Jump to content

TDP to Expand Cabinet This Month | Choice for Minority & ST


sonykongara

Recommended Posts

మంత్రివర్గంలోకి కిడారి శ్రావణ్‌!
ఈనెలలోనే మంత్రివర్గ విస్తరణ
మైనారిటీ కోటా నుంచి ఫరూక్‌కే అవకాశం!
ఈనాడు - అమరావతి
4ap-main5a.jpg

ఇటీవల మావోయిస్టుల కాల్పుల్లో మరణించిన అరకు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ కిడారి సర్వేశ్వరరావు పెద్ద కుమారుడు శ్రావణ్‌కుమార్‌ను రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలిస్తున్నారు. ఐఐటీ నుంచి ఇంజనీరింగ్‌ చదివిన శ్రావణ్‌కుమార్‌ను మంత్రివర్గంలోకి తీసుకుని కీలక శాఖ అప్పగిస్తే, ప్రజల్లోకి.. ప్రత్యేకించి గిరిజనుల్లోకి మంచి సంకేతాలు వెళతాయని ఆయన ఆలోచిస్తున్నారు. గిరిజనులకు మంత్రివర్గంలో అవకాశమివ్వలేదనే విమర్శ తొలగిపోవటంతోపాటు రాజకీయంగానూ సానుకూలత ఏర్పడుతుందని తెదేపా వర్గాల అంచనా. గతంలో భూమా నాగిరెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని భావించగా, ఆయన ఆకస్మికంగా మరణించారు. దీంతో నాగిరెడ్డి కుమార్తె అఖిలప్రియకు అవకాశం కల్పించారు. రాయలసీమలో పార్టీకి అదొక సానుకూల పరిణామంగా అప్పట్లో పరిగణన పొందింది. ఇప్పుడు శ్రావణ్‌కుమార్‌కు కూడా మంత్రివర్గంలో అవకాశమిస్తే గిరిజన వర్గాల నుంచి ఆదరణ లభిస్తుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అన్నీ అనుకూలిస్తే ఈ అక్టోబరులోనే మంత్రివర్గ విస్తరణ జరగొచ్చు. 2014లో అధికారంలోకొచ్చినప్పటి నుంచి మైనారిటీలు, గిరిజనులకు మంత్రివర్గంలో స్థానం కల్పించలేదు. మైనారిటీల నుంచి తెదేపా తరఫున ఒక్కరు కూడా శాసనసభకు ఎన్నికవలేదు. గిరిజనుల నుంచి ఒకరు ఎన్నికైనా అవకాశం రాలేదు. వైకాపా నుంచి తెదేపాలోకొచ్చిన శాసనసభ్యుల్లో ఈ రెండు వర్గాలకు చెందిన వారున్నా వివిధ కారణాలతో మంత్రివర్గంలోకి తీసుకోలేదు. రాజకీయ సమీకరణాల దృష్ట్యా ఇతర వర్గాలకు చెందిన నలుగురికి అప్పట్లో అవకాశమిచ్చారు. తాజాగా.. తొలి నుంచి పార్టీని అంటిపెట్టుకుని ఉన్న ప్రస్తుత శాసనమండలి ఛైర్మన్‌ ఎన్‌.ఎం.డి.ఫరూక్‌ పేరును మైనారిటీ కోటా నుంచి పరిశీలిస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా నుంచి శాసనసమండలి సభ్యుడు షరీఫ్‌ కూడా ఉన్నప్పటికీ, సీనియారిటీతోపాటు మైనారిటీల జనాభా అధికంగా ఉన్న రాయలసీమకు ప్రాతినిథ్యం ఇవ్వాలన్న ఉద్దేశంతో ఫరూక్‌ వైపు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఫరూక్‌ను ఎంచుకుంటే ఖాళీ అయ్యే శాసనమండలి ఛైర్మన్‌ స్థానానికి షరీఫ్‌ ప్రధాన పోటీదారుగా మారతారు. మైనారిటీల కోటా నుంచి ఒకరిని ఎంచుకుంటే, రెండో స్థానాన్ని మొదట్లో గిరిజనుల నుంచి తీసుకోవాలా? బలహీనవర్గాల నుంచి ఎంపిక చేసుకోవాలా? అన్న దానిపై కొంత తర్జనభర్జన జరిగింది. అరకు శాసనసభ్యుడు సర్వేశ్వరరావు మావోయిస్టుల కాల్పుల్లో మరణించటంతో.. రాష్ట్ర మంత్రివర్గంలో ఖాళీగా ఉన్న మరో స్థానాన్ని అతని కుమారుడు శ్రావణ్‌ కుమార్‌తో భర్తీ చేయటంపై తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి పెట్టారు. శాసనసభ, మండలిలో ఎందులోనూ ఆయన సభ్యుడు కాదు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే ఆరునెలల్లోగా ఏదోఒక సభకు ఎన్నికవాలి. ఆలోగా శాసనసభకు సాధారణ ఎన్నికలే రానున్నాయి. ఇప్పటికిప్పుడు అరకు స్థానానికి ఉపఎన్నికలు జరిగే అవకాశమూ లేదు. ముందు శ్రావణ్‌ని మంత్రిగా తీసుకుంటే... ఆ తరువాత అవకాశముంటే శాసనమండలికి ఎన్నికయ్యేలా చూడటం, లేదంటే ఆరు నెలల సమయం ముగిశాక రాజీనామా చేయించి సాధారణ ఎన్నికల్లో అరకు నుంచి పోటీ చేయించటం అనే అంశాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం.

