Jump to content

Ettettaaa..


niceguy

Recommended Posts

ఎస్‌.. అసెంబ్లీ రౌడీ శివాజీలా గెలుస్తా..!
28-09-2018 03:53:55
 
636737037025144643.jpg
  •  నీ మీదే గెలిచి అసెంబ్లీకి రాకపోతే మళ్లీ జనంలో కనిపించను
  •  చావో రేవో దెందులూరులోనే తేల్చుకుందాం..!
  •  పవన్‌ కల్యాణ్‌కు చింతమనేని సవాల్‌
అమరావతి, సెప్టెంబరు 27(ఆంధ్రజ్యోతి): ‘నన్ను అసెంబ్లీ రౌడీ నంటున్నావ్‌..! ఎస్‌.. అసెంబ్లీ రౌడీలో శివాజీ ఎలా గెలిచాడో, అలా నీ మీద గెలిచి అసెంబ్లీకి రాకపోతే.. మళ్లీ జనంలో కనిపించను’ అని దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌కు సవాల్‌ విసిరారు. తాను ఒక సామాన్య కుటుంబానికి చెందిన వాడినని, టీడీపీలో ఉండటం వల్ల రెండుసార్లు ఎమ్మెల్యేనయ్యానని, కోర్టులు కొట్టేయడంతో కేసులు పోయాయని, కేసుల మాఫీ కోసం ప్రభుత్వానికి ఒక్క లెటర్‌ కూడా పెట్టలేదన్నారు. విజయవాడలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
 
దెందులూరు బహిరంగసభలో పవన్‌ కల్యాణ్‌ చేసిన విమర్శలు, ఆరోపణలను తిప్పికొట్టారు. ‘నేను చండాల రాజకీయాలు చేస్తున్నానంటున్నావ్‌. రా..! చావో రేవో దెందులూరులోనే తేల్చుకుందాం. నువ్వే పోటీకి రా! నువ్వు గెలిస్తే నేను ఊరొదిలిపెట్టి వెళ్తా. నేను గెలిస్తే షేక్‌ హ్యాండిచ్చి వెళ్లిపో. లక్షల అభిమానుల నాయకుడివైన నువ్వు సామాన్య ఎమ్మెల్యేపై నీ స్థాయి దిగజారి మాట్లాడుతున్నావ్‌. నాపై 37 కేసులున్నాయని ఎవరో ఇచ్చిన స్ర్కిప్ట్‌ను చదివారు. వాస్తవంగా నాపై ఉన్నవి 3 కేసులే. నేను గనుక పవన్‌వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడితే ఆయన మూడు రోజులు భోజనం చెయ్యలేరు. ఒక పార్టీ అధినేతగా ఉన్న పవన్‌ ఇష్టం వచ్చినట్లు ఆధారాల్లేకుండా మాట్లాడితే ప్రజల్లో చులకన అవుతారు’ అని పేర్కొన్నారు. పవన్‌ కొనుగోలు చేసిన చానల్‌ ద్వారా తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ‘నన్ను ఆకురౌడీ, వీధిరౌడీ అంటున్నారు. ఈ పేర్లు రిజిస్టర్‌ చేయించుకొని భవిష్యత్‌లో సినిమాలకు టైటిల్స్‌ పెట్టుకుంటే బ్రహ్మాండంగా ఉంటుందేమో ఒకసారి ఆలోచించిండి.
 
