Jump to content

తెరాస తాజా మాజీ ఎమ్మెల్యేకు చేదు అనుభవం


sonykongara

Recommended Posts

On 10/1/2018 at 5:32 PM, Chandasasanudu said:

ninna khammam candidate okadu kalisadu..konni oorlalo trs ki vote estham..vere parties ravaddu ani board pettaru annadu..mari hekkada raledey antey...media sariiga soopatla annadu

Die heart TRS fans ilaney brace face petti bluff chestunnaru.... 

 

only time will tell!

Link to comment
Share on other sites

  • Replies 280
  • Created
  • Last Reply
టీఆర్ఎస్ తాజా మాజీ ఎమ్మెల్యేకు భంగపాటు
08-10-2018 10:39:42
 
636745920567037901.jpg
  • అభివృద్ధి పనులు చేయలేదని బాలాజీనగర్‌ వాసుల ఆందోళన
  • మీకు ఓటు అడిగే హక్కు లేదు.. గోబ్యాక్‌ అంటూ నినాదాలు
 
 
వరంగల్‌ టౌన్ : వర్ధన్నపేట నియోజకవర్గ తాజా మాజీ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉన్న అరూరి రమేశ్‌కు ఏనుమాముల బాలాజీనగర్‌లో నిరసన సెగ తగిలింది. నగరంలోని 12వ డివిజన్‌ ఏనుమాముల బాలాజీనగర్‌లో టీఆర్‌ఎస్‌ డివిజన్‌ అధ్యక్షుడు ముడుసు నర్సింహ ఆధ్వర్యంలో ఆదివారం పార్టీ ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించారు. ముఖ్య అతిథిగా అరూరి రమేశ్‌ హాజరై కార్యాలయాన్ని ప్రారంభించి వేదికపై ఆశీనులయ్యారు. డివిజన్‌ అధ్య క్షుడు, నాయకులు మాట్లాడుతుండగానే బాలాజీనగర్‌కు చెందిన కొందరు యువకులు, మహిళలు పెద్ద ఎత్తున మీకు ఓటు అడిగే హక్కు లేదు.. గోబ్యాక్‌ అంటూ ఫ్లెక్సీ పట్టుకుని అక్కడికి చేరుకున్నారు.
 
 
ఏనుమాముల, బాలాజీనగర్‌ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని ఎమ్మెల్యే గోబ్యాక్‌ అంటూ నినాదాలు చేశారు. దీంతో సమావేశంలో కూర్చున్న టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు అక్కడికి చేరుకుని యువకులను, మహిళలను వారించే ప్రయత్నం చేశారు. ఈక్రమంలో ఇరువర్గాలు వాగ్వాదానికి దిగారు. కొందరు యువ కులు వేదిక వద్దకు వెళ్లి మా ప్రాంతంలో ఎందుకు అభివృద్ధి చేయలేదని అరూరి రమేశ్‌ను ప్రశ్నించారు. కోట్లాది రూపాయల పనులు చేశానని నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వారు వినలేదు.
 
 
voek-360.jpgమరోపక్క మహిళలు, యువకులు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు నిర్మించి ఇవ్వలేదని ప్రశ్నిస్తుడండంతో పోలీసులు అడ్డుకుని పంపించేందుకు ప్రయత్నించారు. పరిస్థితులను గమనించిన అరూరి రమేశ్‌ తన ప్రసంగాన్ని త్వర గా ముగించి వెళ్ల్లిపోయారు. కాగా, 12వ డివిజన్‌ కార్పొరేటర్‌ తూర్పాటి సులోచన సారయ్య, ఆ డివిజన్‌ టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు ముడుసు నర్సింహ మధ్య కొంత కాలంగా సాగుతున్న అంతర్గత వర్గపోరే ఇందుకు కారణమని స్థానికులు చర్చించుకుంటున్నారు.
 

