Jump to content

Titli Cyclone | Coastal Districts Put On High Alert |


sonykongara

Recommended Posts

  • Replies 156
  • Created
  • Last Reply
ఎంత అణగదొక్కితే.. అంత రెచ్చిపోతా
06-11-2018 02:18:06
 
636770674871284847.jpg
  • మోదీ దేశాన్ని భ్రష్టు పట్టించారు 
  • బీజేపీ అరాచకాల వల్లే కాంగ్రెస్‌ సహకారం
  • అన్ని పార్టీలను ఏకతాటిపైకి తెస్తున్నాం
  • టీడీపీ చొరవను దేశమంతా అభినందిస్తోంది
  • కోడికత్తిపై ఢిల్లీలో వైసీపీ రాద్ధాంతం
  • తితలీ బాధితుల ఊసే ఎత్తడం లేదు
  • కేంద్రానికి పవన్‌ కల్యాణ్‌ లేఖ రాయలేదేం?
  • పలాస సభలో సీఎం చంద్రబాబు ధ్వజం
  • బాధితులకు 350 కోట్ల పరిహారం పంపిణీ
శ్రీకాకుళం, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీని బీజేపీ అణగదొక్కాలని చూస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. ఎంత అణగదొక్కితే అంత రెచ్చిపోతానని హెచ్చరించారు. కేంద్రంలో బీజేపీ అరాచకాల వల్లే కాంగ్రెస్‌ సహకారం కోరాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ నియంతృత్వ వైఖరికి వ్యతిరేకంగా అన్ని పార్టీలను ఏకతాటిపైకి తెస్తున్న టీడీపీ చొరవను దేశం మొత్తం అభినందిస్తోందన్నారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో సోమవారం తితలీ బాధితులకు రూ.350 కోట్ల పరిహారం పంపిణీ ప్రక్రియను ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించారు. ‘ప్రజాస్వామ్యాన్ని మోదీ అపహాస్యం చేస్తున్నారు. దేశాన్ని భ్రష్టు పట్టించారు. గవర్నర్‌ వ్యవస్థను దుర్వినియోగం చేయడం దగ్గర నుంచి ఈడీ, సీబీఐ, ఆర్‌బీఐ వరకు.. చివరకు పత్రికా స్వేచ్ఛను కూడా దెబ్బతీశారు. అందుకే నేను ఢిల్లీ వెళ్లాల్సి వచ్చింది. అన్ని పార్టీలను ఏకతాటిపైకితెచ్చే బాధ్యతను దేశం కోసం చేపట్టాను. పదవులాశించి ఈ పని చేయడం లేదు. దేశంలో ప్రజాస్వామ్యం పూర్తిగా దెబ్బతింటే మనుగడ ప్రశ్నార్థకమవుతుంది. ఇవన్నీ ఆలోచించి అన్ని పార్టీలను కలిపే పనికి శ్రీకారం చుట్టాను.
 
చివరకు కాంగ్రెస్‌ దేశంలో ఎక్కడా లేని పరిస్థితి ఉన్నా దాన్ని కూడా పోరాటానికి సహకరించాలని కోరాను. ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీని కలిశానంటే అందుకు బీజేపీ అరాచకాలే కారణం. ఎన్‌డీఏ మనకు అన్యాయం చేసిందా.. లేదా.. అని ఈ సందర్భంగా మీ అందరినీ అడుగుతున్నా’ అని సభికులనుద్దేశించి ప్రశ్నించారు. పోరాటానికి సిద్ధంగా ఉన్నామని పిడికిలి బిగించి చెప్పాలని పిలుపిచ్చారు. సీఎం ఇంకా ఏమన్నారంటే.. ‘కేంద్రప్రభుత్వం తితలీ తుఫాను సాయం కింద ఇంతవరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఎంతోమంది చనిపోయినా స్పందించలేదంటే వీరికి మానవత్వం ఉందా? నేను పలాసలో ఉండి తుఫాను బాధితులకు అండగా ఉంటే బీజేపీ నేతలు గుంటూరు వచ్చి పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన చేసి టీడీపీని తిట్టి వెళ్లారు. మనం పన్నులు కడుతున్నాం. అటువంటప్పుడు కేంద్రం కష్టాల్లో ఉన్న రాష్ట్రానికి నిధులిచ్చి ఆదుకోవాలి. విపత్తు సందర్భంలో ఇక్కడకు రావలసిన అవసరం లేదా? ఎందుకు రారు?’
 
