Jump to content

TDP to Play A Key Role in National Politics


sonykongara

Recommended Posts

లక్ష్యం.. మోదీ
భావసారూప్యంగల పార్టీలను  సంఘటితం చేద్దాం
ఆంధ్రప్రదేశ్‌ సహా వివిధ రాష్ట్రాల్లో  ఆయా పార్టీలతో కలసి సభలు
కేంద్రంలో నిర్ణయాత్మక పాత్ర
మంత్రివర్గ సహచరులతో భవిష్యత్‌  కార్యాచరణపై చర్చించిన ముఖ్యమంత్రి
ప్రధాని కావాలన్న ఆలోచన లేదని పునరుద్ఘాటన
ఈనాడు - అమరావతి
3ap-main1a.jpg

తెదేపా జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర రాజకీయాల్లో ప్రధాని నరేంద్ర మోదీ, భాజపాలకు వ్యతిరేకంగా క్రియాశీలక పాత్ర పోషించాలని నిర్ణయించారు. భావసారూప్యంగల పార్టీలన్నిటినీ ఏకతాటిపైకి తేవాలని, ఆంధ్రప్రదేశ్‌తో మొదలు పెట్టి వరుసగా ఆయా రాష్ట్రాల్లో భారీ సభలు నిర్వహించాలన్న నిర్ణయానికి వచ్చారు. ‘‘కేంద్రంలో ప్రధానమంత్రి పదవినేమీ ఆశించి కేంద్రంలో క్రియాశీలక పాత్ర పోషించేందుకు నేను సమాయత్తం కావడం లేదు. గతంలో రెండుసార్లు ప్రధాని అయ్యే అవకాశం వచ్చినా వద్దనుకున్నాను. ఇప్పుడూ నాకా ఆలోచన లేదు. రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజల భవిష్యత్తే నాకు ముఖ్యం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్రంలో భాజపా, మోదీలకు ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటు కావాలి. దేశ ప్రయోజనాల కోసం మనం కేంద్రంలో కీలక పాత్ర పోషించాలి’’ అని చంద్రబాబు మంత్రివర్గ సహచరులకు స్పష్టంచేశారు. బుధవారం ఉండవల్లిలోని ప్రజా వేదికలో జరగాల్సిన పార్టీ సమన్వయ కమిటీ సమావేశం వాయిదా పడిన తర్వాత ఆయన మంత్రివర్గ సహచరులతో సమావేశమయ్యారు. కేంద్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, తెదేపా ఎలాంటి పాత్ర పోషించాలన్న అంశంపై ప్రధానంగా చర్చ జరిగింది. చంద్రబాబు ప్రధాని కావాలంటూ మంత్రులు ఎక్కడా వ్యాఖ్యలు చేయవద్దని సీఎం స్పష్టంచేశారు. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చర్చ ప్రారంభించారు. ‘‘ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేస్తానన్న కేసీఆర్‌ ప్రయత్నాలు విఫలమయ్యాయి. కేంద్రంలో భాజపాకి వ్యతిరేకంగా ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేయగల సత్తా తెదేపాకే ఉంది. మీ నాయకత్వంపై వివిధ  పార్టీల నాయకులకు నమ్మకం ఉంది. భాజపాకి వ్యతిరేకంగా జట్టు కట్టాలనుకుంటున్న పార్టీలన్నీ ఏకతాటిపైకి రావాలంటే... మీరు జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించబోతున్నారన్న భరోసా ఇవ్వాలి. మీరు ఎలాగూ ప్రధాని రేసులో లేరు. ఆ స్పష్టత అందరిలోనూ ఉంది. కేంద్రంలో మనం పోషించబోయే పాత్ర గురించి ఒక స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది’’ అని సూచించినట్టు తెలిసింది. మిగతా మంత్రులు కూడా యనమల వ్యాఖ్యల్ని సమర్థించారు. మోదీకి సన్నిహితంగా ఉండే... భాజపాయేతర పార్టీల ముఖ్యమంత్రులు ఎవరు, మనతో కలసి వచ్చే నాయకులెవరన్న చర్చ జరిగింది. మమతాబెనర్జీ, అఖిలేష్‌ యాదవ్‌, అరవింద్‌ కేజ్రీవాల్‌ వంటి నాయకులు కలసివస్తారని, డీఎంకే కూడా అనుకూలంగా ఉందన్న చర్చ జరిగింది. ‘‘మేం ప్రధాని పదవిని కోరుకోవడం లేదు. దేశాన్ని పరిపాలించాలన్న కోరిక ఎంతమాత్రం లేదు. దేశంలో ప్రధాని ఎవరుండాలన్నది మేం నిర్ణయించాలనుకున్నాం. 2019లో తెదేపా నిర్ణయాత్మక శక్తిగా అవతరించనుంది. మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న అప్రజాస్వామిక చర్యల వల్ల దేశ ప్రజలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. తమకు నచ్చినవారికి మేలు చేసేందుకు, కొన్ని కార్పొరేట్‌ సంస్థల ప్రయోజనాల కోసం మోదీ ఎంత దూరమైనా వెళ్లి దేశ ప్రయోజనాలకు భంగం కలిగిస్తారని అర్ధమవుతోంది. దేశ రాజకీయాల్లో చంద్రబాబుకి ఉన్న అనుభవం, పరిచయాల్ని దేశానికి ఒక మంచి ప్రభుత్వం అందించేలా ఉపయోగించాలని, పాత మిత్రులు, లౌకికవాదులు, ప్రజాస్వామిక శక్తుల్ని ఒక తాటిపైకి తేవాలని నిర్ణయించాం. వివిధ పార్టీలను కూడగట్టి సభలు, సమావేశాలు నిర్వహించిన అనుభవం తెదేపాకి ఉంది. మోదీ నియంతృత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రస్తుతం రాష్ట్రంలో మేం చేస్తున్న పోరాటాన్ని జాతీయ స్థాయికి విస్తరించాలని సమావేశంలో నిర్ణయించాం’’ అని ఒక సీనియర్‌ మంత్రి వివరించారు. దేశ రాజకీయాల్లో చంద్రబాబు నిర్ణయాత్మక శక్తిగా వ్యవహరిస్తారని ఆయన పేర్కొన్నారు. ‘‘కాంగ్రెస్‌ వల్ల రాష్ట్రానికి అన్యాయం జరిగింది. కానీ ఇప్పుడు భాజపా వల్ల ఎక్కువ నష్టపోతున్నాం. కాంగ్రెస్‌ కంటే భాజపా వల్ల జరుగుతున్న నష్టమే ఎక్కువ. మనమీద దాడి చేసి మనల్ని ఇబ్బంది పెడుతున్నవారిపైనే మనం పోరాడాలి. భాజపానే మన శత్రువు’’ అన్న నిర్ణయానికి వచ్చారు.

