Jump to content

IT raids


sonykongara

Recommended Posts

Guest Urban Legend

according to abn bza lo digaru anta IT officers ...repu raids planning ata on few leaders 

modi gadu malli malli idhey IT aata aadutunnadu ...chudham how TDP will counter 

Link to comment
Share on other sites

http://www.andhrajyothy.com/artical?SID=643418

 

బ్రేకింగ్: విజయవాడకు భారీగా చేరుకున్న ఐటీ బృందాలు
04-10-2018 23:31:40
 
636742928292418101.jpg
 
విజయవాడ: ఇటీవల తెలంగాణలోని పలువురు రాజకీయ ప్రముఖుల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వంతు అయ్యింది. గురువారం రాత్రి భారీగా ఐటీ బృందాలు విజయవాడకు చేరుకున్నాయి. శుక్రవారం ఉదయం దాడులకు సిద్ధంగా ఉండాలని పోలీసు అధికారులను ఐటీ బృందాలు కోరడం జరిగింది. అయితే ఈ దాడులు రాజకీయంగానే జరుగుతాయని తెలుస్తోంది.
 
 
కాగా.. శుక్రవారం ఉదయం పలువురు రాజకీయ నేతల ఇళ్లపై ఐటీ దాడులు జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే ఏ రాజకీయ నేత ఇంటిపై ఐటీ అధికారులు సోదాలు చేస్తారో అనే విషయం మాత్రం తెలియరాలేదు. భారీగా బృందాలు విజయవాడకు చేరుకోవడంతో స్థానికంగా ఉన్న నేతలు అలర్ట్ అయినట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఏకకాలంలో పలువురు రాజకీయ నేతల ఇళ్లలో ఐటీ సోదాలు జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాగా ఇందుకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Link to comment
Share on other sites

1 hour ago, ravindras said:

cbn will get sympathy before ap people and  tdp going clean sweep in 2019. 

bjp won't touch cbn directly, they ride people who can provide funding to tdp election expenses

Tdp funding batch ante pedda network, can't do anything.. 

Link to comment
Share on other sites

మంత్రి నారాయణ సంస్థలపై ఐటీ దాడులు?
జోరుగా ప్రచారం...

08165105BRK48A.JPG

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ పురపాలక శాఖ మంత్రి, నారాయణ విద్యాసంస్థల అధినేత పి.నారాయణ ఆస్తులపై ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేస్తున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. వేర్వేరు ప్రాంతాలకు చెందిన ఆదాయపు పన్ను శాఖ అధికారులు గురువారం రాత్రి విజయవాడకు చేరుకున్నారు. వారంతా శుక్రవారం వేకువజాము నుంచే వారు రాష్ట్రంలోని కొంతమంది ఇళ్లపై దాడులు చేసే అవకాశముందని వార్త హల్‌చల్‌ చేసింది. ఈ నేపథ్యంలో మంత్రి నారాయణపై సంస్థలపై ఐటీ దాడులు జరుగుతున్నట్లు సమాచారం బయటకు వచ్చింది. అయితే దీన్ని అటు ఐటీ అధికారులు గానీ.. నారాయణ ప్రతినిధులు గానీ ధ్రువీకరించడం లేదు.
 
 

ఇటీవల తెలంగాణలో ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ కార్యానిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నివాసంపై ఐటీ సోదాలు జరిగిన సంగతి విదితమే. గురువారం నెల్లూరులో తెదేపా నాయకుడు బీద మస్తాన్‌రావు కార్యాలయాల్లోనూ తనిఖీలు నిర్వహించారు. రాత్రి 7 గంటల వరకూ అధికారులు రికార్డుల పరిశీలన చేస్తూనే ఉన్నారు. చెన్నైలోని బీఎంఆర్‌ సంస్థల కార్యాలయాల్లోనూ వారు ఏకకాలంలో దాడులు నిర్వహించినట్లు తెలిసింది. ఇక్కడ ఆదాయం పన్ను అధికారులను వివరాలను అడగాలని ప్రయత్నించినా వారు లోపలికి ఎవరిని అనుమతించలేదు. సోదాలు పూర్తయిన తరువాతనే మీడియాతో మాట్లాడతామని సిబ్బంది చేత సమాచారం ఇచ్చారు. ఐటీ శాఖ దాడులపై ఇంటలిజెన్స్‌ అధికారులు వివరాలను సేకరించారు. ఈ నేపథ్యంలో నారాయణ సంస్థలపై దాడులు జరుగుతున్నట్లు వస్తున్న వార్త రాజకీయంగా కలకలం సృష్టిస్తోంది.

