Jump to content

Polavaram right canal to Eluru canal Link


sonykongara

Recommended Posts

గోదారి నీరు నేరుగా కృష్ణా కాలువకు
పోలవరం కుడి కాలువ నుంచి ఏలూరు కాలువకు సంధానం
  80 వేల ఎకరాల స్థిరీకరణ లక్ష్యం
  రూ.15.45 కోట్ల అంచనా వ్యయం
  ఆర్థిక శాఖకు చేరిన దస్త్రం
ఈనాడు-అమరావతి

 

పోలవరం కుడి కాలువను, కృష్ణా ఏలూరు కాలువతో అనుసంధానించి ఆ కాలువ కింద ఉన్న 80 వేల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించేందుకు ప్రణాళిక సిద్ధమైంది. ఇందులో భాగంగా పోలవరం కుడి కాలువ 137.290 కిలోమీటరు వద్ద ఉన్న అండర్‌టన్నెల్‌ సమీపం నుంచి ఏలూరు కాలువ 36వ కిలోమీటరు వద్దకు మరో కాలువ తవ్వనున్నారు. ఇలా చేయడం వల్ల కృష్ణాలో నీళ్లు లేని సమయంలో గోదావరి జలాలు ప్రకాశం బ్యారేజీకి వెళ్లి మళ్లీ ఏలూరు కాలువకు తిరిగి ప్రయాణించి వచ్చేవరకు అయ్యే ఆలస్యాన్ని నివారించవచ్చని అధికారులు యోచిస్తున్నారు. ఏలూరు కాలువ ఆధునికీకరణ పూర్తి కాని పరిస్థితుల్లో పైనుంచి జరుగుతున్న ప్రవాహ నష్టాలను కూడా నివారించవచ్చనేది జలవనరుల శాఖ ప్రణాళిక. దీనికి అనుగుణంగా అధికారులు రూపొందించిన అంచనాల నివేదిక ప్రస్తుతం ఆర్థిక శాఖ పరిశీలనలో ఉంది. మొత్తం రూ.15.45 కోట్ల అంచనా వ్యయంతో ఈ పనులు చేపట్టేందుకు ప్రణాళిక రూపుదిద్దుకుంది.

