Jump to content

Titli Cyclone | Coastal Districts Put On High Alert |


sonykongara

Recommended Posts

  • Replies 156
  • Created
  • Last Reply
‘తితలీ’ తుపానుపై తెల్లవారుజాము నుంచే సీఎం చంద్రబాబు సమీక్ష
11-10-2018 08:23:08
 
636748449580953809.jpg
అమరావతి: ‘తితలీ’ తుపాను తీరం దాటిన నేపథ్యంలో దాని ప్రభావంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష సమావేశం నిర్వహించారు. గురువారం తెల్లవారుజామున నాలుగు గంటల నుంచే తుపాను ప్రభావంపై ఆర్టీజీఎస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ కలెక్టర్లతో మాట్లాడిన సీఎం చంద్రబాబు అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
 
శ్రీకాకుళం జిల్లాలో ఇది పెను విపత్తని, తుపాను ప్రభావంతో జిల్లాలో తీవ్రనష్టం వాటిల్లే అవకాశం ఉందన్నారు. ఉద్దానం ప్రాంతంలో తుపాను తీవ్ర ప్రభావం చూపిందని, భారీ ఎత్తున జీడిచెట్లు, కొబ్బరిచెట్లు నేలకూలాయని, విద్యుత్‌ స్తంభాలు పడిపోయాయని సీఎం అన్నారు. ఇచ్ఛాపురం, కవిటి, వజ్రపుకొత్తూరు, పలాస మండలాల్లో ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావొద్దని సూచించారు. ముందస్తు జాగ్రత్తలపై ఎస్‌ఎంఎస్‌, ఐవీఆర్‌ఎస్‌ సందేశాలు పంపాలని ఆదేశించారు. అలాగే ప్రజలకు భోజనం, అల్పాహారం, తాగునీరు ప్యాకెట్లు పంపిణీ చేయాలని అవసరమైన మందులు అందుబాటులో ఉంచుకోవాలని అధికారులను సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు.
Link to comment
Share on other sites

తితలీ’ తుపానుపై ఆర్టీజీఎస్‌లో ప్రత్యేక ఏర్పాట్లు
11-10-2018 08:31:47
 
636748435082768700.jpg
అమరావతి: శ్రీకాకుళం జిల్లాలో తితలీ తుఫాను తీరం దాటిన నేపథ్యంలో ఆర్టీజీఎస్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కాల్‌ సెంటర్‌ నుంచి ఎస్‌ఎంఎస్‌ ద్వారా వరద హెచ్చరిక సందేశాలను జారీ చేశారు. సహాయం కోసం 1100 నంబర్‌కు సంప్రదించాలని సూచించారు. అటు విజయనగరం కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూం ఏర్పాటు చేశారు. ఫోన్ 08922236947, టోల్ ఫ్రీ నెంబర్ 1077ను, అలాగే విశాఖ కలెక్టరేట్‌లో కాల్‌ సెంటర్‌ నెంబర్ 1800 4250 0002కు ఫోన్ చేసి సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు.
Link to comment
Share on other sites

తితలీ’ తుపానుపై రాత్రంతా ప్రతి రెండు గంటలకోసారి సీఎం ఆరా
11-10-2018 08:53:30
 
636748450670571778.jpg
అమరావతి: ‘తితలీ’ తుపాను తీరం దాటనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కంటిమీద కునుకు లేకుండా గడిపారు. తుపానుపై రాత్రంతా అప్రమత్తంగా ఉన్న సీఎం ప్రతి రెండు గంటలకు ఒకసారి సమీక్ష నిర్వహించారు. ఆర్టీజి, ఇస్రో అధికారుల నుంచి తుపాన్ కదలికలపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించారు. ఆర్టీజి ద్వారా శ్రీకాకుళం అధికారులకు తుపాన్ సమాచారం అందజేశారు. తెల్లవారుజామున వాయుగుండం తీరాన్ని దాటినట్లు సమాచారం అందడంతో దాని ప్రభావంపై అధికారులతో సమావేశం నిర్వహించారు.
 
