Jump to content

Araku MLA Kidari Sarveswar Rao Shot Dead by Maoists


koushik_k

Recommended Posts

  • Replies 296
  • Created
  • Last Reply
వనంలో వార్‌.. నక్సల్స్‌పై మూకుమ్మడి దాడికి పోలీస్‌ ప్లాన్‌
03-10-2018 03:22:21
 
636741518347236877.jpg
  • ఏవోబీలో సభ పెట్టి నక్సల్స్‌ సవాల్‌
  • రెండున్నర గంటలపాటు భేటీ
  • బోర్డర్‌ దాటి బదులిద్దాం
  • ఏపీ, ఒడిసా, ఛత్తీస్‌గఢ్‌ యోచన
  • రేపు కీలక భేటీ.. వెళుతున్న డీజీపీ
  • బలగాలనివ్వాలని కేంద్రానికి వినతి
మన్యంలో దాడి జరిపిన పది రోజులకే నక్సల్స్‌ భారీ సభ! వార్‌ను వన్‌సైడ్‌ చేసి, వారి కోటల్లోనే వేటాడటానికి ఏపీ పోలీసుల భారీ సన్నద్ధత! దీంతో వనంలో మహా రణానికి రంగం సిద్ధమయినట్టే!
 
 
అమరావతి, నర్సీపట్నం, అక్టోబరు 2(ఆంధ్రజ్యోతి): ఉనికే లేదనుకున్న మావోయిస్టులు పట్టపగలు ఎమ్మెల్యేని కాల్చి చంపడాన్ని ఏపీ పోలీసులు జీర్ణించుకోలేక పోతున్నారు. ప్రతీకారం తీర్చుకోవాలని రగిలి పోతున్నారు. అందుకు అనుగుణంగా వ్యూహరచన చేస్తున్నారు. అందులోభాగంగా పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన మావోయిస్టులపై అక్కడికి వెళ్లి దాడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. దానికోసం ఛత్తీ్‌సగఢ్‌, ఒడిసా బలగాలతో సమన్వయం చేసుకోబోతున్నారు. కేంద్రం నుంచి అందే సాయాన్నీ కూడగట్టుకొని మావోయిస్టులను చావుదెబ్బ తీసేందుకు రంగం సిద్ధం చేసుకొన్నారు. మావోయిస్టులపై మూకుమ్మడిగా ఉమ్మడి కార్యాచర ణ ఎలా చేపట్టాలనే అంశంపై చర్చించేందుకు ఏపీ, ఒడిసా, ఛత్తీ్‌సగఢ్‌ పోలీసు ఉన్నతాధికారులు గురువారం ఒడిసా రాజధాని భువనేశ్వర్‌లో కలుస్తున్నారు. డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ కూడా వెళుతున్నారు. మావోయిస్టులు రాష్ట్రాలకతీతంగా ఏకమై ఒడిసా దళాలు ఏపీలో, ఛత్తీ్‌సగఢ్‌ కేడర్‌ ఒడిసాలో దాడులు చేస్తోంటే, వాటికి ఏపీ నక్సల్‌ నాయకత్వం అబూజ్‌మడ్‌ నుంచి దిశానిర్దేశం చేస్తోందని పోలీసులకు సమాచారం ఉంది. ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ జంటహత్యలో పాల్గొన్న మావోయిస్టుల్లో ఎక్కువ మంది ఒడిసా, ఛత్తీ్‌సగఢ్‌ గోండుతెగకు చెందినవారేననేందుకు పోలీసులకు పక్కా ఆధారాలు లభించాయి. ఈ సమాచారాన్ని ఈ సమావేశంలో డీజీపీ ఠాకూర్‌ పంచుకోనున్నారు. పొరుగు రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారులతోపాటు కేంద్ర పారా మిలిటరీ బలగాల అధిపతులతో కలిసి ఉమ్మడి కార్యాచరణ సిద్ధం చేయబోతున్నట్లు తెలిసింది.
 
