Jump to content

లగడపాటి సర్వేపై ఫస్ట్ టైం స్పందించిన పవన్


sonykongara

Recommended Posts

లగడపాటి సర్వేపై ఫస్ట్ టైం స్పందించిన పవన్
28-09-2018 15:07:10
 
636737440327398267.jpg
  • మా పంథా.. సుదీర్ఘ పోరాటం
  • వీధి రౌడీలు ఏమీ చేయలేరు
  • జన సైనికులను బెదిరిస్తే ఖబడ్దార్‌
  • టీడీపీ, వైసీపీ శ్రేణులకు హెచ్చరిక
  • భూకబ్జాలు, పేకాట క్లబ్‌లతో ఎమ్మెల్యేలు బిజీ
  • ఇలాంటి వారితోనా చంద్రబాబు మళ్లీ సీఎం అయ్యేది
  • ఏలూరు, గణపవరం సభల్లో పవన్‌ కల్యాణ్‌
(ఏలూరు/ఏలూరు రూరల్)(పశ్చిమగోదావరి జిల్లా): ‘జనసేన పంథా సుదీర్ఘ పోరాటం. సమస్యల పరిష్కారం. సామాన్యులకు అండగా చేయూతగా ఉండడం. రాజకీయాల్లోకి వచ్చింది డబ్బున్న మనుషులతో కాదు. అభిమానం, ఆప్యాయత కూడగట్టుకున్న వారితోనే’ అంటూ జనసేనాధిపతి పవన్‌కళ్యాణ్‌ అన్నారు. గురువారం ఏలూరులో జరిగిన బహిరంగ సభలలో ఆయన మాట్లాడారు.
 
ఏలూరు, దెందులూరు ఎమ్మెల్యేలు బడేటి బుజ్జి, చింతమనేని ప్రభాకర్‌పై ధ్వజమెత్తారు. రౌడీయిజం చెలాయిస్తే సహించేది లేదని, కాళ్లు విరగ్గొట్టి కూర్చోబెడతామంటూ హెచ్చరించారు. తెలుగుదేశంకు ఏ రీతిలో తాము మద్దతు ఇచ్చిందో ప్రజలకు వివరించారు. మద్ధతు ఇచ్చిన మాపట్లే ఇలా వ్యవహరిస్తారా ? అంటూ తప్పుపట్టారు. ఎమ్మెల్యేలకు పేకాట క్లబ్‌లపైవున్న ఆసక్తి రైల్వే బ్రిడ్జీ, రోడ్లు, మురుగు నీటిపారుదల వంటి వాటిపై లేవని ఎద్దేవా చేశారు. 2017లో ఏలూరు నగరాన్ని స్మార్ట్‌ సిటీగా ఎంపిక చేస్తే.. ఇక్కడ పేకాట, హత్యలు జరిగాయని ఆరోపించారు. ‘తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్క ఏలూరులోనే పదికిపైగా హత్యలు జరిగాయి. యథేచ్ఛగా భూకబ్జాలు జరుగుతున్నాయి. పేకాట క్లబ్‌లు నడుస్తున్నాయి. ఇందు కోసమేనా మద్ధతు ఇచ్చింది’ అంటూ సీఎం చంద్రబాబును నిలదీశారు. ఏలూరు సుబ్బమ్మదేవి స్కూలు గ్రౌండ్‌ను కబ్జా చేశారంటూ ఆరోపణలు గుప్పించారు. ఎంపీగా మాగంటి బాబు కనీసం ఒక బ్రిడ్జీ కూడా వేయించలేకపోయారన్నారు.
 
‘లగడపాటి లాంటి వారు సర్వే చేస్తున్నప్పుడు నాలుగైదు శాతం మాత్రమే ప్రభావితం ఉంటుందని అంటున్నారు. కాని మా బలం 18 శాతం అని గుర్తు పెట్టుకోండన్నారు. నా ప్రాణాన్నే జనసేనకు పెట్టుబడిగా పెట్టా. తొమ్మిది నెలల్లో సీఎం అయిపోవాలని రాలేదు. బలమైన సిద్ధాంతాలు, విధానాలు తెస్తాం. క్రిమినల్‌ పాలిటిక్స్‌ మీద, క్రిమినల్స్‌ని తన్ని తరిమేయడానికి సిద్ధంగా ఉన్నాం.. పవన్‌ ఆవేశంగా చెప్పారు. ‘జగన్మోహన్‌రెడ్డి వేల కోట్లు పెట్టుబడి పెట్టారు. రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన సీఎం అయ్యారా. ప్రధాని కంటే ముఖేష్‌ అంబానీ బలమైన వ్యక్తి. ఆయన ప్రధాని కాగలిగారా. డబ్బులు కాదు.. ప్రజాభిమానం ముఖ్యం’ సూత్రీకరించారు. అమెరికా వెళ్ళి సేంద్రీయ వ్యవసాయం మేమే చేశామని చంద్రబాబు చెబుతున్నారు. ఇక్కడ దీనికి విరుద్ద పరిస్థితి ఉంది. చేపల చెరువుల్లో విషం కాస్తా చెట్లకు పాకుతోంది. ఆఖరుకి ఇలాంటి చోట్ల కొబ్బరి బొండాలు తాగిన వ్యక్తులు కూడా కాళ్ళు, చేతులు పడిపోతున్నాయని ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
 
మాఫియా చేతిలో విద్యా వ్యవస్థ
మాఫియా చేతిలో ప్రస్తుత విద్యా వ్యవస్థ చిక్కుకుపోయిందని పవన్‌కల్యాణ్‌ ఆరోపించారు. పాఠాలు చెప్పి విలువలు నేర్పే ఉపాధ్యాయులను అడ్మిషన్లు తీసుకురావాలని టార్గెట్‌ పెట్టడం.. ఆ ఉపాధ్యాయుల సర్టిఫికెట్లు, చెక్స్‌ దగ్గరపెట్టుకుని వేధించడం ఏమిటని ప్రశ్నించారు. 13 జిల్లాల నుంచి వచ్చిన ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులతో భేటీ అవుతూ.. విద్యావ్యవస్థ వ్యాపారంగా మారిపోయి నిర్వీర్యమైందని అన్నారు. తెలుగుదేశం పార్టీ నారాయణ విద్యా సంస్థల మీద నడుస్తోందంటూ విమర్శించారు.
 
