Jump to content

15th Finance Commission


sonykongara

Recommended Posts

ఈనాడు, అమరావతి: తలసరి ఆదాయంలో మూడేళ్లలో మీరు బాగానే సాధించారని, విభజన తర్వాతా మీ కృషితో మంచి ఫలితమే వచ్చిందని, ఇలాగే కష్టపడుతూ వెళ్తే అనుకున్న ఫలితాలు సాధించగలుగుతారని ఆర్థిక సంఘం సభ్యుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ప్రశంసించారు. ఇప్పటికే మీరు విజేత అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. గురువారం ఆర్థిక సంఘంతో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రితో చర్చల సందర్భంగా ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించారు. అయితే ముఖ్యమంత్రి దీనిపై ఆసక్తికరంగా స్పందించారు. మీకు ముగ్గురు పిల్లలుంటే ఒకరికే సాయం చేసి మిగిలిన వారిని కష్టపడి ఎదగమని చెప్పగలరా? ఇది న్యాయమేనా అని ప్రశ్నించారు

Link to comment
Share on other sites

ఇప్పటికే మీరు విజేత 
చంద్రబాబుకు ఆర్థిక సంఘం  సభ్యుడి ప్రశంస 
  మీ పిల్లలను ఇలాగే చూస్తారా? 
  అన్యాయంపై సీఎం ఎదురు ప్రశ్న 
11ap-main11a.jpg

ఈనాడు, అమరావతి: తలసరి ఆదాయంలో మూడేళ్లలో మీరు బాగానే సాధించారని, విభజన తర్వాతా మీ కృషితో మంచి ఫలితమే వచ్చిందని, ఇలాగే కష్టపడుతూ వెళ్తే అనుకున్న ఫలితాలు సాధించగలుగుతారని ఆర్థిక సంఘం సభ్యుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ప్రశంసించారు. ఇప్పటికే మీరు విజేత అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. గురువారం ఆర్థిక సంఘంతో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రితో చర్చల సందర్భంగా ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించారు. అయితే ముఖ్యమంత్రి దీనిపై ఆసక్తికరంగా స్పందించారు. మీకు ముగ్గురు పిల్లలుంటే ఒకరికే సాయం చేసి మిగిలిన వారిని కష్టపడి ఎదగమని చెప్పగలరా? ఇది న్యాయమేనా అని ప్రశ్నించారు. దీంతో ఆ సభ్యుడు నవ్వుతూ ఉండిపోయారు. ఛైర్మన్‌ ఎన్‌కే సింగ్‌తో పాటు ఆర్థిక సంఘం సభ్యులు శక్తికాంత్‌ దాస్‌, అనూప్‌ సింగ్‌, డాక్టర్‌ అశోక్‌ లహిరి, ప్రొఫెసర్‌ రమేష్‌చంద్‌ ఈ చర్చలో పాల్గొన్నారు. రాష్ట్ర ఆర్థికశాఖ తరఫున కార్యదర్శి పీయూష్‌ కుమార్‌ నివేదిక ప్రవేశపెడుతూ... హైదరాబాద్‌లో బాహ్య వలయ రహదారికి చేసిన ఖర్చు... ఆ అప్పులను ఏపీకి పంచడాన్ని ప్రస్తావించారు. ఆస్తులు ఏ ప్రాంతంలో ఉన్నవి ఆ ప్రాంతానికి, అప్పులు జనాభా ప్రాతిపదికన పంచడంవల్ల తాము నష్టపోయామని వివరించారు. ఈ దశలో అదే సభ్యుడు కలగజేసుకుని దేశ విభజన సమయంలోనూ ఇలాగే చేశారు కదా... అని ప్రశ్నించారు. ఈ దశలో చంద్రబాబు జోక్యం చేసుకున్నారు. మీరు అన్నది సరే... మరి విభజన హామీలు నెరవేర్చాలి కదా? అదెందుకు చేయలేదని ఎదురు ప్రశ్నించారు. దాంతో ఆర్థిక సంఘం సభ్యుడు సర్దుకున్నారు. అప్పులతో అభివృద్ధి చెందడంలో తప్పేముందని, ప్రైవేటు కంపెనీలు ఇలాగే వృద్ధి చెందుతాయి కదా అని సభ్యుడొకరు ప్రశ్నించారు. దీనికి ముఖ్యమంత్రి సమాధానమిస్తూ... కేంద్రం చేసిన తప్పులకు ప్రజలు నష్టపోవాలా? కనీస వసతులకూ మేం అప్పులు చేసుకోవాలా అని ప్రశ్నించారు. వ్యవసాయంలో మంచి వృద్ధిలో ఆంధ్రప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ ముందున్నాయని ఒక సభ్యుడు కితాబిచ్చారు. మరో సభ్యుడు మాట్లాడుతూ... అమరావతి రాజధాని నిర్మాణం రాష్ట్రానికి ఎంతో ఉపకరిస్తుందని వ్యాఖ్యానించారు. అమరావతికి కేంద్రం నిధులు ఇవ్వనప్పుడు పన్నులు ఎందుకు చెల్లించాలని ముఖ్యమంత్రి గట్టిగా నిలదీశారు.

రెవెన్యూ లోటు 4.79 లక్షల కోట్లు గ్రాంటుగా ఇవ్వాలి 
ఆంధ్రప్రదేశ్‌కు రెవెన్యూ లోటు రూ.4,79,823 కోట్లు గ్రాంటుగా ఇవ్వాలని రాష్ట్ర ఆర్థికశాఖ కార్యదర్శి పీయూష్‌కుమార్‌ 15వ ఆర్థిక సంఘానికి విన్నవించారు. విభజన వల్ల చేపట్టవలసిన కార్యక్రమాలకు, రాజధాని నిర్మాణం, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి, పోర్టుల అనుసంధానానికి రూ.69,687 కోట్లు అవసరమని ఆయన కోరారు. ఆర్థికశాఖ తరఫున నివేదికను ఆర్థిక సంఘం ముందుంచారు. 
* ఆర్థికంగా భారం ఎదుర్కొంటున్న ఏపీ వంటి రాష్ట్రాలకు విపత్తుల సహాయంగా విపత్తుల సహాయ నిధి నుంచి 100% నిధులు ఇవ్వాలి. 
* స్థానిక సంస్థలకు తలసరి రూ.1,000 చొప్పున గ్రాంటుగా ఇవ్వాలి. 
* 14వ ఆర్థిక సంఘం 2015 నుంచి 2020 వరకు రూ.22,113 కోట్ల లోటును పూడ్చాలని సూచించింది. ఆ రెవెన్యూ లోటు సర్దుబాటును కొనసాగించకపోతే ఇంకా ఇబ్బందులు ఎదురవుతాయి. ఒకవేళ గ్రాంటుగా ఇవ్వకపోతే రాష్ట్రం ఇంకా అప్పులు చేయాల్సి ఉంటుంది. పెట్టుబడి వ్యయంపై ప్రభావం చూపుతుంది. అభివృద్ధి మందగిస్తుంది. 
* ఇతర గ్రాంటుగా రూ.4,986 కోట్లు ఇవ్వాలి.

