Jump to content

Modi ga


sonykongara

Recommended Posts

పదేపదే అన్యాయం
ఆంధ్రప్రదేశ్‌కు మళ్లీ కేంద్రం మొండిచెయ్యి
రాష్ట్రంలోని వెనుకబడిన జిల్లాలకు నిధులివ్వని మోదీ సర్కారు
పాత బకాయిల ప్రస్తావనా లేదు
తెలంగాణకు మాత్రం రూ.450 కోట్లు ఇచ్చారు
కేంద్రం కక్షసాధింపునకు పాల్పడుతోందని తెదేపా ధ్వజం
ఈనాడు - దిల్లీ, అమరావతి

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం మరోసారి తీవ్ర అన్యాయం చేసింది. ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టంలోని సెక్షన్‌ 94(2) ప్రకారం.. తెలంగాణలోని తొమ్మిది వెనుకబడిన జిల్లాల(అవిభక్త) అభివృద్ధికి ప్రత్యేక సాయం కింద 2018-19 ఆర్థిక సంవత్సరానికి కేంద్రం తాజాగా రూ.450 కోట్లు విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌కు మొండిచెయ్యి చూపించింది. విభజన చట్టంలోని సెక్షన్‌ 94(2) ప్రకారమే.. ఆంధ్రప్రదేశ్‌లోని ఏడు వెనుకబడిన జిల్లాలకు రూ.50 కోట్ల చొప్పున ఏటా రూ.350 కోట్లను కేంద్రం ఇవ్వాల్సి ఉంది. 2017-18 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్‌కు రూ.350 కోట్లు ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కు తీసుకుంది. కేంద్రం చర్యపై రాష్ట్రం ఇప్పటికే తీవ్ర ఆందోళన, నిరసన తెలియజేసింది. దీనిపై చీమ కుట్టినట్టయినా లేని కేంద్రం మరోసారి ఉద్దేశపూర్వకంగానే అన్యాయం చేసింది. 2018-19 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్‌కు పైసా ఇవ్వకపోవడం, 2017-18కి సంబంధించిన బకాయిలు రూ.350 కోట్ల గురించీ పట్టించుకోకపోవడం కేంద్రం కక్ష సాధింపునకు నిదర్శనమని రాష్ట్ర ప్రభుత్వం మండిపడుతోంది. తెలంగాణకు రూ.450 కోట్లు విడుదల చేస్తున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ సెప్టెంబరు 28న జారీ చేసిన ఉత్తర్వులు సోమవారం వెలుగులోకి వచ్చాయి. తెలంగాణకు రూ.450 కోట్లు విడుదల చేయడం సంతోషమేనని, అదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌ను విస్మరించడం కేంద్రం కక్షసాధింపు ధోరణికి అద్దం పడుతోందని తెదేపా నాయకులు ధ్వజమెత్తుతున్నారు.