 
పథకం ప్రకారం జనసేన ఓట్ల తొలగింపు
జనసైన్యంలోని యువత ఓట్లనే ఒక పథకం ప్రకారం తొలగిస్తున్నారని దుయ్యబట్టారు.యువతంతా ఈ విషయంలో అప్రమత్తం కావాలని, ఓట్లు నమోదు చేసుకోవాలని దిశా నిర్దేశం చేశారు. గణపవరంలో జరిగిన ప్రజా పోరాటయాత్రలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఇసుక, మట్టి, కంకర అమ్ముకునే పనిలో ఎమ్మెల్యేలు బిజీగా గడుపుతున్నారంటూ పవన్‌ ఎద్దేవా చేశారు. గోదావరి జలాలు ఇతర జిల్లాలకు తరలించుకుపోతున్నా ఇక్కడ తాగేందుకు మంచినీరు కొరవడుతోందని అన్నారు. ఆక్వా విస్తరించటంతో జలాలు మరింత కాలుష్యం అయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు.
 
 
జిల్లాలో ఇటువంటి దౌర్భాగ్య స్థితి ఉంటే ప్రాథమిక వైద్య శాలల్లో సిబ్బంది, సౌకర్యాలు లేవంటు దెప్పిపొడిచారు. ప్రభుత్వం సరఫర చేస్తున్న బియ్యం తినడానికి కూడా పనికి రాకుండా పోతున్నాయి.
 
రేషన్‌ సరుకులకు బదులు రూ.3 వేలు లబ్ధిదారుల ఖాతాలో వేస్తామని పవన్‌ ప్రకటించారు. కాపుల రిజర్వేషన్‌పై భవిష్యత్‌లో జనసేన ఒక నిర్ణయం తీసుకుంటుందని బీసీలకు న్యాయం జరిగేలా ఉభయ పెద్దల ద్వారా సంప్రదింపులు జరిగి ఎవరి అన్యాయం జరగని విధానాలను అమలు చేస్తామంటూ తెలిపారు. వృద్ధులకు వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేస్తామన్నారు. పార్టీ నేతలు గుడాల భుజింగరావు, తోట పవన్‌, రాష్ట్ర కో ఆర్డినేటర్‌ రియాజ్‌, యాతం నగేష్‌, కలవకొలను నాగ తులసీరావు, యర్రా నవీన్‌ తదితరులు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

9 hours ago, sonykongara said:
 
  • వీధి రౌడీలు ఏమీ చేయలేరు
  • జన సైనికులను బెదిరిస్తే ఖబడ్దార్‌

veede oka chillara XX ... veedu inkokakarni bedhirinchatam ... 

bring it on ... 

Ravi gundu keekindi marchi poinattunnadu ... time to do it again ... 

 

Link to comment
Share on other sites

3 minutes ago, venkat232 said:

9 months lo CM avvalani raleda............evarni refer chestunnav ra pichhi tuglak................avvalanukunte chestaru mari meelanti lafoot gallani

vadi anna 6months lo CM ayipoyi, guinness book ekkudam anukunnadu. lol!

Link to comment
Share on other sites

1 minute ago, venkat232 said:

aa buffoon gadiki correct place chupincharu....veediki vadi anna lanti exit ravali politics lo.......

my estimate if no mlas/ incharge from other party goes to janasena 0 to 1 seats . best case 9 seats. nobody trusting he will be cm . people vote to party which can form government . they either choose tdp or ysrcp. people don't have patience to support unwinnable candidate.

Link to comment
Share on other sites

15 minutes ago, ravindras said:

my estimate if no mlas/ incharge from other party goes to janasena 0 to 1 seats . best case 9 seats. nobody trusting he will be cm . people vote to party which can form government . they either choose tdp or ysrcp. people don't have patience to support unwinnable candidate.

Yes YSRCP+BJP ki vote vesi malli AP lo Rajanna rajyam testham.

Link to comment
Share on other sites

Intlo pellanni mosam chesi videsi lady ki kadupu chesinapudu neethi gurtukuraleda.

 

Prp petti seats istam ani fans ni vadukuni valla hard work ni ignore sesi kotlu ki seats ammukonapudu neeti gurtuku raleda

 

Godavari jalalu vere jilla ki tarlistunarani edupa.seema vallu manushulu kada vallaki hakku leda. Tagu neeru leni godavari districts ahh nee pichi

 

Kulam daggara manishiki 10 lacs vasulu chesi nuvvu neetulu cheptunnava

 

Attarintiki daredi yevaro kavalani release chesaru piracy ani edupulu edchav . Adi chesta idi chesta ani dialogs kottav cinema mileage kosam. Ila kattu kathalu alli batikeddamanena .. victim ani project cheskuni sympathy votes kosam naa murder ki plan chesaru antava.election mundu murder attempt chesentha verri vengalappalu evaru untaru. Nee sollu nee picha sena kuda nammaru.

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...