Advertisement

Link to comment
Share on other sites

మీకు ఓటెయ్యం.. మా ఊరికి రావొద్దు
చొప్పదండి మాజీ ఎమ్మెల్యే శోభను అడ్డుకున్న గ్రామస్థులు

0316590910SOBHAA-BRK102A.JPG

చొప్పదండి: తెలంగాణలోని పలుచోట్ల మాజీ ఎమ్మెల్యేలకు నిరసన సెగలు తగులుతూనే ఉన్నాయి. తాజాగా కరీంనగర్‌ జిల్లా చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభకు చేదు అనుభవం ఎదురైంది. గ్రామంలో ఎటువంటి అభివృద్ధి పనులు చేపట్టని మీకు ఓటు అడిగే హక్కు లేదని.. ఇకపై ఓట్ల కోసం తమ గ్రామానికి రావద్దంటూ కొలిమికుంట గ్రామస్థులు ఆమెను అడ్డుకున్నారు. తెరాస తరఫున ఎన్నికల ప్రచారంలో భాగంగా శోభ తన అనుచరులతో కలిసి కొలిమికుంట గ్రామానికి వెళ్లారు. సమాచారం అందుకున్న గ్రామస్థులు ఆమెను అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులు లబ్ధిదారులకు అందకుండా చేశారని, రైతు సమన్వయ సమితిలో అనర్హులకు చోటు కల్పించారని గ్రామస్థులు శోభపై మండిపడ్డారు. మరోవైపు చొప్పదండి నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తున్న తెరాసకు చెందిన మరో నేత సుంకె రవి వర్గీయులు సైతం శోభకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘బొడిగె శోభ.. గోబ్యాక్‌’ అంటూ నినాదాలు హోరెత్తడంతో చేసేదేమీ లేక శోభ అక్కడ నుంచి వెనుదిరిగారు.

Link to comment
Share on other sites

On ‎10‎/‎1‎/‎2018 at 8:23 PM, Compaq said:

naaku ikkada okalliddaru thagilaaru, rajakeeya medhaavulu anuko okka maatalo,.. abbo naa daggara maatalu levu anuko raadu aa chandaalam varninchataaniki. KA scene repeat anta AP lo , TG lo single handed ga KCR is going to win anta. inthaki KA scene lo Kumara Swamy evaru ani adiga, inkevaru PK anta. naa chepputho nenu kottukunna ee range lo pfdb_brahmi27.gif

malli aa manda 2-3 times invite chesaru weekend antu,.. mee sthaayi kaadu le dora maadi, meeru kaanivvandi ani selavicha 

inthaki PK geliche seats emina idea unnayi ani adiga aa roje,.. maadi Hyderabad le, parents hailed from AP, so Constituencies perlu sarigga teliyavanta tumblr_mqb6wzSo791spvnemo1_250_01.gif. adi vinaaka inka cheedara vesindi naa meeda naake,.. chi asalu nenu matlaadutundi evaritho ani brahmi24_0.gif

GSB6_0.gif

Link to comment
Share on other sites

On ‎10‎/‎2‎/‎2018 at 1:32 AM, Chandasasanudu said:

ninna khammam candidate okadu kalisadu..konni oorlalo trs ki vote estham..vere parties ravaddu ani board pettaru annadu..mari hekkada raledey antey...media sariiga soopatla annadu

ayyi ee oorlo kanukkunte poddi

Link to comment
Share on other sites

మదన్‌లాల్‌ను మార్చకుంటే వైరాలో ఓటమే
నియోజకవర్గ కేంద్రంలో అసమ్మతి నేతల ర్యాలీ
8hyd-state10a.jpg

వైరా, న్యూస్‌టుడే: ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకుల మధ్యనున్న విభేదాలు భగ్గుమంటున్నాయి. ఈ స్థానంలో అభ్యర్థిగా సిట్టింగ్‌ ఎమ్మెల్యే బాణోతు మదన్‌లాల్‌ను ఖరారు చేస్తూ పార్టీ అధినేత కేసీఆర్‌ తొలి జాబితాలోనే పేరు ప్రకటించారు. ఆ మరుసటి రోజు నుంచే మదన్‌లాల్‌ అభ్యర్థిత్వంపై నియోజకవర్గంలోని అయిదు మండలాల్లోనూ అసమ్మతి రగిలింది. ఇందులో భాగంగా సోమవారం వైరాలో తెరాస జిల్లా నేత బొర్రా రాజశేఖర్‌ నేతృత్వంలో వేలాది మందితో భారీ ర్యాలీ, సభ నిర్వహించారు. ర్యాలీ అనంతరం జరిగిన సభలో బొర్రా రాజశేఖర్‌ మాట్లాడుతూ.. కేవలం మదన్‌లాల్‌పై ఉన్న వ్యతిరేకత వల్ల నియోజకవర్గంలో పార్టీకి పరాభవం తప్పేలా లేదన్నారు. అందరినీ కలుపుకొని వెళ్లే అభ్యర్థికే టికెట్‌ ఇవ్వాలని నాయకులంతా డిమాండ్‌ చేశారు. అంతకుముందు ర్యాలీ సందర్భంగా అసమ్మతి నాయకులు, మదన్‌లాల్‌ అనుచరుల మధ్య తోపులాట జరిగింది. దీంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఇరువర్గాల వారు పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Link to comment
Share on other sites

