Jump to content

IT raids


sonykongara

Recommended Posts

ఏపీలో ఏం జరుగుతోంది? ఐటీ దాడుల నేపథ్యంలో మంత్రులతో సీఎం భేటీ!
05-10-2018 15:29:58
 
636743501978231945.jpg
అమరావతి: ఏపీలో అధికార పార్టీ నేతలే లక్ష్యంగా ఐటీ దాడులు కొనసాగుతుండటం హాట్ టాపిక్‌గా మారింది. రాజకీయ వర్గాల్లో ఐటీ తనిఖీలపై విస్తృత చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు అందుబాటులో ఉన్న మంత్రులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. కేంద్రం కుట్రపూరితంగా వ్యవహరించి టీడీపీ నేతలపై ఐటీ దాడులు చేయిస్తోందని, నేతలంతా ధైర్యంగా ఉండాలని ఆయన సూచించారు. టీడీపీలోనే కాకుండా ఏపీ రాజకీయ వర్గాల్లో కూడా ఇదే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వరుసగా టీడీపీ నేతలే టార్గెట్‌గా ఐటీ సోదాలు జరుగుతుండటం పలు అనుమానాలను రేకెత్తిస్తోంది. నెల్లూరు జిల్లా కావలి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత బీద మస్తాన్ రావు వ్యాపార సంస్థపై ఐటీ దాడులు జరిగాయి. నిన్న మొదలైన ఈ తనిఖీలు నేడు కూడా కొనసాగాయి. కందుకూరు టీడీపీ ఎమ్మెల్యే పోతుల రామారావు, ఆయన కుటుంబసభ్యుల కంపెనీల్లో సోదాలు జరిగినట్లు సమాచారం.
 
టంగుటూరు మండలం చెరువుకొమ్ముపాలెంలోని సదరన్‌ గ్రానైట్స్‌ కంపెనీలో ఐటీ సోదాలు నిర్వహించింది. అలాగే జరుగుమిల్లి మండలం కె.బిట్రగుంటలో సదరన్‌ ట్రోపికల్‌ ఫుడ్స్‌ ఆఫీసులో ఐటీ తనిఖీలు చేపట్టినట్లు తెలిసింది. నారాయణ విద్యా సంస్థల్లో తనిఖీలు చేసేందుకు ఐటీ ప్రయత్నించడంతో ఇది కేవలం టీడీపీ నేతలపై కక్ష సాధింపు చర్య అని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. మోదీకి తనకు నచ్చని వారిపై ఈడీ, ఐటీలతో దాడులు చేయించడం అలవాటుగా మారిందని, భయపడాల్సిన అవసరం లేదని.. బీజేపీ కుట్రలను తిప్పి కొట్టాలని నేతలకు టీడీపీ అధినేత సూచించారు. ఇదిలా ఉంటే.. మంత్రులతో చంద్రబాబు జరిపిన సమావేశంలో కేసీఆర్ విమర్శలు కూడా చర్చకొచ్చినట్లు తెలిసింది. కేసీఆర్ విమర్శలకు ధీటుగా కౌంటర్ ఇవ్వాలని నేతలకు చంద్రబాబు సూచించినట్లు తెలిసింది.
Link to comment
Share on other sites

అసలు సినిమా ముందుంది!
08-10-2018 02:53:08
 
636745772724177873.jpg
  • సూపర్‌ సీన్లు ఉంటాయ్‌..
  • కొందరు నేతలపై త్వరలో దాడులు
  • అంతర్గత సంభాషణల్లో ఐటీ అధికారుల కీలక వ్యాఖ్యలు
  • ఒకరిద్దరు అధికారులపైనా దాడులు
  • కర్ణాటక ఎన్నికలు కాగానే
  • ఐటీ దాడులు చేయాల్సింది
  • బీజేపీ పరాజయంతో వాయిదా
  • ఇప్పుడు పక్కా వివరాలతో సిద్ధం?
  • చెన్నై బృందం ఇంకా రాష్ట్రంలోనే
  • భవిష్యత్‌ దాడులకు వ్యూహరచన
రాష్ట్రంలో తాజాగా జరిగిన ఐటీ దాడులు ట్రయలర్‌ మాత్రమేనా? అసలు సినిమా వేరే ఉందా? పెద్ద నేతలపైనా దాడులు చేసేందుకు ఐటీ అధికారులు సిద్ధమవుతున్నారా? మలి విడతలో కొందరు ఉన్నతాధికారుల ఇళ్లలోనూ సోదాలకు రంగం సిద్ధం చేస్తున్నారా? ఈ ప్రశ్నలన్నింటికీ ఐటీ వర్గాలు అవుననే జవాబిస్తున్నాయి.
 