Link to comment
Share on other sites

విస్తరణ వాయిదా!
06-10-2018 02:14:55
 
  •  నవంబరు నెలాఖరులో జరిగే చాన్సు
  •  కిడారి కుమారుడికి మంత్రి పదవి..
  •  సోమ కొడుక్కి ఎస్సీ ఎస్టీ కమిషన్‌లో సభ్యత్వం
  •  కేబినెట్‌లోకి ఫరూక్‌?.. కౌన్సిల్‌ చైర్మన్‌గా షరీఫ్‌
అమరావతి, అక్టోబరు 5(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ వచ్చే నెలకు వాయిదా పడింది. నవంబరు మూడో వారంలో.. లేదంటే నెలాఖరులోగానీ ముహూర్తం ఉండవచ్చని తాజా సమాచారం సూచిస్తోంది. బీజేపీ మంత్రులు కామినేని శ్రీనివాస్‌, పైడికొండల మాణిక్యాలరావు రాజీనామాలతో ఖాళీ అయిన రెండు మంత్రి పదవులను టీడీపీకి చెందిన వారితో భర్తీ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇప్పటివరకూ మంత్రివర్గంలో ముస్లింలు, గిరిజనులకు ప్రాతినిధ్యం లేదు. గిరిజన ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు ఇటీవల నక్సల్స్‌ చేతిలో దారుణంగా హత్యకు గురైన విషయం తెలిసిందే. ఏజెన్సీ ప్రాంత గిరిజనుల్లో, టీడీపీ శ్రేణుల్లో ఆత్మ స్థైర్యం పెంచడానికి కిడారి కుమారుడు శ్రావణ్‌ను గిరిజన సామాజిక వర్గం తరఫున మంత్రివర్గంలోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి తాజాగా నిర్ణయం తీసుకున్నారు. శ్రావణ్‌ ప్రస్తుతం శాసనసభలో గానీ.. శాసనమండలిలో గానీ సభ్యుడు కాదు. వీటిలో సభ్యుడు కాకపోయినా మంత్రివర్గంలోకి తీసుకోవచ్చు. కాకపోతే ఆరు నెలలలోపు కచ్చితంగా ఏదో ఒక సభకు ఎన్నిక కావలసి ఉంటుంది. కాలేకపోతే మంత్రి పదవికి రాజీనామా చేయాలి. కిడారి మరణంతో ఖాళీ అయిన అరకు స్థానానికి ఉప ఎన్నిక జరిగే అవకాశం లేదు. ఏడెనిమిది నెలల్లో సాధారణ ఎన్నికలు జరగాల్సి ఉండడమే దీనికి కారణమని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.
 
మే నెలాఖరులోపు సాధారణ ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుంది. ఈ లెక్కన దీనికి ఇంకా ఏడున్నర నెలల సమయం ఉంది. శ్రావణ్‌ను ఇప్పుడే మంత్రివర్గంలోకి తీసుకుంటే సరిగ్గా ఎన్నికల ముందు మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఎన్నికలు పూర్తయ్యేవరకూ ఆయన మంత్రిగా ఉండాలంటే నవంబరు నెలాఖరులో మంత్రివర్గంలోకి తీసుకుంటే మధ్యలో రాజీనామా చేయాల్సిన అవసరం ఉండదు. మరోవైపు, శాసనమండలి చైర్మన్‌ ఎన్‌ఎండీ ఫరూక్‌కు మంత్రి పదవి ఇవ్వాలని సీఎం నిర్ణయించినట్లు సమాచారం. టీడీపీ ఎమ్మెల్సీ ఎం.ఎ.షరీ్‌ఫను ఫరూక్‌ స్థానంలో కౌన్సిల్‌ చైర్మన్‌ను చేసే అవకాశం ఉంది. దీనివల్ల ముస్లింలకు రెండు కీలక పదవులు ఇచ్చినట్లవుతుందని టీడీపీ భావిస్తోంది.
Link to comment
Share on other sites

6 minutes ago, niceguy said:

2-3 months back edho strategical expansion annaru..adhi idhena lekapothe idhi kothada..Baaga savaradeesi next year isthe poyedhiga..

