Jump to content

చంద్రబాబుకు ప్రతిష్టాత్మక అవార్డు

sonykongara

Recommended Posts

చంద్రబాబుకు ప్రతిష్టాత్మక అవార్డు
08-10-2018 20:05:14
 
636746260116873953.jpg
అమరావతి: సీఎం చంద్రబాబుకు ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. చంద్రబాబుకు గ్లోబర్‌ అగ్రికల్చర్‌ లీడర్‌ షిప్‌ అవార్డు దక్కింది. డాక్టర్ స్వామినాథన్‌ కమిటీ చంద్రబాబును ఎంపిక చేసింది. ఈనెల 24న ఢిల్లీలో చంద్రబాబుకు అవార్డు అందజేయనున్నారు. ఈ అవార్డును కేంద్ర హోంశాఖమంత్రి రాజ్‌నాథ్‌, చంద్రబాబకు అందజేయనున్నారు. వ్యవసాయ విధానం, రైతులకు ప్రోత్సాహాలు, పరిశోధన, పంటల అభివృద్ధి, నాయకత్వం అంశాలను కమిటీ పరిశీలించింది. సాగునీరు, ప్రకృతి వ్యవసాయం, వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటెంగ్‌ వంటి అంశాలను కూడా కమిటీ పరిగణలోకి తసుకుంది. అన్ని అంశాల్లో ఏపీ అగ్రగామిగా ఉన్నట్లు కమిటీ తేల్చింది
Link to comment
Share on other sites

2017 was given to KCR. The award was instituted in 2008. 

Earlier prominent personalities who received ICFA leadership award were MS Swaminathan (2009), Sharad Pawar(2011), Dr Raman Singh(2013), Prakash Singh Badal(2014), Akhilesh Yadav(2015), Shivarj Singh Chauhan and Ratan Tata (2016).

Link to comment
Share on other sites

2 hours ago, seemovie said:

aadu em chesaadu ani aadiki ivvatam? inkaa a award ki viluva emi undhi?

Link to comment
Share on other sites

6 hours ago, seemovie said:

2017 was given to KCR. The award was instituted in 2008. 

Earlier prominent personalities who received ICFA leadership award were MS Swaminathan (2009), Sharad Pawar(2011), Dr Raman Singh(2013), Prakash Singh Badal(2014), Akhilesh Yadav(2015), Shivarj Singh Chauhan and Ratan Tata (2016).

list lo kcr ekkada unnadu?

  •  ఎంపిక చేసిన స్వామినాథన్‌ కమిటీ
  •  24న ఢిల్లీలో ప్రదానం
అమరావతి, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబుకు ప్రతిష్ఠాత్మకమైన 11వ గ్లోబ ల్‌ అగ్రికల్చరల్‌ లీడర్‌షిప్‌ అవార్డు-2018 దక్కింది. ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ ఎంఎస్‌ స్వామినాథన్‌ అధ్యక్షతన నియమించిన జ్యూరీ కమిటీ ఈ అవార్డును ఎంపిక చేసింది. ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ (ఐసీఎ్‌ఫఏ) సంస్థ ఈ మేరకు సీఎంకి ఈ-మెయిల్‌ పంపింది. గ్రామీణ ప్రాం తాల్లో రైతుల సంక్షేమం కోసం, సాధికారత కోసం కృషి చేసిన సంస్థలు, వ్యక్తులకు ఈ సంస్థ ఏటా పురస్కారాలు అందిస్తోంది. ప్రతి సంవత్సరం విధానం, పరిశ్రమ, పరిశోధన, సాగు, అభివృద్ధి నాయకత్వం, ఉత్తమ వ్యవసాయ రాష్ట్రం, జీవనకాల సాఫల్యం తదితర 15 రకాల కేటగిరీల్లో ఈ అవార్డులను అందిస్తారు.
 
జాతీయ అవార్డు కమిటీ ఢిల్లీలో గత నెల 15 న సమావేశమై చంద్రబాబును పాలసీ లీడర్‌షిప్‌ అవార్డుకు ఎంపిక చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయరంగంలో ప్రగతి సాధించి.. పల్లెల సౌభాగ్యానికి కృషి చేస్తూ.. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి కోసం విజన్‌తో నాయకత్వం వహించినందుకు ఈ అవార్డు ఇవ్వనున్న ట్లు ఐసీఎ్‌ఫఏ సీఎంకు పంపిన మెయిల్‌లో పేర్కొం ది. 2015లో ఈ అవార్డుకు అప్పటి ఉత్తరప్రదేశ్‌ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌, 2016లో మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌, 2017లో హరియాణా సీఎం మనోహర్‌లాల్‌ ఖట్టర్‌కు ప్రదానం చేశారు. 2018లో చంద్రబాబు అందుకోనున్నారు. ఈ నెల 24వ తేదీ సాయం త్రం ఢిల్లీలోని హోటల్‌ హయత్‌ రీజెన్సీలో నిర్వహిం చే కార్యక్రమంలో ఆయనకు ఈ పురస్కారం ప్రదా నం చేస్తారు. కార్యక్రమానికి కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, ఇద్దరు గవర్నర్లు, ఇతర ప్రముఖులు హాజరవుతారని కేంద్ర అధికారులు తెలిపారు.
 
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...