 
అమరావతి, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఐటీ దాడులకు సంబంధించి.. అసలు సినిమా ముందుందని ఆ శాఖ అధికారులు కొందరు పేర్కొంటున్నట్లు సమాచారం. రానున్న రోజుల్లో సూపర్‌ సీన్లు ఉంటాయని వ్యాఖ్యానిస్తున్నారు. రాష్ట్రంలోని కొందరు బడా నేతలతో పాటు ఒకరిద్దరు అధికారులపైనా దాడులు జరిగే అవకాశముందని అంటున్నారు. ఐటీ దాడులు రాజకీయ ప్రేరేపితమని, మోదీ ప్రభుత్వమే చేయిస్తోందన్న విమర్శలు పెద్దఎత్తున వచ్చిన నేపథ్యంలో వీటిని ప్రస్తుతానికి వాయిదా వేసినా.. తెరవెనుక అంతా సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. ఎక్కడో ఒక చిన్న బ్యాంకుకు సంబంధించిన మారుమూల శాఖ నుంచి కొంత సమాచారం సేకరించామని.. దాని ఆధారంగా తీగ లాగుతున్నామని కూడా ఐటీ వర్గాలు చెప్పుకొంటున్నట్లు తెలిసింది. తమ వద్ద ఉన్న సమాచారం, పైనుంచి వచ్చిన ఆదేశాల మేరకు అసలు దాడులు ఇంకా జరగాల్సి ఉందని ఈ వర్గాలు అంటున్నాయి. రాష్ట్రంలో మరిన్ని రాజకీయ పరిణామాలు, ఆసక్తికర విషయాలకు ఐటీ దాడులు నిలయంగా మారతాయని, భవిష్యత్‌లో సంచలన దాడులు ఉంటాయని కూడా అంతర్గత సంభాషణల్లో అనుకుంటున్నట్లు తెలిసింది. ఇప్పటికే నెల్లూరు జిల్లా టీడీపీ సీనియర్‌ నేత బీద మస్తాన్‌రావు, ప్రకాశం జిల్లా కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు కంపెనీలపైనా దాడులు జరిగాయి. శుభగృహ, సదరన్‌ కనస్త్రక్షన్స్‌, వీఎస్‌ లాజిస్టిక్స్‌ తదితర సంస్థల్లోనూ సోదాలు జరిపారు. ఈ దాడుల్లో ఏం దొరికిందన్న విషయాలను ఐటీ శాఖ ఎక్కడా చెప్పలేదు.ఇది ట్రయల్‌ మాత్రమేనని.. ముందుంది ముసళ్ల పండుగ అని వ్యాఖ్యానిస్తున్నాయని తెలిసింది.
 
 
లాకర్లలో కోటిపైనే నగదు!
కొద్దిరోజుల క్రితం జరిపిన దాడుల్లో లభ్యమైన వివరాల ఆధారంగా కొన్ని బ్యాంకులు, వాటిలో ఉన్న లాకర్లనూ ఐటీ బృందాలు సోదాలు చేశాయి. కొన్ని లాకర్ల నుంచి.. రూ.కోటికి పైగా నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. కొన్ని లావాదేవీలు, కొంత సమాచారాన్ని ముందుగానే సేకరించి పెట్టుకుని.. రియల్‌ఎస్టేట్‌ నుంచి ఇన్‌ఫ్రా కంపెనీలను దాడులకు లక్ష్యంగా ఎంచుకున్నట్లు తెలిసింది. ఈ దాడులకు ఆదేశాలు పైనుంచే వచ్చాయని చెప్పుకొంటున్నారు.
 