మనల్ని తెరాసనే వద్దనుకుంది...!
తెరాస అధ్యక్షుడు కేసీఆర్‌ ప్రధాని నరేంద్ర మోదీ చెప్పినట్టుగా నడుస్తున్నారన్న చర్చ జరిగింది. తెరాసకి తెదేపా స్నేహహస్తం చాచినా కేసీఆర్‌ తోసిపుచ్చారని, దాని వెనుక మోదీ హస్తం ఉందని అభిప్రాయపడ్డారు.  ‘‘మనం తెరాసని శత్రు పార్టీగా చూడలేదు. మనమంతా కలసి ఉంటే దక్షిణాదిలో బలమైన శక్తులుగా మారడంతో పాటు, మన హక్కుల్ని సాధించుకోగలమని భావించాం. రెండు రాష్ట్రాల ప్రయోజనాల కోసం సఖ్యతగా ఉంటే బాగుంటుందన్న ప్రతిపాదన మేమే ముందుకు తెచ్చాం. తెలంగాణలో తెదేపా, తెరాస కలిస్తే రాజకీయంగా తిరుగుండదు. అలాంటి వాతావరణం ఉండాలని కోరుకున్న మమ్మల్ని కేసీఆర్‌ వద్దనుకున్నారు. భవిష్యత్తులో మోదీకి దగ్గరగా ఉండాలన్నది ఆయన భావన’’ అని ఒక మంత్రి వెల్లడించారు. భాజపా, వైకాపా, జనసేన కలసి కుట్ర పన్నుతున్నాయని, అజాగ్రత్తగా ఉంటే ఇబ్బందులు తప్పవని, తెదేపాని దెబ్బతీసేందుకే తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు వెళ్లారన్న చర్చ జరిగింది. తెలంగాణ ఏసీబీనే ఓటుకి నోటు కేసు దర్యాప్తు చేయాల్సిందిగా కేంద్రాన్ని కోరినట్టు తెలుస్తోందని సమావేశంలో ఒక మంత్రి పేర్కొన్నారు. కేంద్రం ఆదేశాల మేరకే తెలంగాణలో ఐటీ దాడులు జరుగుతున్నాయని, ఏపీలోనూ ఇదే తరహా దాడులకు అవకాశం లేకపోలేదని మరో మంత్రి అన్నారు. సీఎంతో పాటు మంత్రులనూ టార్గెట్‌ చేసేలా కేంద్రం కుట్రలు పన్నుతోందన్న ప్రచారం జరుగుతోందని మరో మంత్రి పేర్కొన్నట్టు సమాచారం. తెలంగాణలో తెరాసకి వ్యతిరేకంగా కూటమిగా ఏర్పడటాన్ని కేసీఆర్‌ జీర్ణించుకోలేకపోతున్నారన్న మరో మంత్రి వ్యాఖ్యానించారు. ఏపీలో తెదేపాకి వ్యతిరేకంగా జగన్‌-పవన్‌ను కలిపేందుకు కేసీఆర్‌ ప్రయత్నిస్తారన్న ప్రచారం తెలంగాణలో జరుగుతోందని ఆయన తెలిపారు. అన్ని రకాల కుట్రలు, కుమ్మక్కు రాజకీయాలను ఎదుర్కోవాలని చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. రాజకీయంగా ఎదురయ్యే అన్ని సవాళ్లను అధిగమించి ప్రజాబలంతో ఎన్నికలకు వెళ్దామని ఆయన తెలిపారు. ‘‘ప్రతి అంశంలోను మోదీకి వ్యతిరేకత వస్తోంది. జాతీయ స్థాయిలో మన పోరాటం మరింత ఉద్ధృతం చేయాలి. మనల్ని ఇబ్బంది పెట్టేలా వ్యవహరిస్తున్నారు. ఇకపైనా వ్యవహరిస్తారు. మంత్రులూ జాగ్రత్తగా ఉండాల్సిందే. మోదీని  ఓడించడమే మన నినాదం. పరిస్థితుల ప్రకారం ముందుకు వెళ్లాలి’’ అని చంద్రబాబు పేర్కొన్నారు. తెలంగాణలో తెదేపాని నామరూపాల్లేకుండా చేయాలని కేసీఆర్‌ భావిస్తున్నారని, కానీ అది సాధ్యం కాదని, అక్కడ తెదేపాకి బలమైన కేడర్‌ ఉందని చంద్రబాబు పేర్కొన్నట్టు సమాచారం.

వారిద్దరూ మోదీ చేతిలో కీలుబొమ్మలే..!
జగన్‌, పవన్‌లు ఇద్దరూ మోదీ చేతిలో కీలుబొమ్మలేనని, అందుకే కేంద్ర ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట అనడం లేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. వారు చేస్తున్న విమర్శలకు గట్టిగా బదులివ్వాలని మంత్రులకు సూచించారు. తెదేపాని అధికారంలోకి రానివ్వబోమని పవన్‌ కళ్యాణ్‌ చెప్పడాన్ని బట్టే ఆయన ఉద్దేశమేంటో అర్ధమవుతోందన్నారు. రెండేళ్లకొకసారి నిర్వహించే తెదేపా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వచ్చే నవంబరులో ప్రారంభించాలని నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వంపై చేస్తున్న పోరాటంలో భాగంగా ఈ నెల 20 కడపలో ధర్మపోరాట సభ నిర్వహిస్తారు. మిగిలిన జిల్లాల్లోనూ సభలు పూర్తి చేసి, చివరిదానిని కృష్ణా, గుంటూరు జిల్లాలకు కలిపి జనవరిలో భారీగా నిర్వహించాలని నిర్ణయించారు.

Link to comment
Share on other sites

మోదీ అట్టర్‌ ఫ్లాప్‌!
04-10-2018 03:38:01
 
636742210805472141.jpg
ఆయన మళ్లీ ప్రధాని అయితే తెలుగు జాతికి అవమానం
నినాదాలే తప్ప విజయాల్లేవు.. నోట్ల రద్దు, జీఎస్టీ అమలులో విఫలం
పతనావస్థలో రూపాయి విలువ.. సెంచరీ కొడుతున్న పెట్రోలు ధర
రైతుల సమస్యలు పరిష్కరించలేదు.. ఈడీ ప్రయోగంలోనే విజయం
జగన్‌, పవన్‌ ద్వారా బీజేపీ మమ్మల్ని ఫినిష్‌ చేయాలనుకుంటోంది
అన్ని శక్తులనూ ఉపయోగిస్తోంది.. ఇక వారితో తాడోపేడో తేల్చేద్దాం
బీజేపీ ఓటమే తెలుగుదేశం లక్ష్యం.. లెఫ్ట్‌, రైట్‌ అందరినీ కలుపుకెళ్దాం
జాతీయ మీడియా, మంత్రులతో సమీక్షలో చంద్రబాబు ప్రకటన
 
 
అమరావతి, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): ప్రధాని నరేంద్ర మోదీ అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యారని ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు. నోట్ల రద్దు, జీఎస్టీ, పెట్రో ధరల నియంత్రణ, రైతుల సమస్యల పరిష్కారం... ఇలా అన్నింటా ఘోరంగా విఫలమయ్యారని మండిపడ్డారు. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ దారుణంగా పడిపోయిందని... పెట్రోల్‌
ధరలు సెంచరీకి చేరువయ్యాయని తెలిపారు. సబ్సిడీలేని వంటగ్యాస్‌ ధరనూ విపరీతంగా పెంచారని అన్నారు. చంద్రబాబు బుధవారం జాతీయ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. మంత్రులతో కూడా ప్రస్తుత రాజకీయాలపై లోతుగా సమీక్షించారు. ‘‘భారీ నినాదాలు ఇవ్వడం తప్ప మోదీ చేసిందేమీ లేదు. కేంద్ర ప్రభుత్వం పాలనలో విజయవంతం కాలేదు. కానీ... రాజకీయ ప్రత్యర్థులపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌, ఇతర దర్యాప్తు సంస్థలను ప్రయోగించడంలో మాత్రం విజయం సాధించింది’’ అని చంద్రబాబు విరుచుకుపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ప్రజల విశ్వాసం కోల్పోయిందన్నారు.
 