Just now, sonykongara said:
 మదన్‌లాల్‌ను మార్చకుంటే వైరాలో ఓటమే
నియోజకవర్గ కేంద్రంలో అసమ్మతి నేతల ర్యాలీ
8hyd-state10a.jpg

వైరా, న్యూస్‌టుడే: ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకుల మధ్యనున్న విభేదాలు భగ్గుమంటున్నాయి. ఈ స్థానంలో అభ్యర్థిగా సిట్టింగ్‌ ఎమ్మెల్యే బాణోతు మదన్‌లాల్‌ను ఖరారు చేస్తూ పార్టీ అధినేత కేసీఆర్‌ తొలి జాబితాలోనే పేరు ప్రకటించారు. ఆ మరుసటి రోజు నుంచే మదన్‌లాల్‌ అభ్యర్థిత్వంపై నియోజకవర్గంలోని అయిదు మండలాల్లోనూ అసమ్మతి రగిలింది. ఇందులో భాగంగా సోమవారం వైరాలో తెరాస జిల్లా నేత బొర్రా రాజశేఖర్‌ నేతృత్వంలో వేలాది మందితో భారీ ర్యాలీ, సభ నిర్వహించారు. ర్యాలీ అనంతరం జరిగిన సభలో బొర్రా రాజశేఖర్‌ మాట్లాడుతూ.. కేవలం మదన్‌లాల్‌పై ఉన్న వ్యతిరేకత వల్ల నియోజకవర్గంలో పార్టీకి పరాభవం తప్పేలా లేదన్నారు. అందరినీ కలుపుకొని వెళ్లే అభ్యర్థికే టికెట్‌ ఇవ్వాలని నాయకులంతా డిమాండ్‌ చేశారు. అంతకుముందు ర్యాలీ సందర్భంగా అసమ్మతి నాయకులు, మదన్‌లాల్‌ అనుచరుల మధ్య తోపులాట జరిగింది. దీంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఇరువర్గాల వారు పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 

 

dubai sekar aa majaaka na  GSB6_0.gif

Link to comment
Share on other sites

తెరాస ప్రచార రథంపై దాడి

03100601110RATHAM-BRK94A.JPG

షాద్‌నగర్‌: అధికార పార్టీ తెరాస అభ్యర్థులకు క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి పలు చోట్ల వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తాజాగా రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ నియోజకవర్గంలోని ఫరూక్‌నగర్‌ మండలం గంట్లవెల్లి తండా పరిధిలో తెరాస ప్రచార రథంపై గ్రామస్థులు గురువారం దాడిచేశారు. తండాలో తాగునీటి సమస్య పరిష్కారంలో నేతలు పూర్తిగా విఫలమయ్యారని, దీనిపై వారిని ఎన్నిసార్లు కలిసినా స్పందించడం లేదంటూ గ్రామంలోని కొందరు వ్యక్తులు ఆగ్రహంతో ప్రచార రథాన్ని ధ్వంసం చేశారు. తండాలోని కొందరు ప్రచార రథాన్ని చుట్టిముట్టి ఫ్లెక్సీలు చింపి గొడవ చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో తండాకు వెళ్లిన కొందరు నాయకులు గ్రామస్థులతో మాట్లాడి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామ గ్రామాలకు పార్టీలవారీగా ప్రచార రథాలను తిప్పుతున్నారు. ఈ నేపథ్యంలోనే తెరాస ప్రచార రథం గురువారం గంట్లవెల్లి తండాకు చేరుకుంది.