 
కర్ణాటకలో సీట్లు పోయాయనే!
వాస్తవానికి కర్ణాటక ఎన్నికల్లో టీడీపీ పోషించిన పాత్ర కేంద్రానికి నచ్చలేదు. తెలుగువారు అధికంగా ఉన్న ప్రాంతా ల్లో బీజేపీ ఓటమి పాలైంది. రాష్ట్రానికి అన్యాయం చేసిన పార్టీకి వ్యతిరేకంగా కర్ణాటకలోని తెలుగువారు ఓటేయాలని చంద్రబాబు పిలుపిచ్చిన సంగతి తెలిసిందే. రాష్ట్రానికి చెందిన కొందరు నేతలు, ఉద్యోగ సంఘాల నాయకులు అక్కడ ప్రచారం కూడా చేశారు. తెలుగు ప్రాంతాల్లోని సీట్లు కోల్పోవడంతోనే బీజేపీ అధికారానికి రాలేకపోయింది. ఎన్నికల ప్రక్రియ జరుగుతుండగానే.. అక్కడి తెలుగు ప్రాంతాల్లో తమపై వ్యతిరేకత ఉందని బీజేపీకి కూడా అర్థమైంది. దీంతో ఎన్నికలు అయిపోగానే ఏపీలో ఐటీ దాడులు జరపాలని మోదీ ప్రభుత్వం అనుకుందని తెలుగుదేశం నేతలు పేర్కొంటున్నారు. అయితే బీజేపీ ఓటమితో కాస్త తగ్గి.. వాయిదా వేశారని అంటున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నిక లు సమీపిస్తున్నందున పెద్దఎత్తున దాడులకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. సోదాల కోసం చెన్నై తదితర ప్రాంతాల నుంచి వచ్చిన ఐటీ అధికారులు ఇంకా రాష్ట్రంలోనే ఉన్నట్లు సమాచారం. భవిష్యత్‌ దాడులకు వ్యూహరచన చేస్తున్నారు. అయితే ఇటీవల సోదాలు, దాడుల్లో ఏం ఆధారాలు లభ్యమయ్యాయన్నదానిపై మాత్రం పెదవి విప్ప డం లేదు. సినిమా మొత్తం పూర్తయ్యాకే వివరాలు వెల్లడిస్తామని ఒక ఐటీ అధికారి పేర్కొనడం గమనార్హం.
Link to comment
Share on other sites

  • 2 weeks later...
ఏపీలో మరోసారి ఐటీ దాడులు
25-10-2018 08:40:19
 
636760536204630045.jpg
అమరావతి: ఏపీలో మరోసారి భారీగా తనిఖీలు చేసేందుకు ఐటీ శాఖ సన్నద్ధమైంది. విశాఖలో ఇప్పటికే తనిఖీలు ప్రారంభంకాగా, విజయవాడ, గుంటూరు, నెల్లూరులోనూ సోదాలు చేసేందుకు ఐటీ బృందాలు సిద్ధంగా ఉన్నాయి. హెడ్‌క్వార్టర్స్‌ నుంచి ఆదేశాలు రాగానే రంగంలోకి దిగబోతున్నాయి. విశాఖలోని ఎంవీసీ కాలనీలోని అసిస్టెంట్ డైరెక్టర్ కార్యాలయం నుంచి కొన్ని ఐటీ బృందాలు బయలుదేరి గాజువాకలోని సెజ్‌లోకి వెళ్లాయి. అందులోని ట్రాన్స్‌వరల్డ్‌ బీచ్‌ శాండ్‌ కంపెనీలో సోదాలు జరుపుతున్నారు. అసిస్టెంట్ డైరెక్టర్ కార్యాలయంలోనే వేచి ఉన్న మరికొన్ని బృందాలు నగరంలోని పలు ప్రాంతాల్లో సోదాలు చేసేందుకు కాసేపట్లో బయలుదేరనున్నాయి.
 
Tags : it rides, visakhapatnam, Andhrapradesh
Link to comment
Share on other sites

9 hours ago, sonykongara said:

IT RAIDS ON Navayuga AND RVR PROJECTS పోలవరం ప్రాజెక్ట్ కడుతున్నందుకు నవయుగ మీద ఐటీ దాడులు

IT's a plan to slow down Polavaram Project.