రాజధాని ఘనత వస్తుందన్నా...
రాష్ట్ర రాజధాని అమరావతిని నిర్మిస్తే.. అది దేశంలోనే అద్బుత నగరం అవుతుందని.. ఆ ఘనత కూడా ఇద్దరికీ దక్కుతుందని మోదీకి చెప్పానని చంద్రబాబు తెలిపారు. అమరావతి కూడా దేశంలో భాగమని, దాని నిర్మాణం వల్ల కేంద్రానికీ ఆదాయం వస్తుందని తెలిపానన్నారు. ‘‘ఆయన్ను స్వయంగా కలిసి ఇవన్నీ వివరించాను. కానీ, అమరావతికి ఆయన సాయం చేయలేదు. పైగా విమర్శలు చేస్తున్నారు. రాష్ట్రంలోనూ ఇద్దరు, ముగ్గురిని అడ్డుపెట్టుకుని నాపై కుట్రలు పన్నుతున్నారు. ప్రజల సహకారంతో వీటన్నింటినీ తిప్పి కొడతాను’’ అని చంద్రబాబు తెలిపారు. రాష్ట్ర విభజన చట్టంలోని అంశాలు, ప్రత్యేక హోదా హామీని అమలు చేయలేదన్నారు. ఐదుకోట్ల మంది ఆంధ్రులకు కేంద్రం అన్యాయం చేసింద న్నారు. ‘‘వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఇచ్చిందే తక్కువ. ఆ నిధులను కూడా వెనక్కి తీసుకున్నారు.
 
రాజధాని నిర్మాణానికి కేవలం 1500 కోట్లు ఇచ్చారు. విద్యాసంస్థల కోసం రాష్ట్రం ఇచ్చిన భూమి విలువలో పదోవంతు నిధులు కూడా కేంద్రం ఇవ్వలేదు. రైల్వేజోన్‌ ఇవ్వలేదు. వీటి గురించి పార్లమెంటులో మా ఎంపీలు ప్రశ్నిస్తే... కేసీఆర్‌ను పొగిడారు. నన్ను విమర్శించారు. కేంద్రం సహకరించకపోయినా అమరావతి రాజధానిని నిర్మించి తీరుతాం. నా బాధ్యతను నేను నెరవేరుస్తా’’ అని ప్రకటించారు. రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అన్యాయం చేసినందునే కేంద్ర మంత్రివర్గం నుంచి, ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చి.. అవిశ్వాసం పెట్టామని సీఎం తెలిపారు. కేంద్రం సహకరించకున్నా నాలుగేళ్లలో వరుసగా రెండంకెల వృద్ధిరేటు సాధించామన్నారు. ఆపత్కాలంలో నవ్యాంధ్ర ప్రజల కు భరోసా ఇచ్చానని... దానికోసం నిరంతరం కష్టపడుతున్నానన్నారు. ఎన్నికల వాతావరణ వేడెక్కుతున్న నేపథ్యంలో చంద్రబాబు రాజకీయ ప్రత్యర్థులపై సమరభేరి మోగించారు. మోదీ వ్యతిరేక శక్తులన్నింటినీ కలుపుకొని కమలంపై పోరు సాగించాలని, ఇందులో ఎలాంటి శషభిషలు లేవని తేల్చిచెప్పా రు. ‘‘బీజేపీ మనల్ని ఫినిష్‌ చేయడానికి సమస్త శక్తులను ప్రయోగిస్తోంది. మనం కూడా తాడోపేడో తేల్చుకోవాల్సిందే. మోదీ మరోసారి గెలిస్తే తెలుగు ప్రజలకు తీరని అన్యాయం, అవమానమే! కర్ణాటకలో ప్రారంభించిన జైత్రయాత్ర దేశమంతా కొనసాగించేలా పూనుకోవాలి. ఆ దిశగా బీజేపీతో యుద్ధం మొదలైంది’’ అని స్పష్టం చేశారు. బీజేపీకి వ్యతిరేకం గా నిలిచే రాజకీయ శక్తులన్నింటినీ కలుపుకొని వచ్చే ఎన్నిక ల్లో మోదీని గద్దె దించాలన్నారు.
 
‘‘లెఫ్ట్‌ అయినా, రైట్‌ అయినా, కాంగ్రెస్‌ అయినా, కమ్యూనిస్టులైనా మోదీకి వ్యతిరేకంగా నిలిచేవారిని కలుపుకొని వెళ్దాం. ఆయనకు అనుకూలంగా నిలిచేవారి పని పడదాం’’ అని ఆయన అన్నారు. టీడీపీకి వ్యతిరేకం గా వివిధ శక్తులను ప్రయోగించడం, దీనికి రకరకాల మార్గాలను ఎంచుకోవడంపై అప్రమత్తంగా ఉండాలని మం త్రులకు సూచించారు. ‘‘జగన్‌, పవన్‌ రాష్ట్రమంతా తిరుగుతున్నా బీజేపీని ఒక్కమాట అనరు. మనల్నే తిడుతున్నారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన బీజేపీపై వారికి ప్రేమ. పవన్‌, జగన్‌ ఇద్దరినీ చేతిలో పెట్టుకొని బీజేపీ ఆడిస్తోంది. కేంద్రంలో బీజేపీ, ఇక్కడ ఆ పార్టీ చేతిలో ఉన్న వారు అధికారంలోకి వస్తే రాష్ట్రానికి నష్టం. ప్రజలకు అదే చెప్పాలి’’ అని స్పష్టం చేశారు.
 
కీలకపాత్రేగాని... ప్రధాని పదవి కాదు
వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో టీడీపీ కీలక పాత్ర పోషిస్తుంద ని.. అయితే, ప్రధాని పదవి తీసుకోవడం మాత్రం కాదని సీ ఎం తెలిపారు. ‘‘బీజేపీకి వ్యతిరేకంగా రాజకీయ శక్తులను కూ డగట్టడంలో కీలకపాత్ర పోషిద్దాం. కొన్ని పార్టీలు ఎన్నికల ముందు బయటకు రావచ్చు. కొన్ని ఎన్నికల తర్వాత బయటపడవచ్చు. శరద్‌పవార్‌ ఎన్నికల ముందు కలిసి రాకపోవచ్చు. నవీన్‌ పట్నాయక్‌ వంటి వారు ప్రస్తుతం బీజేపీతో సఖ్యతతో ఉన్నారు. తర్వాత ఏం చేస్తారో చూడాలి. అందరినీ సమన్వయపర్చడానికి ప్రయత్నం చేస్తా. ఎన్నికల తర్వాత దేశ ప్రధాని ఎవరో మనం నిర్ణయిద్దాం. కానీ, మనకు ప్రధాని పదవి అవస రం లేదు. నాకు ఈ రాష్ట్రమే ముఖ్యం. నేను ఇక్కడ నుంచి ఎక్కడికీ వెళ్లను’’ అని చంద్రబాబు తెలిపారు. బీజేపీ వ్యతిరేక కూటమికి కాంగ్రెస్‌ నాయకత్వం వహిస్తుందా లేక అన్ని పార్టీలతో కలిసి పనిచేస్తుందా అని మంత్రి అయ్యన్న సందేహం వ్యక్తం చేశారు. ‘‘ఇక్కడ ఎవరు ఎవరికీ నాయకత్వం వహించరు. బీజేపీని వ్యతిరేకిస్తున్న పార్టీలన్నీ కలిసి పనిచేస్తాయి. ఎన్నికల తర్వాత ప్రధాని ఎవరో నిర్ణయిస్తారు’’ అని చంద్రబాబు వివరించారు.
 
 
రాఫెల్‌పై నోరు విప్పరేం?
రాఫెల్‌పై ఇంత రాద్ధాంతం అవుతున్నా నోరు విప్పడం లేదెందుకని మోదీని చంద్రబాబు ప్రశ్నించారు. కేంద్రం సూచన ప్రకారమే భారత్‌లో భాగస్వామ్య కాంట్రాక్టును అనిల్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ డిఫెన్స్‌కు కట్టబెట్టినట్లు ఈ ఒప్పందం జరిగినప్పుడు ఫ్రాన్స్‌ అధ్యక్షుడిగా ఉన్న హోలాన్‌ కూడా చెప్పారని గుర్తు చేశారు. ఈ తర్వాత కూడా...మోదీ నోరు విప్పి మాట్లాడలేదన్నారు.
 