తుఫాను ప్రభవాతంతో పలాస మున్సిపాలిటీలో తీవ్ర నష్టం వాటిల్లిందని, ఈదురుగాలుల వల్ల భారీగా పంట నష్టం, ఆస్తినష్టం కలిగినట్లు తెలిపారు. పంటనష్టం, ఆస్తి నష్టంపై సమాచారం సేకరించాలని అధికారులను సీఎం ఆదేశించారు. వర్షాలు తెరిపి ఇచ్చిన వెంటనే సహాయ పునరావాస చర్యలు చేపట్టాలన్నారు. పునరావాస కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించాలని ఆదేశించారు. భోజనం, పులిహోర, తాగునీటి పాకెట్లు పంపిణీ చేయాలని, సహాయ పునరావాస చర్యల్లో అందరూ పాల్గొనాలని సీఎం సూచిచంారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు సహాయచర్యలలో చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు. సాయంత్రానికల్లా సాధారణ పరిస్థితులు వచ్చేలా చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
 
Tags : cm chandrababu, titli cyclone, Andhrapradesh
Link to comment
Share on other sites

తుఫాన్ సహాయకచర్యలపై సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్
11-10-2018 11:05:33
 
636748528542706841.jpg
అమరావతి: తుఫాన్ సహాయకచర్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం ఉదయం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. నేలకూలిన చెట్లను వెంటనే తొలగించాలని, దెబ్బతిన్న రహదారులను వెంటనే పునరుద్దరించాలని ఆదేశించారు. అలాగే యుద్ధప్రాతిపదికన రాకపోకలు పునరుద్దరించాలని తెలిపారు. నదుల్లో ప్రవాహం పరిశీలించాలని..కాలువలకు గండ్లు పడకుండా చూడాలని సూచించారు. విద్యుత్ పునరుద్దరణ చర్యలు వేగవంతం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్ఎఫ్, కోస్టల్ గార్డుల సేవలు వినియోగించుకోవాలన్నారు. ఇతర జిల్లాల నుంచి సిబ్బందిని శ్రీకాకుళానికి తరలించాలని చెప్పారు. అంటువ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని, సాయంత్రానికల్లా సాధారణ పరిస్థితులు నెలకొల్పాలని అధికారులను సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు.
 
Tags : ap cm, Chandrababu, Teleconference, Amaravati, Cyclone
Link to comment
Share on other sites

పెనుతుఫానుగా కొనసాగతున్న ‘తితలీ’
11-10-2018 11:18:17
 
636748536034709348.jpg
విశాఖపట్నం: జిల్లాలోని వజ్రపుకొత్తూరు మండలం గొల్లపాడు- పల్లెసారథి వద్ద ఈరోజు తెల్లవారుజామున తితలీ తుఫాను తీరం దాటినప్పటికీ పెనుతుఫానుగానే కొనసాగుతోంది. ఈశాన్య దిశగా కదిలి తుపానుగా రేపటికి బలహీనపడే అవకాశం ఉన్నట్లు విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. తుఫాను ప్రభావంతో శ్రీకాకుళంలో గంటకు 135-145 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ప్రస్తుతం 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. మరో 6 గంటల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని విశాఖ వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
Link to comment
Share on other sites

ముఖ్యమంత్రి జాగారం
తిత్లీపై రాత్రంతా సమీక్షించిన సీఎం చంద్రబాబు
పలు దఫాలుగా టెలికాన్ఫరెన్సులు
ప్రాణ, ఆస్తి నష్టం లేకుండా చూడాలని అధికారులకు సూచనలు
11ap-main5a.jpg