Link to comment
Share on other sites

జల్లెడ పట్టిన ఐటీ
చెన్నై, నెల్లూరు, విశాఖ,  హైదరాబాద్‌, శ్రీకాకుళంలో ఆదాయ పన్ను సోదాలు
తెల్లవారుజామునే వివిధ ప్రాంతాలకు బృందాలు
అధికారుల సోదాలతో విశాఖ ఉక్కిరిబిక్కిరి
‘నవయుగ’లో పరిశీలన
వీవీ మినరల్స్‌ సంస్థల్లో  విస్తృత తనిఖీలు
చెన్నైలో 100 ప్రాంతాల్లో ..
విశాఖలో ఇద్దరు ఛార్టర్డ్‌  అకౌంటెంట్ల ఇళ్లలోనూ..

25ap-main2a.jpg

తెలుగు రాష్ట్రాలతోపాటు తమిళనాడులోని పలు ప్రాంతాల్లో ఆదాయ పన్ను అధికారులు గురువారం విస్తృత సోదాలు జరిపారు. విశాఖలోని పలు కార్యాలయాలు, సంస్థలను జల్లెడ పట్టారు. అన్నిచోట్లా గురువారం తెల్లవారుజామునుంచే పెద్దఎత్తున సోదాలు చేయడం వ్యాపార, రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది. తమిళనాడు కేంద్రంగా ఉన్న వీవీ మినరల్స్‌ కార్యకలాపాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సంస్థకున్న విశాఖ, శ్రీకాకుళం కార్యాలయాల్లోనూ సోదాలు చేశారు. నవయుగ ఇంజినీరింగ్‌ కంపెనీ నిర్వహిస్తున్న కృష్ణపట్నం ఓడరేవుతోపాటు విశాఖ, హైదరాబాద్‌లలోని ఆ సంస్థ కార్యాలయాలలో తనిఖీలు చేశారు.

ఈనాడు - న్యూస్‌టుడే బృందం

తెలుగు రాష్ట్రాలపై ఐటీ పంజా విసిరింది.  పలు ప్రైవేటు సంస్థలు, కార్యాలయాలను సోదా చేసింది. విశాఖ ఎంవీపీ కాలనీలో ఉన్న ఆదాయ పన్నుశాఖ కార్యాలయం నుంచి ప్రైవేటు వాహనాలలో ఐటీ బృందాలు నగరంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లాయి. చెన్నై నుంచి కూడా ఇదే విధంగా భారీ అధికార బృందం సోదాలకు తరలివెళ్లింది.

వీవీ మినరల్స్‌పై విస్తృతంగా..
తెల్లవారుజామున 4.30గంటలకే విశాఖ శివారు దువ్వాడలో ఉన్న వీసెజ్‌లోని ‘ట్రాన్స్‌వరల్డ్‌ గార్నైట్‌ ఇండియా(టీజీఐ)’ కార్యాలయానికి అధికారులు చేరుకుని తనిఖీలు చేశారు. శ్రీకాకుళం జిల్లా గార మండలం సతివాడ గ్రామ సమీపంలోని ఈ కంపెనీ కార్యాలయంలోనూ సోదాలు కొనసాగాయి. ఈ సంస్థ శ్రీకాకుళం జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇసుక శుద్ధి చేసి ఖనిజాలను వెలికితీస్తుంది. వాటిని సముద్రమార్గంలో విదేశాలకు ఎగుమతి చేస్తోంది. వీసెజ్‌లోని టీజీఐ ప్రాంగణంలోనే ఉన్న వీవీ మినరల్స్‌లోనూ అధికారులు తనిఖీచేశారు. తమిళనాడులోని తిరునల్వేలి కేంద్రంగా ఉన్న వీవీ మినరల్స్‌కు చెందిన దాదాపు వంద ప్రాంతాల్లో సోదాలు కొనసాగాయి. 37 బృందాలు, 130 మంది సిబ్బంది సోదాల్లో పాల్గొన్నారు. చెన్నైలోని ఎగ్మూర్‌, తిరువాన్మియూర్‌తోపాటు తమిళనాడులోని తిరునల్వేలి, తూత్తుకుడి, కోయంబత్తూరు, కారైకల్‌ తదితర ప్రాంతాల్లోనూ సోదాలు చేశారు. ఎస్‌.వైకుంఠరాజన్‌కు చెందిన వీవీ మినరల్స్‌కు దేశంలోనే అతి పెద్ద ఖనిజాల వెలికితీత సంస్థగా పేరుంది. టీవీ, వస్త్ర, వ్యవసాయ ఉత్పత్తులు, రసాయనాలు తదితర వ్యాపారాలు సంస్థకు ఉన్నాయి. సంస్థ స్థిర, చరాస్తులకు సంబంధించిన పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఖనిజాల అక్రమ ఎగుమతి ద్వారా వచ్చిన ఆదాయాన్ని స్పిన్నింగ్‌, చక్కెర మిల్లులు, హోటళ్లు, విద్యాసంస్థల్లో పెట్టుబడులుగా మార్చినట్లు కేంద్ర ఆర్థిక విభాగం గుర్తించిన మేరకే ఈ సోదాలు చేసినట్లు తెలిసింది. వీవీ మినరల్స్‌ అధినేతకు అధికార అన్నాడీఎంకేకు చెందిన పలువురు నేతలతో సంబంధాలు ఉన్నాయి.