అలిపిరిలో చేసిన వారే అరకులో!
అలిపిరిలో తనపై దాడి చేసిన నక్సల్సే అరకులో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేపై దాడి చేసి పొట్టన బెట్టుకొన్నారని సీఎం అన్నట్లు సమాచారం. గిరిజనుల మధ్య ఉన్న తెగల విభేదాలు కొంత ప్రభావం చూపినట్లు కనిపిస్తోందని, పూర్తి సమాచారం రావాల్సి ఉందని ఆయన అన్నారు. రోడ్డు ప్రమాదాలు పార్టీ ముఖ్యులను బలి తీసుకొంటున్నాయని, వాటిపై జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. తదుపరి ధర్మ పోరాట దీక్ష సభ ఈనెల 20న కడపలో, డిసెంబరులో అనంతపురంలో నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సభల్లో చివరిది జనవరిలో అమరావతిలో జరుపుతారు. పార్టీ సభ్యత్వ నమోదు నవంబరులో ప్రారంభించాలని నిర్ణయించారు. పార్టీ సభ్యులకు బీమా ప్రీమియం చెల్లింపులు వచ్చే ఏడాది సంబంధిత కంపెనీలకు జరపాల్సి ఉందని, అందుకే ఈ కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించామని పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి లోకేశ్‌ తెలిపారు.
 
కాంగ్రెస్‌ రాష్ట్రానికి అన్యాయం చేసింది. అందుకు, గత ఎన్నికల్లో శిక్ష అనుభవించింది. కానీ.. బీజేపీ మనల్ని నమ్మించి మోసం చేసింది. అది చాలక ప్రతి రోజూ కత్తిదూసి మనపై పడుతోంది. ఇంకా కాంగ్రెస్‌ గురించే ఆలోచిస్తూ కూర్చుందామా లేక బీజేపీపై పోరాడదామా?
 
మోదీ ఇరవై ఏళ్లు ప్రధానిగా ఉంటారని... ఆయన వల్ల దేశం లాభపడుతుందని
ఆశించాను. కానీ, ఆయన దానికి భిన్నంగా ఫ్యాక్షనిస్టులాగా వ్యవహరించారు.
టీడీపీని మళ్లీ అధికారంలోకి రానివ్వబోమని పవన్‌ అంటున్నారు. తాను కూడా సీఎం కాబోనని చెబుతున్నారు. మరి... జగన్‌ను సీఎం చేస్తారా? - చంద్రబాబు
Link to comment
Share on other sites

కొత్త పొత్తులు తప్పవు
07-10-2018 02:14:03
 
636744941911112278.jpg
  • నమ్మిన బీజేపీ ద్రోహం చేసింది
  • కేసీఆర్‌ కలిసి రాలేదు.. వైసీపీ అడుగడుగునా అడ్డుపడుతోంది
  • బీజేపీ, జగన్‌ లాలూచీ రాజకీయాలు
  • ఐటీ దాడులతో భయోత్పాత యత్నం
  • అనేక సంక్షోభాలను చూశా
  • అవే అవకాశాలు కల్పిస్తాయి
  • బీజేపీయేతర సహకారం తప్పదు
  • జాతీయస్థాయిలో మద్దతు కావాలి
  • ఈ ఐదారు నెలల్లో దేశవ్యాప్త పోరు
  • టీడీపీ ఎంపీలతో సీఎం చంద్రబాబు
నమ్మిన బీజేపీ ద్రోహం చేసింది. స్నేహహస్తం అందించినా కేసీఆర్‌ కలిసిరాలేదు. వైసీపీ అడుగడుగునా అభివృద్ధికి మోకాలడ్డుతోంది. జాతీయ స్థాయిలో మన ముందున్న ప్రత్యామ్నాయం ఏమిటి? కొత్త పొత్తులు మినహా మార్గాంతరం లేదు. జాతీయస్థాయిలో మనకు మద్దతు కావాలి. బీజేపీయేతర పార్టీల తోడ్పాటు తీసుకోవాలి. భావసారూప్య పార్టీలతో కలిసి పనిచేయాలి. 36 ఏళ్లుగా టీడీపీ ఇదే రాజకీయ విధానంతో పనిచేస్తోంది.
- చంద్రబాబు
 
అమరావతి, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): ‘‘బీజేపీ మనపై ఒంటి కాలిపై లేస్తోంది. ఈ పరిస్థితుల్లో బీజేపీయేతర పార్టీల సహకారం తీసుకోక తప్పదు. అదే డెమోక్రటిక్‌ కంపల్షన్‌ (ప్రజాస్వామ్య అనివార్యత). దీనివల్లనే రాజకీయ పొత్తులు’’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ‘గతంలో నేషనల్‌ ఫ్రంట్‌ అయినా అదే. తర్వాత యునైటెడ్‌ ఫ్రంట్‌ అయినా అంతే. యూపీఏలోనూ, ఎన్డీయేలోనూ అంతే. భావసారూప్య పార్టీలతో కలిసి పనిచేయాలి. 36 ఏళ్లుగా టీడీపీ ఇదే రాజకీయ విధానంతో పనిచేస్తోంది’ అని స్పష్టం చేశారు. ఉండవల్లిలోని ప్రజావేదికలో తెలుగుదేశం పార్టీ ఎంపీలతో సీఎం శనివారం భేటీ అయ్యారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌, జాతీయస్థాయిలో, తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరిణామాలపై చర్చించారు. ‘నమ్మిన బీజేపీ ద్రోహం చేసింది. స్నేహహస్తం అందించినా.. కేసీఆర్‌ కలిసిరాలేదు. ప్రతిపక్ష వైసీపీ అడుగడుగునా అభివృద్ధికి మోకాలొడ్డుతుంది. ఈ పరిస్థితుల్లో ఏంచేయాలి? జాతీయస్థాయిలో మనముందున్న ప్రత్యామ్నాయం ఏమిటి? కొత్త పొత్తులు మినహా మార్గాంతరం లేదు. ఏపీకి బీజేపీ చేసిన అన్యాయాన్ని ఎదుర్కోవాలి’ అని పేర్కొన్నారు. ఈ సమావేశంలో చంద్రబాబు ఇంకేమన్నారంటే..
 
దొంగ సర్వేలు
ఏపీలో బీజేపీ, వైసీపీ రహస్య పొత్తుపై మీడియాలో కథనాలు వస్తున్నాయి. గుంటూరు కన్నా లక్ష్మీనారాయణకు లాభం చేసేందుకే అప్పిరెడ్డిని తప్పించారు. బీజేపీకి 10, 15 సీట్లు వదులుకునేందుకు జగన్మోహన్‌రెడ్డి సిద్ధంగా ఉన్నాడని మీడియాలో వస్తోంది. వీటన్నింటి గురించి ప్రజల్లోకి తీసుకెళ్లాలి. నియోజకవర్గాల్లో అన్నివర్గాల ప్రజలతో ఇప్పటి నుంచే సత్సంబంధాలు పెంచుకోవాలి. దొంగ సర్వేలతో నైతిక స్థైర్యం దెబ్బతీయాలని బీజేపీ, వైసీపీ చూస్తున్నాయి. లాలూచీ రాజకీయాలు చేస్తున్నాయి. వారి కుట్రలు నెరవేరవు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఇందులో ఆందోళన పడాల్సిన పనిలేదు. మనపట్ల, ప్రభుత్వంపట్ల ప్రజల్లో పూర్తి సంతృప్తి ఉంది. ప్రజలు మనతో ఉన్నారు. ప్రజలే మన హైకమాండ్‌. మీ పని మీరు చేయండి. ప్రజలే అంతిమ తీర్పు ఇస్తారు.
 
