Jump to content

బీజేపీ-వైసీపీ పొత్తు పొడిచింది?


sonykongara

Recommended Posts

బీజేపీ-వైసీపీ పొత్తు పొడిచింది?
04-10-2018 03:45:12
 
636742399561432050.jpg
  • 15 చోట్ల అంతర్గత ఒప్పందం
  • కన్నా కోసం లేళ్లకు మొండిచేయి
  • ఆ స్థానంలో ఏసురత్నానికి టికెట్‌
  • బీజేపీ కోసం జగన్‌ ‘త్యాగాలు’!
  • ఇన్‌చార్జుల మార్పుపై
  • వైసీపీలో లుకలుకలు
అమరావతి (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో బీజేపీ, వైసీపీ మధ్య అంతర్గతంగా పొత్తు కుదిరినట్లు తెలుస్తోంది. బీజేపీలోని ప్రముఖ నాయకుల గెలుపు కోసం వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ తనను నమ్ముకున్న నేతలను ‘త్యాగం’ చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కనీసం 15 చోట్ల లోపాయకారీ ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. అందులో భాగంగానే కొన్ని స్థానాల్లో బలమైన నాయకులను తప్పించి, బలహీన నేతలను ఇన్‌చార్జులుగా నియమిస్తున్నారన్న ఆరోపణలకు తాజా పరిణామాలు బలం చేకూరుస్తున్నాయి. నాలుగేళ్లుగా గుంటూరు-2 స్థానంలో వైసీపీ ఇన్‌చార్జిగా ఉన్న బలమైన నాయకుడు లేళ్ల అప్పిరెడ్డిని జగన్‌ ఆకస్మికంగా తప్పించారు. ఇటీవలే పార్టీలో చేరిన ఏసురత్నానికి ఆ బాధ్యతలు అప్పగించారు.
 
ఈయనెవరో వైసీపీ కార్యకర్తలకు కూడా తెలియదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కోసమే ఈ మార్పు జరిగిందని, గుంటూరు-2లో ఆయన గెలుపు అవకాశాలు పెంచడం కోసమే అప్పిరెడ్డిని తప్పించారని పేర్కొంటున్నారు. ఇదొక్కటే కాదు. సుమారు పది శాసనసభ, మూడు నాలుగు లోక్‌సభ స్థానాల్లో బీజేపీకి వైసీపీ సహకరించేలా అంతర్గత ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. ఎంపీ స్థానాల్లో సిట్టింగ్‌లతోపాటు పురందేశ్వరి, కావూరి సాంబశివరావు ఉంటారని చెబుతున్నారు. ఆ ఇద్దరూ కన్నాతో కలిసి కాంగ్రెస్‌ నుంచి బీజేపీలో చేరిన వారే కావడం గమనార్హం. కేసుల విషయంలో సహకరిస్తామన్న హామీ కారణంగానే జగన్‌ ఇలాంటి త్యాగాలకు సిద్ధపడుతున్నారని.. కొందరు బీజేపీ నేతలు పోటీ చేసే ప్రాంతాల్లో బలహీన నేతలను నిలపాలన్న డిమాండ్‌కు అంగీకరించినట్లు రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఇంకోవైపు.. జగన్‌ ఆకస్మికంగా ఇన్‌చార్జులను మార్చడంపై వైసీపీలో లుకలుకలు మొదలయ్యాయి. చిలకలూరిపేటలో మర్రి రాజశేఖర్‌ స్థానంలో విడదల రజనీని ఇన్‌చార్జిగా నియమించడంతో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు నెత్తిన పాలుపోసినట్లుయిందని వైసీపీ వర్గాలే చెబుతున్నాయి.
 
మైలవరం నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమి పాలైన జోగి రమేశ్‌ను కాదని.. మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు కుమారుడు కృష్ణప్రసాద్‌ను నియమించారు. విజయవాడ తూర్పులో నాలుగేళ్లు ఇన్‌చార్జిగా ఉన్న భవకుమార్‌ను తప్పించి.. కొద్దినెలల క్రితం పార్టీలో చేరిన యలమంచిలి రవికి బాధ్యత అప్పగించారు. ఇప్పుడు వంగవీటి రాధాకృష్ణను విజయవాడ సెంట్రల్‌ నుంచి అక్కడకు వెళ్లాలని సూచించారు. ఆయన స్థానంలో మల్లాది విష్ణును ఇన్‌చార్జిగా నియమించడంతో రాధా వర్గం జగన్‌పై అగ్గిమీద గుగ్గిలమవుతోంది. కాకినాడలో ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డిని మార్చాలన్న యోచనలో జగన్‌ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
Link to comment
Share on other sites

2 hours ago, Raaz@NBK said:

Hanumanthudi Balam Hanumanthudiki teliyadhu anattu..

BJP vala balam BJP valaki teliyadam ledhu..

Maree cheap ga 15 seats enti :damn:

Minimum 40 seats ayina poti cheyyali..

Asala 15 seats ki pothu endi??.,,danikanna ontariga vellatam better...matha pichi gallaki ee psychoski saripoindi

Link to comment
Share on other sites

4 hours ago, Chandasasanudu said:

Asala 15 seats ki pothu endi??.,,danikanna ontariga vellatam better...matha pichi gallaki ee psychoski saripoindi

Adhe ga Maree cheap ga 15 seats kosam TDP tho godava pettukunnara.. atleast 40 seats ki ayina tender pettalasindhe..

Link to comment
Share on other sites

Generations scene ledhu le. Amaravathi development pace bad and reorg committee recommendation implementation slow. Yes, Modi promised and he didn't keep it due to other factors yes we can blame him in this regard and not vote BJP in AP. On the other side, rural development etc. good. Monna CS ye cheppadu 2017-18 17k crores vachai centre nunchi and this year also on track, so central schemes he is delivering well.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...