Link to comment
Share on other sites

ఏపీ కష్టాలపై సానుభూతి ఉంది 
మా విధివిధానాలకు లోబడి ఎంత చేయాలో అంతా చేస్తాం 
  రాజధాని నిర్మాణం గొప్ప అవకాశం 
  15వ ఆర్థిక సంఘం ఛైర్మన్‌ ఎన్‌.కె.సింగ్‌ 
ఈనాడు - అమరావతి 
11ap-main12a.jpg

‘ఆంధ్రప్రదేశ్‌కు కఠినమైన సవాళ్లే కాదు. అద్భుతమైన అవకాశాలున్నాయి. నూతన రాజధాని నిర్మాణం గొప్ప అవకాశం. రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఇది గొప్ప చోదకంగా పని చేస్తుంది. ఇప్పటికే అమరావతికి మంచి బ్రాండ్‌ ఏర్పడింది. జల వనరుల నిర్వహణ, నదుల అనుసంధానం చర్యలతో రాష్ట్రంలో ఉత్పాదకత పెరుగుతోంది. తలసరి ఆదాయం పెరిగేందుకు ఇది దోహదం చేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సాంకేతికత వినియోగంలో ముందున్నారు. జ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థను ఏర్పాటు చేసే క్రమంలో ఏపీ చేస్తున్న కృషి బాగుంది. భవిష్యత్తులో ఇవన్నీ ఇక్కడ జీవన ప్రమాణాల పెరుగుదలకు దోహదం చేస్తాయి. ఏపీలో చొరవ కలిగిన, ప్రభావవంతమైన నాయకత్వం ఉంది’ అని 15వ ఆర్థిక సంఘం ఛైర్మన్‌ ఎన్‌కే సింగ్‌ పేర్కొన్నారు. రాష్ట్ర విభజనవల్ల ఆంధ్రప్రదేశ్‌ ఎదుర్కొంటున్న కష్టాలపై తమకు సానుభూతి ఉందని, ఈ రాష్ట్ర అవసరాలు, పరిమితులూ తెలుసని, తమకు నిర్దేశించిన విధివిధానాలు, రాజ్యాంంగ నిబంధనలకు లోబడి ఏపీకి చేయగలిగినంత చేస్తామని హామీ ఇచ్చారు. గురువారం వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు- రాష్ట్ర మంత్రులు, రాష్ట్రంలోని వివిధ రాజకీయ పక్షాల సభ్యులతో వేర్వేరుగా సమావేశమైన అనంతరం ఆయన ఇతర ఆర్థిక సంఘం సభ్యులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ‘రాష్ట్ర విభజన పర్యవసానాల మూలంగా ఏపీ ఆర్థిక పరిస్థితి ఎలా మారిందనే దానిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్యమైన విషయాలను మా దృష్టికి తీసుకొచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడాన్ని ప్రస్తావించారు. రాజధాని నిర్మాణం, పోలవరం వంటి ప్రాధాన్య ప్రాజెక్టులకు సహకరించాల్సిన అవసరాన్ని వివరించారు. ప్రతి అంశాన్ని నమోదు చేసుకున్నాం. వాటన్నింటినీ పరిశీలిస్తాం. హేతుబద్ధంగా ఎలా చేయాలో అలా సహకరిస్తాం’ అని సింగ్‌ వివరించారు. అనంతరం విలేకరులడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు.

కేంద్రం వసూలు చేసే సెస్‌లు, సర్‌ఛార్జీలను డివిజిబుల్‌ పూల్‌ చేర్చాలని ఏపీ డిమాండు చేస్తోంది కదా! మీరేమి సిఫార్సు చేయనున్నారు? 
కేంద్ర ప్రభుత్వం వసూలు చేసే సెస్‌లు, సర్‌ఛార్జీలను డివిజిబుల్‌ పూల్‌లో చేర్చి... రాష్ట్రాలకు పంచాలని ఏపీతో సహా చాలా రాష్ట్రాలు డిమాండు చేస్తున్నాయి. దీనికి రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉన్నందున మేం చేసేదేమీ లేదు. రాష్ట్రాల వినతిని కేంద్రం దృష్టికి తీసుకెళ్తాం.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండు చేస్తోంది. దీనిపై 15వ ఆర్థిక సంఘం ఎలాంటి సిఫార్సులు చేయనుంది? 
ప్రత్యేక హోదాకు సంబంధించి మేం (15వ ఆర్థిక సంఘం) ఎలాంటి సిఫార్సులు చేయలేం. ఈ అంశం మాకు నిర్దేశించిన విధివిధానాల్లో లేదు.

14వ ఆర్థిక సంఘం సిఫార్సు వల్లే ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్రం పదే పదే చెబుతోంది కదా? 
కేంద్రం ఏం చెప్పింది? ఎలా చెప్పిందనే దానిపై నేను వ్యాఖ్యలు చేయను. రాష్ట్రాలను కేటగిరీలుగా విభజించడానికి తాము అనుకూలం కాదని 14వ ఆర్థిక సంఘం పేర్కొంది. ఆయా రాష్ట్రాల ఆర్థిక పరిస్థితికి అనుగుణంగా సహకారం ఉండాలని నిర్దేశించింది.

