Jump to content

జైలు నుంచే నామినేషన్ వేస్తా: రేవంత్


Saichandra

Recommended Posts

జైలు నుంచే నామినేషన్ వేస్తా: రేవంత్
27-09-2018 16:30:32
 
636736626342459883.jpg
మహబూబ్‌నగర్: కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి తాను జైలుకెళ్లడం ఖాయమైనట్లుగా వ్యాఖ్యానించారు. కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గిలో ఏర్పాటు చేసిన సభలో ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ.. ‘అన్నీ మంచిగా ఉంటే మళ్లీ వస్తా.. లేదంటే జైలు నుంచే నామినేషన్ వేస్తా’నని చెప్పారు. గురువారం తన ఇళ్లపై జరిగిన ఐటీ దాడుల నేపథ్యంలో రేవంత్ భవిష్యత్‌ను ఊహించి ఈ వ్యాఖ్యలు చేశారు. తాను జైల్లో ఉన్నా.. ఎక్కడున్నా కొడంగల్ నుంచే పోటీ చేస్తానని, తనను 50 వేల మెజార్టీతో గెలిపించాలని కోస్గి ప్రజలను కోరారు. కొడంగల్ ప్రజలపై నమ్మకంతోనే తాను హైదరాబాద్ వెళ్తున్నానని రేవంత్ ఆశాభావం వ్యక్తం చేశారు.
 
 
 
ఇదే తన చివరి ఉపన్యాసం కావొచ్చేమోనన్న సందేహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ను గద్దెదించటమే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తామన్నారు. మోదీ, కేసీఆర్‌ కలిసి అక్రమ కేసులు బనాయిస్తున్నారని ధ్వజమెత్తారు. అందులో భాగంగానే తన నివాసంలో సోదాలు చేపట్టారన్నారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా తన విజయాన్ని అడ్డుకోలేరని రేవంత్ ధీమా వ్యక్తం చేశారు
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...