25ap-main2c.jpg

* విశాఖ ఎంవీపీ కాలనీ ఉషోదయ జంక్షన్‌ సమీపంలో నివసిస్తున్న ఛార్టర్డ్‌ అకౌంటెంట్‌ ఎస్‌.మురళీకృష్ణ ఇంట్లో ఐటీ బృందం సోదాలు చేసింది.
* విశాఖలో నివసిస్తున్న ఛార్టర్డ్‌ అకౌంటెంట్‌ రాఘవేంద్రరావు ఇంట్లోనూ అధికారులు తనిఖీలు నిర్వహించారు.
* ఇద్దరు ఛార్టర్డ్‌ అకౌంటెంట్లు విశాఖపట్నంలోని పలు ప్రముఖ సంస్థలు, వ్యక్తుల పన్ను దాఖలు ప్రక్రియలను పర్యవేక్షిస్తారన్న సమాచారంతో వారిళ్లలో సోదాలు చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో వారికి ఈ బాధ్యతలను అప్పగించిన వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు ఆందోళనకు గురయ్యారు. తనిఖీలలో కొందరు వ్యక్తులు, సంస్థల కీలక సమాచారం అధికారులకు లభ్యమైనట్లు సమాచారం. ఈ వివరాల ఆధారంగా మళ్లీ సోదాలు చేసే అవకాశం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.
* విశాఖ వీఐపీ రోడ్డులోని షాపర్స్‌స్టాప్‌ ఎదురు రోడ్డులో ఉన్న ప్రముఖ గుత్తేదారు ఆర్‌.వెంకటేశ్వరరావు(ఆర్వీఆర్‌) ఇంట్లోనూ సోదాలు చేశారు. ఆర్వీఆర్‌ సంస్థ నౌకాదళానికి సంబంధించిన పలు ప్రాజెక్టులు, దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ నిర్మాణాలు చేసిందిగా ప్రత్యేక గుర్తింపు పొందింది.
* శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం నడుకుదిటిపాలెంలో తెదేపా నాయకుడు, రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ డైరెక్టరు ఎన్‌.ఈశ్వరరావు ఇంట్లోనూ తనిఖీలు చేశారు. ఆయన చేస్తున్న వ్యాపారాలు, ఆదాయవ్యయాల వివరాలను సేకరించినట్లు తెలిసింది. ఇంటిలోని కంప్యూటర్లు, డైరీలు, ఇతర దస్త్రాలను పరిశీలించారు.