ప్రస్తుత పరిస్థితి
* 1957లో ప్రకాశం బ్యారేజీ నిర్మించిన సమయంలో కృష్ణా డెల్టా ఆయకట్టును 13.08 లక్షల ఎకరాలకు పెంచారు. ఏలూరు కాలువ కింద నీరందించే ఆయకట్టును 1,15,000 ఎకరాలకు పెంచారు. మొత్తం 1643 క్యూసెక్కుల నీటిని తీసుకెళ్లాలన్నది ఆలోచన. ఆ స్థాయిలో నీటిని తీసుకువెళ్లేలా సీఎంసీడీ పనులు చేపట్టలేదు. ప్రకాశం బ్యారేజీలో పూర్తి స్థాయి నీరున్న సమయంలోనూ చివరి ఆయకట్టుకు నీరందడం ఇబ్బందిగా మారుతోంది. ఈ పరిస్థితుల్లో ఏలూరు కాలువలో 1300 క్యూసెక్కులకు మించి నీటిని వదిలితే ఎనికేపాడు అక్విడక్టు వద్ద పొంగి పొర్లి వృథా అవుతోంది.
* 2008లో చేపట్టిన కృష్ణా డెల్టా ఆధునికీకరణలో భాగంగా మట్టి పనులు మాత్రమే చేపట్టారు. దీంతో ఆయకట్టుదారులు ఇబ్బంది పడుతున్నందున తాజా ప్రతిపాదన వెలుగులోకి వచ్చింది.
* పోలవరం కుడి కాలువ ద్వారా కృష్ణా డెల్టాలోని 13.08 లక్షల ఎకరాల ఆయకట్టుకు 80 టీఎంసీల నీటిని ఇస్తున్నారు. ప్రస్తుతం ఏలూరు కాలువ కింద ఉన్న 1,15,000 ఎకరాలు ఇందులోకి వస్తుంది. అంపాపురం దిగువన ఏలూరు కాలువలో 80 వేల ఎకరాల ఆయకట్టుంది. ఈ ఆయకట్టుకు 100 డ్యూటీ కింద 800 క్యూసెక్కుల నీరు మళ్లించగలిగితే ఆయకట్టు స్థిరీకరణ సాధ్యమవుతుందన్నది తాజా ప్రణాళిక. ఇందులో భాగంగా పోలవరం కుడి కాలువను, ఏలూరు కాలువను దిగువ పేర్కొన్న తరహాలో అనుసంధానిస్తారు.
1. పోలవరం కుడి ప్రధాన కాలువ కృష్ణా జిల్లా బాపులపాడు మండలం బండారిగూడెం గ్రామం మీదుగా ప్రవహిస్తోంది. అక్కడ 137.315 కిలోమీటరు వద్ద స్థానిక వాగును ఈ కాలువ దాటేలా అండర్‌టన్నెల్‌ ఇప్పటికే నిర్మించారు. ఈ వాగు పోలవరం కాలువపై ఉన్న అండర్‌టన్నెల్‌ ద్వారా కాలువను దాటి అంపాపురంలోని మల్లిగని చెరువులోకి నీటిని చేరుస్తుంది. ఈ అండర్‌టన్నెల్‌ నుంచి చెరువు వరకు 3.4 కిలోమీటర్ల దూరం ఉంటుంది.
2. తాజా ప్రణాళికలో భాగంగా పోలవరం కుడి కాలువ ఎడమ వైపున 137.290 కి.మీ. వద్ద ఒక ఎస్కేప్‌ నిర్మించి పోలవరం కుడి కాలువ నుంచి గోదావరి నీటిని ఈ వాగులోనే పోసి అంపాపురం వద్దకు మళ్లిస్తారు. ప్రస్తుతం వాగు నాలుగు మీటర్ల వెడల్పున ఉంటుంది. స్థానిక ప్రవాహాలతో పాటు కలిపి 800 క్యూసెక్కులను తీసుకెళ్లేలా ఈ కాలువను వెడల్పు చేస్తారు. తిరిగి ఆ చెరువు నుంచి రెండు కి.మీ. పొడవునా కాలువ తవ్వి ఏలూరు కాలువలో 37.208 కి.మీ.వద్ద ఉన్న వీరవల్లి అండర్‌టన్నెల్‌ వద్ద కలుపుతారు. భారీ వర్షాల సమయంలో అదనపు జలాలుంటే బుడమేరు డ్రెయిన్‌కు మళ్లిస్తారు.

Edited by sonykongara
Link to comment
Share on other sites

మరో అనుసంధానానికి శ్రీకారం
26-09-2018 07:35:11
 
636735441129070505.jpg
  • పోలవరం కుడి కాలువను ఏలూరు కాలువకు అనుసంధానం చేస్తూ లింక్‌ చానల్‌ నిర్మాణం
  • రూ. 15 కోట్ల నిధులు విడుదల
  • లక్షా 15 వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ
 
విజయవాడ: ప్రభుత్వం మరో అనుసంధానానికి శ్రీకారం చుట్టింది. పోలవరం కుడి కాలువను ఏలూరు కాలువకు అనుసంధానం చేస్తూ లింక్‌ చానల్‌ నిర్మాణానికి రూ.15 కోట్లు నిధులు కేటయించింది. దీంతో కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలకు సాగు, తాగు నీటి కష్టాలు తీరుతాయి. 700 క్యూసెక్కులతో లింక్‌ కెనాల్‌ ఏర్పాటు చేయనుంది. దీని వల్ల కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల ప్రజల కష్టాలు తీరనున్నాయి. పోలవరం నుంచి వచ్చే పట్టిసీమ కాల్వ, ఏలూరు కాల్వ ఐదో కిలో మీటర్ల వరకు సమాంతరంగా ప్రయా ణిస్తాయి. పట్టిసీమ నుంచి వచ్చే గోదావరి నీరు కృష్ణానదిలో కలసి అక్కడ నుంచి ప్రకాశం బ్యారేజీకి చేరుతుంది.
 