ఈనాడు, అమరావతి: తిత్లీ తుపాను తీవ్ర ప్రభావం చూపించనుందనే ముందస్తు సమాచారం నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగారు. రాత్రంతా కంటిమీద కునుకు లేకుండా శ్రమించారు. బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు సమీక్షించారు. ఆర్టీజీఎస్‌ నుంచి వచ్చే సమాచారం ఆధారంగా  ఉన్నతాధికారులతో మాట్లాడారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చూడాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి స్థాయిలోని వ్యక్తే నిద్ర మానుకుని అరగంటకోసారి పర్యవేక్షిస్తుండటంతో కిందిస్థాయి సిబ్బంది చురుగ్గా వ్యవహరించారు. అనంతపురం జిల్లా పర్యటనకు వెళ్లిన చంద్రబాబు బుధవారం సాయంత్రానికి తిరిగి వచ్చారు. 6 గంటలకు కలెక్టర్లు, ఉన్నతాధికారులతో మాట్లాడారు. విపత్తు నిర్వహణ, వాతావరణ, జలవనరులశాఖ అధికారులకు పలు సూచనలు చేశారు.  బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించి ఆహారం, తాగునీరు అందించాలని స్పష్టం చేశారు. అమలు తీరుపై మరోమారు ఆరా తీశారు.  తీరం దాటిన సమయంలో తెల్లవారుజామున 4 గంటలకు సీఎం ఇంకోసారి అధికారులతో మాట్లాడారు. గురువారం ఉదయం 10.25 గంటలకు కలెక్టర్లు, ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి మాట్లాడారు. ఇక నుంచి ప్రతి గంటా మనకు ముఖ్యమేనని స్పష్టం చేశారు. సహాయ పునరావాస చర్యలే కీలకమని చెప్పారు.

11ap-main5b.jpg
Link to comment
Share on other sites

సిక్కోలుకు అండ
12-10-2018 03:21:22
 
636749112838115065.jpg
  • కార్యదర్శులంతా శ్రీకాకుళానికి సాధారణ స్థితి వచ్చేదాకా అక్కడే
  • మత్స్యకారులకు 50 కిలోలు, ఇతరులకు 25 కిలోల బియ్యం
  • మృతులకు తక్షణం పరిహారం
  • పంటల పరిశీలనకు శాస్త్రవేత్తలు
  • సహాయ చర్యల్లో పాల్గొనాలని పార్టీ యంత్రాంగానికి పిలుపు
  • శ్రీకాకుళంలో చంద్రబాబు సమీక్ష
శ్రీకాకుళం, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): తితలీ తుఫానుతో దెబ్బతిన్న ఉత్తరాంధ్ర సాధారణ స్థితికి వచ్చేదాకా ప్రభుత్వ యంత్రాంగం మొత్తం అక్కడే ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. అన్ని శాఖల కార్యదర్శులు శ్రీకాకుళం రావాలని ఆదేశించారు. తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతాలు కోలుకునేదాకా ఉన్నతాధికారులంతా అక్కడే ఉండాలన్నారు. పంటలకు జరిగిన నష్టం, వాటి పరిస్థితిని సమీక్షించేందుకు వ్యవసాయ శాస్త్రవేత్తలను పిలిపించాలన్నారు. బుధవారం రాత్రి నుంచి యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన సీఎం.. గురువారం రాత్రి విశాఖ నుంచి రోడ్డుమార్గం గుండా శ్రీకాకుళం చేరుకున్నారు. జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు, జిల్లా అధికారులతో కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు.
 
మత్స్యకారులకు 50కేజీల చొప్పున, ముంపు గ్రామాల్లో 25 కేజీల చొప్పున బాధితులకు తక్షణం బియ్యం అందిస్తామని తెలిపారు. పార్టీ యంత్రాంగం, ప్రజలు కూడా సహాయ చర్యల్లో పాల్గొనాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ఆర్‌ అండ్‌ బీకి చెందిన 22 రహదారులను శుక్రవారంనాటికే బాగుచేయాలన్నారు. విద్యుత్తు సరఫరాను త్వరితగతిన పునరుద్ధరించాలని ఆదేశించారు. వంశధార ఫేజ్‌-2 రిజర్వాయర్‌లోకి వరద నీటిని మళ్లించాలన్నారు. ముందస్తు చర్యల ద్వారా ప్రాణనష్టం తగ్గించగలిగామంటూ... జిల్లా యంత్రాంగాన్ని అభినందించారు. తుపాను నష్టానికి సంబంధించి చిత్రాలను సీఎం చూశారు. మరణించిన వారికి నష్టపరిహారం తక్షణమే అందించాలని అధికారుకు ఆదేశించారు.
 