15వ ఆర్థిక సంఘం విధివిధానాల్లో 2011 జనాభా లెక్కలనే పరిగణనలోకి తీసుకోవాలని ఉండటంపై పలు రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి కదా? 
మాకు నిర్దేశించిన విధివిధానాల్లో 2011 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకోవాలని ఉంది. అయితే 2011 జనాభా లెక్కలనే పరిగణనలోకి తీసుకోవాలని లేదు. ఇతర సంవత్సరాల లెక్కలనూ వినియోగించుకుంటాం. మంచి పనితీరు, సమర్థత కనబరిచిన రాష్ట్రాలకు నష్టం (శిక్ష) కలిగించేలా చేయం.

ప్రజాకర్షక పథకాలను ఎలా నిర్వచించుకుంటున్నారు? 
దీనిపై లోతుగా అధ్యయనం చేస్తున్నాం. పరిమిత అర్థిక వనరులున్నప్పుడు ఖర్చుల నాణ్యత ఎలా ఉందో పరిశీలిస్తున్నాం.

Link to comment
Share on other sites

కేంద్ర వ్యవస్థే సరిగా లేదు 
విభజన హామీల అమలుపై కుండబద్దలు  కొట్టిన 15వ ఆర్థిక సంఘం ఛైర్మన్‌ ఎన్‌కే సింగ్‌ 
  ఇంతకుముందు రాష్ట్రాలను విభజిస్తే  ఇలా జరగలేదు 
  ఆంధ్రప్రదేశ్‌ విషయంలోనే ఇలా... 
  హోదా విషయంలో మేమేం చేయలేం 
  ఇతరత్రా చేయగలిగినంత చేస్తాం 
11ap-main15a.jpg
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశం తమ పరిధిలో లేదని 15వ ఆర్థిక సంఘం ఛైర్మన్‌ ఎన్‌కే సింగ్‌ కుండబద్దలు కొట్టారు. విభజన చట్టం అమలు చేయడానికి అసలు ఒక వ్యవస్థ లేకుండా పోయిందని ఘాటుగా వ్యాఖ్యానించారు. ‘ఇలా అయితే దేశం ఏమైపోవాలి? సమయానుకూలంగా మాట మారుస్తూ పోతే విపరీత పోకడలకు దారి తీయదా?’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవేదనా స్వరం వినిపించారు. అమరావతిలో గురువారం 15వ ఆర్థిక సంఘంతో ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు జరిపిన సమావేశం ఆసక్తికరంగా సాగింది. ప్రత్యేక హోదా విభజన హామీలు, విభజన వ్యవహారంపై సభ్యులు కొన్ని అంశాలు లేవనెత్తగా... సీఎం గట్టిగా సమాధానాలిచ్చారు. చంద్రబాబు విజన్‌ను, ఆయన పనితీరును    ఛైర్మన్‌తో పాటు సభ్యులు ప్రశంసించారు.

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో 15వ ఆర్థిక సంఘం ఏమీ చేయలేదని ఛైర్మన్‌ నందకిశోర్‌ సింగ్‌ (ఎన్‌కే సింగ్‌) స్పష్టం చేశారు. ఈ సంఘానికి ఉన్న పరిమితులను, పరిధులను ప్రస్తావిస్తూ... ‘ఆంధ్రప్రదేశ్‌ విభజన జరిగినప్పుడు నేను రాజ్యసభలోనే సభ్యుడిని. ఆ చర్చలో నేనూ పాల్గొన్నా. ఇంతకుముందు ఎక్కడ రాష్ట్ర విభజన జరిగినా ఆ హామీలను అమలు చేయడానికి ఒక వ్యవస్థ ఉండేది. బీహార్‌, జార్ఖండ్‌ విభజన సమయంలో హామీల అమలుకు ఒక వ్యవస్థాగతమైన ఏర్పాటు చేశారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు ఛైర్మన్‌గా ఒక సెల్‌ (విభాగం) ఏర్పాటు చేశారు. ఆయన పర్యవేక్షించి అమలు చేయించారు. ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టం అమలుకు అలాంటి వ్యవస్థే లేదు. భారత ప్రభుత్వమే నేరుగా బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. ఆ రోజు మీ పార్లమెంటు సభ్యులు అనితరసాధ్యమైన పోరాటం చేశారు. అంతెందుకు ఆ రోజు అరుణ్‌ జైట్లీ, వెంకయ్య నాయుడు ప్రత్యేక హోదా డిమాండు చేశారు. ప్రధాని మన్మోహన్‌సింగ్‌ నుంచి హామీ పొందారు. బీహార్‌కు ఆ హోదా సాధించడంలో మేము విఫలమయ్యాం. ఈ విషయంలో మీరు సాధించారు. నిజానికి ఆర్థిక సంఘంతో దీనికి ఏ మాత్రం సంబంధం లేదు. జాతీయ అభివృద్ధి మండలి నిర్ణయం తీసుకోవాలి. ప్రణాళికా సంఘం అమలు చేయాలి. 14వ ఆర్థిక సంఘం ఏం చెప్పిందనే విషయంపై పునఃసమీక్షించడానికి అవకాశం లేదు’ అని పేర్కొన్నారు.

11ap-main15b.jpg
2011 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకుంటే ప్రగతి కాముక రాష్ట్రాలకు నష్టం వాటిల్లుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వాదనలను ఆయన ప్రస్తావిస్తూ... ఆర్థిక సంఘానికి నిర్దేశించిన పరిమితుల ప్రకారం వ్యవహరించాల్సి ఉంటుందన్నారు. ఆ నిబంధనల్లోనే బాగా పని చేసిన రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు ఇవ్వొచ్చన్న అవకాశమూ ఉందని, ఈ స్వేచ్ఛను వినియోగించుకుని ఆ మేరకు సానుకూలంగా స్పందించవచ్చని సింగ్‌ వెల్లడించారు. రాష్ట్ర విభజన వల్ల ఆంధ్రప్రదేశ్‌కు ఎదురైన ఇబ్బందులు, సవాళ్లు తమకు తెలుసునని, తాము సానుకూలంగానే స్పందిస్తామని ఛైర్మన్‌ భరోసా ఇచ్చారు.
Link to comment
Share on other sites

ఇలా అయితే దేశం ఏం కాను ? 
సమయానుకూలంగా కేంద్రం మాట మార్చేస్తుందా? 
  ఇది ప్రమాదకర ధోరణి కాదా? 
  మొదటి నుంచీ దక్షిణాదికి అన్యాయమే 
  నేను నాకు ఏదో అనుకూలం చేయమనడం లేదు 
  అన్ని రాష్ట్రాలతో సమంగా చేయాల్సిన బాధ్యత కేంద్రానికి లేదా? 
  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 
11ap-main16a.jpg