ఈ కాల్వ ఏలూరు వరకు వెళుతుంది. ఈ మధ్యలో జిల్లాలోని గన్నవరం, బాపులపాడు, మండలాలతో పాటు పెదపాడు, ఏలూరు, పెదవేగి, భీమడోలు మండలాలకు చెందిన వేల ఎకరాల సాగుకు కూడా ఏలూరు కాల్వ నీరే అవసరం. దీని కింద రెండు జిల్లాల్లో కలిపి లక్షా 16 వేల ఎకరాలు సాగులో ఉంది. ఏలూరు కాల్వ పూర్తి సామర్థ్యం 1643 క్యూసెక్కులు ఉన్నప్పటికీ గ్రావిటీ తక్కువగా ఉండటంతో ఏటా కాల్వ చివరి భూములకు నీరు అందదు. ప్రతి ఏటా ఈ కాల్వ కింద ఉన్న సాగులో వేలాది ఎకరాలకు నీరు అందక పంటలు పండటం లేదు. దీనికి తోడు కాల్వగట్ట్టుపై నివసించే ప్రజలు విడుదల చేసే మల, మూత్రాదులు, మురుగు, చెత్తాచెదారం వంటి వ్యర్థాలన్నీ నేరుగా ఏలూరు కాల్వలో కలుస్తాయి. అదే నీరు కిందకు వెళుతుంది. ఈ నీరే కింది గ్రామాల ప్రజలకు తాగునీరు కూడా అవడంతో ఆరోగ్య సమస్యలు తలెత్తు తున్నాయి. ప్రజలు, రైతుల నుంచి ప్రత్యామ్నాయం అడుగు తున్నారు. పోలవరం కాల్వ, ఏలూరు కాల్వను కలుపుతూ లింక్‌ కెనాల్‌ ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ చాలా కాలంగా ఉంది. ఇన్నాళ్లకు అది నెరవేరనుంది.
 
నీటి ఆవిరి నష్టాలు తగ్గుతాయి
పట్టిసీమ ద్వారా గోదావరి నుంచి 80 టీఎంసీల నీరు తీసుకు రావడానికి పోలవరం కుడి కాల్వను డిజైన్‌ చేశారు. దీని ద్వారా 13.08 లక్షల ఎకరాల ఆయకట్టు స్థ్ధిరీకరణ అవుతోంది. గోదావరి నుంచి వచ్చే జలాలను ప్రకాశం బ్యారేజీ వద్ద ఉన్న రెగ్యులేటర్‌ ద్వారా మూడు కాల్వలకు విడుదల చేస్తారు. ఇందులో ఏలూరు కాల్వకు విడుదలయ్యే 1650 క్యూసెక్కుల ద్వారా 1.15 లక్షల ఎకరాలు సాగవుతోంది. జిల్లాలో 57 వేల ఎకరాలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 58 వేల ఎకరాలకు ఏలూరు కాల్వ నీరే ఆధారం. పట్టిసీమ లిఫ్ట్‌ నుంచి రోజుకు 8400 క్యూసెక్కుల నీరు పోలవరం కుడి కాల్వ ద్వారా వస్తుంది. అయితే ప్రవాహ సమయంలో నీటి ఆవిరి నష్టాల వల్ల కృష్ణానదికి చేరే సరికి 7200 క్యూసెక్కులు మాత్రమే వస్తుంది.
 
పంట నష్టం 20 కోట్లు
ఏలూరు కాల్వలో పూర్తి సామర్థ్యం మేరకు నీటి పారుదల లేకపోవడంతో గత కొన్నేళ్లుగా గన్నవరం, బాపులపాడు మండలాలలతో పాటు పశ్చిమ గోదావరిలోని పెదపాడు, ఏలూరు, పెదవేగి, భీమడోలు మండలాలలో పంటలు సక్రమంగా పండటం లేదు. పశ్చిమ గోదావరి జిల్లాలోని నాలుగు మండలాలలో ఏలూరు కాల్వ కింద 58 వేల ఎకరాలకు గాను 2016 - 17లో 18 వేల ఎకరాలు మాత్రమే సాగైంది. అలాగే గన్నవరం, బాపులపాడు మండలాల్లో సుమారు 8 వేల ఎకరాల లోపు పంటలు పండలేదు. ఏలూరు కాల్వను పోలవరం కాల్వతో అనుసంధానం చేసి డైరెక్ట్‌గా నీటిని తీసుకోవడం వల్ల సాగునీటి ఇబ్బందులు తప్పుతాయి. లింక్‌ కెనాల్‌ అభివృద్ధికి ప్రభుత్వం పెడుతున్న రూ. 15 కోట్ల ఖర్చు ఒక్క ఏడాదిలోనే తిరిగి సమకూర్చుకునే అవకాశం ఉందని రైతు నాయకుడు చలసాని ఆంజనే యులు అన్నారు. లింక్‌ కెనాల్‌ మంజూరుకు గన్నవరం ఎమ్మెల్యే వంశీమోహన్‌ కృషి చేసినందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
 