 
ప్రధాని ఫోన్‌...
శ్రీకాకుళంలో అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న సమయంలోనే ప్రధాని మోదీ నుంచి చంద్రబాబుకు ఫోన్‌ వచ్చింది. తుఫాను తీవ్రత, జరిగిన నష్టం గురించి ప్రధాని అడిగి తెలుసుకున్నారు.
 

Advertisement

Link to comment
Share on other sites

విలయం
12-10-2018 03:14:02
 
636749108436827282.jpg
  • ఉత్తరాంధ్రలో ఉత్పాతం
  • ఉత్తరాంధ్ర విలవిల.. 12 గంటలపాటు ఉక్కిరిబిక్కిరి
  • తుఫాను వేగం గంటకు 165కి.మీ
  • 165 కి.మీ.వేగంతో గాలులు
  • శ్రీకాకుళంలో 12, విజయనగరంలో 5 మండలాల్లో కల్లోలం
  • 10 మంది మృతి.. కూలిన చెట్లు.. వేలాది విద్యుత్‌ స్తంభాలు
  • శ్రీకాకుళంలోనే సీఎం.. ప్రధాని మోదీ ఫోన్‌.. నష్టంపై ఆరా
  • పలాస వద్ద తీరం దాటిన ‘తితలీ’
నిశిరాత్రి వచ్చింది. నిద్ర లేకుండా చేసింది! హోరు గాలి బీభత్సం! కుండపోతగా వర్షం! కూకటివేళ్లతో సహా కుప్పకూలిన వృక్షాలు! చీపురు పుల్లల్లా విరిగిపడిన విద్యుత్‌ స్తంభాలు! అడ్డకోతకు గురై ఆధారాలు లేకుండా గాలిలో నిలిచిన రైలు పట్టాలు! చెల్లాచెదురైన వరిచేలు! బుధవారం అర్ధరాత్రి నుంచి... గురువారం మధ్యాహ్నం వరకు! పన్నెండు గంటలపాటు... అంతా పెను బీభత్సం! అందమైన సీతాకోక చిలుక పేరుతో వచ్చిన ‘తితలీ’ తుఫాను సృష్టించిన విలయం! ‘హుద్‌హుద్‌’ను గుర్తుకు తెచ్చిన భయంకర అనుభవం!
 
 
విశాఖపట్నం/ఉద్దానం/శ్రీకాకుళం/పార్వతీపురం/విజయనగరం, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి) : ఉత్తరాంధ్రపై పెను ఉప్పెన విరిగిపడింది. తీవ్రతీవ్రం, చండ్రచండ్రంగా విరుచుకుపడిన ‘తితలీ’ తుఫాను ఉధృతికి ఉత్తర కోస్తా తీరం చిగురుటాకులా వణికిపోయింది. చివరినిమిషంలో తుఫాను తన దశను మార్చుకోవడంతో, అలలెత్తిన బీభత్స, మృత్యు గాలుల సుడిలో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు 12గంటలపాటు చిక్కుకుపోయాయి. శ్రీకాకుళంలోని పలాస సమీపంలోని డోకులపాడు-మెట్టూరు పరిసరాల్లో గురువారం తెల్లవారుజామున ‘తితలీ’ తీరం దాటింది. ఈ తుఫాను ఒడిసాలోని గోపాల్‌పూర్‌ వద్ద తీరం దాటుతుందని, ఆ ప్రభావంతో ఉత్తరాంధ్రలో తీవ్ర గాలులతోకూడిన భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. దీనికి భిన్నంగా ‘తితలీ’ పలాస వైపు చొచ్చుకురావడంతో శ్రీకాకుళం, విజయనగరం తీరాలు తీవ్ర కల్లోలానికి గురయ్యాయి. ఈ కల్లోలంలో చిక్కుబడి పదిమంది మత్స్యకారులు ప్రాణాలు కోల్పోయారు. విశాఖ తీరంలో మరో ముగ్గురు గల్లంతయ్యారు. తుఫాను తీరం దాటడానికి 4 గంటల ముందు మొదలైన భీకర గాలులు, తీరం దాటిన 8 గంటల తరువాతా కొనసాగాయి. ఈ గాలులే ఉత్తరాంధ్రకు కాళరాత్రిని మిగిల్చాయి.
 
