Jump to content

15th Finance Commission


sonykongara

Recommended Posts

రత్యేక ప్రోత్సాహం తప్పనిసరి
 అప్పుడే రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి
 15వ ఆర్థిక సంఘంతో పరిశ్రమలు, వాణిజ్య సంఘాల ప్రతినిధులు
ఈనాడు - అమరావతి
12ap-main14a.jpg

విభజన కారణంగా ఆర్థిక లోటును ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామికాభివృద్ధికి ప్రత్యేక ప్రోత్సాహకాలివ్వాలని రాష్ట్రంలోని పరిశ్రమలు, వాణిజ్య సంఘాలకు చెందిన ప్రతినిధులు 15వ ఆర్థిక సంఘాన్ని కోరారు. విజయవాడలోని ఓ ప్రైవేటు హోటల్‌లో శుక్రవారం సాయంత్రం ఆయా సంఘాల ప్రతినిధులతో ఆర్థిక సంఘం ఛైర్మన్‌ నంద కిషోర్‌ సింగ్‌, సభ్యులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కిషోర్‌ సింగ్‌ మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్‌కు అవకాశమున్నంత వరకూ సాయం చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు. రాష్ట్రం ఎదుర్కొంటున్న పరిస్థితులన్నింటినీ అధ్యయనం చేశామని చెప్పారు. ఈ సమావేశంలో భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) తరఫున మాజీ ఛైర్మన్‌ జేఎస్‌ఆర్‌కే ప్రసాద్‌, ది ఆంధ్రప్రదేశ్‌ ఛాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ ఫెడరేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఎ.సత్యనారాయణ, ఏఎల్‌ఈఏపీ అధ్యక్షురాలు బి.రమాదేవి, ఏపీ స్పిన్నింగ్‌ మిల్లుల సంఘం నుంచి రఘురామ్‌, ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ స్మాల్‌ అండ్‌ మీడియమ్‌ ఇండస్ట్రీస్‌ అసోషియేషన్‌ (ఫాప్సియా) అధ్యక్షుడు కె.సుబ్బారావులు మాట్లాడారు. ఆర్థిక సంఘానికి పలు అంశాలను విన్నవించారు.

మౌలిక వసతులను మెరుగుపరచండి
ఆంధ్రప్రదేశ్‌లో వేగవంతమైన అభివృద్ధి కోసం ప్రత్యేక పారిశ్రామిక క్లస్టర్ల ఏర్పాటుకు ప్రోత్సహించాలి. విశాఖపట్నం-చెన్నై పారిశ్రామిక కారిడార్‌లో మౌలిక వసతుల అభివృద్ధికి సహాయపడాలి. పారిశ్రామిక పురోగతిలో ఉన్న ఇతర రాష్ట్రాలతో సమాన స్థాయికి వచ్చేవరకూ ఏపీ పారిశ్రామిక రంగానికి చేయూతివ్వాలి.
- సీఐఐ ప్రతినిధి
పనితీరు ఆధారంగా ప్రోత్సాహం
15వ ఆర్థిక సంఘం విధివిధానాల వల్ల ప్రగతిశీల రాష్ట్రాలు... ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం కలుగుతుంది. 2011 జనాభా లెక్కల ఆధారంగా నిధుల వాటాను నిర్ణయించడం సరికాదు. జనాభా నియంత్రణను పాటించిన రాష్ట్రాలను శిక్షించేలా ఈ విధానం ఉంది. అందుకే ఆ రాష్ట్రాలకు ప్రత్యేక ప్రోత్సాహక పథకం (స్పెసిఫిక్‌ ఇన్సెంటివ్‌ స్కీమ్‌) ప్రకటించాలి. నిధుల వాటా నిర్ణయించడంలో జనాభా నియంత్రణకు తగిన వెయిటేజీ ఇవ్వాలి. రాష్ట్రాల పనితీరు ఆధారంగా ప్రొత్సాహాకాలు ఇవ్వాలి. పెట్రోల్‌, డీజిల్‌లను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలి.
- ఏపీ ఛాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ ఫెడరేషన్
‘హోదా’ స్థాయిలో నిధులివ్వాలి
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు కేటాయించినట్లే ఏపీకి నిధులివ్వాలి. తద్వారా రాష్ట్రానికి కొంత ఆర్థిక చేయూత లభించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి వీలవుతుంది. రాజధాని నిర్మాణానికి నిధులు కేటాయించాలి.
- ది ఫెడరేషన్‌ ఆఫ్‌ తెలంగాణ అండ్‌ ఆంధ్రప్రదేశ్‌ ఛాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ
ప్రభుత్వ రంగసంస్థలు రావాలి
పారిశ్రామికీకరణలో రాష్ట్రం పనితీరు, గ్రామీణ, పట్టణ ప్రాంతాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని రాష్ట్రానికి నిధులు కేటాయించాలి. ఏపీలో ప్రభుత్వ రంగ సంస్థలను ఏర్పాటు చేయాలి.  ఏపీ ప్రభుత్వం అప్పులు, లోటు స్థాయిని పరిగణనలోకి తీసుకుని సాయం అందించాలి.
- అసోషియేషన్‌ ఆఫ్‌ లేడీ ఎంటర్‌ప్రెన్యూర్స్‌ ఆఫ్‌ ఇండియా
వస్త్ర పరిశ్రమకు ప్రోత్సాహం
ఆంధ్రప్రదేశ్‌కు గ్రాంట్ల రూపంలో సాయం మంజూరు చేయాలి. ఏపీలో వస్త్ర పరిశ్రమ ఏర్పాటు, అభివృద్ధికి చాలా అవకాశాలున్నాయి. వాటిని ప్రొత్సహించేందుకు రాబోయే అయిదేళ్ల పాటు వస్త్ర పరిశ్రమకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలి.
- ఏపీ స్పిన్నింగ్‌ మిల్లుల సంఘం
మరికొన్ని ముఖ్యమైన వినతులు
ఆంధ్రప్రదేశ్‌లో తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు తోడ్పాటు అందించాలి. సూక్ష్మ, మధ్య, చిన్న తరహా పారిశ్రామిక వాడల ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు రూ.100 కోట్లు చొప్పున కేటాయించాలి. అందులో రూ.50 కోట్లు గ్రాంటు, రూ.50 కోట్లు రుణం రూపంలో ఇవ్వాలి.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...