డ్రోన్లతో దండయాత్ర
ఏపీ గ్రేహౌండ్స్‌ పోలీసులు వినియోగిస్తు న్న అతి చిన్న డ్రోన్లు మొదలుకొని పెద్ద డ్రోన్ల వరకూ దండకారణ్యంలో మావోయిస్టుల కోసం వినియోగించే ఆలోచనలో పోలీసులున్నట్లు తెలుస్తోంది. ఒక పెద్దసైజు తూనిగ నుంచి భారీ పక్షి సైజు వరకూ ఐదు రకాల డ్రోన్లను సమకూర్చుకున్న ఏపీ గ్రేహౌండ్స్‌, సీఆర్‌పీఎఫ్‌ బలగాలను ఉమ్మడి దాడులకు పంపే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం హామీ ఇచ్చిన మేరకు ఇంకా మూడు కంపెనీల కేంద్ర బలగాలు రాష్ట్రానికి రావాల్సి ఉంది. మొత్తం ఆరింటికి గానూ మూడే పంపారు. మిగతా బలగాలను వెంటనే అందించాల్సిందిగా కేంద్రాన్ని డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ కోరారు.
 
భద్రతా వలయంలో మన్యం ఠాణాలు
లివిటిపుట్టు ఘటన తరహాలో మావోయిస్టులు పోలీసు స్టేషన్లపైనా మెరుపు దాడులు చేసే అవకాశం ఉన్నట్టు నిఘావర్గాలకు సమాచారం అందిం ది. విశాఖ మన్యంలోని పోలీసులను ఈ వర్గాలు ఇప్పటికే అప్రమత్తం చేశాయి. ఈ నేపథ్యంలో ఏజెన్సీలోని పోలీసు స్టేషన్లకు భద్రతను పెంచుతున్నారు. మన్యంలో మరోసారి నక్సల్స్‌కు చాన్స్‌ ఇవ్వకూడదనే పట్టుదలతో పోలీసు ఉన్నతాధికారులున్నారు. మావోయిస్టుల దాడులకు అనువుగా ఉన్న పోలీస్‌ స్టేషన్లను ముందుగా గుర్తించి, వెనువెంటనే పలు రక్షణ చర్యలు చేపట్టే పనిలో ఉన్నారు. ప్రతి విషయాన్నీ నిశితంగా పరిశీలిస్తున్నారు.
Link to comment
Share on other sites

మావోయిస్టులపై పోరుకు ఉమ్మడి వ్యూహం
06-10-2018 02:33:00
 
636743940178262962.jpg
  • ఒడిసా, ఏపీ డీజీపీల భేటీ
అమరావతి/భువనేశ్వర్‌/విశాఖపట్నం, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా సరిహద్దుల్లోని మావోయిస్టు తీవ్రవాద కార్యకలాపాల నిర్మూలనకు ఒడిసాతో కలిసి ఉమ్మడి కార్యాచరణ రూపొందిస్తామని డీజీపీ ఆర్‌పీ.ఠాకూర్‌ తెలిపారు. రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో వామపక్ష తీవ్రవాదాన్ని అరికట్టడానికి సమష్టిగా తీసుకోవాల్సిన చర్యలపై శుక్రవారం భువనేశ్వర్‌లో ఒడిసా డీజీపీ ఆర్‌పీ శర్మతో ఆయన భేటీ అయ్యారు. ఈ భేటీలో ఇరు రాష్ట్రాలలో వామపక్ష తీవ్రవాదులతో తలపడుతున్న పోలీస్‌ అధికారులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం ఏపీ డీజీపీ ఠాకూర్‌ మాట్లాడుతూ, ‘‘సరిహద్దుల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు..
 