ఊపిరి బిగబట్టుకొని..
బుధవారం రాత్రి నుంచి గురువారం సాయంత్రం దాకా శ్రీకాకుళం జిల్లావాసులు ఊపిరి బిగబట్టుకొని గడిపారు. తుఫాను మిగిల్చిన బీభత్స ఛాయలు ఉద్దానంలో అడుగడుగునా కనిపించాయి. ఉద్దానంలో లక్షల ఎకరాల్లో కొబ్బరి చెట్లు సాగుచేశారు. పెను గాలులు, భారీ వర్షాలకు ఒక్కో ఎకరానికి 30శాతం చెట్లు నేలకూలి ఉంటాయని అంచనా. ఊపేసిన గాలులకు ఈ జిల్లాలో లక్షలాది చెట్లు, వేలాది విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. మొత్తం 12 మండలాల్లో తుఫాను గాలుల తీవ్రతకు పెను విధ్వంసం చోటుచేసుకుంది. కొబ్బరితోటలు లక్షలాది ఎకరాల్లో ధ్వంసం అయ్యాయి. 15వేలు దాకా విద్యుత్‌ స్తంభాలు పడిపోయాయి. పలాస, సోంపేట తదితర మండలాల్లో ట్రాన్స్‌ఫార్మర్లు ఎగిరిపడ్డాయి. వాగులు, వంకలు పొంగిపొర్లి పంట పొలాలు ముంపునకు గురయ్యాయి. అధికారులు, సహాయక బృందాలు సైతం తుఫాను తీవ్రత, గాలులకు భయపడి సాయంత్రం దాకా అడుగు బయటకు వేయలేకపోయారు.
 
36skl11SS.jpgఅంతా బీభత్సమే..
శ్రీకాకుళం జిల్లాలో జాతీయరహదారి రూపురేఖలు కోల్పోయింది. నరసన్నపేట దాటాక ఇచ్ఛాపురం వరకు హైవేపై వేలాది చెట్లు పూర్తిగా నేలకొరిగాయి. పలాసకు దగ్గరలోని కృష్ణాపురం టోల్‌గేట్‌ నేలమట్టమైంది. హైవే వెంబడి పదుల సంఖ్యలో ఉన్న పెట్రోల్‌ బంకుల పై కప్పులు ఎగిరిపోయాయి. హైవే పక్కన ఉన్న దాబాలు, హోటళ్లు దెబ్బతిన్నాయి. చెన్నై-కోల్‌కతా హైవేను ఆనుకుని ఉన్న పలుగెడ్డలు రోడ్డుపైకి పొంగిపొర్లడంతో ఆ దారిలో కొన్నిగంటలపాటు రాకపోకలు నిలిచిపోయాయి. బొప్పాయిపురం వద్ద హైవేపై 15 కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి.
 
పది మంది బలి!
‘తితలీ’ గాలుల బీభత్సం, భారీ వర్షాల కారణంగా పది మంది మృతిచెందారు. సరుబుజ్జిలి మండలం రొట్టవలస గ్రామంలో మూడడ్ల సూర్యారావు (46), వంగర మండలంలో తాడి అప్పలనరసమ్మ (62), సంతబొమ్మాళి మండలం సున్నపల్లిలో బొంగు దుర్గారావు(60), వడ్డితాండ్రలో కె.అప్పలస్వామి (56), టెక్కలి ఆంధ్రావీధికి చెందిన కొల్లి లక్ష్మమ్మ (70), సువర్ణపురంలో మన్నెన సంతో్‌షకుమార్‌ (29), ఇప్పిలి కన్నయ్య (53), నందిగాంలో పాత్రో నారాయణరావు (70), పోతులూరులో బుడ్డ గోవిందరావు (40), ఎల్‌.ఎన్‌.పేట మండలంలోని సోమా కంపెనీలో పనిచేస్తున్న రుడియో గొమాంగో (20) ప్రాణాలు కోల్పోయారు. వేగం తగ్గినా.. విధ్వంసం ఎక్కువే కాగా, ఫైలిన్‌, హుద్‌హుద్‌లతో పోల్చితే ‘తితలీ’ గాలుల తీవ్రత తక్కువే. తితలీ గంటకు 140-150, అప్పుడప్పుడు 165 కి.మీ. వేగంతో తీరం దాటింది. అయినా శ్రీకాకుళం, దక్షిణ ఒడిశాకు అపార నష్టం జరిగింది. దెబ్బతిన్న మండలాలు ఇవే..
 