25ap-main2d.jpg

పోలీసుల బందోబస్తు
విశాఖలో భారీఎత్తున ఐటీ సోదాలు చేయనున్నట్లు బుధవారం సాయంత్రంనుంచే మొదలైన ప్రచారాన్ని నిజం చేస్తూ తనిఖీలు కొనసాగాయి. ఐటీ అధికారులు సోదాలు చేస్తున్న సమయంలో ఆయా కార్యాలయాల వద్ద పోలీసులు బందోబస్తు కల్పించారు. ఇతరులను కార్యాలయంలోకి వెళ్లనీయలేదు. లోపలున్న వారిని కూడా బయటకు పంపలేదు. కార్యాలయాల సిబ్బంది సెల్‌ఫోన్లనూ స్వాధీనం చేసుకున్నారు.

25ap-main2e.jpg

రాజకీయ, వ్యాపార వర్గాల్లో వణుకు
సోదాల సమాచారం మీడియాలో ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుండడంతో పలువురు వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు క్షణమొక యుగంలా గడిపారు. దాడుల సమాచారం తెలుసుకున్న కొందరు ఇళ్ల నుంచి వెళ్లిపోవడంతోపాటు సెల్‌ఫోన్లు స్విచ్ఛాఫ్‌ చేసేశారు. ఎక్కడెక్కడ గాలిస్తున్నారన్న సమాచారాన్ని ఐటీ అధికారులు ప్రకటించకపోవడంతో ఏమాత్రం సంబంధం లేనివారి ఇళ్లలోనూ సోదాలు జరుగుతున్నాయంటూ వదంతులు ప్రచారమయ్యాయి. అక్కయ్యపాలెం, నరసింహనగర్‌, సీతమ్మధార, బాలసయ్యశాస్త్రి లేఅవుట్‌ తదితర ప్రాంతాల్లోనూ ప్రముఖుల ఇళ్లలో, సంస్థల్లోనూ అధికారులు సోదాలు చేశారని ప్రచారం సాగింది. కీర్తిప్రతిష్ఠలున్న నవయుగ ఇంజినీరింగ్‌, ఆర్వీఆర్‌ సంస్థల్లో సోదాలు చేయడంపై పారిశ్రామికవర్గాలు విస్మయం వ్యక్తం చేశాయి.

నవయుగ సంస్థల్లో
25ap-main2b.jpg
తెలుగు రాష్ట్రాల్లో భారీ నీటిపారుదల ప్రాజెక్టుల పనులు చేస్తున్న నవయుగ ఇంజినీరింగ్‌ కంపెనీ లిమిటెడ్‌(ఎన్‌ఈసీఎల్‌) కార్యాలయాల్లో సోదాలు కొనసాగాయి. ఈ కంపెనీ నిర్వహిస్తున్న నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని కృష్ణపట్నం ఓడరేవులో అధికారులు తనిఖీ చేశారు. గత ఏడాది ఈ ఓడరేవు నుంచి విదేశాలకు ఖనిజాలు, ఇతర సరకులు భారీగా ఎగుమతి అయ్యాయి. తిరుపతి నుంచి వచ్చిన ఆదాయపన్ను శాఖ సహాయ సంచాలకులతోపాటు ముగ్గురు అధికారులు ఇక్కడ పరిశీలించారు. విశాఖ ద్వారకానగర్‌లో ఉన్న నవయుగ ఇంజినీరింగ్‌ కంపెనీ లిమిటెడ్‌ కార్యాలయానికి కూడా వెళ్లి ప్రాజెక్టుల రికార్డులను తనిఖీ చేశారు. తెలంగాణలోనూ ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో ఉన్న నవయుగ కార్యాలయానికి ఉదయం ఎనిమిదింటికే 15 మందితో కూడిన బృందం చేరుకుంది. రెండు రాష్ట్రాలూ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పోలవరం, కాళేశ్వరం ప్రాజెక్టుల కాంట్రాక్టు పనులను ఈ సంస్థ దక్కించుకుంది. బ్రహ్మపుత్ర నదిపై 9.15కి.మీ. పొడవైన వంతెనను కూడా నిర్మించి దేశంలో ఒక నదిపై అత్యంత పొడవైన వంతెనను నిర్మించిన సంస్థగా గుర్తింపు పొందింది.

