Jump to content

ED raids


krish2015

Recommended Posts

రేవంత్‌రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు
27-09-2018 09:06:40
 
636736360016263937.jpg
హైదరాబాద్: కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ఇళ్లలో ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు సోదాలు చేస్తున్నారు. గురువారం ఉదయం నుంచి రేవంత్‌రెడ్డితో పాటు అతడి సోదరుల ఇళ్లలోనూ సోదాలు కొనసాగుతున్నాయి. మొత్తం మూడు చోట్ల ఈడీ సోదాలు చేస్తోంది. హైదరాబాద్‌తో పాటు కొడంగల్ ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. సోదాలు జరుగుతున్న చోట్ల కుటుంబసభ్యుల ఫోన్లను అధికారులు స్విచ్ ఆఫ్ చేయించారు.
 
2015 ఎమ్మెల్సీ ఎలక్షన్లలో ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సెన్‌కు రూ.కోటి డీల్‌ కుదిర్చారని రేవంత్‌పై గతంలో ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. అప్పట్లో పక్కా సమాచారం అందుకున్నఏసీబీ అధికారులు రంగంలోకి దిగి కేవలం రూ.50లక్షలు మాత్రమే స్వాధీనం చేసుకున్నారు. అయితే మిగిలిన మొత్తం కూడా బదిలీ అయిన విషయాన్ని ఏసీబీ గుర్తించలేదు. కొద్దిరోజుల క్రితం ఈ కేసును ఏసీబీ అధికారులు ఈడీకి అప్పగించింది. ఇందులో భాగంగా ఈడీ అధికారులు రేవంత్‌రెడ్డి ఇళ్లతో పాటు కార్యాలయాలపై సోదాలు చేపట్టింది.
 
కొద్ది రోజుల క్రితం జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో అక్రమాలు జరిగాయంటూ జూబ్లీహిల్స్ పోలీసులు రేవంత్‌రెడ్డికి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే అసెంబ్లీ రద్దు అనంతరం తనపై దాడులు జరుగుతాయంటూ రేవంత్‌రెడ్డి ఆరోపణలు చేసిన తర్వాతే ఈడీ సోదాలు జరగడం గమనార్హం. 
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...