శ్రీకాకుళంలో దెబ్బతిన్న మండలాలు ఇవే..
కోటబొమ్మాళి, సంతబొమ్మాళి, టెక్కలి, నందిగాం, మెళియాపుట్టి, పలాస, మందస,వజ్రపుకొత్తూరు, ఇచ్ఛాపురం, కవిటి, కంచిలి, సోంపేట
విజయనగరంలో... పార్వతీపురం, కురుపాం, కొమరాడ, గుమ్మలక్ష్మీపురం, గరుగుబిల్లి
 
అడుగడుగునా విధ్వంసమే..
విజయనగరం జిల్లాను ప్రకృతి విలయం ముంచెత్తింది. పార్వతీపురం డివిజన్‌ను నిలువునా వణికించింది. పార్వతీపురం, కురుపాం, కొమరాడ, గుమ్మలక్ష్మీపురం, గరుగుబిల్లి మండలాల్లో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. ఈ పెను గాలులకు 10 వేల ఎకరాల్లో ఆరటి.. 6 వేల ఎకరాల్లో వరికి నష్టం వాటిల్లింది. 400 ఎకరాల్లో మొక్కజొన్న. 1200 ఎకరాల్లో కూరగాయల పంట దెబ్బతింది. మొత్తంగా రూ.20 కోట్ల విలువైన పంటలకు నష్టం వాటిల్లినట్లు అంచనా. భోగాపురం, పూసపాటిరేగ మండలాల్ల్లో సముద్రం 150 మీటర్ల మేర ముందుకు చొచ్చుకొచ్చింది.SFSG-6WWW.jpg
Link to comment
Share on other sites

తితలీ’ తుఫాను: 169 గ్రామాలు అతలాకుతలం
12-10-2018 09:54:05
 
636749348462492558.jpg
శ్రీకాకుళం: తితలీ తుపాను ప్రభావంతో జిల్లాలోని 169 గ్రామాలు అతలాకుతలమయ్యాయి. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు 12 మండలాల్లో యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టారు. తుఫాను ప్రభావంతో లక్షలాది ఎకరాల్లో వరిపంట నీటమునిగింది. ఉద్దానంలో కొబ్బరి, అరటి, జీడిమామిడి తోటలకు తీవ్రనష్టం వాటిల్లింది. బలమైన గాలులకు 17 మండలాల్లో 7 వేల విద్యుత్‌ స్తంభాలు కూలిపోయాయి. 110 బృందాలు, 2200 మంది విద్యుత్‌ సిబ్బంది పనిచేస్తున్నారని, ఆదివారం నాటికి విద్యుత్‌ను పునరుద్ధరిస్తామని ఈపీడీసీఎల్‌ సీఎండీ తెలిపారు.
 
