Jump to content

Amanchi krishna mohan


sonykongara

Recommended Posts

ఎమ్మెల్యే ఆమంచి వైసీపీలోకి జంప్ అవుతారా..!?
06-10-2018 13:05:11
 
636744281158369094.jpg
  • ఐటీ దాడులు ఆమంచిపై మైండ్‌గేమ్‌
  • జిల్లాలో రాజకీయ కలకలం
  • పోతుల సమీప బంధువు కంపెనీలో ఐటీ అధికారుల సోదాలు
  • పలువురు నేతలు, వారి బంధువర్గ వ్యాపారుల్లో ఆందోళన
  • చీరాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌ పార్టీ మార్పుపై పుకార్లు షికారు
  • తోసిపుచ్చిన ఆమంచి
  • అసత్య ప్రచారంపై ఆరా
ఒంగోలు: ఒకవైపు ఆదాయపన్ను శాఖ అధికారుల దాడులు. మరోవైపు చీరాల శాసన సభ్యుడు ఆమంచి కృష్ణమోహన్‌ పార్టీ మార్పుపై షికార్లు చేసిన పుకార్లు. దీంతో జిల్లాలో ఒక్కసారిగా రాజకీయ కలకలం సృష్టించింది. శుక్రవారం ఉదయం నుంచి మొదలైన ఈ కలకలం మధ్యాహ్నం తర్వాత రాజకీయ దుమారాన్ని రేకెత్తించింది. సాయంత్రానికి ఐటీ దాడులు కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు సమీప బంధువు కంపెనీల వరకే పరిమితమయ్యాయని, చీరాల ఎమ్మెల్యే ఆమంచి వ్యక్తిగత పనులపై చెన్నై వెళ్లారే తప్ప జగన్‌ను కలవలేదని తేలిపోవడంతో ఇది కొంత సద్దుమణిగింది. అయితే ఐటీ దాడులు రాష్ట్రంలో ఇంకా కొనసాగే అవకాశం ఉందన్న ప్రచారం, పార్టీ ఫిరాయింపులపై అనుమానా లు రాజకీయ వర్గాల్లోనేకాక, ప్రజానీకంలోనూ చర్చనీయాంశమయ్యాయి.
 
గత కొద్దిరోజులుగా జరుగుతున్న ప్రచారం లో భాగంగా అన్నట్లు రాష్ట్ర రాజధాని ప్రాం తం కేంద్రంగా ఆదాయ పన్ను శాఖ అధికా రులు పలు వ్యాపార సంస్థలపై శుక్రవారం దాడులు నిర్వహించారు.
 
అధికార టీడీపీలోని శ్రీమంతులు, వారి బంధువులు, సన్నిహితులై న వ్యాపారులపైనే దాడులు జరుగుతున్న వా తావరణం కన్పించింది. జిల్లాకు కూడా ఐటీ అధికారులు వచ్చారన్న సమాచారంతో రాజ కీయ వర్గాల్లో ప్రధానంగా టీడీపీలో ఉన్న వ్యాపార ప్రముఖులు కాస్తంత అలజడికి గు రయ్యారు. ఇదేసమయంలో చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ వైసీపీ అధినేత జగన్‌ను హైదరాబాద్‌లో లోటస్‌ పాండ్‌లో కల బోతున్నారని సోషల్‌ మీడియాలో ఒక పోస్టిం గ్‌ వచ్చింది. దీంతో రాజకీయ వర్గాల్లో ఏం జరుగుతుందన్న చర్చ మొదలైంది. ఇప్పటికీ ఐటీ దాడులపై స్పష్టత లేకపోగా, ఎమ్మెల్యే ఆ మంచి విషయం ప్రచారమని తేలిపోయింది.
 
