Jump to content

chintamaneni prabhakar


sonykongara

Recommended Posts

నేను వ్యక్తిగతంగా మాట్లాడితే మూడ్రోజులు అన్నం తినలేవ్ పవన్..!"
27-09-2018 14:22:29
 
636736549515407989.jpg
విజయవాడ: "నేను వ్యక్తిగతంగా మాట్లాడితే మూడ్రోజుల పాటు అన్నం తినలేవ్.." అని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి దెందలూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వ్యాఖ్యానించారు. పవన్ తనపట్ల చేసిన ఆరోపణలపై చింతమనేని గురువారం విజయవాడలో మీడియా సమావేశం నిర్వహించారు.
 
 
ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.." పవన్ నన్ను ‘ఆకు రౌడీ’, ‘వీధి రౌడీ’ అంటున్నారు. ఈ పేర్లు రిజిస్టర్ చేయించుకుని భవిష్యత్తులో సినిమాలకు ఈ టైటిల్స్ పెట్టుకుంటే బ్రహ్మాండంగా ఉంటుందేమో ఒక్కసారి ఆలోచించండి. నటుడిగా పవన్‌ను అభిమానిస్తాను.. నీ ఫ్యాన్స్ ఎవరూ బాధపడకూడదనే ఉద్దేశంతో నేను మీ వ్యక్తిగత విషయాల జోలికి పోదల్చుకోలేదు. నా వ్యక్తిగత విషయాలతో ఈ రాష్ట్రానికి నన్ను పరిచయం చేయాలని పవన్ చాలా తాపత్రయం పడుతున్నారు. రాజకీయాల్లో యాక్ట్ చేయడమంటే.. గబ్బర్ సింగ్‌లాగా సినిమాల్లో యాక్ట్ చేయడం కాదు. నేను వ్యక్తిగతంగా మాట్లాడితే మూడ్రోజుల పాటు మీరు అన్నం తినలేరు.
 
కనీసం విప్‌కు.. చీఫ్ విప్‌కు మీకు తేడా తెలియదు. నాకు చంద్రబాబు ఇచ్చింది విప్.. మీరేమో చీఫ్ విప్ అని చెబుతున్నారు. ఆ మాత్రం అవగాహన ఉండదా?. రాజకీయ పార్టీని నడుపుతున్నామంటే ఊరికే యాగా బోగీగానా?.. దారిన పోయే దానయ్య లాగా నువ్వు మాట్లాడటానికి సరిపోవ్. నువ్వు రాష్ట్ర పార్టీకి అధ్యక్షుడివి. దేశంలో ప్రధాన సమస్యలు చాలానా ఉన్నాయ్. ముఖ్యంగా హోదా గురించి ఎందుకు మాట్లాడలేకపోతున్నావ్.. ఢిల్లీలో నీకు కూడా పాచిపోయిన లడ్డూ ఏమైనా అందిందా? " అని పవన్‌పై చింతమనేని వరుస ప్రశ్నలు సంధించారు.
Link to comment
Share on other sites

ఎందుకు చెప్పలేకపోతున్నావ్ పవన్..?: చింతమనేని
27-09-2018 13:01:37
 
636736500995140185.jpg
విజయవాడ: ఇటీవల దెందలూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు స్పందించిన చింతమనేని గురువారం విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. " పవన్ చేసిన ఆరోపణలు రుజువు చేస్తే దేనికైనా నేను సిద్ధమే. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదవడం మాని.. ఇప్పటికైనా అవగాహనతో మాట్లాడాలి. సమస్యల మీద ప్రశ్నిస్తానంటున్నావ్. నువ్వు ప్రత్యేక హోదా గురించి ఎందుకు ప్రశ్నించలేకపోతున్నావ్..?. జనసేన పార్టీ అధికారంలోకి వస్తే ఈ పనిచేస్తాను.. ఆ పనిచేస్తాను అని ఎందుకు జనాలకు చెప్పలేకపోతున్నావ్..?. పవన్ నా నియోజకవర్గంలో అడుగు పెట్టారు చాలా సంతోషం.
 
