Jump to content

లోక్‌సభ స్థానాల అభ్యర్థులపై టీడీపీ కసరత్తు


koushik_k

Recommended Posts

  • సగంచోట్ల కొత్త ముఖాలు!
  • లోక్‌సభ స్థానాల అభ్యర్థులపై టీడీపీ కసరత్తు
  • 11 చోట్ల పాత అభ్యర్థులే
  • రాయపాటి, ఎస్పీవై రెడ్డి రిటైర్మెంట్‌
  • అరకు నుంచి ఓ ఉన్నతాధికారి!
  • కాకినాడలో చలమలశెట్టి సునీల్‌?
  • అసెంబ్లీకి తోట నరసింహం
  • నరసాపురంలో రఘురామరాజు
  • 3-4 సీట్లలో ఇంకా అస్పష్టత
అమరావతి, (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లోని 25 లోక్‌సభ స్థానాల్లో సుమారుగా సగం చోట్ల ఈసారి తెలుగుదేశం పార్టీ కొత్త ముఖాలు బరిలోకి దించనున్నట్లు తెలిసింది. ఆ పార్టీ అధిష్ఠానం నిర్వహిస్తున్న కసరత్తు ఈ పరిణామాన్ని సూచిస్తోంది. ప్రస్తుత పరిస్థితులను బట్టి 11 సీట్లలో పాతవారికే తిరిగి పోటీ చేసే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. పదిచోట్ల కొత్తవారు రంగంలోకి దిగడం ఖాయమని తెలుస్తోంది. నాలుగు చోట్ల పాతవారు కొనసాగుతారో లేక కొత్తవారు వస్తారో స్పష్టత రాలేదు. గత ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని ఆ పార్టీకి టీడీపీ నాలుగు సీట్లు (విశాఖ, నరసాపురం, రాజంపేట, తిరుపతి) కేటాయించింది. ఈసారి ఆ సీట్లలో తానే సొంతంగా పోటీ చేయనుంది. రెండు సీట్లలో సిటింగ్‌ ఎంపీలు అనారోగ్య కారణాలతో
రిటైర్మెంట్‌ తీసుకోనున్నారు. నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి, నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకపోవచ్చని టీడీపీ వర్గాలు పేర్కొన్నాయి. రాయపాటి ఈసారి కూడా పోటీ చేస్తానని ప్రకటనలు ఇస్తున్నా పార్టీ వర్గాలు మాత్రం ఆయన ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని కొత్త అభ్యర్థి కోసం అన్వేషిస్తున్నాయి.
 
ఆ 11 మందికి లైన్‌ క్లియర్‌
గత ఎన్నికల్లో పోటీచేసిన వారిలో 11 మంది మళ్లీ బరిలోకి దిగడం ఖాయమేనని టీడీపీ వర్గాలు అంటున్నాయి. వీరిలో కొందరు సిటింగ్‌ ఎంపీలు.. మరికొందరు పోయినసారిఓడిన అభ్యర్థులు. కింజరాపు రామ్మోహన్‌నాయుడు(శ్రీకాకుళం), అశోక్‌ గజపతిరాజు(విజయనగరం), పండుల రవీంద్రబాబు(అమలాపురం), మాగంటి బాబు(ఏలూరు), కేశినేని నాని(విజయవాడ), కొనకళ్ల నారాయణరావు(మచిలీపట్నం), గల్లా జయదేవ్‌(గుంటూరు), శ్రీరాం మాల్యాద్రి(బాపట్ల), శివప్రసాద్‌(చిత్తూరు), బుట్టా రేణుక(కర్నూలు) ఈ జా బితాలో ఉన్నారు. 2014లో ఒంగోలులో పోటీ చేసి ఓడి న మాగుంట శ్రీనివాసులరెడ్డి ఈసారి అక్కడే పోటీ చేయనున్నారు. రవీంద్రబాబు, మాగంటి బాబు, శివప్రసాద్‌ స్థానికంగా చిన్న చిన్న అసంతృప్తులు ఎదుర్కొంటున్నా వారి కొనసాగింపునకే అధినాయకత్వం మొగ్గు చూపుతోందని సమాచారం. కొనకళ్ల ఈసారి అ సెంబ్లీకి పోటీ చేయాలని ఆసక్తితో ఉన్నా.. ఆయన్ను ఎంపీగానే కొనసాగిస్తారని సమాచారం.
 
కొత్తవారికి అవకాశాలు
కొన్ని సీట్లలో కొత్తవారికి అవకాశాలు రానున్నాయి. అరకులో ఒక ఉన్నతాధికారి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయన త్వరలో రిటైర్‌ కానున్నారు. బీజేపీ ఎంపీ కంభంపాటి హరిబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న విశాఖ సీట్లో ఈసారి కొత్త అభ్యర్థి తెరపైకి రానున్నా రు. మాజీ ఎంపీ ఎంవీవీఎస్‌ మూర్తి, ఆయన మనవ డు భరత్‌, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త పేరు ప్రచారంలో ఉన్నాయి. కొంత మంది మంత్రి గంటా శ్రీనివాసరావు పేరు కూడా ప్రచారంలో పెడుతున్నారు. టీడీపీ అధిష్ఠానం ఇంకా ఈ సీటుపై స్పష్టతకు రాలేదు. కాకినాడ ఎంపీ తోట నరసింహం ఈసారి అసెంబ్లీకి పోటీ చేయనున్నారు. ఆ సీటును చలమలశెట్టి సునీల్‌కు ఇచ్చే యోచనలో టీడీపీ ఉంది. చంద్రబాబును ఇటీవల తరచూ కలుస్తు న్న ఆయన కొద్ది రోజుల్లో అధికారికంగా టీడీపీలో చేరనున్నారు. బీజేపీ ఎంపీ గంగరాజు ప్రాతినిధ్యం వహిస్తున్న నరసాపురం సీటుకు తన అభ్యర్థిని టీడీపీ అంతర్గతంగా ఖరారు చేసింది.
 