 
‘పోతుల’ బంధువు కంపెనీలపై ఐటీ దాడులు
జిల్లాకు వచ్చిన ఆదాయ పన్ను శాఖ అధికారులు కందుకూరు ఎమ్మెల్యే పోతుల రా మారావు మేనల్లుడు యార్లగడ్డ కార్తీక్‌కు చెం దిన కంపెనీల్లో శుక్రవారం సోదాలు ప్రా రంభించారు. తొలుత వీరు ఇటు పోతుల రా మారావు కంపెనీలతోపాటు, మరికొందరి సం స్థలపైనా దాడులకు దిగినట్లు వార్తలొచ్చాయి. చివరకు ఎమ్మెల్యే పోతులను టార్గెట్‌ చేశార న్న ప్రచారం జరిగింది. ఒంగోలు సమీపం లోని చెరువుకొమ్ముపాలెం వద్ద ఉన్న పోతుల కు చెందిన గ్రానైట్‌ కంపెనీలోకి ప్రవేశించా రన్న ప్రచారం జరిగింది. అయితే అది నిజం కాదని కొద్దిసేపటికే తేలిపోయింది. జరుగుమ ల్లి మండలం కె. బిట్రగుంట వద్ద ఉన్న సదరన్‌ ట్రాఫికల్‌ ఫుడ్స్‌ లిమిటెడ్‌ కంపెనీ వద్దకు శుక్రవారం ఉదయం 8 గంటల సమ యంలో రెండు వాహనాల్లో ఐటీ అధికారులు చేరుకున్నారు.
 
కార్మిక శాఖ అధికారులమని చెప్పి లోపలికి వెళ్లిన వారు సోదాలు ప్రార ంభించారు. ఉదయం నుంచి రాత్రి పొద్దుపో యే వరకు సోదాలు జరుగుతూనే ఉన్నాయి. ఆ కంపెనీకి కార్తీక్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా ఉండగా, వినయ్‌కుమార్‌ అనే వ్యక్తి ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా, ఆంటోని స్వామి సీఈవోగా వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. వేలు మురుగన్‌ మేనేజర్‌గా ఉండగా ఐటీ అధికారులు కంపె నీలోకి వెళ్లిన తర్వాత లోపలి అందరి సెల్‌ఫోన్లు స్విచాఫ్‌ చేయించారు. వారిని బయటకు వెళ్లకుండా, బయట నుంచి ఎవ్వరినీ లోపలికి రానీయకుండా తనిఖీలు నిర్వహించారు.
 
 
కార్తీక్‌, మరికొందరు విజయవాడ కేంద్రంగా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నట్లు సమాచారం. ఆ రంగాలకు చెందిన కొన్ని సంస్థల పై ఐటీ అధికారులు దాడులు చేసినప్పుడు కార్తీక్‌కు సంబంధించిన సమాచారం లభ్యం కావడంతో అటు విజయవాడ, ఇటు జరుగు మల్లి మండలంలో ఆయన భాగస్వామిగా ఉ న్న సంస్థలపై దాడులు చేసినట్లు తెలు స్తోంది. ఈ దాడుల్లో ఏం గుర్తించారన్న స మాచారం అధికారికంగా వెల్లడికానప్పటికీ రా మారావు కంపెనీలపై దాడులు జరగలేదన్న సమాచారంతో టీడీపీ అభిమానులు, రామా రావు అనుచరులు ఊరట చెందారు. శుక్రవా రం ఉదయాన్నే హైదరాబాద్‌కు బయల్దేరి వె ళ్లిన రామారావు అక్కడ పని ముగించుకొని రాత్రికి టంగుటూరు చేరుకున్నారు.
 
కాగా.. రాజకీయ వైషమ్యాల నేపథ్యంలో జరుగుతున్న దాడులు కావడంతో టీడీపీలో ఉన్న వ్యాపా రరంగానికి చెందిన నేతల్లో ఆందోళన కన్పి స్తోంది. టీడీపీకి చెందిన ఆరుగురు శాసనస భ్యులకు తోడు మంత్రి శిద్దా రాఘవరావు సంస్థలపై త్వరలో దాడులు జరిగినా ఆశ్చ ర్యపడాల్సిన అవసరం లేదన్న ప్రచారం జరు గుతోంది. ఇదిలా ఉండగా ప్రజాప్రతినిధులు గా ఉన్న వారిని వదిలేసి ఐటీ అధికారులు త మపై దృష్టి సారిస్తారేమోనన్న ఆందోళనలో ఇతర వ్యాపార ప్రముఖులు, ప్రధానంగా టీ డీపికి చెందిన నేతల బంధువులు ఉన్నారు.
 