 
Link to comment
Share on other sites

ఏపీపై ‘ఆపరేషన్‌ ఐటీ’!
05-10-2018 03:18:49
 
636743063293631108.jpg
  • గుంటూరు, విజయవాడపై నజర్‌
  • భారీగా రంగంలోకి ఐటీ సిబ్బంది?
  • ఏ క్షణమైనా సోదాలకు సిద్ధం
  • జాబితాలో అధికార పార్టీ నేతలు?
అమరావతి, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్రలోని ప్రముఖులపై ఆదాయపు పన్ను (ఐటీ) నజర్‌ పడినట్లు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా... ‘రాజధాని’ జిల్లాలు కృష్ణా, గుంటూరులో అధికార పార్టీకి సన్నిహితంగా ఉంటున్న ప్రముఖులు, వ్యాపారవేత్తలు, కాంట్రాక్టర్లపై ఒక్కసారిగా విరుచుకుపడేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం! దీనికోసం హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై నుంచి పెద్ద సంఖ్యలో ఐటీ సిబ్బంది సమాయత్తమైనట్లు చెబుతున్నారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా సోదాలు జరిపేందుకు వీలుగా తగిన బందోబస్తు ఏర్పాటు చేయాలని స్థానిక పోలీసు యంత్రాంగాన్ని వీరు కోరినట్లు తెలిసింది. ‘‘ఒక అరగంట ముందు చెబుతాం! ఆ వెంటనే మీరు మాతోపాటు కలిసి రావాలి. బందోబస్తు కల్పించాలి’’ అని అడిగినట్లు సమాచారం! నిజానికి... అధికార పార్టీకి సన్నిహితంగా ఉండే ప్రముఖులపై ఐటీ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. నిజానికి... రెండు మూడు నెలలుగా రాజధాని జిల్లాలపై ఐటీ కన్నేసింది.
 
సోదాలకు అవసరమైన ప్రాతిపదికన సిద్ధం చేసుకుంటోంది. రాజధాని ప్రాంతంలో భూ లావాదేవీలు జరిపిన, పన్నులు కట్టలేదని భావిస్తున్న కాంట్రాక్టర్లు, వ్యాపారవేత్తలతో జాబితా రూపొందించుకుంది. ఇందులో ఒకరిద్దరు ప్రముఖ ప్రజా ప్రతినిధులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు హైదరాబాద్‌లో రేవంత్‌ రెడ్డి అంశానికి కొనసాగింపుగానే అమరావతిలో సోదాలు జరుపుతారా? లేక... దానికీ దీనికీ సంబంధం లేదా? అనే అంశంపై స్పష్టత లేదు. టీడీపీకి చుక్కలు చూపిస్తామని ఒకరిద్దరు బీజేపీ నేతలు గతంలో హెచ్చరించారు. ఎన్నికల ముందు రాజకీయ ప్రత్యర్థులపైకి ఐటీ, ఈడీ వంటి సంస్థలను ప్రయోగించడం మోదీకి అలవాటని సీఎం చంద్రబాబు తరచూ చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ‘ఆపరేషన్‌ ఐటీ’పై రాజకీయంగానూ ఉత్కంఠ రేకెత్తిస్తోంది.
Link to comment
Share on other sites

ఐటీ దాడుల్లో కొత్త కోణం...మీడియా వెంబడించడంతో..
05-10-2018 10:57:31
 
636743350396949380.jpg
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజధానిలో జరుగుతున్న ఐటీ దాడుల్లో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. మీడియా వెంబడించడం, టీడీపీ వర్గాలకు సమాచారం అందటంతో ఐటీ అధికారులు ప్లాన్ బీని అమలు చేసినట్లు తెలుస్తోంది. మొదట బెంజిసర్కిల్‌లోని నారాయణ కాలేజికి వెళ్లిన ఐటీ బృందం మీడియా వెంబడించడంతో అక్కడి నుంచి బందర్ రోడ్డులోకి వెళ్లారు. అయితే తమను వెంబడించవద్దని మధ్యాహ్నం తర్వాత తామే వివరాలు వెల్లడిస్తామని ఐటీ అధికారులు స్పష్టం చేశారు.
 
 
మరోవైపు రాజధానిలో ఐటీ దాడులు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించాయి. గురువారం రాత్రి చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ నుంచి వచ్చిన ఐటీ బృందాలు విజయవాడకు చేరుకున్నాయి. వచ్చీరాగానే గుంటూరు, విజయవాడ పోలీసు అధికారులకు ఫోన్ చేసి తమకు భద్రత కావాలని కోరాయి. తమ పార్టీ నేతల ఇళ్లపై దాడులు జరుగుతున్నాయని టీడీపీ వర్గాలు అప్రమత్తమయ్యాయి. విజయవాడలో నారాయణ కళాశాలల వద్దకు వచ్చిన ఐటీ అధికారులు ఆ తరువాత అక్కడి నుంచి వెళ్లిపోయారు. తమ కళాశాలలపై ఎటువంటి ఐటీ దాడులు జరగలేదని మంత్రి నారాయణ ప్రకటించారు. నెల్లూరులోని మంత్రి ఇంటి వద్దకు కూడా వెళ్లారని సమాచారం అందింది. అయితే ఆ సమయంలో మంత్రి నారాయణ ఇంట్లోనే ఉన్నారు. అక్కడకు ఎవరూ రాలేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 13 జిల్లాల్లోని నారాయణ విద్యాసంస్థలపై ఎక్కడా కూడా ఐటీ అధికారులు దాడులు చేయలేదని వివరించారు. గుంటూరు జిల్లా టీడీపీ నేతలపై కూడా దాడులు జరుగుతాయని ముందుగా ప్రచారం జరిగింది. విజయవాడ నుంచి కొన్ని ఐటీ బృందాలు గుంటూరు వైపునకు వెళ్లడమే ఈ ప్రచారానికి కారణం. 
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...