Jump to content

All set for IT raids


rama123

Recommended Posts

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ పురపాలక శాఖ మంత్రి, నారాయణ విద్యాసంస్థల అధినేత పి.నారాయణ ఆస్తులపై ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేస్తున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. వేర్వేరు ప్రాంతాలకు చెందిన ఆదాయపు పన్ను శాఖ అధికారులు గురువారం రాత్రి విజయవాడకు చేరుకున్నారు. వారంతా శుక్రవారం వేకువజాము నుంచే వారు రాష్ట్రంలోని కొంతమంది ఇళ్లపై దాడులు చేసే అవకాశముందని వార్త హల్‌చల్‌ చేసింది. ఈ నేపథ్యంలో మంత్రి నారాయణపై సంస్థలపై ఐటీ దాడులు జరుగుతున్నట్లు సమాచారం బయటకు వచ్చింది. అయితే దీన్ని అటు ఐటీ అధికారులు గానీ.. నారాయణ ప్రతినిధులు గానీ ధ్రువీకరించడం లేదు.
 
 

ఇటీవల తెలంగాణలో ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ కార్యానిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నివాసంపై ఐటీ సోదాలు జరిగిన సంగతి విదితమే. గురువారం నెల్లూరులో తెదేపా నాయకుడు బీద మస్తాన్‌రావు కార్యాలయాల్లోనూ తనిఖీలు నిర్వహించారు. రాత్రి 7 గంటల వరకూ అధికారులు రికార్డుల పరిశీలన చేస్తూనే ఉన్నారు. చెన్నైలోని బీఎంఆర్‌ సంస్థల కార్యాలయాల్లోనూ వారు ఏకకాలంలో దాడులు నిర్వహించినట్లు తెలిసింది. ఇక్కడ ఆదాయం పన్ను అధికారులను వివరాలను అడగాలని ప్రయత్నించినా వారు లోపలికి ఎవరిని అనుమతించలేదు. సోదాలు పూర్తయిన తరువాతనే మీడియాతో మాట్లాడతామని సిబ్బంది చేత సమాచారం ఇచ్చారు. ఐటీ శాఖ దాడులపై ఇంటలిజెన్స్‌ అధికారులు వివరాలను సేకరించారు. ఈ నేపథ్యంలో నారాయణ సంస్థలపై దాడులు జరుగుతున్నట్లు వస్తున్న వార్త రాజకీయంగా కలకలం సృష్టిస్తోంది.

Link to comment
Share on other sites

ఏపీలో ఏం జరుగుతోంది? ఐటీ దాడుల నేపథ్యంలో మంత్రులతో సీఎం భేటీ!
05-10-2018 15:29:58
 
636743501978231945.jpg
అమరావతి: ఏపీలో అధికార పార్టీ నేతలే లక్ష్యంగా ఐటీ దాడులు కొనసాగుతుండటం హాట్ టాపిక్‌గా మారింది. రాజకీయ వర్గాల్లో ఐటీ తనిఖీలపై విస్తృత చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు అందుబాటులో ఉన్న మంత్రులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. కేంద్రం కుట్రపూరితంగా వ్యవహరించి టీడీపీ నేతలపై ఐటీ దాడులు చేయిస్తోందని, నేతలంతా ధైర్యంగా ఉండాలని ఆయన సూచించారు. టీడీపీలోనే కాకుండా ఏపీ రాజకీయ వర్గాల్లో కూడా ఇదే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వరుసగా టీడీపీ నేతలే టార్గెట్‌గా ఐటీ సోదాలు జరుగుతుండటం పలు అనుమానాలను రేకెత్తిస్తోంది. నెల్లూరు జిల్లా కావలి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత బీద మస్తాన్ రావు వ్యాపార సంస్థపై ఐటీ దాడులు జరిగాయి. నిన్న మొదలైన ఈ తనిఖీలు నేడు కూడా కొనసాగాయి. కందుకూరు టీడీపీ ఎమ్మెల్యే పోతుల రామారావు, ఆయన కుటుంబసభ్యుల కంపెనీల్లో సోదాలు జరిగినట్లు సమాచారం.
 
టంగుటూరు మండలం చెరువుకొమ్ముపాలెంలోని సదరన్‌ గ్రానైట్స్‌ కంపెనీలో ఐటీ సోదాలు నిర్వహించింది. అలాగే జరుగుమిల్లి మండలం కె.బిట్రగుంటలో సదరన్‌ ట్రోపికల్‌ ఫుడ్స్‌ ఆఫీసులో ఐటీ తనిఖీలు చేపట్టినట్లు తెలిసింది. నారాయణ విద్యా సంస్థల్లో తనిఖీలు చేసేందుకు ఐటీ ప్రయత్నించడంతో ఇది కేవలం టీడీపీ నేతలపై కక్ష సాధింపు చర్య అని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. మోదీకి తనకు నచ్చని వారిపై ఈడీ, ఐటీలతో దాడులు చేయించడం అలవాటుగా మారిందని, భయపడాల్సిన అవసరం లేదని.. బీజేపీ కుట్రలను తిప్పి కొట్టాలని నేతలకు టీడీపీ అధినేత సూచించారు. ఇదిలా ఉంటే.. మంత్రులతో చంద్రబాబు జరిపిన సమావేశంలో కేసీఆర్ విమర్శలు కూడా చర్చకొచ్చినట్లు తెలిసింది. కేసీఆర్ విమర్శలకు ధీటుగా కౌంటర్ ఇవ్వాలని నేతలకు చంద్రబాబు సూచించినట్లు తెలిసింది.
Link to comment
Share on other sites

1 hour ago, Saichandra said:

ఐటి అధికారులకి సెక్యూరిటీ విత్ డ్రా చేసుకునే ఆలోచనలో ఎపి ప్రభుత్వం!!

Wrong move.. Ala Chesthe central force or Army ni pamputaru..

Link to comment
Share on other sites

3 hours ago, Raaz@NBK said:

Wrong move.. Ala Chesthe central force or Army ni pamputaru..

central army forces ni state force arrest chesthe...valla mida case pedithe..non bailable case pedithe

Asalu vachina IT valla mida nirbhaya case lu pedihte...Raiding ki vachina intlo pani manishi mida rape attempt chesadani

Link to comment
Share on other sites

9 minutes ago, kishbab said:

central army forces ni state force arrest chesthe...valla mida case pedithe..non bailable case pedithe

Asalu vachina IT valla mida nirbhaya case lu pedihte...Raiding ki vachina intlo pani manishi mida rape attempt chesadani

cheyvachu kuda cheyyalani ante

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...