ఈనాడు, అమరావతి: ‘ఆంధ్రప్రదేశ్‌ను విభజిస్తూ ఆ రోజు ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంటులో హామీ ఇచ్చారు. అది విస్మరించారు. 14వ ఆర్థిక సంఘం వంక చెప్పి తప్పించుకున్నారు. సమాయానుకూలంగా మాట మారిస్తే ఎలా, బాధ్యతాయుత స్థానాల్లో ఉన్న వారే ఇలా వ్యవహరిస్తే ఇక దేశం ఏమైపోవాలి. ఇది విపరీత పోకడలకు దారి తీయదా? ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన చెందుతున్నాయి. దిల్లీలో తమ మాటకు విలువ లేకుండా పోయిందనుకుంటున్నాయి. దేశం ముఖ్యం కాదా?’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించారు. పక్క రాష్ట్రాలతో సమంగా ఎదిగేవరకూ ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై లేదా అని సీఎం నిలదీశారు. 15వ ఆర్థిక సంఘానికి ఆయన ప్రభుత్వం తరఫున రాష్ట్ర అవసరాలపై సమగ్ర ప్రజెంటేషన్‌ ఇచ్చారు.

‘ఈ శతాబ్దపు రాజకీయ బాధిత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌. నిరంతరం 10.5శాతం వృద్ధి సాధిస్తున్నా పక్క రాష్ట్రాలతో సమం కాలేకపోతున్నాం. అందుకే కేంద్రం, ఆర్థిక సంఘం ఇతోధికంగా ఆంధ్రప్రదేశ్‌కు సాయం చేయాలి’ అని ముఖ్యమంత్రి విన్నవించారు. ప్రకృతి విపత్తులను ఎదుర్కోగలుగుతున్నాంగానీ, రాజకీయ వివక్ష, కక్ష సాధింపుల నుంచి తప్పించుకోలేకపోతున్నామని చెప్పారు. రాజధాని నిర్మాణానికి 1,09,000 కోట్లు ఖర్చు అవుతుందని లెక్కించామని, 15వ ఆర్థిక సంఘం 37,437 కోట్లు కేటాయించాలని ముఖ్యమంత్రి కోరారు. వెనుకబడిన జిల్లాలకు రూ.22,500 కోట్లు, రోడ్ల అనుసంధానానికి రూ.10వేల కోట్లు కేటాయించాలన్నారు. ఆర్థిక సంఘం 2025 వరకూ 1975 జనాభా లెక్కలనే ప్రాతిపదికగా తీసుకోవాలని కోరారు. జనాభా నియంత్రణ చేసిన ఏపీ వంటి రాష్ట్రాలు ఎందుకు నష్టపోవాలని ప్రశ్నించారు.

ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి చినరాజప్ప, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, మంత్రులు పితాని సత్యనారాయణ, నక్కా ఆనంద బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పునేఠా, ముఖ్యమంత్రి కార్యాలయ ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర తదితరులు పాల్గొన్నారు.

Link to comment
Share on other sites

ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే 
కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటాను 50శాతానికి పెంచాలి 
  15వ ఆర్థిక సంఘానికి పార్టీల విజ్ఞప్తి 
11ap-main17a.jpg

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని, కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు తిరిగిచ్చే వాటాను 42 శాతం నుంచి 50శాతానికి పెంచాలంటూ కేంద్రానికి సిఫార్సు చేయాలని 15వ ఆర్థిక సంఘం ఛైర్మన్‌ ఎన్‌కే సింగ్‌, సభ్యులకు వైకాపా, సీపీఐ, సీపీఎం విజ్ఞప్తి చేశాయి. స్థానిక సంస్థలకు రాష్ట్ర ప్రభుతం ఎన్నికలు జరిపించేలా చూడాలని భాజపా కోరింది. గురువారం సచివాలయంలో ఆర్థిక సంఘంతో జరిగిన సమావేశంలో వైకాపా నుంచి శాసన మండలిలో ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పార్టీ నేత కృష్ణ, సీపీఐ నుంచి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పీజే చంద్రశేఖరరావు, ఎమ్మెల్సీ కత్తి నర్సింహారెడ్డి, సీపీఎం నుంచి రాష్ట్ర కార్యదర్శి పి.మధు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వై.వెంకటేశ్వరావు, భాజపా నుంచి ముఖ్య అధికార ప్రతినిధి సుధీష్‌ రాంబొట్ల కలిసి వారి పార్టీల తరఫున విజ్ఞాపన పత్రాలను సమర్పించారు. తర్వాత అక్కడే విలేకరులతో మాట్లాడారు.