Link to comment
Share on other sites

సత్తుపల్లి తాజా మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సమక్షంలో గురువారం సత్తుపల్లి మండలానికి చెందిన పలువురు ప్రజాప్రతినిదులు, మాజీ ప్రజాప్రతినిధి తెలుగుదేశం పార్టీలో చేరారు. టీఆర్‌ఎస్‌ పార్టీకి గుడ్‌బై చెప్పి తెలుగుదేశం పార్టీలో చేరారు. సత్తుపల్లి మునిసిపాలిటిలో 11వ వార్డు కౌన్సిలర్‌ మల్లూరి పద్మావతి అంకంరాజు సండ్ర సమక్షంలో చేరారు. పట్టణంలోని పాలవాడకు చెందిన ద్రోణవల్లి రఘు టీడీపీలో చేరారు. సత్తుపల్లి మండలం రామానగరానికి చెందిన సత్తుపల్లి వైఎస్‌ ఎంపీపీ పిల్లి ఉషారాణి, సురేష్‌ దంపతులు, అదే గ్రామానికి చెందిన ఒంటెద్దు సాయిలు, జి.మల్లయ్య, శ్రీకాంత్‌, రాధాకృష్ణ ల ఆధ్వర్యంలో 50 కుటుంబాల వారు సండ్ర సమక్షంలో టీడీపీలో చేరారు. కిష్టాపురం తాజా మాజీ సర్పంచి మారగాని గురవయ్య, ఎంపీటీసీ సభ్యురాలు విజయరేఖ, నాగార్జున,షేక్‌ నాగులుమీరా, ఇస్లావత్‌ లాఖ్య, అజ్మీరా సుధాకర్‌, అజ్మీరా విజయ్‌,ఽ దారావత్‌ బాలాజీ, అజ్మీరా నరసింహస్వామిల ఆధ్వర్యంలో 30కుటుంబాల వారు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కూసంపూడి రామారావు, కూసంపూడి దొడ్డా శంకరరావు, మహేష్‌, మోరంపూడి ప్రసాద్‌, చాంద్‌ పాషా, పవన్‌, కొండా శ్రీను, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Link to comment
Share on other sites

మాజీ ఎమ్మెల్యేకు చేదు అనుభవం

11583114BRK74A.JPG

మునుగోడు: మునుగోడు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి(తెరాస)కి చిన్న కొండూరు గ్రామస్థులు షాకిచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం చిన్న కొండూరు గ్రామంలో ప్రభాకర్‌రెడ్డి ఆదివారం ఉదయం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో ఆయన వాహనాన్ని గ్రామస్తులు, అఖిలపక్ష నేతలు అడ్డుకున్నారు. నాలుగున్నరేళ్లలో గ్రామానికి ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని ఆయన్ని నిలదీశారు. దీంతో మాజీ ఎమ్మెల్యే అనుచరులకు, గ్రామస్తులకు మధ్య స్వల్ప తోపులాట చోటుచేసుకుంది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి రెండు వర్గాలను సముదాయించారు.
Link to comment
Share on other sites

Thatha channel lo ee videos vasthunnayi ante, something really bad on ground. TRS batch thought that no need to consider people for 4yrs, elections appudu poyi jai Telangana ante all fine anukunnaru. Janam baaga dhinchuthunnatlunnaru.

Link to comment
Share on other sites

పినపాకలో ‘కారు’కు ఎదురు దెబ్బ

04245216TRS118.JPGఖమ్మం: ఖమ్మం జిల్లా పినపాక నియోజకవర్గంలో తెరాసకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. పినపాక మండలంలోని తెరాస ముఖ్య నాయకులు కాంగ్రెస్‌లో చేరారు. ఏడూళ్ల బయ్యారం, ఉప్పాక నుంచి సుమారు 400 మంది కార్యకర్తలు తెరాస నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లారు. మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు సమక్షంలో ముఖ్య నేతలు కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. తెరాస అభ్యర్థి పాయం వెంకటేశ్వర్లు అభ్యర్థిత్వాన్ని అసమ్మతి వర్గం వ్యతిరేకిస్తూ వస్తోంది. అయితే, వారిని బుజ్జగించేందుకు ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. దీంతో గత మూడు రోజులుగా తెరాసలోని ముఖ్యనేతలు కాంగ్రెస్‌లో చేరుతున్నారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...