Tags : titli cyclone, srikakulam, Andhrapradesh
Link to comment
Share on other sites

పలాసకు విషాదాన్ని మిగిల్చిన ‘తితలీ’
12-10-2018 17:23:11
 
636749617930657316.jpg
పలాస: తితిలీ తుఫాను పలాసపై తీవ్ర ప్రభావం చూపింది. భారీ వర్షాలకు తోడు ఈదురుగాలు బీభత్సం సృష్టించాయి. రహదారులపై హోర్డింగ్‌లు కూలిపోయాయి. రోడ్లపై కంటైనర్లు పక్కకు ఒరిగిపోయాంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పలాసకు దగ్గరలోని కృష్ణాపురం టోల్‌గేట్‌ నేలమట్టమైంది. హైవే వెంబడి పదుల సంఖ్యలో ఉన్న పెట్రోల్‌ బంకులపై కప్పులు ఎగిరిపోయాయి. హైవే పక్కన ఉన్న దాబాలు, హోటళ్లు దెబ్బతిన్నాయి. చెన్నై-కోల్‌కతా హైవేను ఆనుకుని ఉన్న పలుగెడ్డలు రోడ్డుపైకి పొంగిపొర్లడంతో ఆ దారిలో కొన్నిగంటలపాటు రాకపోకలు నిలిచిపోయాయి. బొప్పాయిపురం వద్ద హైవేపై 15 కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. శ్రీకాకుళం జిల్లాలో జాతీయరహదారి రూపురేఖలు కోల్పోయింది. నరసన్నపేట దాటాక ఇచ్ఛాపురం వరకు హైవేపై వేలాది చెట్లు పూర్తిగా నేలకొరిగాయి.
Link to comment
Share on other sites

తితలీ’తో ఉద్దానం విలవిల
12-10-2018 17:51:38
 
636749634999672023.jpg
శ్రీకాకుళం: తితలీతో ఉద్దానం ప్రాంత గ్రామాలు విలవిల్లాడుతున్నాయి. నీళ్లు, ఆహారం లేక ప్రజలు అల్లాడుతున్నారు. తమను ఎవరూ పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. బుధవారం రాత్రి నుంచి గురువారం సాయంత్రం దాకా శ్రీకాకుళం జిల్లావాసులు ఊపిరి బిగబట్టుకొని గడిపారు. తుఫాను మిగిల్చిన బీభత్స ఛాయలు ఉద్దానంలో అడుగడుగునా కనిపించాయి. ఉద్దానంలో లక్షల ఎకరాల్లో కొబ్బరి చెట్లు సాగుచేశారు. పెను గాలులు, భారీ వర్షాలకు ఒక్కో ఎకరానికి 30శాతం చెట్లు నేలకూలి ఉంటాయని అంచనా. ఊపేసిన గాలులకు ఈ జిల్లాలో లక్షలాది చెట్లు, వేలాది విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. మొత్తం 12 మండలాల్లో తుఫాను గాలుల తీవ్రతకు పెను విధ్వంసం చోటుచేసుకుంది. కొబ్బరితోటలు లక్షలాది ఎకరాల్లో ధ్వంసం అయ్యాయి.
Link to comment
Share on other sites

తితలీ బాధితులకు భరోసా కల్పించిన చంద్రబాబు
12-10-2018 18:09:45
 
636749647352061356.jpg
శ్రీకాకుళం: తితలీ ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు ఏరియల్‌ సర్వే నిర్వహించారు. సోంపేట, కవిటి, పలాస మండలాల్లో చంద్రబాబు పర్యటించారు. బాధితులతో మాట్లాడిన సీఎం వారికి భరోసా కల్పించారు. అనంతరం పలాస మున్సిపల్‌ ఆఫీస్‌లో అధికారులతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారాన్ని సీఎం ప్రకటించారు. సేవా కార్యక్రమాల్లో అధికారులు, కార్యకర్తలు పాల్గొనాలని ఆదేశించారు. ‘‘బాధితులకు అన్ని రకాల సహాయం చేస్తాం. అధికారులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు. తితలీ తుపాను నష్టంపై ప్రధాని మోదీకి నివేదిక ఇస్తాం. తుఫాన్‌ బాధితులను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలి. సంక్షోభ నివారణకు అందరూ సహకరించాలి. దెబ్బతిన్న ప్రాంతాలు కోలుకోవడానికి సమయం పడుతుంది’’ అని చంద్రబాబు చెప్పారు.
Link to comment
Share on other sites