అప్పుడే అంకురార్పణ
పునర్విభజన చట్టం అమలు చేయలేదు. ప్రత్యేక హోదా ఇవ్వలేదు. ప్రజలందరిలో బీజేపీపై తీవ్ర వ్యతిరేకత ఉంది. తెలంగాణలో పొత్తులేదని బీజేపీనే ఏకపక్షంగా ప్రకటించింది. టీడీపీని బలహీనపరిచే కుట్రకు అప్పుడే అంకురార్పణ జరిగింది. జగన్‌తో ఇక్కడ, కేసీఆర్‌తో అక్కడ బీజేపీకి రహస్య ఒప్పందం అప్పుడే కుదిరింది. భాగస్వామ్య పార్టీలలో సమర్థమైన నాయకత్వాన్ని బలహీనపరిచే కుట్ర చేశారు. శివసేన, అకాలీదళ్‌, తెలుగుదేశం ఇలా అన్ని పార్టీలనూ బలహీనపరిచే కుతంత్రాలు పన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చంద్రబాబు, వెంకయ్యనాయుడు ఉన్నారు. గుజరాత్‌కు ఎవరు ఉన్నారు? అని కేంద్ర కేబినెట్‌లో ప్రధాని నరేంద్ర మోదీ అన్నమాటలు ఆయన నైజానికి నిదర్శనం. గుజరాత్‌కు ఏపీ ఎక్కడ పోటీ అవుతుందో అనే భయం ఆయనలో ఉందని ఆ మాటలే బయటపెట్టాయి.
 
బీజేపీ ఇమేజ్‌ పడిపోయింది
ఐటీ దాడులు రాజకీయ కోణంలో జరిగినట్లుగానే ప్రజలు భావిస్తున్నారు. దాడులతో భయోత్పాతం సృష్టించడం సరికాదు. కర్ణాటక, తమిళనాడు, తెలంగాణలో ఈ తరహాలోనే దాడులు చేస్తున్నారు. రేవంత్‌ అంశంతో మనకు ముడిపెట్టాలని కట్రపన్నారు. బీజేపీ ఇమేజ్‌ దేశవ్యాప్తంగా బాగా పడిపోయింది. పెద్దనోట్లరద్దు అట్టర్‌ఫ్లాప్‌ అయింది. నెగిటివ్‌ గ్రోత్‌కు దారితీసింది. బ్యాంకులపై ప్రజల్లో విశ్వాసాన్ని దెబ్బతీశారు. ఎన్‌పీఏలు ఆరేడు రెట్లు పెరిగిపోయాయి. బీజేపీ నాయకులెవరికీ ఆర్థికరంగంపై సరైన అవగాహన లేదు. తాత్కాలిక లాభాల కోసం కక్కుర్తిపడుతున్నారు.
 
ఏపీకి తీరని అన్యాయం
రాఫెల్‌ కుంభకోణంపై ఏ విధంగా స్పందించాలో.. బోఫార్స్‌ స్కాం నాటి పరిస్థితుల్ని గుర్తు తెచ్చుకోవాలి. నాడు 105 మంది ఎంపీలు మూకుమ్మడి రాజీనామాలు చేశారు. రాష్ట్రపతిని కలిసి వినతిపత్రం అందించారు. అప్పటి ప్రభుత్వంపై చర్యలు తీసుకోకపోతే అన్ని రాష్ట్రాల ఎమ్మెల్యేలూ ఢిల్లీకి వచ్చి ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ ఐదారు నెలల్లో జాతీయస్థాయిలో ఎంపీల పోరాటం ఎలా ఉండాలి? శీతాకాలపు సమావేశాల్లోపు పోరాట వ్యూహంపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి. ఆంధ్రప్రదేశ్‌కు అన్నివిధాలా నష్టం చేశారు. తెలుగుజాతికి తీరని అన్యాయం జరిగింది. పోరాడి మనకు న్యాయం చేయించాలి. మనకు చట్టపరంగా రావాల్సినవి కక్షతో ఆపేశారు. హామీలను అటకెక్కించి దాడులకు దిగారు. ఇక్కడి పారిశ్రామికవేత్తలలో భయాందోళనలు సృష్టిస్తున్నారు. పెట్టుబడులు రాకుండా దాడుల రూపంలో భయోత్పాతం సృష్టిస్తున్నారు.
 
ఇక దేశవ్యాప్త పోరాటం..
సంక్షోభంలోనే సమర్థ నాయకత్వం బయటకు వస్తుంది. సంక్షోభాన్ని సమర్థతతోనే ఎదుర్కోగలం. పిరికివాళ్లు సంక్షోభాల్లో మునిగిపోతారు. నా జీవితంలో ఒకటి, రెండు కాదు అనేక సంక్షోభాలు చూశాను. సంక్షోభాలే అనేక అవకాశాలను కల్పిస్తాయి. ధర్మపోరాట సదస్సులు ఇప్పటి వరకు 7 పూర్తి చేశాం. ఇంకా 5 సభలు నిర్వహించాలి. వీటిని ఒకవైపు నిర్వహిస్తూనే మరోవైపు దేశవ్యాప్తంగా పోరాట పంథా చేపట్టాలి. పెట్రోల్‌, డీజిల్‌ ధరల నియంత్రణలో బీజే పీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. రూపాయి ధరను దారుణంగా పతనం చేశారు. ఇంకా ఐదారు నెలలు మాత్రమే ఉంది. జాతీయస్థాయిలో ప్రత్యామ్నాయ కూటమి నిర్మించాలి. దేశవ్యాప్తంగా సదస్సులు నిర్వహించాలి. కేంద్ర, రాష్ట్ర సంబంధాలు, రైతు సమస్యలపై జాతీయస్థాయిలో చర్చించాలి.
Link to comment
Share on other sites

కేసీఆర్‌ను నమ్మడమా: చంద్రబాబు
07-10-2018 02:34:47
 
636744944654924402.jpg
  • బీజేపీ చేతిలో ఇరుక్కుని మనకు షరతులా?
  • కలుద్దామంటే వారం ఆగి నో చెప్పారు
  • పైగా కాంగ్రెస్‌తో కలవొద్దని కోరారు
  • నమ్మలేకే మన దారిలో మనం వెళ్లాం
  • నా కింద పనిచేసినా గౌరవం తగ్గించలేదు
  • కేసీఆర్‌ భాషను ప్రజలు సమర్థించరు: బాబు
అమరావతి, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఒంటరిగా పోటీ చేయాలని.. కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేయవద్దని తెలంగాణ సీఎం కేసీఆర్‌ తనను కోరారని టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. టీఆర్‌ఎస్‌ పార్టీతో జరిగిన చర్చల ప్రక్రియ వివరాలను శనివారం ఇక్కడ టీడీపీ ఎంపీల సమావేశంలో చంద్రబాబు వివరించారు. ‘తెలుగు రాష్ట్రాల్లోని రెండు ప్రాంతీయ పార్టీలు కలిసి ఉంటే దక్షిణాదిలో ఆధిక్యం చూపవచ్చునని, ఢిల్లీలో కూడా తెలుగువారి ప్రాభవానికి ఉపయోగపడుతుందని నేను సూచించాను. ముందు సానుకూలంగానే స్పందించారు. ఆలోచించి చెబుతానన్నారు. కానీ, వారం తర్వాత కలవలేనని చెప్పారు. ఆయనను మరెవరో ప్రభావితం చేస్తున్నారని అప్పుడే అర్ధమైంది. ఆ సమయంలోనే మనకు మరో షరతు పెట్టారు. టీడీపీ పోటీ చేయాలనుకొంటే ఒంటరిగా చేయాలని, కాంగ్రెస్‌తో కలవొద్దని కోరారు. ఆయన బీజేపీ చేతిలో ఇరుక్కొని మనకు షరతులు పెడితే ఎలా? ఆయన దూరంగా ఉంటున్నప్పుడు మన నిర్ణయం మనం తీసుకొంటాం.
 