రూ.700 కోట్ల బకాయి..!
‘భౌతిక, సామాజిక మౌలిక వసతుల విస్తరణతోపాటు రెండు రాష్ట్రాల్లోని వెనుకబడిన జిల్లాల్లో చేపట్టే కార్యక్రమాలకు కేంద్రం మద్దతునిస్తుంది’ అని విభజన చట్టంలోని సెక్షన్‌ 94(2) పేర్కొంది. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లోని వెనుకబాటుతనాన్ని పరిగణనలోకి తీసుకొని తెలంగాణలోని తొమ్మిది (అవిభక్త), ఆంధ్రప్రదేశ్‌లోని ఏడు జిల్లాలకు ఒక్కో దానికి ఏటా రూ.50 కోట్ల చొప్పున ఆరేళ్లు ఇవ్వడానికి కేంద్రం అంగీకరించింది. దీని ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు మూడేళ్లు మాత్రమే కేంద్రం రూ.1050 కోట్లు ఇచ్చింది. నాలుగో ఏడాది రూ.350 కోట్లు ఇచ్చి వెనక్కు తీసుకుంది. 2017-18 ఆర్థిక సంవత్సరం చివరలో ఆ పనిచేసింది. ఆ మొత్తాన్ని ఇంతవరకూ విడుదల చేయలేదు. ఈ లెక్కనచూస్తే గతేడాది బకాయితోపాటు, ఈ ఏడాది తాజా మొత్తం కలిపి మొత్తం రూ.700 కోట్లు రావాలి. కేంద్రం గతేడాది ఫిబ్రవరి 9న రూ.350 కోట్లు ఇచ్చి 15న వెనక్కు తీసుకొందని, ప్రధాని కార్యాలయం ఆదేశాలతోనే ఆ పని చేసినట్లు ఆర్థికశాఖ చెప్పిందని ముఖ్యమంత్రి చంద్రబాబు బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా శాసనసభలోనే ధ్వజమెత్తారు. ఏపీకి నిధులు ఎందుకు ఆపారో, ఏ లోపం ఉందో చెప్పాలని డిమాండ్‌ చేశారు. చంద్రబాబు చేసిన ఆరోపణలపై కేంద్ర ఆర్థిక శాఖ నుంచి ఇంతవరకు స్పందన లేదు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం యూసీలు ఇవ్వలేదని, అందుకే ఆపేశారని భాజపా నేతలు చేసిన ప్రచారాన్ని ఏపీ ప్రభుత్వం ఖండించింది. కేంద్రానికి సమర్పించిన యూసీలను అధికారికంగా వెల్లడించింది. లేదంటే కేంద్ర ప్రభుత్వాన్ని అధికారికంగా వాటిపై స్పందించమని సవాలు చేసింది. అయినప్పటికీ కేంద్రం వైపు నుంచి దీనిపై ఇంతవరకూ సమాధానం రాలేదు. కేంద్రం కేవలం రాజకీయ కారణాలతోనే ఈ పనికి ఒడిగట్టిందని తెదేపా ఎంపీలు పేర్కొన్నారు.

మాపై ఎందుకీ నిర్లక్ష్యం?
విభజన చట్టంలోని ఒకే సెక్షన్‌ ప్రకారం రెండు రాష్ట్రాలకు నిధులు ఇవ్వాల్సి ఉన్నప్పుడు ఒక రాష్ట్రానికి ఇచ్చి, మరో రాష్ట్రాన్ని విస్మరించడం వెనుక ఉన్న కారణాలేంటని రాష్ట్ర ప్రణాళికా మండలి ఉపాధ్యక్షుడు సి.కుటుంబరావు కేంద్రాన్ని ప్రశ్నించారు. ప్రజలకు జవాబు చెప్పాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని పేర్కొన్నారు. కేంద్రం ఇచ్చిన ప్రతి పైసాకూ తాము యూసీలు సమర్పించామని, దీనిపై కేంద్ర ఆర్థిక శాఖ అధికారికంగా స్పందించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

పక్షపాత ధోరణి మరోసారి రుజువైంది..
ఆంధ్రప్రదేశ్‌పై కేంద్రం కక్షసాధింపు చర్యకు పాల్పడుతోందని మరోసారి రుజువైందని ఎంపీ రామ్మోహన్‌నాయుడు ధ్వజమెత్తారు. ‘వెనుకబడిన జిల్లాలకు నిధుల కేటాయింపులో మోదీ ప్రభుత్వం రాష్ట్రానికి మరోసారి మొండిచేయి చూపింది. మిగులు బడ్జెట్‌తో ఏర్పడిన తెలంగాణకు ఆగమేఘాలపై రూ.450 కోట్లు విడుదల చేసిన కేంద్రం, ఆంధ్రప్రదేశ్‌కు రావలసిన రూ.350 కోట్ల విషయంలో ఎందుకు నిర్లక్ష్యం చేస్తోంది? నవ్యాంధ్రలోని వెనుకబడిన ఏడు జిల్లాలు అభివృద్ధి చెందడం కేంద్రానికి ఇష్టం లేదా? రూ.350 కోట్ల నిధులు ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కు తీసుకుని నెలలు గడుస్తున్నా ఉలుకూపలుకూ లేకపోవడం వెనుక ఆంతర్యమేంటి? ఆంధ్రా భాజపా నాయకుల్లారా.. కేంద్రం చర్యల్ని గమనిస్తున్నారా? ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం చేస్తున్న అన్యాయంపై రాష్ట్ర భాజపా నాయకులు, కేంద్రాన్ని వెనకేసుకు వస్తున్న వైకాపా, జనసేన నేతలు ఎందుకు మౌనంగా ఉండిపోయారు? రాష్ట్రంపై దొంగ ప్రేమ కురిపిస్తున్న ప్రతిపక్ష నాయకుడి చిత్తశుద్ధి ఎక్కడికి పోయింది?’ అని ఆయన మండిపడ్డారు.