 
 
లింక్‌ కెనాల్‌ ద్వారా ఏలూరు కాల్వకు 700 క్యూసెక్కులు
పోలవరం కుడి కాల్వతో ఏలూరు కాల్వను కలపడానికి అంపాపురం సమీపంలోవాగును లింక్‌ కెనాల్‌గా అభివృద్ధి చేసి రెండు కాల్వలను కలుపుతారు. లింక్‌ కెనాల్‌ ద్వారా 700 క్యూసెక్కుల పట్టిసీమ జలాలను సుమారు ఐదో కిలో మీటర్లు తీసుకువెళ్లి నేరుగా ఏలూరు కాల్వలో కలుపుతారు. దీని వల్ల నీటి ప్రవాహ నష్టాలు కూడా తగ్గుతాయని అధికారులు అంటున్నారు. ఏలూరు కాల్వను నేరుగా పోలవరం కాల్వకు కలపడం వల్ల సమయం కూడా తగ్గుతుంది. బాపులపాడు పక్క నుంచే పోలవరం కాల్వ వెళుతున్నా దాదాపు 80 నుంచి వంద కిలో మీటర్లు చుట్టూ తిరిగి వస్తేకాని ఏలూరు కాల్వ ద్వారా కింది ప్రాంతాలకు నీరు చేరదు. రెండు కాల్వలను కలిపితే ఆ పరిస్ధితి ఉండదు. కలుషిత నీటి బదులుగా ప్రజలకు సురక్షిత నీరు తాగునీరుగా అందించవచ్చు.
 
అంపాపురం సమీపంలో పోలవరం కాల్వ, ఏలూరు కాల్వల మధ్య ఉన్న వాగును 700 క్యూసెక్కుల ప్రవాహానికి అనుగుణంగా అభివృద్ధి చేస్తారు. ఇందులో భాగంగా అంపాపురం వద్ద 106 ఎరాలలో ఉన్న మల్లిగారి ట్యాంకు వద్ద రెగ్యులేటర్‌ను నిర్మిస్తారు. అంపాపురం దిగువలో ఏలూరు కాల్వమీద మరో రెగ్యులేటర్‌ను నిర్మించి మధ్యలో రెండు చోట్ల ఫుట్‌ బ్రిడ్జిల నిర్మాణాలను కూడా చేపట్టవలసి ఉంటుంది. మధ్యలో 7 డ్రాపులు, రెండు కల్వర్టులను కూడా నిర్మించాల్సి ఉంది. లింక్‌ కెనాల్‌కు 15 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేయడంతో ఇరిగేషన్‌ అధికారులు టెండర్లు పిలవడానికి సన్నాహాలు చేస్తున్నారు. వీలైనంత త్వరగా టెండర్లు పూర్తి చేసి పనులు ప్రారంభిస్తామని ఈఈ వేణుగోపాల్‌ చెప్పారు.
Link to comment
Share on other sites

This smallthing cost is just 15 crores onetime ...Benefit is more than 400+ crores every year and more water to prakasam...I wish they do the same for Bandar canal&other of krishna district

 

+ Godavari Krishna river merge count reduced by 700 cusecs(so not counted in usage)

+ 700 cusecs extra can be taken to prakasam as canal capacity goes down from Bapulapadu

+ 700 cusecs travel distance reduced by 100 KM

 

tenor.gif

Edited by AnnaGaru
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...