తెలంగాణలో తాము చెప్పినట్లు టీడీపీ వింటే ఆంధ్రా రాజకీయాల్లో వేలు పెట్టనని కేసీఆర్‌ మరో మాట అన్నారు. ఆయన మాట ఎవరు నమ్మాలి? ఈ ఎన్నికలు గడిచిన తర్వాత ఆయన ఎలా వ్యవహరిస్తారో ఎవరైనా చెప్పగలరా? అందుకే అక్కడ మన పార్టీ నిలబడటానికి ఏ వ్యూహం అవసరమో ఆ వ్యూహంలో వెళ్లాం. మనమేమీ నేరుగా కాంగ్రె్‌సతో కలవలేదు. మనవాళ్లు కోదండరాంతో, సీపీఐతో చర్చలు జరిపారు. తర్వాత కాంగ్రెస్‌ వచ్చింది. అందరూ కలిసి మహా కూటమిగా ఏర్పడ్డారు’ అని చంద్రబాబు వివరించారు. ‘ఇక్కడ జగన్‌, అక్కడ టీఆర్‌ఎస్‌ వస్తుందని 2014 ఎన్నికల ముందే కేసీఆర్‌ చెప్పాడు. ఏపీలో జగన్‌ వస్తే అతని ముందు తానే సమర్థుడిగా చలామణి కావొచ్చని ఆశించాడు. కానీ ఏపీ ప్రజలు కేసీఆర్‌ ఆశల్ని తారుమారు చేశారు’ అని అన్నారు.
 
కేసీఆర్‌ భాషపై చర్చ
చంద్రబాబును ఉద్దేశించి కేసీఆర్‌ చేస్తున్న విమర్శలు, వాడుతున్న భాష ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. చేసిన అభివృద్ధిని చెప్పుకొని ప్రజల వద్ద ఓట్లు పొందగలిగే పరిస్థితిలో కేసీఆర్‌ లేరని, అందుకే ఆంధ్రులను, చంద్రబాబును తిట్టి మరోసారి తెలంగాణ ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొడితే తప్ప గెలవలేనన్న అభిప్రాయంతో ఈ పని చేస్తున్నారని టీడీపీ ఎంపీలు పేర్కొన్నారు. ‘ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉండగా మెదక్‌ జిల్లా రాజకీయాల్లో కరణం రామచంద్రరావుకు ప్రాధాన్యం ఇచ్చేవారు. కేసీఆర్‌ను పట్టించుకొనే వారు కాదు. నేను కేసీఆర్‌కు ప్రాధాన్యం ఇచ్చి ముందుకు తెచ్చాను. నా కేబినెట్‌లో మంత్రిగా అవకాశం ఇచ్చాను. ఆయన నా కింద పనిచేశారు. అయినా నేను ఎప్పుడూ కేసీఆర్‌ను ఆ దృష్టితో చూడలేదు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనకు ఇవ్వాల్సిన గౌరవం ఎప్పుడూ ఇచ్చాను. ఆయనను నా సహచరుడిగా (కొలీగ్‌)గా సంబోధించేవాడిని తప్ప తక్కువగా చూడలేదు. కేసీఆర్‌ ఎలా ఉన్నా... ఎలా మాట్లాడినా నా హుందాతనం నేను నిలుపుకొన్నాను. ఆయన మాట్లాడే భాషను ప్రజలు సమర్ధిస్తారని నేను అనుకోను’ అని చంద్రబాబు అన్నారు.
 
షెడ్యూల్‌పై కేంద్రం ప్రభావం!
ఎన్నికల షెడ్యూల్‌ విడుదలలో కేంద్ర ప్రభుత్వ ప్రభావం కొంత ఉందన్న అభిప్రాయం ఈ సమావేశంలో వ్యక్తమైంది. బీజేపీ పరిస్థితి బాగోలేదనే ఎలక్షన్‌ షెడ్యూల్‌లో రాజస్థాన్‌ ఎన్నికను చివరకు తెచ్చారని, దీనివల్ల ఆ ఎన్నిక ప్రభావం మిగిలిన రాష్ట్రాలపై పడకుండా చూసుకోగలిగారని ఎంపీలు అన్నారు. తెలంగాణలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ఇంకా పూర్తి కాక ముందే షెడ్యూల్‌ విడుదల కావడంపై ఈ సమావేశంలో కొంత ఆశ్చర్యం వ్యక్తమైంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కావడం వల్ల ఇక ఏపీ ఎన్నికలు ముందు వస్తాయన్న ఊహాగానాలకు తెర పడిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ‘తెలంగాణ ఎన్నికలు ఆపి లోక్‌సభ ఎన్నికలు ముందుకు తెస్తారని కొంత ప్రచారం జరిగింది. అది జరిగితే ఏపీ ఎన్నికలు కూడా ముందుకు వచ్చేవి. ఇక ఇప్పుడు ఆ అవకాశం లేదు. షెడ్యూల్‌ ప్రకారం ఏప్రిల్‌, మే నెలల్లోనే ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు జరుగుతాయి’ అని ఆయన పేర్కొన్నారు
Link to comment
Share on other sites

కొత్త పొత్తులు తప్పవ్‌!
ప్రత్యామ్నాయ కూటమి నిర్మిద్దాం
భాజపాయేతర పార్టీల మద్దతు తీసుకుందాం
తెలంగాణలో తెదేపా, తెరాస కలసి పోటీ చేద్దామన్నా.. కేసీఆర్‌ వినలేదు
తెదేపా ఎంపీలతో చంద్రబాబు వ్యాఖ్యలు
6main6a.jpg
ఈనాడు అమరావతి: రాష్ట్రానికి భాజపా చేసిన అన్యాయాన్ని ఎదుర్కోవాలంటే జాతీయ స్థాయిలో భావసారూప్య పార్టీల మద్దతు తీసుకోవాల్సిందేనని తెదేపా జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడ్డారు. దాన్ని ప్రజాస్వామ్య అనివార్యతగా అభివర్ణించారు. తెదేపా ఏర్పాటు చేసుకుంటున్న రాజకీయ పొత్తులన్నీ దానిలో భాగమేనన్నారు. విభజన చట్టంలోని అంశాలు, రాష్ట్ర ప్రయోజనాల సాధన కోసం పోరాడుతూనే, జాతీయ స్థాయిలో సమస్యలపైనా తెదేపా ఉద్యమిస్తుందని ప్రకటించారు. ‘మనం భాజపాయేతర పార్టీల సహకారం తీసుకోవాలి. భావసారూప్య పార్టీలతో కలసి పనిచేయాలి. 36 ఏళ్లుగా తెదేపా రాజకీయ విధానమదే. మనముందున్న ప్రత్యామ్నాయాలు రెండే. కాంగ్రెస్‌పై వ్యతిరేకంగా ఉండటమా? భాజపాకు వ్యతిరేకంగా పనిచేయడమా? భాజపా మనపైకి ఒంటికాలిపై వస్తోంది. ఈ నేపథ్యంలో భాజపాయేతర పార్టీల సహకారం తీసుకోక తప్పని పరిస్థితి మనది. గతంలో నేషనల్‌ ఫ్రంట్‌ అయినా, యునైటెడ్‌ ఫ్రంట్‌ అయినా.. ఆ తర్వాత యూపీయే, ఎన్డీయే అయినా ప్రజాస్వామ్య అనివార్యతల వల్ల ఏర్పడినవే’ అని గుర్తుచేశారు. చంద్రబాబు అధ్యక్షతన శనివారం ఉండవల్లిలోని ప్రజావేదికలో తెదేపా పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. కేంద్రంపై పోరాట కార్యాచరణ, దేశ రాజకీయాల్లో తెదేపా పోషించాల్సిన పాత్ర తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. చారిత్రక కారణాల వల్లే తెలంగాణలో కలసి వచ్చే పార్టీలతో పొత్తు పెట్టుకున్నామని, తెలుగువారు ఎక్కడున్నా బాగుండాలన్నదే తెదేపా లక్ష్యమని, ఎన్టీఆర్‌ తెదేపా స్థాపించిందే అందుకోసమని చంద్రబాబు పేర్కొన్నారు. ‘మనం నమ్మిన భాజపా ద్రోహం చేసింది. స్నేహహస్తం అందించినా కేసీఆర్‌ కలసి రాలేదు. వైకాపా అడుగడుగునా అభివృద్ధికి అడ్డు తగులుతోంది. ఈ పరిస్థితుల్లో మనం ఏం చేయాలి? జాతీయ స్థాయిలో మన ముందున్న ప్రత్యామ్నాయం ఏమిటి? కొత్త పొత్తులు మినహా మనకు మార్గాంతరం లేదు’ అని తెలిపారు.