ప్రధాని కార్యాలయం ఆమోదముద్రతో..!
తెలంగాణకు ‘స్పెషల్‌ అసిస్టెన్స్‌-కేపిటల్‌ ఇన్‌ 2018-19’ కింద రూ.450 కోట్ల నిధులు విడుదల చేస్తున్నట్లు ఆర్థికశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. విభజన చట్టంలోని సెక్షన్‌ 94(2) ప్రకారం తెలంగాణలోని వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ఆర్థికసాయం చేయాలని ఆగస్టు 16న నీతిఆయోగ్‌ నుంచి వచ్చిన సిఫార్సులకు సెప్టెంబరు 26న ప్రధాని కార్యాలయం ఆమోదముద్ర వేయడంతో ఈ నిధులను విడుదల చేస్తున్నట్లు ఆర్థిక శాఖ తెలిపింది.

Link to comment
Share on other sites

తెలంగాణకు 450 కోట్లు.. ఏపీకి సున్నా!
09-10-2018 02:18:06
 
636746695485257877.jpg
  • వెనుకబడిన జిల్లాలకు మళ్లీ మోదీ మొండిచేయి
  • తెలంగాణకు 450 కోట్లు విడుదల
  • ఫిబ్రవరిలో 350 కోట్లిచ్చి వెనక్కి
  • ఇప్పటి వరకు తిరిగివ్వని కేంద్రం
  • కొత్తగా నిధుల మంజూరూ లేదు
  • రాజకీయ కక్షతోనే అన్యాయం
  • రాష్ట్ర అధికారుల ఆవేదన
అమరావతి (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌పై మోదీ ప్రభుత్వం.. మరోసారి తన వివక్షను బయటపెట్టుకుంది. ప్రత్యేక హోదా, ప్యాకేజీలను తుంగలో తొక్కి.. విభజన చట్టంలోని హామీలను, అప్పటి ప్రధాని ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా.. అదే నిర్లక్ష్య ధోరణిని కొనసాగిస్తోంది. పొరుగురాష్ట్రం తెలంగాణలోని 9 వెనుకబడిన జిల్లాలకు రూ.450 కోట్లు విడుదల చేసి.. మన రాష్ట్రంలోని ఏడు వెనుకబడిన జిల్లాలకు చిల్లిగవ్వయినా ఇవ్వలేదు. ఏపీలో వెనుకబడిన జిల్లాలకు ఇవ్వాల్సిన నిధులను సక్రమంగా ఇవ్వకపోగా.. గతంలో రూ.350 కోట్లు ఇచ్చినట్లే ఇచ్చి వెనక్కి తీసుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 9న రూ.350 కోట్లు రాష్ట్రం ఖాతాలో జమచేసి.. తర్వాత ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) ఆమోదం లేదంటూ వాటిని ఫిబ్రవరి 15వ తేదీన వెనక్కి తీసుకుంది.
 
అంతకుముందు విడుదల చేసిన నిధులకు సంబంధించిన యూసీలు, ఖర్చుల వివరాలు రాష్ట్రం సమర్పించలేదని, అందుకే నిధులు వెనక్కి తీసుకున్నామని చెప్పింది. కానీ రాష్ట్ర అధికారులు యూసీలు, ఖర్చుల వివరాలు సమర్పించి నెలలు గడుస్తున్నప్పటికీ కేంద్రం నుంచి నిధులు విడుదల కాలేదు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి తెలంగాణలోని 9 జిల్లాలకు, ఏపీలోని ఏడు జిల్లాలకు ఏటా రూ.50 కోట్ల చొప్పున కేంద్రం గ్రాంటు ఇస్తోంది. ఓవైపు రాష్ట్రం వెనుకబడిన జిల్లాలకు బుందేల్‌ఖండ్‌ తరహా ప్యాకేజీ కావాలని కోరుతుంటే.. మోదీ ప్రభుత్వం కనీసం ఏటా రూ.50 కోట్లు కూడా ఇవ్వడం లేదు. బుందేల్‌ఖండ్‌ ప్యాకేజీ ప్రకారం.. రాష్ట్రంలోని ఏడు వెనుకబడిన జిల్లాలకు కలిపి రూ.22 వేల కోట్లు కావాలని కేంద్రానికి అనేకసార్లు విజ్ఞప్తి చేసింది. రాయలసీమకు చెందిన నాలుగు జిల్లాలు, ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలు ఎందుకు వెనుకబడ్డాయో.. ప్యాకేజీ అందిస్తే.. రాష్ట్రాభివృద్ధికి అవి ఎలా దోహదపడతాయో కూడా స్పష్టంగా వివరించారు.
 