వైకాపా...
* రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు వచ్చే ఐదేళ్లకు కేంద్రం కనీసం రూ.60వేల కోట్ల గ్రాంట్‌ ఇవ్వాలి. 
* వచ్చే ఏడాది మార్చి 31వరకూ కేంద్రానికి రాష్ట్రం ఉన్న అప్పులను పూర్తిగా రద్దు (వేవ్‌డ్‌ ఆఫ్‌) చేయాలి. 
* కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటాలను 50శాతానికి పెంచాలి. 
* జీఎస్టీ అమలుతో రాష్ట్రాలకు జరిగే నష్టాలకు పరిహారం చెల్లించేలా రూపొందించిన సంస్కరణలను సమర్థంగా అమలు చేయాలి. 
* విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌ అన్న పేరు తప్ప రాష్ట్రానికి ఏమీ రాలేదని, రాజధాని నిర్మాణానికి, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి పూర్తి స్థాయిలో నిధులివ్వలేదని, పోలవరం హామీ నెరవేరలేదని, వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని న్యాయం జరిగేలా చూడాలని కోరామని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు.
సీపీఐ..
* అమరావతి నిర్మాణానికి కేంద్రం అంగీకరించిన గ్రాంటును ఇవ్వాలి. 
* పొరుగు రాష్ట్రాలతో ఏపీ సమాన స్థాయికి వచ్చేంతవరకూ కేంద్రం గ్రాంట్లు, వడ్డీ లేని రుణాలను ఇవ్వాలి.
సీపీఎం...
* గిరిజన ప్రాంతాల్లో విద్యా, వైద్య సౌకర్యాల కల్పన కోసం రాష్ట్రానికి కేంద్రం 100శాతం గ్రాంట్లను ఇవ్వాలి. 
* పేద కౌలు రైతుల రక్షణ (ప్రొటెక్ట్‌) కోసం ప్రత్యేక గ్రాంట్లు ఇవ్వాలి. 
* ప్రకృతి వైపరీత్యాల సహాయ నిధి నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు రావడం లేదు.
భాజపా...
* రాష్ట్రంలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిపేలా చూడాలి. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల కేంద్రం నుంచి వచ్చే నిధులందక స్థానిక సంస్థలు నష్టపోతున్నాయి. 
* రాష్ట్రంలో సముద్రతీర ప్రాంతం కలిగిన జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. 
* రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ పాటించడం లేదు. నిధులను రాష్ట్రం విచ్చలవిడిగా ఖర్చు పెట్టకుండా నియంత్రించడంతోపాటు నిధుల మళ్లింపు జరగకుండా చూడాలి.
ప్రత్యేక హోదా ముగిసిన అంకం: భాజపా
‘ప్రత్యేకహోదా ముగిసిన అంకం. హోదాకు సమానంగా వచ్చే అన్ని రాయితీలు ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావడం లేదు. ఎస్పీవీ ఏర్పాటు చేసి రూ.16వేల కోట్లు తీసుకోవాలని కేంద్రం చెబుతున్నా రాష్ట్రం సిద్ధంగా లేదు. కేంద్రం చేసిన సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయ అవసరాలకు వినియోగించుకోకుండా రాష్ట్రాభివృద్ధికి వినియోగించేలా ఆర్థిక సంఘం సిఫార్సు చేయాలి’ అని భాజపా నేత బాలసుబ్రమణ్యంతో కలిసి ఆ పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి సుధీష్‌ రాంబొట్ల పేర్కొన్నారు.
రాష్ట్రాలను సామంతుల్లా చూడొద్దు
‘రాష్ట్రాలను సామంతుల్లా చూడొద్దు. సహకార సమాఖ్య విధానంతోపాటు ఆర్థిక సమాఖ్య విధానం ఉండాలి. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వొద్దని 14వ ఆర్థిక సంఘం చెప్పిందంటూ కేంద్రం చెబుతున్నదంతా అబద్ధమని ఈ రోజు సభ్యుల అభిప్రాయాన్ని బట్టి అర్థమైంది. కేంద్రం పన్నుల్లో రాష్ట్రాలకు వాటాలు కేటాయించే విధానం లోపభూయిష్టంగా ఉంది’ అని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు అభిప్రాయపడ్డారు.
Link to comment
Share on other sites

ఎన్‌కే సింగ్‌ అధ్యక్షుడిగా ఉన్న 15వ ఆర్థిక సంఘం ఆంధ్రప్రదేశ్‌ పర్యటనలో భాగంగా గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రితో సమావేశమైంది. రాష్ట్ర మంత్రిమండలిలోని ముఖ్యులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు ఇందులో పాల్గొన్నారు. తొలుత సింగ్‌, ఇతర సభ్యులకు సీఎం పుష్ఫగుచ్ఛాలు అందించి సాదరంగా ఆహ్వానించారు. గత రాత్రంతా మేల్కొనే ఉన్నానని, తితలీ తుఫాను సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తూనే ఉన్నానని వివరించారు. ప్రకృతి వైపరీత్యాలు తరచూ రాష్ట్రాన్ని నష్టపరుస్తూనే ఉన్నాయంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు.

Link to comment
Share on other sites

40 minutes ago, rk09 said:
భాజపా...

* రాష్ట్రంలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిపేలా చూడాలి. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల కేంద్రం నుంచి వచ్చే నిధులందక స్థానిక సంస్థలు నష్టపోతున్నాయి. 
* రాష్ట్రంలో సముద్రతీర ప్రాంతం కలిగిన జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. 
* రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ పాటించడం లేదు. నిధులను రాష్ట్రం విచ్చలవిడిగా ఖర్చు పెట్టకుండా నియంత్రించడంతోపాటు నిధుల మళ్లింపు జరగకుండా చూడాలి.

Dabbulu ekkuva ivvandi ani adagataaniki maata ravatam ledu ga howle gallaki.

Link to comment
Share on other sites

చంద్రబాబు నాయకత్వం భేష్‌..
12-10-2018 02:55:35
 
విభజన నేపథ్యంలో రాష్ట్రం ఎన్నో సవాళ్లను ఎదుర్కొందని ఎన్‌కే సింగ్‌ పేర్కొన్నారు. నూతన రాజధాని అమరావతి నిర్మాణం, రాష్ట్రంలో ఆర్థిక వృద్ధి రేటు పెరుగుదల, నీటి వనరులకు సమప్రాధాన్యం, నదుల అనుసంధానం, పోలవరం ప్రాజెక్టు వంటి అంశాలను ప్రస్తావిస్తూ ప్రభుత్వం పనితీరును, చంద్రబాబు నాయకత్వాన్ని ప్రశంసించారు. వ్యవసాయ ఉత్పత్తుల్లో రాష్ట్రం మంచి పురోగతి సాధిస్తున్నట్లు తెలిపారు. టెక్నాలజీ, నాలెడ్జ్‌ ఎకానమీ, ఐటీ రంగాల్లో రాష్ట్రం ప్రత్యేక గుర్తింపు సాధించిందన్నారు. సీఎం డిమాండ్లను పరిగణనలోకి తీసుకుని.. అవకాశం ఉన్నంత వరకు రాష్ట్రానికి న్యాయం చేస్తామని చెప్పారు. సమావేశంలో 15వ ఆర్థిక సంఘం సభ్యులు డాక్టర్‌ అశోక్‌ లహిరి, డాక్టర్‌ అనూప్‌ సింగ్‌, శక్తికాంత్‌దా్‌స, ప్రొఫెసర్‌ రమేశ్‌చంద్‌, ఏపీ ఆర్థిక శాఖ కార్యదర్శులు ఎం.రవిచంద్ర, పీయూష్‌ కుమార్‌, ప్రత్యేక కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