నటుడిగా పవన్‌ను అభిమానిస్తా. నీ అభిమానులు బాధపడకూడదనే పవన్‌ వ్యక్తిగత విషయాల జోలికి వెళ్లడం లేదు. రాజకీయాల్లో యాక్ట్‌ చేయడమంటే గబ్బర్‌సింగ్‌ సినిమాలోలా నటించడం కాదు’ అని చింతమనేని విమర్శించారు. కనీసం విప్‌కు, చీఫ్‌వి్‌పకు తేడా తెలియదా అని మండిపడ్డారు. రాజకీయ పార్టీ నడుపుతూ దారికిపోయే దానయ్యలా మాట్లాడటం సరికాదన్నారు. ‘పార్లమెంట్‌లో చట్టాలు చేసేది ఎమ్మెల్యేలంటావ్‌. పార్లమెంట్‌లో ఎమ్మెల్యేలుంటారా? నాపై 18 ఏళ్ల అభిమానిని పోటీ పెడతానన్నావ్‌. 18 ఏళ్లుకు ఓటు హక్కు ఉంటుంది. చట్టసభలకు పోటీ చేసే హక్కు రాదని కూడా తెలియదా?’ అని ప్రశ్నలు సంధించారు. ప్రత్యేక హోదా గురించి ఎందుకు మాట్లాడటం లేదని చింతమనేని నిలదీశారు. ఢిల్లీలో నీకు కూడా పాచిపోయిన లడ్డూ ఏమైనా అందిందా? అని ప్రశ్నించారు. ‘ఎక్కడైనా, ఎప్పుడైనా నా రెండో వైపు చూడు. చూసిన తర్వాత నేను నిజంగా రాజ్యాంగేతర శక్తినే అయితే రాజకీయాలు వదిలిపెట్టి వెళ్లిపోతా’ అని అన్నారు. తనపై త్రీమెన్‌ కమిటీ వేయాలన్న డిమాండ్‌పైనా చింతమనేని స్పందించారు. ‘ప్రభుత్వం కమిటీ వేస్తే దానిని రాజకీయం చేసే అవకాశం ఉంది. పవన్‌ స్వయంగా కమిటీ వేసి విచారణ చేపడితే ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా. బహిరంగ విచారణకు సిద్ధంగా ఉన్నా’ అని సవాల్‌ విసిరారు. ‘నన్ను టార్గెట్‌ చేసి మాట్లాడుతున్న పవన్‌.. పులివెందులకెళ్లి జగన్‌పై మాట్లాడగలవా?’ అని నిలదీశారు. తాను దూకుడిగా వెళ్తున్నందునే సీఎం చంద్రబాబు తనపై రౌడీషీట్‌ పెట్టించారని చెప్పారు. ‘నా నియోజకవర్గంలో నేనే హీరోని. పిట్టలదొరలా కాకుండా వాస్తవాలు మాట్లాడాలి’ అని పవన్‌కు హితవు పలికారు.
 
పవన్‌ ఆత్మపరిశీలన చేసుకోవాలి: బొండా ఉమ
ప్రజా సమస్యలపై పోరాడే నేతలపై కేసులు సహజమని.. అటువంటి వారిని రౌడీలు, గూండాలుగా సంబోధించడం సరికాదంటూ టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు పవన్‌ కల్యాణ్‌కు హితవు పలికారు. దెందులూరు ఎమ్మెల్యేపై చేసిన వ్యాఖ్యలకు ఆత్మపరిశీలన చేసుకోవాలని కోరారు. మోదీ, అమిత్‌ షాల రాఫెల్‌ కుంభకోణం, జగన్‌ అవినీతి పవన్‌కు కనిపించడం లేదా అని బొండా ప్రశ్నించారు. టీడీపీతో కలిసి ఉన్నప్పుడు కనిపించని రౌడీయిజం ఇప్పుడు పవన్‌కు కనిపించడం బాధాకరమన్నారు. కాగా.. పవన్‌ కల్యాణ్‌ ఆదేశిస్తే దెందులూరు ఎమ్మెల్యే ప్రభాకర్‌పై పోటీ చేస్తానని ట్రాన్స్‌జెండర్‌ తమన్నా సింహాద్రి స్పష్టం చేశారు. చింతమనేని స్థాయికి తాను చాలని విజయవాడలో పేర్కొన్నారు.
Link to comment
Share on other sites

Probably no party leader has spoken in this cheap manner in a public meeting

 

 

Don't want sting operation on your misdoings - understood

Dont want commenting on your personal relations - understood

Want to attack others personally - understood

Want to make rogue and baseless allegations - understood

Want to take u-turns and completely change course on you theories and ideologies - understood (natural instinct of yours)

Why use "padukovadam" comments - how to understand this!

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...