Jump to content

తెరాస తాజా మాజీ ఎమ్మెల్యేకు చేదు అనుభవం


sonykongara

Recommended Posts

  • Replies 280
  • Created
  • Last Reply
ఏనుగు రవీందర్‌రెడ్డికి నిరసన సెగ

04110122BRK110-ENUGU.JPG

ఎల్లారెడ్డి: ఎన్నికల గడువు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. నియోజకవర్గంలోని గ్రామ గ్రామాన అభ్యర్థులు సుడిగాలి ప్రచారం చేస్తున్నారు. వీలైనంత ఎక్కువ మంది ప్రజలను కలుసుకొనే దిశగా ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో పలువురు అభ్యర్థులకు ప్రజల నుంచి చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. గతంలో కొందరు తెరాస అభ్యర్థులకు ప్రజల నుంచి కొన్ని గ్రామాల్లో నిరసన సెగ ఎదురవగా.. నిన్న కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానారెడ్డిని కూడా నాగార్జునపేట ప్రజలు సమస్యలపై నిలదీసిన విషయం తెలిసిందే. తాజాగా కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గ తెరాస అభ్యర్థి ఏనుగు రవీందర్‌ రెడ్డికి నిరసన సెగ తాకింది. నాగిరెడ్డిపేట మండలంలోని వదల్‌పర్తి, మాల్‌తుమ్మెద గ్రామాల్లో ఈ రోజు ప్రచారానికి వెళ్లిన ఆయనను కొందరు స్థానికులు అడ్డుకున్నారు. తమ గ్రామాల అభివృద్ధిని పట్టించుకోలేదని.. గతంలో ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చలేదని నిలదీశారు. ఎన్నికలు రాగానే తాము గుర్తుకొచ్చామా ? అంటూ ప్రశ్నించారు. దీంతో అక్కడే ఉన్న తెరాస కార్యకర్తలు వారిని సముదాయించి తిరిగి తమ ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు.

Link to comment
Share on other sites

తాటి వెంకటేశ్వర్లుపై చెప్పుల దాడి
24-11-2018 03:47:40
 
636786280591810431.jpg
  • గ్రామానికి ఎందుకొచ్చారంటూ నిలదీత
చంద్రుగొండ, నవంబరు 23: ఎన్నికల ప్రచారంలో అశ్వారావుపేట టీఆర్‌ఎస్‌ అభ్యర్థి, తాజా మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లుకు చేదు అనుభవం ఎదురైంది. ప్రచారంలో భాగంగా భద్రాద్రి జిల్లా చంద్రుగొండ మండలంలోని శ్రీరాంపురం, రేపల్లెవాడ గ్రామాల మీదుగా అన్నారం తండా, గానుగపాడు నుంచి పోకలగూడెంకు వెళ్లారు. అక్కడ రాజీవ్‌గాంధీ సెంటర్‌కు చేరుకోగానే గ్రామ ప్రజల నుంచి ఆయనకు ఊహించని ప్రతిఘటన ఎదురైంది. లంబాడాలకు వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడారంటూ మహిళలు, యువకులు ఆయన్ను నిలదీశారు. నాలుగేళ్లలో తమ గ్రామానికి ఏం చేశారంటూ దుర్భాషలాడారు. ‘మా గ్రామానికి ఎందుకొచ్చారు. ఓట్లు అడగడానికి ఏ మొహం పెట్టుకొని వచ్చారు’ అంటూ ఆయనపై రాళ్లు రువ్వారు. కొందరు చెప్పులు విసిరారు. ఓ చెప్పు.. రక్షణగా ఉన్న ఎస్సైవైపు దూసుకెళ్లింది. 
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...