రహదారులు, సెల్‌ఫోన్‌ కనెక్టివిటీ వంటి వాటిపై చర్చించాం. చేపట్టాల్సిన చర్యల ప్రాధాన్యతా క్రమాన్ని నిర్ధారించాం’’ అని తెలిపారు. ఒడిసా డీజీపీ శర్మ మాట్లాడుతూ, ‘‘అంతర్రాష్ట్ర సమన్వయం, సహకారానికి తీసుకోవలసిన చర్యలపై చర్చించాం. ప్రధానంగా మల్కన్‌గిరి జిల్లాలోని కటాఫ్‌ ఏరియాలో ఉమ్మడి బలగాల మోహరింపు, దా డులు, మావోయిస్టుల ఏరివేతపై చర్చిం చాం’’ అని చెప్పారు. రెండు రాష్ట్రాల మధ్య నిఘా సమాచారం మార్పిడి, సరిహద్దుల వెంబడి వ్యూహాత్మక బలగాల మొహరింపు తదితర అంశాలపై చర్చించినట్లు ఏపీ డీజీపీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
Link to comment
Share on other sites

పోలీసులకు పట్టుబడ్డ మావోయిస్టు దళాలు
07-10-2018 18:17:38
 
636745331095367305.jpg
అమరావతి: ఒడిశా కోరాపుట్‌లోని అటవీప్రాంతంలో పోలీస్ బలగాలు కూంబింగ్ నిర్వహించారు. ఈ కూబింగ్ లో మావోయిస్టు దళాలు పోలీసులకు పట్టుబడ్డారు. కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోమ హత్యలో పట్టుబడ్డ మావోయిస్టులు దళాలు పాల్గొన్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఇంకా మరికొంతమంది మావోయిస్టులు పరారీలో ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతం మావోయిస్టుల కోసం పోలీసు దళాలు గాలిస్తున్నారు. మావోయిస్టు యాక్షన్‌ టీం కూడా ఉందని హెడ్‌క్వార్టర్స్‌కు సమాచారం అందింది. విషయం తెలుసుకున్న పోలీసు ఉన్నతాధికారులు ఆపరేషన్‌ను పర్యవేక్షిస్తున్నారు. మావోయిస్టులను వెంటాడాలని ఉన్నతాధికారుల ఆదేశాలు జారీ చేశారు. అవసరమైతే హెలికాప్టర్లు పంపేందుకు అధికారులు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఈ జాయింట్ ఆపరేషన్ లో గ్రేహౌండ్స్‌, యాంటీ నక్సల్స్ స్క్వార్డ్, ఒడిశా బలగాలు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

కిడారి, సోమలను హత్య చేసిన మావోల కోసం పోలీసులు వెతుకుతుండగా షాకింగ్ ఘటన !
08-10-2018 02:49:48
 