కోడి కత్తి ఘటనపై హడావుడి..
‘ప్రతిపక్ష నేత జగన్‌పై ఆ పార్టీ అభిమాని కోడికత్తి తో దాడి చేశారు. ఆ నెపాన్ని తెలుగుదేశంపై మోపి... ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతి, హోం మంత్రిని కలిసి ఫిర్యాదు చేసిన వైసీపీ పెద్ద మనుషులు తితలీ తుఫాను బాధితుల గురించి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడాన్ని ఏమనాలి? కోడికత్తి ఘటనను పెద్దదిగా చిత్రీకరించిన వైసీపీ.. ఉద్దానం తుఫానుతో తీవ్రంగా నష్టపోతే కనికరం లేకుండా వ్యవహరించింది. పక్కనే విజయనగరం జిల్లాలో జగన్‌ పర్యటిస్తున్నా కనీసం తుఫాను బాధితులను పలకరించడానికి రాలేదు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఉద్దానం వచ్చి మొసలి కన్నీరు కార్చారు. చాలా అన్యాయం జరిగిందని మాట్లాడారు. కానీ కేంద్రానికి ఒక్క లేఖ అయినా రాశారా? విమర్శించారా?’
 
వాళ్ల ఫొటోలను బజారుకీడ్చాలి
‘తితలీ తుఫాను బాధితులకు పరిహారం అందించేందుకు ఎంతో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నాం. అయినా అక్రమార్కులు.. ఫొటోలను మార్ఫింగ్‌ చేస్తూ ప్రభుత్వాన్నే మోసం చేయాలని ప్రయత్నిస్తున్నారు. అటువంటి వ్యక్తులు దొరికితే అత్యంత కఠినంగా శిక్షిస్తాం. వీళ్లది దొంగల కంటే నీచాతినీచమైన బుద్ధి. వీలైతే బాధితులకు సాయం చేయాలి. సాయాన్ని కొట్టేస్తే ఊరుకునేది లేదు. ఖబడ్దార్‌. సాయం పొందిన తుఫాను బాధితుల జాబితాలను ఆన్‌లైన్‌లో పెడతాం. జియోట్యాగింగ్‌ చేస్తాం. ఎవరైనా అనర్హులుంటే 1100కి ఫోన్‌ చేయండి’
 
అధికారులకు వారం సెలవు
‘తితలీ తుఫానులో నిరంతరాయంగా విధులు నిర్వహించిన ఇతర జిల్లాల అధికారులను అభినందిస్తున్నాను. అధికారులు దసరాకు కూడా ఇంటికి వెళ్లలేదు. కనీసం దీపావళికైనా వారం రోజులు ప్రత్యేకంగా సెలవు ఇవ్వాలని నిర్ణయించాం. దసరా వచ్చిందని, ఇంటికి వెళ్తామని అధికారులు నన్ను ఒక్క మాట కూడా అడగలేదు. బాధితులకు న్యాయం జరిగిన తర్వాతే ఇళ్లకు వెళ్తామని కష్టపడి పనిచేశారు’
 
భవనాల నిర్మాణం
తితలీ తుపాను ప్రభావిత ప్రాంతాలను ఆదుకునేందుకు నేషనల్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవల్‌పమెంట్‌ కౌన్సిల్‌ (నారెడ్కో) నిర్మించ తలపెట్టిన సామాజిక భవనాల శిలాఫలకాన్ని సీఎం చంద్రబాబు పలాసలో ఆవిష్కరించారు.గిరిజన గ్రామాలలో రూ.70 లక్షలతో భవనాలు నిర్మించడానికి నారెడ్కో ముందుకొచ్చింది.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...