పారిశ్రామికవేత్త రఘురామకృష్ణంరాజును నిలపనున్నట్లు సమాచారం. రాయపాటి ప్రాతినిధ్యం వహిస్తున్న నరసరావుపేట సీటుకు గట్టి అభ్యర్థి కోసం టీడీపీ అన్వేషిస్తోంది. టీటీ డీ చైర్మన్‌ సుధాకర్‌ యాదవ్‌ కుమారుడు, అటవీ మం త్రి సిద్ధా రాఘవరావు, గుంటూరు-2 ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి పేర్లు ఇక్కడ వినిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో బీజేపీ పోటీ చేసిన తిరుపతి(ఎస్సీ) స్ధానంలో ఈసారి టీడీపీ అభ్యర్థిని నిలపనుంది. పోయినసారి అక్కడ బీజేపీ తరపున పోటీ చేసిన అభ్యర్థి జయరాజ్‌ తర్వాత టీడీపీలో చేరారు. ఆయనతోపాటు మాజీ మంత్రి పర్సా రత్నం, నెలవల సుబ్రమణ్యం పేర్లు వినిపిస్తున్నాయి. అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి తన కుమారుడు పవన్‌ రెడ్డికి అవకాశమివ్వాలని చంద్రబాబును కోరారు.
 
టీడీపీ అధిష్ఠా నం కూడా సుముఖంగానే ఉంది. హిందూపురం ఎం పీ నిమ్మల కిష్టప్ప అసెంబ్లీకిరావాలని కోరుకుంటున్నా రు. కానీ అధిష్ఠానం ఏ నిర్ణయానికీ రాలేదు. ఆయన్ను అసెంబ్లీకి తీసుకొస్తే ఎంపీగా కొత్తవారికి చాన్సు వస్తుంది. కడపలో..జమ్మలమడుగు అసెంబ్లీ స్థానం వి వాద పరిష్కారం కోసం మంత్రి ఆదినారాయణ రెడ్డి.. మండలిలో ప్రభుత్వ విప్‌ పి.రామసుబ్బారెడ్డిల్లో ఒకరిని కడప ఎంపీగా నిలపాలని టీడీపీ భావిస్తోంది. పోయినసారి ఇక్కడ పోటీ చేసిన శ్రీనివాసరెడ్డి ఎంపీగానైనా లేక ఎమ్మెల్యేగానైనా పోటీకి సిద్ధమని అంటున్నారు. మాజీ మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డి పేరును కూడా తెరపైకి తెస్తున్నారు. రాజంపేటలో పోయినసారి బీజేపీ అభ్యర్థిగా పురందేశ్వరి పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి అక్కడ ఎమ్మెల్సీ చెంగల్రాయుడిని నిలపాలన్న యోచన పార్టీ వర్గాల్లో ఉంది. నంద్యాలలో ఎస్పీవై రెడ్డి స్థానంలో ఇంకా స్పష్టత రాలేదు.
  
 
కొన్ని సీట్లపై ఇంకా రాని స్పష్టత
కొన్ని లోక్‌సభ స్థానాలపై టీడీపీలో ఇంకా స్పష్టత రాలేదు. అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాసరావు అసెంబ్లీకి పోటీ చేస్తానని పార్టీ అధినేత తో చెప్పారు. కొంతకాలం గడిస్తే తప్ప దీనిపై స్పష్టత వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఆయన అసెంబ్లీకి వెళ్లే పక్షంలో ఆ లోక్‌సభ స్థానానికి మాజీ ఎంపీ కొణతాల రామకృష్ణ, విశాఖ డెయిరీ చైర్మన్‌ అడారి తులసీరావు తనయుడు ఆనంద్‌, మంత్రి అయ్యన్నపాత్రుడు పేర్లు వినవస్తున్నాయి. రాజమండ్రి ఎంపీ మురళీమోహన్‌ విషయంలో కూడా అస్పష్టత ఉంది. ఆయన మళ్లీ పోటీ చే యాలని ఆశిస్తున్నారు. కానీ పార్టీ నేతలు ఆయన పోటీ పట్ల సుముఖంగా లేరు. ఈ సీటుపైనా నిర్ణయానికి కొంత సమయం పట్టేలా ఉంది. నెల్లూరు లోక్‌సభ స్థానానికి పోయినసారి మాజీ మంత్రి ఆదాల ప్రభాకరరెడ్డి పోటీ చేశారు. ఈ సారి ఆయన అసెంబ్లీ బరిలో నిలవనున్నారు. దీంతో ఈ సీటుపై స్పష్టత రావాల్సి ఉంది.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...