గత జులైలో జూబ్లీహిల్స్‌లోని నవయుగ గ్రూప్‌ కంపెనీల కార్యాలయాల్లో రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌ అధికారులు సోదాలు చేశారు. ఒకే చిరునామాతో 47 సంస్థలు పనిచేస్తున్నట్లు గుర్తించారు. ఆదాయపన్ను ఎగవేసినట్లు అనుమానిస్తున్నామని, దీనిలో భాగంగానే సోదాలు నిర్వహిస్తున్నామని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఒక అధికారి తెలిపారు. హైదరాబాద్‌లో సోదాల సందర్భంగా పలు దస్త్రాలు, కంప్యూటర్‌ హార్డ్‌డిస్కులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

చెన్నైలో కీలక పరిణామాల రోజునే వీవీ మినరల్స్‌పై..
యలలిత మరణానంతరం నిర్వహించిన ఆర్కేనగర్‌ ఉపఎన్నికల సందర్భంగా 2017 ఏప్రిల్‌లో రాష్ట్రంలో ఐటీ సోదాలు జరిగాయి. రూ.80 కోట్లను ఓటర్లకు పంచారని, వీటి పత్రాలు లభ్యమైనట్లు అధికారులు అప్పట్లో పేర్కొన్నారు. భాజపా ఆటలో భాగమే ఐటీ సోదాలన్న ఆరోపణలు అధికార పార్టీ నుంచి వచ్చాయి. దీన్ని భాజపా ఖండించింది. ఆ తర్వాత శశికళ, ఆమె కుటుంబసభ్యులకు చెందిన సంస్థల్లో భారీగా ఐటీ సోదాలు జరిగాయి. ఈ సమయంలోనూ టీటీవీ దినకరన్‌ వర్గం భాజపాను నిందించింది. ఈ ఏడాది సెప్టెంబరులో డీఎంకే అగ్రనేత అళగిరి చెన్నైలో శాంతియుత ర్యాలీ నిర్వహిస్తున్నప్పుడు అదే రోజు ఐటీ తనిఖీలు కొనసాగడాన్ని ఆయన వర్గం తప్పుబట్టింది. ఆ పార్టీ కూడా భాజపాపైనే వేలెత్తిచూపింది. తాజాగా గురువారం అత్యంత కీలకమైన అనర్హత ఎమ్మెల్యేల అంశంపై తీర్పు వచ్చింది. రాష్ట్రంతో ముడిపడిన కీలక పరిణామాలు ఉన్నప్పుడే ఐటీ సోదాలు జరుగుతుండటం విశేషం.
Link to comment
Share on other sites

గుంటూరులో ఐటీ దాడులు
29-10-2018 09:33:47
 
636764024286053208.jpg
గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. సోమవారం ఉదయం జిల్లాలో ఐటీ అధికారులు తనిఖీలు మొదలుపెట్టారు. టీడీపీ నేత, ఎల్‌వీఆర్ క్లబ్ కార్యదర్శి కోవెలమూడి రవీంద్ర ఇళ్లు, కార్యాయాల్లో ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు. తెల్లవారుజాము నుంచి సోదాలు కొనసాగుతున్నాయి. గత పదిరోజుల క్రితం జిల్లాలోని పలువురు వ్యాపారుల ఇళ్లు, వ్యాపార సంస్థలపై సోదాలు నిర్వహించిన ఐటీ అధికారులు ఇప్పుడు ఏకంగా టీడీపీ మద్దతు దారుల కార్యాలయాలపై సోదాలు చేపట్టింది. తొలుత వ్యాపార సంస్థలపై దాడులు చేసిన అధికారులు, రెండో విడతలో టీడీపీ మద్దతుదారులు, వారి వ్యాపారసంస్థలపై దృష్టిసారించినట్లు తెలుస్తోంది. సాయంత్రంలోపు మరొకొందరు టీడీపీ సానుభూతిపరులపై ఐటీ సోదాలు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Link to comment
Share on other sites

గుంటూరులో ఐటీ దాడులు
తెదేపా నేత వ్యాపారవేత్త కోవెలమూడి నాని ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు
హైదరాబాద్‌, గుంటూరుకు చెందిన మూడు బృందాల ఆధ్వర్యంలో తనిఖీలు
ఈనాడు - గుంటూరు
29ap-main6a.jpg