636745993139376173.jpg
  • పావుగంట హోరాహోరీ కాల్పులు
  • తప్పించుకొన్న అగ్రనేతలు?
  • కిడారి, సివేరిలను హత్య చేసిన
  • మావోయిస్ట్‌ యాక్షన్‌ టీమ్‌ కూడా!
  • ఒడిసా సరిహద్దు అడవిలో ఘటన
  • తప్పించుకొన్న వారి కోసం వేట
  • రంగంలోకి హెలికాప్టర్లు
  • నక్సల్స్‌ సామగ్రి, మందులు లభ్యం
  • మందుపాతర్ల డంపూ స్వాధీనం!
అమరావతి/చింతపల్లి/సీలేరు/సాలూరు రూరల్‌ (ఆంధ్రజ్యోతి): ఏవోబీలో వార్‌ మొదలైంది. మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులతో ఆంధ్రా, ఒడిసా సరిహద్దు (ఏవోబీ) అటవీ ప్రాంతం దద్దరిల్లింది. ఆదివారం మధ్యాహ్నం దాదాపు 15-20 నిమిషాలపాటు కాల్పులు హోరెత్తాయి. ఒక ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేను పట్టపగలే హత్య చేసిన మావోయిస్టుల కోసం గాలిస్తున్న క్రమంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటన ఒడిసా పరిధిలోని సుంకి, పొట్టంగి మధ్య ఏపీకి సమీపంలోని సకరాయి అడవుల్లో జరిగింది. ఎటువంటి ప్రాణనష్టం లేదని అధికారులు తెలిపారు. కాకపోతే దట్టమైన అటవీ ప్రాంతం, కొండకు ఎగువ భాగంలో ఉండటంతో కాల్పులు జరుపుతూ మావోయిస్టులు అక్కడి నుంచి తప్పించుకొన్నారు. వీరిలో మావోయిస్టుపార్టీ అగ్రనేతలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కిడారి, సివేరిలను హత్య చేసిన మావోయిస్టుల యాక్షన్‌ టీమ్‌ తప్పించుకొన్న బృందంలో ఉన్నట్లు అనుమానిస్తున్నారు. అక్కడి స్థానికులు చెప్పిన పోలికల ఆధారంగా సందేహిస్తున్నారు. దీంతో ఒడిసా ఎస్‌వోజీ (స్పెషల్‌ ఆపరేషన్‌ గ్రూప్‌), ఏపీకి చెందిన గ్రేహౌండ్స్‌, ఏపీఎస్పీతోపాటు బీఎ్‌సఎఫ్‌ దళాలు సంయుక్తంగా ఏవోబీని జల్లెడ పడుతున్నాయి.
 
 
జాయింట్‌ ఆపరేషన్‌
సుంకి అటవీ ప్రాంతంలో 15 మంది మావోయిస్టులు సమావేశమైనట్లు పక్కా సమాచారం అందడంతో బలగాలు జాయింట్‌ ఆపరేషన్‌కు దిగాయి. అయితే వీరి రాకను గమనించిన మావోయిస్టులు కాల్పులు ప్రారంభించారు. ఘటనా స్థలం నుంచి ఏపీ డీజీపీతోపాటు ఇంటెలిజెన్స్‌ డీజీలకు బలగాలు విషయం చెప్పడంతో వారు వెంటనే హెలికాప్టర్లు పంపారు. తప్పించుకొన్న మావోయిస్టులు ఆ పరిసరాల్లోనే ఉండొచ్చని అనుమానిస్తూ ఒడిసా, ఏపీవైపు నుంచి విస్తృతంగా కూంబింగ్‌ చేస్తున్నారు. ఘటనా స్థలం నుంచి మావోయిస్టులకు చెందిన బ్యాగులు, దుస్తులు, మందుపాతర్లు, నీళ్ల క్యాన్లు, పాదరక్షలు, మందులను స్వాధీనం చేసుకొన్నారు. కాల్పులు జరిగిన విషయాన్ని ఒడిశా కోరాపుట్‌ ఎస్పీ విశాల్‌ కున్వర్‌ సింగ్‌, విశాఖ జిల్లా ఎస్పీ రాహుల్‌ దేవ్‌ శర్మ ధృవీకరించారు.
 
 
ప్రతీకారేచ్ఛ!
మావోయిస్టుల కదలికలు లేవని అనుకుంటున్న సమయంలో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలను వారు పట్టపగలు హత్య చేయడంతో ఆనాటి నుంచీ ఏపీ పోలీసులు ఈ ప్రాంతంలో వారి కోసం వేట సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇది జరగడంతో వారిని వదలొద్దని అధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు వెళ్లినట్లు తెలుస్తోంది. అందుకే అటవీ ప్రాంతంలో అణువణువూ గాలిస్తున్నారు. పైగా అగ్రనేతలు, మావోయిస్టు యాక్షన్‌ టీమ్‌ సభ్యులు ఉన్నట్లు ప్రచారం జరుగుతుండటంతో పక్కా వ్యూహంతో ముందుకెళ్తున్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకొని బలగాలకు దిశానిర్దేశం చేస్తున్నారు. అవసరమైతే మరిన్ని హెలికాప్టర్లు, అదనపు బలగాలను పంపేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.
Link to comment
Share on other sites

okesh NaraVerified account @naralokesh 6h6 hours ago

 
 