లోటు గ్రాంటు కొనసాగింపునకు సానుకూలం
12-10-2018 02:57:19
 
అమరావతి, అక్టోబరు 11(ఆంధ్రజ్యోతి): రెవెన్యూలోటు గ్రాంటు కొనసాగించాలన్న రాష్ట్ర విజ్ఞప్తిపై ఆర్థిక సంఘం సానుకూలంగా స్పందించిందని రాష్ట్ర ఆర్థికశాఖ కార్యదర్శి ఎం.రవిచంద్ర తెలిపారు. అన్ని రాష్ట్రాలకు రెవెన్యూ లోటు సమస్య ఉందని, తాము పరిగణనలోకి తీసుకుంటామని ఆర్థిక సంఘం చెప్పినట్టు వివరించారు. ఏపీకి రాబోయే ఐదేళ్లలో రెవెన్యూ లోటు రూ.4 లక్షల కోట్లకు పైగా ఉంటుందని ఆయన చెప్పారు. 15వ ఆర్థిక సంఘం అంచనాలు కూడా దాదాపు అంతే ఉన్నాయని చెప్పారు. ఒకవేళ కేంద్రం రెవెన్యూ లోటు గ్రాంటును నిలిపేస్తే.. రాష్ట్రాల్లో పెట్టుబడులు ఉండవని, రాష్ట్రాభివృద్ధి అక్కడితో ఆగిపోతుందని పేర్కొన్నారు. ఈ సమస్యను 15వ ఆర్థిక సంఘం అర్థం చేసుకుందని... సీరియ్‌సగా పరిగణనలోకి తీసుకుందని రవిచంద్ర తెలిపారు.
Link to comment
Share on other sites

హోదా ఇప్పించండి
12-10-2018 02:52:13
 
636749095348754395.jpg
  •  ఐదేళ్లలో రాష్ర్టానికి 60 వేల కోట్లు ఇవ్వాలి
  •  15వ ఆర్థిక సంఘానికి వైసీపీ ప్రతిపాదనలు
అమరావతి, అక్టోబరు 11(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ నిలదొక్కుకునేందుకు ప్రత్యేక హోదా ఇచ్చేలా సిఫారసు చేయాలని 15వ ఆర్థిక సంఘానికి వైసీపీ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు వైసీపీ రాజకీయ సలహా కమిటీ సభ్యుడు, శాసనమండలిలో ప్రతిపక్షనేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పార్టీ తరఫున ప్రతిపాదనలు సమర్పించారు. వచ్చే ఐదేళ్లలో రాష్ట్రానికి లోటు బడ్జెట్‌ నిధులు అందించేలా కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేయాలని కోరారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నిలదొక్కుకునేందుకు ఐదేళ్లలో రూ.60 వేల కోట్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. 2019 మార్చి 31 వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకుంటున్న రుణాలను పూర్తిగా మాఫీ చేయాలన్నారు. 1971 జనాభా ప్రాతిపదికన 15వ ఆర్థిక సంఘం నిధులు కేటాయించాలని, రాష్ట్రానికి 15 శాతం వెయిటేజీ ఇవ్వాలని కోరారు. ఆహార పదార్థాల ఉత్పత్తికి కొత్త పరామితిని ఏర్పాటుచేసి 5 శాతం వెయిటేజీ ఇవ్వాలన్నారు. దేశ వ్యాప్తంగా సంప్రదాయేతర ఇంధన వనరుల సామర్థ్యం పెంచడంలో మన రాష్ట్రానికి 10 శాతం వెయిటేజీ ఇవ్వాలని కోరారు.
Link to comment
Share on other sites

పెండింగ్‌ నిధులు ఇప్పించాలి
12-10-2018 02:52:54
 
  • ఏపీకి హోదాతో పాటు వడ్డీలేని రుణాలివ్వాలి: లెఫ్ట్‌
అమరావతి, అక్టోబరు 11(ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధులు, 2014-15 ఆర్థిక లోటు, పోలవరం ప్రాజెక్టు, రాజధానికి ఇవ్వాల్సిన పెండింగ్‌ నిధులను వెంటనే విడుదల చేసేలా కేంద్రానికి సిఫారసులు చేయాలని 15వ ఆర్థిక సంఘాన్ని సీపీఎం కోరింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు, కార్యదర్శివర్గ సభ్యుడు వై.వెంకటేశ్వరరావు పార్టీ తరఫున ప్రతిపాదనలు అందించారు. ప్రత్యేక హోదాకు సిఫారసు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం స్థానికసంస్థలకు ఇస్తున్న నిధులకు రెట్టింపు నిధులు 15వ ఆర్థిక సంఘం కేటాయించాలన్నారు. రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం రాష్ట్రానికిచ్చిన హామీలను గౌరవించి అమలు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సెక్రటేరియట్‌ మెంబర్‌ పీజే చంద్రశేఖర్‌రావు ప్రతిపాదించారు. ఇతర రాష్ట్రాలతో సమానంగా అభివృద్ధి చెందేందుకు ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు వడ్డీలేని రుణాలు అందించాలని కోరారు.
Link to comment
Share on other sites

నిధులు కుమ్మరిస్తున్న కేంద్రం!
12-10-2018 02:53:28
 
  • రాష్ట్రమే వాటిని వృథా చేస్తోంది: బీజేపీ
అమరావతి, అక్టోబరు 11(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఓ వైపు నిధులు కుమ్మరిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వృథా చేస్తోందని 15వ ఆర్థిక సంఘానికి బీజేపీ ఫిర్యాదు చేసింది. కేంద్రం తగినన్ని నిధులిచ్చినా రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగాలను విస్మరించిందని బీజేపీ నేతలు తమ వినతిపత్రంలో ఆరోపించారు. అయితే ప్రత్యేక హోదా, విభజన హామీల ఊసే ఎత్తకుండా ఇతర పార్టీల కన్నా భిన్నంగా బీజేపీ విన్నవించడం చర్చనీయాంశమైంది. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడం వల్లే కేంద్ర నిధులు రాకుండాపోయాయని చెబుతూనే... కేంద్రం తగినన్ని నిధులిచ్చినా ప్రాధాన్యత రంగాల వారీగా రాష్ట్రం ఖర్చు చేయడం లేదని బీజేపీ నేతలు పేర్కొన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని సూచించారు.
 