దేశవ్యాప్తంగా సభలు
‘ధర్మపోరాట సభలు ఏడు పూర్తి చేశాం. ఇంకా ఐదు నిర్వహించాలి. వీటిని నిర్వహిస్తూనే మరోపక్క దేశవ్యాప్తంగా పోరాటం చేపట్టాలి. పెట్రో ధరల నియంత్రణలో కేంద్రం విఫలమైంది. రూపాయి విలువ ఘోరంగా పతనమైంది. వీటిపై పోరాడుతూ జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ కూటమి నిర్మించాలి. కేంద్ర, రాష్ట్ర సంబంధాలు-సర్కారియా కమిషన్‌ సిఫార్సుల అమలుపైన, రైతు సమస్యల పరిష్కారంపైన..ఇలా  రెండు జాతీయ స్థాయి సదస్సులు నిర్వహిద్దాం’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

భాగస్వామ్య పక్షాలను బలహీనపరిచే కుట్ర
‘తెలంగాణలో తెదేపాతో పొత్తు లేదని భాజపానే ఏకపక్షంగా ప్రకటించింది. తెదేపాను బలహీనపరిచే కుట్రకు అప్పుడే అంకురార్పణ జరిగింది. జగన్‌తో ఇక్కడ, కేసీఆర్‌తో అక్కడ అప్పుడే రహస్య ఒప్పందం కుదిరింది. భాగస్వామ్య పార్టీలలో సమర్థ నాయకత్వాన్ని బలహీనపరిచేందుకు భాజపా కుట్ర చేసింది. శివసేన, అకాలీదళ్‌, తెలుగుదేశం..ఇలా అన్ని పార్టీలను బలహీనపరచడం వాళ్ల లక్ష్యం. రేవంత్‌ అంశంతో మనకు ముడిపెట్టాలని కుట్ర పన్నారు’ అని చంద్రబాబు మండిపడ్డారు.

కాంగ్రెస్‌తో కలవొద్దని కేసీఆర్‌ చెప్పారు
తెలంగాణలో తెదేపా, తెరాసలు కలసి పోటీ చేస్తే దక్షిణ భారతంలో తెలుగు రాష్ట్రాలదే పైచేయి అవుతుందని చెప్పినా కేసీఆర్‌ వినలేదని చంద్రబాబు అన్నారు. ‘పొత్తు విషయాన్ని ప్రస్తావించగా ఆలోచించి చెబుతానని చెప్పి..వారం తర్వాత కుదరదని చెప్పారు. పైగా తెలంగాణలో తెదేపా ఒంటరిగానే చేయాలి తప్ప, కాంగ్రెస్‌తో పొత్తు వద్దని సలహా ఇచ్చారు’ అని చంద్రబాబు పేర్కొన్నారు. ‘మనిద్దరం కలుద్దాం. కాంగ్రెస్‌ ఉంటే కర్ణాటకలో ఉంటుంది. తమిళనాడులో కాంగ్రెస్‌, భాజపాలకు చోటు లేదు. దక్షిణ భారతంలో మనదే పైచేయి అవుతుందని చెప్పినా కేసీఆర్‌ వినలేదు. అప్పటికే ఆయన వేరేవాళ్ల చేతుల్లోకి వెళ్లాడని అర్థమైంది. ఇక్కడ జగన్‌, అక్కడ తాను గెలుస్తానని 2014 ఎన్నికలకు ముందే కేసీఆర్‌ చెప్పాడు. ఏపీలో జగన్‌ వస్తే అతని ముందు తానే సమర్థుడిగా చలామణి కావొచ్చని ఆశించారు. ఏపీ ప్రజలు కేసీఆర్‌ ఆశల్ని తారుమారు చేశారు’ అని చంద్రబాబు అన్నారు.

రాష్ట్రంలో ఒంటరిగానే పోటీ
ఈనాడు డిజిటల్‌, అమరావతి: తెలంగాణలో మహాకూటమిలో భాగంగా కాంగ్రెస్‌తో కలసి పోటీ చేసినా, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ సహా ఏ పార్టీతోనూ తెదేపాకు పొత్తు ఉండబోదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. తెదేపాపా సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నరేంద్రమోదీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే తెదేపా లక్ష్యమని, ఐదు రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికలనుంచే ఆ దిశగా పనిచేయాలని నిర్ణయించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల సమయానికే మమతా బెనర్జీ, అఖిలేష్‌ యాదవ్‌, అరవింద్‌ కేజ్రీవాల్‌, మాయావతి వంటివారిని ఒక తాటిపైకి తెచ్చి డీఎంకే వంటి పార్టీలతోనూ కలిపి ప్రత్యామ్నాయ వేదికను సిద్ధం చేయాలని, అవసరమైతే చంద్రబాబు ఆయా నాయకులతో కలిసి ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో భాజపాకు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించాలన్న నిర్ణయానికి వచ్చారు. మనమేదో కాంగ్రెస్‌తో చేతులు కలుపుతున్నామన్న భావన ప్రజల్లో కలిగించడం మంచిది కాదని, తెలంగాణలో మహాకూటమిలో కాంగ్రెస్‌ కూడా భాగస్వామే తప్ప నేరుగా ఆ పార్టీతో చేతులు కలపలేదని, ఈ విషయంలో ఎంపీలంతా స్పష్టతతో ఉండాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

 
 