Janaalu malli chance isthe. Prathi issue lo CBN delay tactics not good for party.

BJP ministers bayataki poyinappudu ventane 2-3 TDP MLAs ni ministers chesi vunte gatti impact vundedi. 3-4 incapable ministers ni kooda peekithe inka baagundedi.

Link to comment
Share on other sites

  • 1 month later...
On 10/6/2018 at 8:14 PM, RKumar said:

Janaalu malli chance isthe. Prathi issue lo CBN delay tactics not good for party.

BJP ministers bayataki poyinappudu ventane 2-3 TDP MLAs ni ministers chesi vunte gatti impact vundedi. 3-4 incapable ministers ni kooda peekithe inka baagundedi.

 

Link to comment
Share on other sites

చంద్రబాబుకు రుణపడి ఉంటాం: కిడారి శ్రవణ్
09-11-2018 21:54:59
 
636773973009448797.jpg
విశాఖపట్నం: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓ తండ్రిలా తమ కుటుంబాన్ని ఆదుకుంటున్నారని దివంగత నేత కిడారి సర్వేశ్వరరావు తనయుడు కిడారి శ్రవణ్ చెప్పారు. ఈ నెల 11న జరగనున్న మంత్రివర్గ విస్తరణలో కిడారి శ్రవణ్‌కు మంత్రిగా అవకాశం ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ఆయనకు ఫోన్ చేసి చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్పందించిన శ్రవణ్.. చంద్రబాబుకు జీవితాంతం రుణపడి ఉంటామన్నారు. తమ కుటుంబానికి టీడీపీ నేతలు అండగా నిలిచారని అన్నారు. సీఎం చంద్రబాబు తనకు ఏ బాధ్యత అప్పగించినా సైనికుడిలా పనిచేస్తానని అన్నారు. తన తండ్రి ఆశయ సాధనకు కృషి చేస్తానని చెప్పారు.
Link to comment
Share on other sites

ఏకాభిప్రాయంతోనే ఎంపిక
ఏపీ మంత్రివర్గంలోకి ఫరూక్‌, శ్రావణ్‌
మండలి ఛైర్మన్‌గా షరీఫ్‌,
ప్రభుత్వ విప్‌గా చాంద్‌బాషాకు అవకాశం
రెండు వర్గాల నేతలను పిలిచి మాట్లాడిన సీఎం

ఈనాడు, అమరావతి: తెదేపాలో ఎవరినీ నొప్పించని విధంగా రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణకు కార్యరంగం సిద్ధమైంది. మైనారిటీల నుంచి ఎన్‌ఎండీ ఫరూక్‌, గిరిజనుల నుంచి కిడారి శ్రావణ్‌ల ఎంపికకు ఆయా వర్గాల ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్యులు మద్దతు పలికారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తమకు ఆమోదమేనని ప్రకటించారు. మండలి ఛైర్మన్‌గా షరీఫ్‌, ప్రభుత్వ విప్‌గా చాంద్‌బాషాల నియామకానికి కూడా ఈ సందర్భంగా సీఎం పచ్చజెండా ఊపారు. తన నిర్ణయమే అంతిమమైనప్పటికీ ఏకాభిప్రాయంతో ప్రకటించాలని ముఖ్యమంత్రి భావించారు. అందుకే అందరితోనూ మాట్లాడాలంటూ ఈ రెండు వర్గాల శాసనసభ్యులు, పార్టీ నాయకులకు కబురు పంపారు. శనివారం ఉదయాన్నే ఉండవల్లికి పిలిపించి మాట్లాడారు. ఆ ఇద్దరినీ మంత్రివర్గంలోకి తీసుకోడానికి కారణాలను వివరించారు. దీంతో అప్పటిదాకా మంత్రి పదవులు ఆశించిన శాసనసభ్యులు చల్లబడి సీఎం నిర్ణయమే శిరోధార్యమని ప్రకటించారు. సీఎం వద్ద సమావేశానికి వెళ్లే సమయంలో ఎమ్మెల్యేలు జలీల్‌ఖాన్‌, చాంద్‌బాషా ఒకింత అసంతృప్తిగా ఉన్నారనే ఊహాగానాలు వచ్చాయి. ప్రసారమాధ్యమాలతో మాట్లాడినప్పుడు తమకూ అవకాశం ఇస్తారని ఆశిస్తున్నామని వారన్నారు.