 
‘ఆమంచి’ వైసీపీలో చేరుతున్నట్లు ప్రచారం
చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ వైసీపీ అధినేత జగన్‌తో భేటీ కాబోతున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో వచ్చిన ఓ పోస్టింగ్‌ రాష్ట్ర స్థాయిలో సంచలనం కలిగించింది. ఇటు టీడీపీ, వైసీపీకి చెందిన కింది స్థాయి వర్గాల్లోనూ ఈ విషయం పెద్ద చర్చనీయాంశమైంది. హైదరాబాద్‌లోని జగన్‌ నివాసమైన లోటస్‌పాండ్‌ వద్దకు మీడియా అంతా చేరుకుంది. జగన్‌కు చెందిన మీడియా ప్రతినిధులు కొందరు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ ‘సార్‌.. లోటస్‌ పాండ్‌కు ఎన్ని గంటలకు వస్తున్నారు’ అని కృష్ణమోహన్‌కే ఫోన్‌ చేసి అడిగారు. జిల్లాలో టీడీపీకి చెం దిన సీనియర్‌ నాయకులు కొందరు అదే పని గా ఈ విషయమై ఆరా తీసినట్లు తెలిసింది. గూఢచార శాఖ అధికారులు, టీడీపీ రాజకీ య వ్యవహారాలు చూసే నాయకులు ఉరుకు లు పరుగులు తీశారు. మధ్యాహ్నం మంత్రి వర్గ సమావేశం వద్ద ఈ అంశమే ప్రధాన చర్చనీయాంశమైంది. ఒక దశలో ఈ సమా చారం ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లగా ఆమంచిని అనుమానించకండి. ఒకవేళ ఆయన ఏదైనా చేయాలనుకుంటే చెప్పే చేస్తానని ముఖ్యమంత్రి ఆ ప్రచారాన్ని కొట్టిపారేసినట్లు చెప్తున్నారు.
 
 
సాయంత్రానికి బాలినేని కూడా ఆమంచితో ఉన్నట్లు పుకార్లు రావడంతో వైసీపీ శ్రేణులు ఈ సమాచారంపై నిజం తెలుసుకునేందుకు బాలినేని, ఇతర నాయకులకు ఫోన్లు చేశారు. గాంధీ జయంతి రోజు నియోజకవర్గంలో ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆమంచి తనకు చెందిన ఆక్వా ఫ్యాక్టరీ పనిపై ఈనెల 3న చెన్నై వెళ్లారు. తనకు సన్నిహి తుడైన బీద మస్తాన్‌రావు సంస్థలపై ఐటీ దా డులు జరుగుతున్నాయని తెలుసుకుని ఆయ న కుటుంబీకులను కలుసుకునేందుకు మరో రోజు అక్కడే ఉన్నారు. శుక్రవారం ఈ ప్రచా రం ప్రారంభమైన సమయంలో ఆయన చెన్నైలోనే ఉన్నారు. అనంతరం బయల్దేరి సా యంత్రానికి చీరాల చేరుకున్నారు. విషయం ఏదైనా పూర్తిస్థాయిలో పరిశీలించే అలవాటు న్న ఆమంచి, ఆయన వర్గీయులు ఈ ప్రచా రం ఎలా జరిగిందన్న అంశంపై ఆరా తీసినట్లు తెలిసింది. చివరకు చీరాలకు చెంది టీడీపీలో ఉండీ లేనట్లుగా ఉంటున్న ఒక నా యకుడు, సామాజికంగా అతనితో సన్నిహితంగా ఉండే గూఢచార శాఖలో ఆ ప్రాంత బాధ్యతలు నిర్వహిస్తున్న ఉద్యోగి కలిసి సోషల్‌ మడియాలో ఈ ప్రచారం ప్రారంభించారన్న అభిప్రాయానికి వచ్చారు.
 
 
శుక్రవారం రాత్రికి ఈ విషయం తెలుసుకున్న ఆమంచి వర్గీయులు కారాలు మిరియాలు నూరుతు న్నారు. ఈ ప్రచారం ప్రారంభమైన కొన్ని గంటల్లోనే టీడీపీ ముఖ్యనేత టి.డి. జనార్దన్‌, మరికొందరు ఆమంచితో మాట్లాడినట్లు తె లుస్తోంది. చీరాలకు చేరిన ఆమంచి తన అనుచరులు, తనకు ఫోన్లు చేసిన మీడియా ప్రతినిధులతో ‘నా రాజకీయ స్టాండ్‌ను నేను ఎప్పుడో వెల్లడించా. మైండ్‌గేమ్‌ రాజకీయాల కు స్పందించి వివరణ ఇచ్చుకోవాల్సిన అ వసరం నాకు లేదు’ అని కరాఖండిగా చెప్తూ నియోజకవర్గ అభివృద్ధిపై చేస్తున్న, చేయబో తున్న కృషిని, పనులను వివరించారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...