ఇటీవల జరిగిన దాడిలో మరణించిన అరకు శాసన సభ్యులు కిడారి సర్వేశ్వరరావు గారి కుటుంబాన్ని పాడేరులో కలిసి పరామర్శించడం జరిగింది. గిరిజన ప్రాంతాల అభివృద్దికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమైనవి. ఒక నిస్వార్థ నాయకున్ని మనం కోల్పోయాం. ఆయన అకాల మరణం పార్టీకి తీరనిలోటు.

DpIWIVtWwAAuRdU.jpg
DpIWIV3XoAAdulY.jpg
DpIWIVuW0AIZ1Yn.jpg
DpIWIV2XcAA7SYd.jpg
Link to comment
Share on other sites

కిడారి హత్య కేసులో 21వ ముద్దాయి ఎన్‌కౌంటర్‌లో మృతి
12-10-2018 16:55:22
 
636749605286526011.jpg
విశాఖ: ఏవోబీలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ మహిళా మావోయిస్ట్ మృతి చెందింది. కూంబింగ్ చేస్తున్న పోలీసులకు మావోలు తారసపడ్డారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ మహిళా మావోయిస్ట్ మృతి చెందింది. ఆమెను మీనాగా పోలీసులు గుర్తించారు. మీనా ఏవోబీ స్పెషల్ జోనల్ కార్యదర్శి గాజర్ల రవి అలియాస్ ఉదయ్ భార్యగా పోలీసులు గుర్తించారు. ఇటీవల అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోమా హత్య కేసులో ఈమెను 21వ ముద్దాయిగా పోలీసులు ఎఫ్‌ఐఆర్‌‌లో కేసు నమోదు చేశారు. ఈ ఎన్‌కౌంటర్‌తో ఏవోబీ మరోసారి ఉలిక్కి పడింది. మావోయిస్టులు ప్రతికార దాడులకు దిగుతారేమోనని పోలీసులు జిల్లా సరిహద్దుల్లో భద్రతను పెంచారు. ఏపీ, ఒడిషా సరిహద్దులో విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నారు. పోలీసులు కూంబింగ్‌తో గిరిజనులు ఆందోళన చెందుతున్నారు.
Link to comment
Share on other sites

బుద్ధి చెప్పాల్సిందే!
21-10-2018 03:06:00
 
636756879588417203.jpg
  • మావోయిస్టులపై దాడికి ప్రతీకార ప్రణాళిక సిద్ధం
  •  పొరుగు రాష్ట్రాలతో కలిసి ప్రణాళిక, వ్యూహ రచన
  • ఇప్పటికే గవర్నర్‌కు నివేదన
  • రంగంలోకి ప్రత్యేక బృందాలు
  • కఠినంగా పోలీస్‌ బాస్‌ ఠాకూర్‌
అమరావతి, అక్టోబరు 20(ఆంధ్రజ్యోతి): మావోయిస్టులకు గట్టిగా బదులిచ్చేందుకు పోలీ్‌సశాఖ చాకచక్యంగా అడుగులేస్తోంది. ఒక ఎమ్మెల్యే, మరో మాజీ ఎమ్మెల్యేను హత్య చేసిన తర్వాత పక్కా ప్రణాళికతో ముందుకెళ్తోంది.మావోయిస్టు పార్టీ ఉనికి కోల్పోయిందని పోలీసులు భావిస్తున్న తరుణంలో లివిటిపుట్టు దాడి జరగడంతో.. ప్రతీకారంతో రగిలిపోతున్న ఏపీ పోలీసులు ఒడిశా, ఛత్తీ్‌సగఢ్‌తోపాటు కేంద్ర పారామిలటరీ బలగాలతో సమన్వయం చేసుకొంటున్నారు. ఇటీవల భువ నేశ్వర్‌ సమావేశంలో తీసుకొన్న నిర్ణయాలకు అనుగుణంగా పోలీస్‌ బలగాలు రంగంలోకి దిగాయి. కీలక మహిళా మావోయిస్టును మట్టుబెట్టి మరో నలుగురిని అరెస్ట్‌ చేసిన ఏపీ పోలీసులు మరింత ఉత్సాహం, వ్యూహంతో ముందుకెళ్తున్నారు.
 