నీ నియోజకవర్గం నుంచే నేను పోటీ చేస్తానని నన్ను శిశుబాలుడితో అభివర్ణించావ్.. అసలు నువ్వు శ్రీ కృష్ణుడివో.. నేను శ్రీకృష్ణుడినో తెలియాలంటే నువ్వు నా మీద పోటీ చెయ్. అప్పుడు నా నియోజకవర్గ ప్రజలు సరైన తీర్పును ఇస్తారు. ఆ రకంగా నన్ను రాజకీయంగా ఎదుర్కో.. తప్పులేదు. ఇంత చెండాలుడిని రాజకీయాల నుంచి తరమటం నీ బాధ్యత అయినప్పుడు నువ్వే పోటీ చెయ్. రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యేపైన ఇంతగా గురిపెట్టలేదు.. ఒక్క దెందలూరు ఎమ్మెల్యేపైనే గురిపెట్టావ్ గనుక.. రా చావో రేవో దెందలూరులోనే తేల్చుకుందాం" అని పవన్‌కు చింతమనేని సవాల్ విసిరారు. అయితే ప్రభాకర్ వ్యాఖ్యలపై పవన్ ఎలా స్పందిస్తారో అన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
 
 
 
 
 
 
 
 
 
 
Tags : chintamaneni prabhakar, Pawan Kalyan, counter
Link to comment
Share on other sites

నటుడిగా పవన్ అంటే నాకు అభిమానమే: చింతమనేని
27-09-2018 13:41:50
 
636736525120028953.jpg
 
విజయవాడ: జనసేన అధినేత పవన్ కల్యాణ్.. నటుడిగా ఆయన అంటే తనకు అభిమానమని టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ అన్నారు. నిన్న పవన్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ నాణేనికి ఒక పక్కనే చూశారని.. రెండో పక్క చూస్తే తట్టుకోలేరని అన్నారు. తాను ఎవరి పట్ల రౌడీయిజం ప్రవర్తించానో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సరికాదన్నారు. చిన్న గల్లీలో మీటింగ్‌ పెట్టుకుని వ్యక్తిగత విషయాలను మాట్లాడనని ఆయన అన్నారు.
 
రాఫెల్‌ కుంభకోణం గురించి పవన్ కల్యాణ్ ఒక్కసారైన నోరు విప్పారా? అని చింతమనేని ప్రశ్నించారు. దిగజారిపోయి బజారునాయకుడిలా మాట్లాడే పరిస్థితి ఎందుకొచ్చిందన్నారు. తాను రాజ్యాంగ వ్యతిరేక వ్యక్తినని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నారు. పార్లమెంటులో ఎవరుంటారో తెలియని నాయకుడు పవన్‌కళ్యాణ్‌ అని చింతమనేని ఎద్దేవా చేవారు. పులివెందుల వెళ్లి వైసీపీ అధ్యక్షుడు జగన్‌ను ప్రశ్నించగలవా? అంటూ చింతమనేని.. పవన్‌కు సవాల్ చేశారు.
Link to comment
Share on other sites

నాపై పోటీ చేసి గెలువు.. పవన్‌కు చింతమనేని సవాల్
27-09-2018 12:47:51
 
636736492731982550.jpg
విజయవాడ: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనపై వచ్చిన ఆరోపణలపై మీకు ఇష్టమొచ్చిన కమిటీ వేసుకోండని ఆయన సవాల్ చేశారు. ఆరోపణలపై వాస్తవాలు తెలుసుకోకుండా.. తనను హత్య చేయడానికి ప్రయత్నించిన వ్యక్తులతో కలిసి పని చేస్తున్నారని విమర్శించారు. పవన్ కల్యాణ్ పార్టీ అధినేత స్థాయి నుంచి నియోజకవర్గ కో-ఆర్డినేటర్ స్థాయికి పడిపోయారని చింతమనేని విమర్శించారు.
 
ఆయన ఇంకేమన్నారంటే.. ‘నువ్వు నాపై పోటీ చేయి. చావో రేవో దెందులూరులోనే తేల్చుకుందాం. నువ్వు గెలిస్తే.. పవన్ కల్యాణ్ లాంటి వ్యక్తిపై పోటీ చేసి ఓడిపోయానని అనుకుంటా. నీ విజయోత్సవంలో పాల్గొంటా.. నేను గెలిస్తే షేక్ హ్యాండ్ ఇవ్వు చాలు అంతే..’ అంటూ పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
 
 
‘18 ఏళ్లు నిండిన వ్యక్తిని చట్టసభల్లోకి పంపుతా అంటున్నారు. అతను అనర్హుడని మీకు  తెలియదా.? నీ టీవీలో అసెంబ్లీ రౌడీ అని ప్రచారం చేస్తున్నారు. నా కుమారుడు అది చూసి నన్ను ప్రశ్నించాడు. అసెంబ్లీ రౌడీ సినిమాలో శివాజీ ఎలా గెలిచాడో... నేను కూడా అలాగే గెలిచి వస్తా. రాష్ట్రంలో నన్ను ఒక్కడినే టార్గెట్ చేస్తున్నావు. జగన్, వైసీపీ నేతలపై కేసులు ఉన్నాయి. పులివెందులలో కూడా ఇలా ప్రశ్నించగలవా?’ అంటూ పవన్‌పై చింతమనేని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. 
 