సిక్కోలుకు అండ
12-10-2018 03:21:22
 
636749112838115065.jpg
  • కార్యదర్శులంతా శ్రీకాకుళానికి సాధారణ స్థితి వచ్చేదాకా అక్కడే
  • మత్స్యకారులకు 50 కిలోలు, ఇతరులకు 25 కిలోల బియ్యం
  • మృతులకు తక్షణం పరిహారం
  • పంటల పరిశీలనకు శాస్త్రవేత్తలు
  • సహాయ చర్యల్లో పాల్గొనాలని పార్టీ యంత్రాంగానికి పిలుపు
  • శ్రీకాకుళంలో చంద్రబాబు సమీక్ష
శ్రీకాకుళం, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): తితలీ తుఫానుతో దెబ్బతిన్న ఉత్తరాంధ్ర సాధారణ స్థితికి వచ్చేదాకా ప్రభుత్వ యంత్రాంగం మొత్తం అక్కడే ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. అన్ని శాఖల కార్యదర్శులు శ్రీకాకుళం రావాలని ఆదేశించారు. తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతాలు కోలుకునేదాకా ఉన్నతాధికారులంతా అక్కడే ఉండాలన్నారు. పంటలకు జరిగిన నష్టం, వాటి పరిస్థితిని సమీక్షించేందుకు వ్యవసాయ శాస్త్రవేత్తలను పిలిపించాలన్నారు. బుధవారం రాత్రి నుంచి యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన సీఎం.. గురువారం రాత్రి విశాఖ నుంచి రోడ్డుమార్గం గుండా శ్రీకాకుళం చేరుకున్నారు. జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు, జిల్లా అధికారులతో కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు.
 
మత్స్యకారులకు 50కేజీల చొప్పున, ముంపు గ్రామాల్లో 25 కేజీల చొప్పున బాధితులకు తక్షణం బియ్యం అందిస్తామని తెలిపారు. పార్టీ యంత్రాంగం, ప్రజలు కూడా సహాయ చర్యల్లో పాల్గొనాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ఆర్‌ అండ్‌ బీకి చెందిన 22 రహదారులను శుక్రవారంనాటికే బాగుచేయాలన్నారు. విద్యుత్తు సరఫరాను త్వరితగతిన పునరుద్ధరించాలని ఆదేశించారు. వంశధార ఫేజ్‌-2 రిజర్వాయర్‌లోకి వరద నీటిని మళ్లించాలన్నారు. ముందస్తు చర్యల ద్వారా ప్రాణనష్టం తగ్గించగలిగామంటూ... జిల్లా యంత్రాంగాన్ని అభినందించారు. తుపాను నష్టానికి సంబంధించి చిత్రాలను సీఎం చూశారు. మరణించిన వారికి నష్టపరిహారం తక్షణమే అందించాలని అధికారుకు ఆదేశించారు.
 
 
ప్రధాని ఫోన్‌...
శ్రీకాకుళంలో అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న సమయంలోనే ప్రధాని మోదీ నుంచి చంద్రబాబుకు ఫోన్‌ వచ్చింది. తుఫాను తీవ్రత, జరిగిన నష్టం గురించి ప్రధాని అడిగి తెలుసుకున్నారు.
Link to comment
Share on other sites

పలాసలోనే ఉంటా.. యుద్ధప్రాతిపదికన పనులు జరిపిస్తా

032523012APCMPLS112A.JPG

పలాస: ‘తిత్లీ’ పెను తుపాను ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. వజ్రపుకొత్తూరు మండలం అక్కుపల్లిలో బాధితులతో సీఎం ముఖాముఖి నిర్వహించారు. తుపానుతో నష్టపోయిన రైతులందర్నీ ఆదుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు. తుపాను ప్రభావిత ప్రాంత వాసులకు 50 కిలోల బియ్యాన్ని అందజేస్తామని, విద్యుత్‌ పునరుద్ధరణ పనులు వేగవంతం చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. 194 గ్రామాల్లో సహాయకచర్యలను ముమ్మరం చేశామని.. పలాసలోనే ఉండి యుద్ధప్రాతిపదికన పనులు జరిగేలా చూస్తానని చంద్రబాబు స్థానికులతో చెప్పారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...