ఇదే సమయంలో దసరా బ్రహ్మోత్సవాల్లో భాగంగా దుర్గమ్మ దర్శనానికి వచ్చిన గవర్నర్‌ నరసింహన్‌ మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయాన్ని సందర్శించి సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులతో శాంతి భద్రతలపై సమీక్షించారు. ఈ సందర్భంగా గడిచిన నాలుగేళ్లలో పోలీసులు, మావోయిస్టుల మధ్య జరిగిన పోరును గవర్నర్‌కు డీజీపీ ఠాకూర్‌ వివరించారు. ‘ఏపీ పోలీసులు ఎక్కడా వెనకడుగు వేయలేదు. నాలుగేళ్లలో 40 మంది మావోయిస్టులను మట్టుబెట్టి, 255 మందిని అరెస్టు చేశాం. రాష్ట్ర విభజన తర్వాత 320 మంది లొంగిపోయారు. మావోయిస్టుల నుంచి 96ఆయుధాలు స్వాధీనం చేసుకున్నాం’ అని వివరించినట్లు సమాచారం.
 
కట్టడి చేశాం!
రాష్ట్ర విభజన జరిగిన కొత్తలో మావోయిస్టులు చేసిన ఆస్తినష్టం రూ.12.24 కోట్లుగా ఉన్నా.. ఆ తర్వాత వారిని బాగా కట్టడి చేశామని పోలీస్‌ బాస్‌ పేర్కొన్నారు. 2015 నుంచి తీసుకున్న పటిష్టమైన చర్యల వల్ల 2016లో కేవలం రూ.5వేల విలువైన ఆస్తి మాత్రమే ధ్వంసం చేయగలిగారని పోలీసు బాస్‌ వివరించినట్లు తెలిసింది. తిరిగి 2017లో పుంజుకొన్నా.. ఇప్పుడా పరిస్థితి లేదని డీజీపీ వెల్లడించినట్లు తెలుస్తోంది.
 
ఐపీఎస్‌ల బదిలీ ఎప్పుడైనా..!
రాష్ట్రంలో ఐపీఎస్‌ అధికారుల బదిలీలు ఎప్పుడైనా ఉండొచ్చని ఠాకూర్‌ చెప్పారు. ఒకటి రెండు జిల్లాల ఎస్పీల బదిలీ అనివార్యమని, మరో మూడు జిల్లాల ఎస్పీలను ఎన్నికల కమిషన్‌ నిబంధనల మేరకు బదిలీ చేయాల్సి ఉందన్నారు. ‘మీడియాలో వస్తోన్న విధంగా నేను ప్రతిరోజూ బదిలీలపై చర్చ కోసం సీఎం దగ్గరికి వెళ్లడం లేదు. ప్రతి ఉదయం సీఎంతో సీఎస్‌, డీజీపీ సమావేశం సాధారణంగా ఉండేదే’ అని ఆయన వివరించారు. మీడియాలో వస్తోన్న విధంగా ఎలాంటి పైరవీలకు జిల్లా ఎస్పీ పోస్టింగ్‌ ఇవ్వబోరని, శాంతి భద్రతల నిర్వహణే ధ్యేయంగా ‘రైట్‌ పర్సన్‌కు రైట్‌ ప్లేస్‌’ ఉంటుందని స్పష్టం చేశారు.
 