నిధుల కేటాయింపు 2011 జనాభా ప్రాతిపదికన జరిగిందని, ఫలితంగా కుటుంబ నియంత్రణ పాటించిన రాష్ట్రాలు నష్టపోయాయని వివరించారు. తీర సంరక్షణకు ప్రత్యేక నిధులు కేటాయించాలని బీజేపీ కోరింది. సుదీర్ఘ సముద్ర తీరమున్న ఆంధ్రప్రదేశ్‌కు తీరప్రాంత అభివృద్ధి నిధులు కేటాయించాల్సిన ఆవశ్యకత ఉందని పార్టీ ప్రతినిధులు వివరించారు. రాష్ట్రంలో వెనుక బడిన జిల్లాలకు ఇస్తున్న నిధులు సరిపోవడంలేదని, వాటిని పెంచాలని ఆర్థిక సంఘాన్ని కోరారు.
Link to comment
Share on other sites

సానుభూతి ఉంది.. హోదా లేదు!
12-10-2018 02:54:40
 
  •  హోదా మా పరిధిలో లేదు
  • అప్పట్లో వాజ్‌పేయి ఇచ్చారు
  •  ఆంధ్రపై నాకు సానుభూతి ఉంది
  •  పరిమితులకు లోబడి చేయగలిగింది చేస్తా
  •  15వ ఆర్థిక సంఘం చైర్మన్‌ ఎన్‌కే సింగ్‌ హామీ
అమరావతి, అక్టోబరు 11(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే అంశం తమ పరిధిలో లేదని 15వ ఆర్థిక సంఘం చైర్మన్‌ ఎన్‌కే సింగ్‌ స్పష్టం చేశారు. ‘గతంలో జాతీయాభివృద్ధి మండలిలో కొన్నిరాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించారు. ఆ తర్వాత అప్పటి ప్రధాని వాజ్‌పేయి రెండు రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చారు. ఆ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా నిర్వహణను కేంద్ర ఆర్థిక శాఖ సహకారంతో ప్రణాళికా సంఘం చూసుకుంది. ఇందులో ఆర్థిక సంఘం పాత్ర లేదు’ అని తెలిపారు. 15వ ఆర్థిక సంఘం ఈ నెల 9 నుంచి 12వ తేదీ వరకు రాష్ట్రంలో పర్యటిస్తోంది. అందులో భాగంగా కమిషన్‌ చైర్మన్‌, సభ్యులు గురువారం ఉదయం సీఎం చంద్రబాబుతో, సాయంత్రం రాష్ట్రంలోని వివిధ పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. 14వ ఆర్థిక సంఘం చెప్పడం వల్లే తాము ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదంటూ కేంద్రం చేసిన ప్రకటనపై తాను స్పందించనని సింగ్‌ తెలిపారు. 14వ ఆర్థిక సంఘం రాష్ట్రాలను వివిధ కేటగిరీలుగా (ప్రత్యేక హోదా ఉన్న, ప్రత్యేక హోదా లేని) విభజించేందుకు సుముఖత కనబరచలేదని చెప్పారు.
 
ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు ప్రత్యేకంగా అందుతున్న ప్రయోజనాలేమీ లేవని అభిప్రాయపడిందన్నారు. అది క్షుణ్ణంగా అధ్యయనం చేయలేదని తాను భావిస్తున్నట్లు తెలిపారు. కొన్ని గణాంకాలను పరిశీలించాక తానీ అభిప్రాయానికి వచ్చానన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను అధ్యయనం చేస్తున్నానని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ విభజన బిల్లుకు అనుకూలంగా గతంలో తాను రాజ్యసభలో మాట్లాడానని ఎన్‌కే సింగ్‌ చెప్పారు. ‘ఏపీ పట్ల సానుభూతి ఉంది. నాకున్న పరిమితులకు లోబడి చేయగలిగింది చేస్తాను. 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకోవాలని ఆర్థిక సంఘం విధివిధానాల్లో ఉంది. కానీ జనాభా నియంత్రణ పాటించినరాష్ట్రాలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలన్న ప్రతిపాదనలు ఉన్నాయి. జనాభా వెయిటేజీని సరికొత్తగా ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం’ అని ఎన్‌కే సింగ్‌ చెప్పారు. సెస్‌లు, సర్‌చార్జీలను డివిజబుల్‌ పూల్‌లోకి తీసుకొచ్చేందుకు రాజ్యాంగం అంగీకరించదని.. అయితే చాలా రాష్ట్రాల నుంచి వచ్చిన ఈ డిమాండ్‌ను కేంద్రం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు.
Link to comment
Share on other sites

సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసే కుట్ర
12-10-2018 02:56:57
 
636749147991850320.jpg
  • డీలిమిటేషన్‌కు పనికొచ్చిన నిబంధన
  • నిధుల కేటాయింపునకు పనికిరాదా?: యనమల ధ్వజం
  • రాష్ర్టానికి న్యాయం చేయాలని ఆర్థిక సంఘానికి విజ్ఞప్తి
అమరావతి, అక్టోబరు 11(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ లాంటి రాష్ట్రాలకు నష్టం కలిగించేలా ‘టర్మ్స్‌ ఆఫ్‌ రెఫరెన్స్‌’ను కేంద్రం రూపొందించడంపై రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. దేశంలోని సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసే ఉద్దేశంతోనే కేంద్రం ఈ పనిచేసిందని విమర్శించారు. గురువారం 15వ ఆర్థిక సంఘం ముఖ్యమంత్రి, మంత్రులతో సమావేశమైంది. మంత్రి యనమల స్వాగతోపన్యాసం చేశారు. 2011 జనాభా ప్రాతిపదికన వెయిటేజీ ఇవ్వాలన్న నిబంధనను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. రాజధాని అమరావతి ఇప్పుడిప్పుడే రూపురేఖలు సంతరించుకుంటోందని, ఈ సమయంలో రాజధాని అభివృద్ధికి అవసరమైన నిధులు కేటాయించి, రాష్ట్రాభివృద్ధికి దోహదపడాలని 15వ ఆర్థిక సంఘాన్ని కోరారు. 2001లో రాజ్యాంగానికి చేసిన 84వ సవరణను సాకుగా చూపుతూ నియోజకవర్గాల పునర్విభజన అవసరం లేదని చెప్తున్న కేంద్రం... అదే నిబంధనను జనాభా ప్రాతిపదికన ఇచ్చే నిధులకు ఎందుకు పాటించడం లేదని ప్రశ్నించారు.
 