బుధవారం దెందులూరులో పర్యటించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్... ఎమ్మెల్యే చింతమనేనిపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. చింతమనేనిపై చాలా కేసులున్నా .. రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పవన్ ఆరోపించారు. విదేశాల్లో అయితే పర్యవసనాలు తీవ్రంగా ఉండేవని వ్యాఖ్యానించారు. వీటన్నింటికీ కౌంటర్‌గానే పవన్‌కు ఎమ్మెల్యే చింతమనేని సవాల్ విసిరారు.
 
Tags : Janasena, Pawan Kalyan, TDP, chintamaneni prabhakar
Link to comment
Share on other sites

Prabha comments ki Baga hurt అయ్యాడు le, nee annane నే dobbalenodivi, దమ్ముంటే పోటీ cheyyi నా మీద ఈ రెండు బాగా hurt చేశాయి pichodini, దానికి vugipoyadu... ప్రభ daggara talking skills baane వుంటాయి.. Minister avvalsinodu.. 

Link to comment
Share on other sites

2 minutes ago, ramntr said:

Prabha comments ki Baga hurt అయ్యాడు le, nee annane నే dobbalenodivi, దమ్ముంటే పోటీ cheyyi నా మీద ఈ రెండు బాగా hurt చేశాయి pichodini, దానికి vugipoyadu... ప్రభ daggara talking skills baane వుంటాయి.. Minister avvalsinodu.. 

kopam haddula lo unte  super anattu, chala gattiga matladedu..

Link to comment
Share on other sites

పవన్‌కల్యాణ్‌ ఆరోపణలు అవాస్తవం: చింతమనేని

12420827BRK83A.JPG

విజయవాడ: జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ తనపై ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్నారని దెందులూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ చింతమనేని ప్రభాకర్‌ అన్నారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవన్‌ స్థాయిని దిగజార్చుకుని తనపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధి చూసిన తర్వాత పవన్‌ మాట్లాడాలని అన్నారు. తనపై 37 కేసులున్నాయని పవన్‌ తప్పుడు ఆరోపణలు చేశారని.. వాస్తవంగా తనపై ఉన్నవి 3కేసులు మాత్రమే ఉన్నాయని తెలిపారు. పవన్‌కల్యాణ్‌ వ్యక్తిగత విషయాల గురించి తాను మాట్లాడితే ఆయన మూడు రోజులు భోజనం చేయరని అన్నారు. ఓ పార్టీకి అధినేతగా ఉన్న పవన్‌ ఇష్టం వచ్చినట్లు ఆధారాలు లేకుండా మాట్లాడితే ప్రజల్లో చులకన అవుతారని చింతమనేని అన్నారు. తాను రాజ్యాంగశక్తినని పవన్ నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్‌ చేశారు. పవన్‌ తాను కొనుగోలు చేసిన ఛానల్‌ ద్వారా తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

పవన్‌కల్యాణ్‌ పశ్చిమగోదావరి జిల్లా దెందులూరులో బుధవారం రాత్రి నిర్వహించిన పోరాటయాత్ర బహిరంగ సభలో స్థానిక ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. శాసనసభ్యులను క్రమశిక్షణలో పెట్టాల్సిన ప్రభుత్వ విప్‌ చింతమనేని ప్రభాకర్‌ క్రమశిక్షణ తప్పితే ఏమనాలి?, 27 కేసులున్న వ్యక్తిని ప్రభుత్వ విప్‌గా పెట్టారంటే ముఖ్యమంత్రిని ఏమనాలి? అతను స్థానికంగా భయభ్రాంతులకు గురిచేస్తున్నా పట్టించుకోకపోతే ఏమనాలి? కొల్లేరు భూములను చేపల చెరువులుగా మార్చేశారు.. ప్రైవేటు ఆస్తులను అన్యాక్రాంతం చేశారు... మనుషులను కొట్టడం, ఆడపడుచులపై దాడిచేయడం, ఎస్సీలపై దాడులు ఇన్ని చేస్తున్నా మీరు పట్టించుకోకపోతే ఏమనాలి? అంటూ పవన్‌ ప్రభుత్వాన్ని నిలదీశారు.