ప్రముఖ వ్యాపారవేత్త, గుంటూరుకు చెందిన తెదేపా నాయకుడు కోవెలమూడి రవీంద్ర (నాని) ఇల్లు, కార్యాలయాల్లో సోమవారం ఆదాయపన్ను అధికారులు సోదా లు చేశారు. నగరంలోని అశోక్‌నగర్‌ మూడో లైనులో పక్కపక్కనేఉన్న ఆయన నివాసం, కార్యాలయాలకు ఉదయాన్నే ఐటీ బృందాలు చేరుకున్నాయి. హైదరాబాద్‌, గుంటూరుకు చెందిన 22మంది అధికారులతో కూడిన మూడు బృందాలు సోదాలలో పాల్గొన్నాయి. ఆయన నివాసం, కార్యాలయాల్లో పలు కీలక రికార్డులను వారు స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు పరిసరాల్లో పెట్రోలుబంకులు, గ్యాస్‌ డీలర్‌షిప్పులు కలిగిన ఆయనకు పలువురు ప్రముఖులతో సత్సంబంధాలు ఉన్నాయి. 2014 శాసనసభ ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి తెదేపా స్థానాన్ని ఆయన ఆశించారు. నగరంలోని ప్రముఖ ఎల్వీఆర్‌ అండ్‌ సన్స్‌ క్లబ్‌కు ప్రస్తుతం ఆయన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు.

ఉదయం11 గంటల వరకు సోదాలు చేసి చివరగా ఆయనను గుంటూరులోని ఐటీ కార్యాలయానికి తీసుకెళ్లారు. మధ్యాహ్నభోజనం కోసం కొద్దిసేపు విరామమిచ్చి సాయంత్రం వరకు సుదీర్ఘంగా విచారించారు. ఐటీ కార్యాలయానికి వెళ్లే ముందు తనను కలిసిన మీడియా ప్రతినిధులతో నాని మాట్లాడుతూ.. ప్రతి రెండు, మూడేళ్లకోసారి ఐటీ అధికారులు వచ్చి పన్ను చెల్లింపు వివరాలను పరిశీలిస్తారని, ఇందులో భాగంగానే ప్రస్తుతం వచ్చారని వివరించారు. ఆయన నివాసంలో ఐటీ సోదాలను తెలుసుకుని తెదేపాకు చెందిన పలువురు ద్వితీయ శ్రేణి నాయకులు ఉదయం 10-11 గంటల ప్రాంతంలో అక్కడికి వచ్చి వెళ్లిపోయారు.

Link to comment
Share on other sites

పేరం గ్రూపు సంస్థల్లో ఐటీ సోదాలు

111437PEERAMGROUP.JPG

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో ఆదాయపన్ను శాఖ సోదాలు కొనసాగుతున్నాయి. నిన్న గుంటూరులో తెదేపా నేత ఇంట్లో తనిఖీలు చేపట్టిన ఐటీ అధికారులు మంగళవారం పేరం గ్రూపు సంస్థల్లో సోదాలు చేస్తున్నారు. విశాఖతో పాటు హైదరాబాద్‌, తిరుపతిలో తనిఖీలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లోని మంజీరా మెజిస్టిక్‌ మాల్‌లోని పేరం గ్రూపు ప్రధాన కార్యాలయంతో పాటు విశాఖ, తిరుపలోని హరిబాబు ఇల్లు, కార్యాలయాల్లో మొత్తం 9 బృందాలు సోదాలు చేస్తున్నాయి. పేరం గ్రూపునకు చెందిన జీజీఆర్‌ హౌసింగ్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌లోనూ సోదాలు జరుగుతున్నాయి. పేరం హరిబాబు చేస్తున్న వ్యాపారానికి, ప్రభుత్వానికి చెల్లించే పన్నులకు చాలా వ్యత్యాసం ఉన్నట్లు అనుమానం రావడంతోనే ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. తిరుపతికి చెందిన పేరం గ్రూపు అధినేత హరిబాబు.. గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్‌(తెదేపా)కు వియ్యంకుడు.

Link to comment
Share on other sites

  • 2 weeks later...

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...