ముఖ్యాంశాలు

 
Link to comment
Share on other sites

రాష్ట్రంలో ఒంటరిగానే పోటీ
మోదీని గద్దె దించడమే లక్ష్యం
ఐదు రాష్ట్రాల ఎన్నికలతోనే భాజపా పతనం మొదలవ్వాలి
భావసారూప్యంగల పార్టీలతో విస్తృత వేదిక
ఐటీ దాడులపై సీబీడీటీకి ఫిర్యాదు
తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశంలో నిర్ణయాలు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: తెలంగాణలో మహాకూటమిలో భాగంగా కాంగ్రెస్‌తో కలసి పోటీ చేసినా, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ సహా ఏ పార్టీతోనూ తెదేపాకు పొత్తు ఉండబోదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఆయన అధ్యక్షతన శనివారం ఉండవల్లిలోని ప్రజావేదికలో జరిగిన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ(తెదేపాపా) సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నరేంద్రమోదీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే తెదేపా లక్ష్యమని, ఐదు రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికలనుంచే ఆ దిశగా పనిచేయాలని నిర్ణయించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల సమయానికే మమతా బెనర్జీ, అఖిలేష్‌ యాదవ్‌, అరవింద్‌ కేజ్రీవాల్‌, మాయావతి వంటివారిని ఒక తాటిపైకి తెచ్చి డీఎంకే వంటి పార్టీలతోనూ కలిపి ప్రత్యామ్నాయ వేదికను సిద్ధం చేయాలని నిర్ణయించారు. అవసరమైతే చంద్రబాబు ఆయా నాయకులతో కలిసి ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో భాజపాకు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించాలన్న నిర్ణయానికి వచ్చారు. ఒక పక్క విభజన చట్టంలోని హామీలు, రాష్ట్రానికి రావలసిన ప్రయోజనాల కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచుతూనే, మరోవైపు కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేలా జాతీయ స్థాయిలో పోరాడాలన్న నిర్ణయానికి వచ్చారు. మనమేదో కాంగ్రెస్‌తో చేతులు కలుపుతున్నామన్న భావన ప్రజల్లో కలిగించడం మంచిది కాదని, తెలంగాణలో మహాకూటమిలో కాంగ్రెస్‌ కూడా భాగస్వామే తప్ప నేరుగా ఆ పార్టీతో చేతులు కలపలేదని, ఈ విషయంలో ఎంపీలంతా స్పష్టతతో ఉండాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. సమావేశంలో తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాలను కేంద్ర మాజీ మంత్రి సుజనాచౌదరి, ఇతర ఎంపీలు మీడియా ప్రతినిధులకు వివరించారు.
* విభజన చట్టంలోని హామీల అమలుకు ఎంపీలంతా వచ్చే వారం నుంచి దిల్లీలో ఆయా శాఖల మంత్రులను కలసి ఒత్తిడి తెస్తారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి వంటి రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవారిని కలసి వినతులిస్తారు. వచ్చే వారంనుంచే ఈ ప్రక్రియ ప్రారంభిస్తారు.
* జాతీయస్థాయిలో భావసారూప్యం ఉన్న పార్టీల కూటమి ఏర్పాటులో భాగంగా తృణమూల్‌ నేత, పశ్చిమబెంగాల్‌ సీఎం మమతాబెనర్జీ దిల్లీలో నిర్వహించనున్న సభకు తెదేపా హాజరయ్యే అవకాశం ఉంది.
* తాజా ఐటీ దాడులపై కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ)కు ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు.
* విద్యుత్‌ రంగాన్ని చేతుల్లోకి తీసుకునేందుకు వీలుగా బిల్లు ప్రవేశపెట్టేందుకు కేంద్రం ప్రయత్నాల్ని అడ్డుకోవాలి.
* రాజస్థాన్‌లో భాజపాకు తీవ్రమైన ప్రతికూల పవనాలు వీస్తున్నాయి. ఇది తెలిసే ఆ రాష్ట్రానికి చివర్లో పోలింగ్‌ జరిగేలా తేదీలు నిర్ణయించారని తెదేపాపా అభిప్రాయపడింది.


అది... మైక్‌ ఇన్‌ ఇండియా..!
‘కేంద్రంలోని భాజపా సర్కారు రాజ్యాంగబద్ధంగా పాలించడం లేదు. రాష్ట్రాల ఎన్నికలను ఇష్టానుసారంగా నిర్వహించుకుంటోంది. మేకిన్‌ ఇండియా.. మైక్‌ ఇన్‌ ఇండియాగా మారిందని ప్రపంచమంతా అంటోంది. దేశం ఐసీయూలోకి వెళ్తోంది. రాష్ట్ర హక్కుల కోసం మరోసారి పోరాడాలని నిర్ణయించాం. ఐదు రాష్ట్రాల శాసనసభల ఎన్నికల దృష్ట్యా శీతాకాల సమావేశాలను డిసెంబరులో కొద్ది రోజులు పెట్టి మమ అనిపించేస్తారు. ఆ తర్వాత ఓటాన్‌అకౌంట్ బడ్జెట్‌ పెడతారు. అందుకే మా పోరాటాన్ని ఉద్ధృతం చేయాలని నిర్ణయించుకున్నాం’
- కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి

ఎన్డీయేతర కూటమి ఏర్పాటే మా లక్ష్యం
‘దేశం బాగుండాలంటే వచ్చే ఎన్నికల్లో ఎన్డీయేకు ప్రత్యామ్నాయ కూటమి ఏర్పడాలి. అదే మా ప్రాధాన్యం. ప్రధాని మోదీ, భాజపా అధ్యక్షుడు అమిత్‌షా ఉన్నంతవరకూ రాష్ట్రానికి న్యాయం జరగదు. ఎన్టీయే కూటమిలో ఉన్న శివసేన, జేడీ(యూ), అకాలీదళ్‌ వంటి పార్టీలూ అసంతృప్తితో ఉన్నాయి. భాజపా ముఖ్యమంత్రులు కూడా మోదీ-షా ద్వయంపై అసంతృప్తితో ఉన్నారు. భాజపా ఓటమి త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలతో మొదలవ్వాలి. దేశం ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి సారిస్తాం. రఫేల్‌ ఒప్పందంపైనా నిలదీస్తాం. తాజాగా రష్యాతో జరిగిన ఆయుధ ఒప్పందంలోనూ అనిల్‌అంబానీ సంస్థకు లబ్ధి చేకూర్చినట్లు ఆరోపణలున్నాయి. 2015లో మోదీ రష్యా పర్యటనకు వెళ్లినప్పుడు అనిల్‌ కూడా వెళ్లినట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి. అప్పుడే ఒప్పందంలో లబ్ధి చేకూర్చేందుకు ప్రయత్నాలు జరిగాయని వార్తలొస్తున్నాయి. ప్రధాని మోదీ కార్పొరేట్‌ సంస్థలకు అమ్ముడుపోయిన తీరును ప్రజలకు వివరిస్తాం’
- ఎంపీ గల్లా జయదేవ్‌

ప్రధాని ఎందుకు మాట్లాడరు?
‘స్వచ్ఛభారత్‌ ప్రారంభించిన ప్రధాని మోదీ తెరవెనుక బ్యాంకులను ఊడ్చేస్తున్నారు. రుణ ఎగవేతదారులను దేశం దాటిస్తున్నారు. నిరర్థక ఆస్తులు పెరుగుతున్నాయి. ప్రతినెలా మన్‌కీబాత్‌ నిర్వహిస్తున్న ప్రధాని దేశ రక్షణకు సంబంధించిన అంశంపై ఎందుకు స్పందించడం లేదు? దేశ ప్రజల ప్రశ్నకు సమాధానం చెప్పాలి. ప్రత్యేక హోదా అడిగితే రక్షణ రంగం నుంచి నిధులివ్వాలా? అని ఎద్దేవా చేసినవారు రఫేల్‌పై ఎందుకు సమాధానం చెప్పరు? మోదీ దేశానికి ప్రధానా లేక కార్పొరేట్‌ సంస్థలకా? దేశ ప్రయోజనాల కోసం విదేశాలకు వెళ్తున్నారా? లేదా కార్పొరేట్‌ సంస్థలకు లబ్ధి చేకూర్చేందుకా? వాళ్లకు సంబంధించిన సంస్థలను ఆదుకునేందుకు ప్రత్యేకంగా బిల్లులు తెస్తున్న కేంద్రం జీఎస్టీ అమలు వల్ల నష్టపోయిన చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ఆదుకునేందుకు ఎందుకు ముందుకు రావడం లేదు?’
- ఎంపీ రామ్మోహన్‌నాయుడు
Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • 2 weeks later...

ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫోన్ చేసిన సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేశ్ యాదవ్ కాంగ్రెస్ తో సహా అన్ని విపక్షాలను ఒకే వేదికపైకి తీసుకురావల్సిన ఆవశ్యకత ఉంది: అఖిలేశ్ యాదవ్ దేశంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే బాధ్యత మనపై ఉందని ముఖ్యమంత్రితో అన్న అఖిలేశ్ యాదవ్

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...