ఆదివారం విజయవాడలో నిర్వహించే పోలీసు అమరవీరుల సంస్మరణకు రావాల్సిందిగా సీఎంని ఆహ్వానించినట్లు చెప్పారు. ‘మావోయిస్టుల మాటలకు, చేతలకు పొంతన ఉండటం లేదని, గిరిజనులకు మద్దతు అంటూనే అదే వర్గానికి చెందిన ఎమ్మెల్యేని హత్య చేయడం తప్పు కాదా?’ అని డీజీపీ ప్రశ్నించారు. ఈ సమావేశంలో శాంతి భద్రతల ఏడీజీ హరీశ్‌ కుమార్‌ గుప్తా, ఐజీ రవిశంకర్‌ అయ్యన్నార్‌ తదితర సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులు పాల్గొన్నారు.
1sgs4sdfd4.jpg 
Link to comment
Share on other sites

  • 3 weeks later...
సివేరి సోమ పెద్ద కుమారుడికి కీలక బాధ్యతలు అప్పగించిన సీఎం
11-11-2018 13:53:01
 
636775412565740994.jpg
  • తండ్రి పదవిలో తనయుడు
  • ఎస్‌సీ,ఎస్‌టీ కమిషన్‌ సభ్యుడిగా సివేరి అబ్రహం
 
 
అనంతగిరి/అరకులోయ/విశాఖపట్నం: మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన అరకులోయ మాజీఎమ్మెల్యే సివేరి సోమ పెద్ద కుమారుడు సివేరి అబ్రహంను రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్‌ సభ్యుడిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ బాధ్యతలను సివేరి సోమ హత్యకు గురైన ముందు వరకు నిర్వర్తించారు. తండ్రి చనిపోవడంతో ఆ బాధ్యతలను కుమారుడికి అప్పగించారు. జంట హత్యల్లో ప్రాణాలు కోల్పోయిన ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు కుమారుడు కిడారి శ్రావణ్‌కు ఇప్పటికే మంత్రి పదవి ఇస్తున్నట్టు ప్రకటించిన ప్రభుత్వం మరో నాయకుడు సివేరి సోమ కుటుంబానికి సమన్యాయం చేస్తూ ఆయన నిర్వర్తించిన ఎస్‌సీ,ఎస్‌టీ కమిషన్‌ సభ్యుడి బాధ్యతను ఆయన కుమారుడు అబ్రహంకు అప్పగించారు. తెలుగు యువత జిల్లా నాయకుడిగా ఇప్పటికే అబ్రహం రాజకీయాల్లో ఉన్నారు. 1986లో జన్మించిన అబ్రహం మెకానికల్‌ ఇంజనీరింగు చదివి, కీలక బాధ్యతలను తీసుకోనున్నారు.
 
 
టీడీపీని అరకులోయ నియోజకవర్గంలో నడిపించే ఇద్దరు కీలక నేతలు మావోయిస్టుల చేతిలో హతమవ్వడంతో ఆపార్టీకి పెద్దదిక్కులను కోల్పోయింది. ఈ నేపథ్యంలో ఇద్దరు నాయకుల కుటుంబాలకు న్యాయం చేస్తూ, పార్టీ శ్రేణులు నిరాశకు లోనవ్వకుండా ఉండే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇద్దరు నేతల వారసులకు కీలక బాధ్యతలను అప్పగించారు. ఈ నిర్ణయాలపై నియోజకవర్గ స్థాయి కేడర్‌ సంతృప్తి వ్యక్తం చేస్తున్నది. ముఖ్యమంత్రి చంద్రబాబు మాటను వెంటనే నిలబెట్టుకోవడంపై కిడారి, సివేరి కుటుంబీకులు కృతజ్ఞతలు తెలిపారు.
 
 
బాధ్యతగా విధులు నిర్వహిస్తా: అబ్రహం
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఆయనకు మా కుటుంబం రుణపడి ఉంటుంది. నాన్న సోమ ఆశయసాధనకు కృషి చేస్తాను.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...