Link to comment
Share on other sites

పవన్‌ వ్యాఖ్యలపై మండిపడ్డ బోండా ఉమ
01270227BRK87A.JPG

విజయవాడ: తెలుగుదేశం పార్టీ రౌడీ ఎమ్మెల్యేలను ప్రోత్సహిస్తోందంటూ జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను విజయవాడ సెంట్రల్ శాసనసభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు తిప్పికొట్టారు. ఓ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న పవన్ కల్యాణ్ తన వ్యాఖ్యలను బేరీజు వేసుకుని మాట్లాడాలని సూచించారు. దెందులూరు శాసన సభ్యుడు చింతమనేని ప్రభాకర్‌పై ఆయన చేసిన ఆరోపణలు సరికావని అభిప్రాయపడ్డారు. ప్రతిపక్షంలో ఉండగా చేసిన రాజకీయ పోరాటాలపై పెట్టిన కేసులనే పవన్ ఎత్తి చూపిస్తున్నారని.. ఏ రాజకీయ నాయకుడిపై అయినా అలాంటి కేసులు ఉండటం సహజమని అన్నారు. మూడేళ్లపాటు టీడీపీతో కలిసి పనిచేసిన పవన్‌కు ఇప్పుడే కేసులు కనిపించాయా అని బోండా ప్రశ్నించారు. మహిళా అధికారిపై దాడులు చేశారంటూ వ్యాఖ్యానించిన పవన్ అందులో వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని సూచించారు. ఓ రాజకీయ పార్టీ అధినేతగా పవన్ విజ్ఞత ప్రదర్శించాలని హితవు పలికారు.

 

Link to comment
Share on other sites

నిన్న దెందులూరులో పవన్ కళ్యాణ్ వీరావేశంతో చింతమనేని పై సవాల్ విసరడంతో చింతమనేనికి బాగా క్లోజ్ గా ఉండేఒక జర్నలిస్టు ఆయన అభిప్రాయం తెలుకుందామని చింతమనేని ఇంటికి వెళ్లాడు .అక్కడ పొద్దున్నే 10 అయినా కూడా చింతమనేని నిద్ర లేకపోవడం తో సెక్యూరిటీ వాళ్ళని అడిగాడు. సారు గదిలో నుంచి బయటకు రావడం లేదని చెప్పడంతో జర్నలిస్ట్ ధైర్యం చేసి చింతమనేని దగ్గరకు వెళ్ళాడు. ఆ సమయంలో చింతమనేని గజగజ వణికిపోతూ భయపడుతున్నాడు.

జర్నలిస్టు: ఏంటి సార్ ఇలా ఉన్నారు ఉన్నారు

చింతమనేని: (వణికిపోతూ..) నాకు చాలా భయంగా ఉంది. ఆ జనసైనికులు ఎక్కడ వచ్చి నలిపేస్తారని భయంగా వుంది. మూతి మీద మీసం రాని కుర్రోడు ఎక్కడ నిలబడి నన్ను ఓడిస్తాడోనని వణుకు పుడుతోంది. బయటకు వెళ్దామంటే రోడ్డుపైన ఎక్కడ గేదెలు ..ఎద్దులు... పొడుస్తాయో...ఎవరన్నా వాటిని నా పైకి ఉసిగొలిపారేమోనని భయంగా ఉంది. అందుకే గేదెలు తిరిగే టైం లో బయటకు వెళ్లడం లేదు. రాత్రిపూట కరెంటు పోతే నన్ను మర్డర్ చేస్తారేమోనని భయపడి ఇంటి చుట్టూ లైటింగ్ పెట్టించాను.ఒకటికి రెండు జనరేటర్లు పెట్టమని మన వాళ్లకి చెప్పాను .అలాగే ఈ గన్మెన్లు పోలీసులు సరిపోరు.. ఓ.. 40 మంది దిట్టంగా ఉన్న బౌన్సర్లను తెమ్మని చెప్పాను.. అప్పుడే బయటకు వస్తాను.

జర్నలిస్ట్ :ఊరుకోండి సార్ ఎవరు నమ్ముతారు...? చింతమనేని: అదేంటి నువ్వు నమ్మడం లేదా ..?
జర్నలిస్ట్ :ఇలా మాట్లాడితే కామెడీగా ఉంటుంది.

చింతమనేని :అదేంటి నిన్న ఒకడు దెందులూరు సెంటర్ కొచ్చి అంత పెద్ద కామెడీ చేస్తే అందరూ నమ్మారు.. కామెడీలు ఆడే చేయాలా నేను చేయకూడదా...

జర్నలిస్ట్ నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు

Link to comment
Share on other sites

3 hours ago, BalayyaTarak said:

PK and his party formula,  Do some allegations in each constituency MLA and pack up, tarvata vallu iche explanation or challenge ki PK or any of his party spokepersons nunchi em response undadu.

Which is exactly in line with GVL and other BJP leaders formula. BJP + PK strategy idi.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...