కేంద్రం నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి జిల్లాకు రూ.50 కోట్ల చొప్పున నిధులు సాధారణ పద్ధతిలోనే రాష్ట్రాల ఖాతాల్లో జమ అవుతుంటాయి. ఇదేమీ ప్రత్యేక వెసులుబాటు కాదు. ఆ నిధులకు రాష్ట్రాలు యూసీలు పంపిస్తే.. కేంద్రం తదుపరి నిధులు విడుదల చేస్తుంది. మన రాష్ట్రానికీ గత ఏడాది నిధులు విడుదలయ్యాయి. వాటిని ఖర్చు పెట్టి సంబంధిత యూసీలను కేంద్రానికి పంపింది కూడా. దీంతో ఈ ఏడాది ఫిబ్రవరి 9న రాష్ట్ర ఖాతాలో కేంద్రం నుంచి రూ.350 కోట్లు జమ అయ్యాయి. అప్పటికే కేంద్రం 2018-19 బడ్జెట్‌ ప్రవేశపెట్టడం.. ఇందులో ఏపీకి జరిగిన అన్యాయంపై రాష్ట్ర ప్రభుత్వం, ఎంపీలు, రాష్ట్ర ప్రజలు నిరసనలకు దిగారు. మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తారు. నిధులు, యూసీల అంశంలో టీడీపీ, బీజేపీ నేతల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణల యుద్ధం జరిగింది. ఈ పరిస్థితుల్లో రాష్ట్రం ఖాతాలో రూ.350 కోట్లు జమయ్యాయి. కానీ ఆ వెంటనే ఫిబ్రవరి 15వ తేదీన కేంద్రం ఆ నిధులను వెనక్కి లాగేసుకుంది.
 
పీఎంవో కార్యాలయం అనుమతి లేకుండా పొరపాటున ఈ నిధులు విడుదల చేశామని.. అందుకే వాటిని వెనక్కి తీసుకుంటున్నామని రాష్ట్ర అధికారులకు సమాచారం అందించి ఆ రూ.350 కోట్లు వెనక్కి తీసుకున్నారు. ఇది జరిగి దాదాపు 8 నెలలు గడుస్తున్నా.. ఇప్పటి వరకు ఆ నిధులను తిరిగి రాష్ట్రానికి ఇవ్వలేదు. కేవలం రాజకీయ వైరం వల్లనే రాష్ట్రానికి వచ్చిన నిధుల్ని వెనక్కి తీసుకున్నారని.. కొత్తగా నిధులివ్వడం లేదని ఆర్థిక శాఖ అధికారులు భావిస్తున్నారు.
Link to comment
Share on other sites

They released for ALL states except ANdhra Pradesh....Actually AP wrote letter asking why last year payment is not released..

There is no answer and instead they blocked this year funds for "ONLY ANDHRA"

 

Remember: These backward district funds were given faster under Manmohan govt to 7 districts than Modi govt even though highlighted in RE-org bill as "Special help"

Link to comment
Share on other sites

3 hours ago, Saichandra said:

Ippudu admin garu vachi cbn ki language problem so venakki tisukunnaru antaru 

Nenu enthuku cheppatam outgoing CS said they got 17000cr from centre 2017-18 and this fiscal they already got 10k cr already which is 30% more than same period last fiscal. Yes ikkada 350cr vishayam lo issue undochu not denying. But trend chusthe konni politics from both sides la anipisthundhi.