‘84వ రాజ్యాంగ సవరణ ప్రకారం... 2026 వరకు నియోజకవర్గాల పునర్విభజనకు 1971 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకోవచ్చు. సీట్ల పెంపు విషయంలో నిబంధనల ప్రకారం వ్యవహరిస్తున్న కేంద్రం... నిధుల కేటాయింపులో నిర్లక్ష్యం చూపుతోంది’ అని ధ్వజమెత్తారు. ఫైనాన్స్‌ కమిషన్‌ చట్టం 1951 ప్రకారం రెవెన్యూ లోటు గ్రాంటు అంశంపై స్వతంత్రంగా వ్యవహరించే అధికారం ఆర్థిక సంఘానికి ఉందని, దాన్ని ఉపయోగించుకుని రాష్ట్రానికి న్యాయం చేయాలని యనమల కోరారు. టర్మ్స్‌ ఆఫ్‌ రెఫరెన్స్‌లో కేంద్రం ‘పాపులిస్ట్‌’ పథకంగా పేర్కొనడాన్ని ఆయన తప్పుపట్టారు.
Link to comment
Share on other sites

హోదాపై సిఫారసు చేయండి
12-10-2018 03:01:32
 
  •  వెనుకబడిన ప్రాంతాలకు నిధులు ఇవ్వాలి
  •  15వ ఆర్థిక సంఘానికి రాష్ట్ర నేతల వినతులు
అమరావతి, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేలా కేంద్రానికి సిఫారసు చేయాలంటూ పలువురు నేతలు 15వ ఆర్థిక సంఘానికి విజ్ఞప్తి చేశారు. అమరావతిలో గురువారం సంఘం ప్రతినిధులను పలు రాజకీయ పార్టీలు, ఇతర వర్గాలు కలసి, రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలు, వినతులు సమర్పించాయి. ఈ సందర్భంగా ఆయా పార్టీల నాయకులు మీడియాతో మాట్లాడారు.
 
కేంద్రం చెప్పేదంతా బూటకం
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వొద్దని 14 ఆర్థిక సంఘం చెప్పిందనడం పెద్ద అబద్ధం. కేంద్రం చెబుతున్నదంతా బూటకమే. 15వ ఆర్థిక సంఘం అధ్యక్షులు ఎంకే సింగ్‌ చేసిన వ్యాఖ్యలతో ఈ విషయం స్పష్టమైంది. హోదా విషయంలో ఫైనాన్స్‌ కమిషన్‌ కూడా చేతులెత్తేసేలా కేంద్రం చేసింది. విభజన సమస్యలు దృష్టిలో పెట్టుకుని రాష్ట్రాభివృద్ధిని కాంక్షిస్తూ సానుకూల ధోరణితో వ్యవహరించాలని సంఘాన్ని కోరాం. 2011 లెక్కల ప్రకారం కాకుండా 1971 జనాభా ప్రాతిపదికగా రాష్ట్రానికి నిధులు కేటాయించాలి. కుటుంబ నియంత్రణను సమర్థంగా నిర్వహించిన రాష్ట్రాలకు అధిక నిధులివ్వాలి. హోదా అనేది రాజకీయ నిర్ణయమని, రాజ్యసభలో తాను ఓటు వేసిన విషయాన్ని కూడా సింగ్‌ గుర్తు చేశారు. బీజేపీ కల్లబొల్లి కబుర్లు చెబుతూ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తోంది.
- కుటుంబరావు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు
 
హోదా ఎందుకివ్వరు?
పార్లమెంటులో అన్ని పార్టీలు ఒప్పుకున్నా, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడానికి గల కారణాలేంటో చెప్పాలి. రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ప్రజలందరూ కోరుకుంటున్నారు. దీనిపై 15వ ఆర్థిక సంఘం కేంద్రానికి సిఫారసు చేయాలి. ఎఫ్‌ఆర్‌బీఎం చట్లం సమర్థంగా అమలు కాకపోవడం వల్లే రుణ సంక్షోభంలో చిక్కుకున్నాం. అధిక వడ్డీకి బాండ్లు విడుదల చేస్తున్నారు. వాటిపై విధించే వడ్డీకి పరిమితి ఉండేలా చూడాలి. వెనుకబడిన ప్రాంతాలకూ నిధులు కేటాయించి, స్వామినాథన్‌ కమిటీ సిఫారసులు అమలు చేయాలి.
- ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు
 
హోదా ముగిసిన అంకం
ఏపీకి ప్రత్యేక హోదా ముగిసిన అంకం. హోదాతో సమానంగా నిధులు ఇస్తామని, ఎస్పీవీ ఏర్పాటు చేసుకోవాలని కేంద్రం సూచించింది. అయితే రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను తప్పుదారి పట్టించడానికే కేంద్రం నిధులు ఇస్తామన్నా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడంలేదు. 2011 జనాభా ప్రాతిపధికన నిధులు కేటాయించడం వల్ల రాష్ట్రం నష్టపోయే ప్రమాదం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోతే వాటికి బదులుగా రాష్ర్టానికి ఇచ్చే నిధుల్లో కోత విధించాలి. - సుధీష్‌ రాంబొట్ల, బీజేపీ అధికార ప్రతినిధి
 
ప్రత్యేక హోదా ఇవ్వాలి
ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేలా 15వ ఆర్థిక సంఘం సిఫారసు చేయాలి. విభజన సమయంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడంతో పాటు ఏపీలో వెనుకబడిన ప్రాంతాలకూ నిధులు కేటాయించాలి. ప్రభుత్వాలు అభివృద్ధి కోసం నిధులు ఖర్చు చేయకుండా రాజకీయ జిమ్మిక్కులకు కేటాయిస్తున్నాయి. జీఎ్‌సటీ వచ్చిన తర్వాత చిన్న పరిశ్రమలు, రైతులు దెబ్బతింటున్నారు. ఆరోగ్య బడ్జెట్‌ను కేంద్రమే భరించాలి.
- మధు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...