌ దామోదర రాజనర్సింహ సతీమణి పద్మినీరెడ్డి అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు ఉదయం భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు, రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ సమక్షంలో భాజపాలో చేరిన ఆమె కొద్దిగంటల్లోనే ఆ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్‌ కార్యకర్తల మనోవేదన చూసి తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ఆమె వెల్లడించారు. తాను భాజపాలో చేరడంతో ఇంత భారీ స్థాయిలో కాంగ్రెస్‌ కార్యకర్తల నుంచి స్పందన వస్తుందని తాను ఊహించలేదన్నారు. కాసేపట్లో సంగారెడ్డిలో భర్త రాజనర్సింహతో కలిసి ఆమె మీడియాతో మాట్లాడనున్నట్లు సమాచారం.

Share this post


Link to post
Share on other sites
10 hours ago, nbk@myHeart said:

Damodar uncle strategy emo to get 2 seats to his family in congress....

Ayinaa erri pushpaalu kaakapothe mogudu raakundaa pellaam mana party ki endukichindo think cheyyaraa tholumandam batch

Yes damodareee chepinchadu cong ni blackmail cheyyadaniki but cong vallu Damodar gadiki kuda seat ledu dobbamannaru untaru anni musukuni back ki tisukuvachadu

Share this post


Link to post
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now

  • Recently Browsing   0 members

    No registered users viewing this page.

×