Jump to content

BJP puppet survey: Rajasthan gone, MP&chattisgarh also doubt


AnnaGaru

Recommended Posts

just gujju gang G-balupu bjp ni patestundi....Even section of North hardcore "BJP voters" also moving away because of "arrogant gujju thugs"..

 

Madya pradesh pote inka GUJJU thugs sardukovachu....Even in 2004(sweep)&2009 MP gave BJP majority

 

https://www.news18.com/news/politics/assembly-elections-2018-congress-likely-to-win-rajasthan-has-edge-in-mp-chhattisgarh-says-opinion-poll-1901259.html

 

న్యూదిల్లీ: త్వరలో జరగనున్న మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి చేదు అనుభవం ఎదురయ్యే అవకాశం ఉందని ఒపీనియన్‌ పోల్స్‌ ద్వారా తెలుస్తోంది. రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ పార్టీకి అత్యధిక సీట్లు వచ్చే అవకాశం ఉందని, రాజస్థాన్‌ ప్రదేశ్‌ కాంగ్రెస్ కమిటీ‌ అధ్యక్షుడు సచిన్‌ పైలట్‌ ముఖ్యమంత్రి కావాలని అక్కడి ఓటర్లు కోరుకుంటున్నారని తెలిసింది. ఏబీపీ న్యూస్‌-సీవోటర్‌ సర్వే వెల్లడించిన వివరాల ప్రకారం... మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో 15 ఏళ్ల తరువాత తిరిగి కాంగ్రెస్‌ పార్టీకి అధికారం దక్కనుంది. అలాగే, రాజస్థాన్‌లోనూ కాంగ్రెస్‌ విజయం సాధించే అవకాశం ఉంది. 200 అసెంబ్లీ సీట్లు ఉన్న రాజస్థాన్‌లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్‌ పార్టీకి 142, భాజపాకు 56 సీట్లు దక్కుతాయని ప్రజాభిప్రాయ సర్వే ద్వారా తెలిసింది. మిగతా రెండు సీట్లు ఇతరులకు దక్కే అవకాశం ఉంది. తమ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వసుంధర రాజే కన్నా సచిన్‌ పైలట్‌‌ వైపునకే అధిక మంది ఓటర్లు మొగ్గు చూపుతున్నారు.

అలాగే, మధ్యప్రదేశ్‌లోని 230 అసెంబ్లీ నియోజక వర్గాల్లో ఎన్నికలు జరిగితే కాంగ్రెస్‌కి 122 సీట్లు దక్కుతాయని, భాజపాకు 108 సీట్లు వస్తాయని సర్వే ద్వారా తెలుస్తోంది. ఛత్తీస్‌గఢ్‌లోని మొత్తం 90 అసెంబ్లీ నియోజక వర్గాల్లో కాంగ్రెస్‌కి 47, భాజపాకి 40 సీట్లు వస్తాయి. మిగతా మూడు ఇతరులకి రావచ్చు. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌, భాజపాలకు 42.2, 41.5 శాతం చొప్పున ఓట్లు వస్తాయని తెలిసింది. అలాగే, ఛత్తీస్‌గఢ్‌లో ఈ రెండు పార్టీలకు వరసగా 38.9, 38.2 శాతం చొప్పున ఓట్లు వస్తాయి. రాజస్థాన్‌లో మాత్రం ఈ రెండు పార్టీల మధ్య భారీగా తేడా ఉండనున్నట్లు వెల్లడైంది. కాంగ్రెస్‌కి 49.9 శాతం ఓట్లు వస్తే, భాజపాకు 34.3 శాతం ఓట్లు పడనున్నాయి. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో భాజపా 165, 142, 49 సీట్లు గెలుచుకుని విజయభేరి మోగించింది. ఆ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కి వరసగా 58, 21, 39 సీట్లు వచ్చాయి.

ఎన్నికల కమిషన్‌ (ఈసీ) నిన్న ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, మిజోరాం, రాజస్థాన్‌, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ప్రకటన చేసిన విషయం తెలిసిందే. నవంబరు 12 నుంచి డిసెంబరు 7 వరకు ఆయా రాష్ట్రాల్లో ప్రకటించిన తేదీల ప్రకారం ఎన్నికలు జరుగుతాయి. ఛత్తీస్‌గఢ్‌లో రెండు దశల్లో నవంబరు 12, 20 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి. మధ్యప్రదేశ్‌, మిజోరాం అసెంబ్లీ ఎన్నికలు నవంబరు 28న జరగనున్నాయి. రాజస్థాన్‌ తెలంగాణల్లో డిసెంబరు 7న ఎన్నికలు జరుగుతాయి. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు డిసెంబరు 11న వెల్లడవుతాయి.

 

Link to comment
Share on other sites

3 minutes ago, krish2015 said:

 Digvijai Singh lanti bafoon gallani nammukunteee nasanameee

rajasthan Satish pilot laga Sindhia ni annouce cheste sweep ani MP vallu cheptaru..Rahul gaadu dusta gang(diggi) ni bhane cut chesadu

 

The Congress has not announced any CM candidate, though it has made it clear that the choice would be between PCC chief Kamal Nath and campaign committee chief Jyotiraditya Scindia, should it make the grade on December 11.

 

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...