Link to comment
Share on other sites

2 minutes ago, Kiran said:

Nenu enthuku cheppatam outgoing CS said they got 17000cr from centre 2017-18 and this fiscal they already got 10k cr already which is 30% more than same period last fiscal. Yes ikkada 350cr vishayam lo issue undochu not denying. But trend chusthe konni politics from both sides la anipisthundhi.

Lol apandi ika 17k cr ani,okka ap ke special ga ichara???anni states ki istaru,cs schemes dwara rabattukunnaru amount,edo danam chesinattu cheptunnaru 17k cr ichamu ani 

Link to comment
Share on other sites

Ex Chief Secretary was talking about better performance of AP in Central govt schemes for which funds are given on non descretionary bais. Those funds are   right of every state as they are contributing to the central exchequer

edo free ga danam chesinattu 17k cr ichamu ani cheppukuntunnaru 

Link to comment
Share on other sites

Just now, Saichandra said:

Lol apandi ika 17k cr ani,okka ap ke special ga ichara???anni states ki istaru,cs schemes dwara rabattukunnaru amount,edo danam chesinattu cheptunnaru 17k cr ichamu ani 

as per ur logic avi kuda ivvakudadhu ga as per kakshasasimpu

or we can infer in CS related schemes centre is not doing any anyayam to AP, only reorg related things it is twisting hands.

Link to comment
Share on other sites

1 minute ago, Kiran said:

as per ur logic avi kuda ivvakudadhu ga as per kakshasasimpu

or we can infer in CS related schemes centre is not doing any anyayam to AP, only reorg related things it is twisting hands.

Asalu adi ichedi enti 29 states right adi modi unna rahul unna or ey pm unna states ki ah funds ravalsinde,cg govt ki taxes katti tirigi states ivvakunda em chestaru?

 

Link to comment
Share on other sites

Just now, Saichandra said:

Asalu adi ichedi enti 29 states right adi modi unna rahul unna or ey pm unna states ki ah funds ravalsinde,cg govt ki taxes katti tirigi states ivvakunda em chestaru?

 

Good thx for accepting, there is no bias on cs schemes, vadukunnodiki vadukunnantha

I also accept centre is twisting arms related to reorg stuff

 

Link to comment
Share on other sites

2 minutes ago, Kiran said:

Good thx for accepting, there is no bias on cs schemes, vadukunnodiki vadukunnantha

I also accept centre is twisting arms related to reorg stuff

 

Cs schemes ni eppudu cbn or tdp vallu question cheyyalede?infact cbn review meetings lo cheptaru e year ekkuva rabattadaniki try cheyyandi ani,cbn questioning regarding re org act,ey matram karchu leni railway zone ivvadam ledu though orissa mps are not opposing it

Link to comment
Share on other sites

4 minutes ago, ravikia said:

So ippudu 350crs ivvakapovadam kooda issue kadhu annattundhi eeda discussion. 17K cr already vachayi ga, inka 350cr ivvalsina avasaram emundhi ane okka maate migilindhi ?

AJ interpretation la undhi

Link to comment
Share on other sites

6 minutes ago, Saichandra said:

Cs schemes ni eppudu cbn or tdp vallu question cheyyalede?infact cbn review meetings lo cheptaru e year ekkuva rabattadaniki try cheyyandi ani,cbn questioning regarding re org act,ey matram karchu leni railway zone ivvadam ledu though orissa mps are not opposing it

Aa issues ni I am also acknowledging dude

Link to comment
Share on other sites

30 minutes ago, Kiran said:

Nenu enthuku cheppatam outgoing CS said they got 17000cr from centre 2017-18 and this fiscal they already got 10k cr already which is 30% more than same period last fiscal. Yes ikkada 350cr vishayam lo issue undochu not denying. But trend chusthe konni politics from both sides la anipisthundhi.

Bro respect pogottukomakandi.. BJP chese panulaki patthasu Paliki.. Really disgusting :sleep:

Link to comment
Share on other sites

2 hours ago, ramntr said:

Little action is expected from govt/party, gvl gadini vij వచ్చేలా chesi shirt chirigela kodithe , lotus batch concentration ఇటు thiruguddi, then they will answer... Already gone ani inka full ga left anukunta... 

he gave a golden opportunity a month or two ago (caused a road accident), appudu tukku lepalsindi sannasini.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...