చేతులు కలిపి.. బలపరిచి
మధ్యాహ్నం 2.10 గంటలకు వేదిక వద్దకొచ్చిన చంద్రబాబు ముందుగా ఫరూక్‌, శ్రావణ్‌ను తన కార్యాలయంలోకి పిలిపించారు. మంత్రులుగా ఆదివారం ప్రమాణం చేయాల్సి ఉంటుందని చెప్పారు. అనంతరం మైనారిటీల నేతలు 15మందితో ప్రజావేదిక లోపలి కార్యాలయంలో సమావేశమయ్యారు. వైకాపా నుంచి వచ్చినవారికి మంత్రి పదవులు ఇస్తే, గవర్నరు అభ్యంతరం చెబుతారనే సంకేతాలున్నాయని వెల్లడించారు. ఏళ్లుగా పార్టీలోనే పనిచేస్తున్న ఫరూక్‌కు అవకాశమిస్తున్నట్లు స్పష్టం చేశారు. రాయలసీమ ప్రాంతానికి పార్టీ, ప్రభుత్వపరంగా ఇస్తున్న ప్రాధాన్యాన్ని వివరించారు. ఆశావహులకు భవిష్యత్తులో అవకాశాలు కల్పిస్తామన్నారు. సీఎం అభిప్రాయానికి నేతలంతా మద్దతు పలికారు. మండలి ఛైర్మన్‌ పదవి నుంచి ఫరూక్‌ను తప్పిస్తున్నందున షరీఫ్‌కు అవకాశమివ్వాలని కొందరు సూచించగా చంద్రబాబు అంగీకరించారు. తనకూ ప్రభుత్వ విప్‌గా అవకాశమివ్వాలని చాంద్‌బాషా కోరారు. ఎమ్మెల్యే సర్వేశ్వరరావు మృతితో ఆ పదవి ఖాళీగా ఉన్నదని గుర్తు చేశారు. అనంతపురంనుంచి ఇప్పటికే ముగ్గురు విప్‌లుగా ఉన్నారని గుర్తు చేసిన ముఖ్యమంత్రి చివరకు సుముఖత తెలిపారు. దీంతో ఉదయం కొంత అసంతృప్తిగా ఉన్నారన్న నేతల వైఖరిలో మార్పు కన్పించింది. సమావేశంనుంచి బయటకు వచ్చిన వెంటనే అందరూ చేతులు కలిపారు.

అసెంబ్లీ అభ్యర్థి శ్రావణ్‌
గిరిజనవర్గ నేతలతో జరిగిన సమావేశానికి హాజరవడంతోనే చంద్రబాబు అరకు నియోజకవర్గ నేతలు, కిడారి శ్రావణ్‌ కుటుంబసభ్యులతో కలిసి ఫొటోలు దిగారు. శ్రావణ్‌ను మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నట్లు ప్రకటించారు. ఎమ్మెల్యే సర్వేశ్వరరావు కోరుకున్నట్టుగా అరకు ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని వివరించారు. వచ్చే ఎన్నికల్లో అరకు తెదేపా అభ్యర్థిగా ఆయనే పోటీ చేస్తారనే స్పష్టతనిచ్చారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ సభ్యుడిగా మాజీ ఎమ్మెల్యే శివేరి సోమ కుమారుడు అబ్రహంను నియమిస్తామని హామీనిచ్చారు. దీంతో అక్కడినుంచి వచ్చిన పార్టీ నేతల్లో హర్షం వ్యక్తమైంది.

అనంతపురం జిల్లా నుంచి నలుగురు విప్‌లు
అనంతపురం జిల్లాలో విప్‌ల సంఖ్య నాలుగుకు పెరగనుంది. ఈ జిల్లా నుంచి పరిటాల సునీత, కాలవ శ్రీనివాసులు మంత్రులుగా ఉన్నారు. చీఫ్‌విప్‌లుగా మండలిలో పయ్యావుల కేశవ్‌, అసెంబ్లీలో పల్లె రఘునాథరెడ్డి, విప్‌గా యామినీబాల ఉన్నారు. ఇప్పుడు అదే జిల్లా నుంచి చాంద్‌భాషాకు విప్‌ పదవి దక్కనుంది.

ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు
ఇద్దరు మంత్రుల ప్రమాణస్వీకారానికి ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయ ఆవరణలో ఉన్న ప్రజావేదిక సిద్ధమైంది. శనివారం రాత్రివరకూ అధికారులు ఈ ఏర్పాట్లను పర్యవేక్షించారు.

ఫరూక్‌కు వైద్య ఆరోగ్యం?
ముఖ్యమంత్రితో జరిగిన సమావేశంలో కొత్త మంత్రులకు కేటాయించే శాఖలపైనా చర్చ నడిచింది. ఫరూక్‌కు మైనారిటీ సంక్షేమంతోపాటు ముఖ్యమంత్రి వద్ద ఉన్న వైద్య ఆరోగ్య శాఖ కేటాయించే అవకాశం ఉంది. గిరిజన సంక్షేమశాఖను శ్రావణ్‌కు అప్పగించనున్నారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...