Jump to content

Araku MLA Kidari Sarveswar Rao Shot Dead by Maoists

koushik_k

Recommended Posts

  • Replies 296
  • Created
  • Last Reply
7 hours ago, akhil ch said:

XX lu Maoist lu. Ysr gadu eri paresadu. Lepi dobbandi malli. Elemma

7 hours ago, kumar_tarak said:

Aasss holes....deshaniki pattina daridram ninjakodukulu

ee edhavalaki oka goal ledu padu ledu. cinemalo vegetable markets lo hafta vasool chese valla kante ee daridrulu mari ghoram le. Our family had first hand experience with these idiots.

asalu vellani kadu, velledo desoddarukulu ani vellani venakesukoocche varavara rao, comunist party edhvalani lepeyyali first.

Link to comment
Share on other sites

division bill lo pettina maro important hammi hamphut...mari naxal's peragaru atne urikena?

just AP police establishment ki 2000 crores avuddi ani central team report ichindi...paisa ivvala ippati varaku.....they took 4 years to even give nominal go-ahead for greyhounds

‘No Greyhounds trainingcentre for Andhra Pradesh’

Link to comment
Share on other sites

కిడారి సర్వేశ్వరరావు హత్యకు అదే ప్రధాన కారణమా?
23-09-2018 21:55:08
 
636733365063176258.jpg
ప్రతీకార చర్యల్లో భాగంగానే మావోయిస్టులు... అరకు లోయలో దుశ్చర్యకు పాల్పడ్డారా? లేక బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకమంటూ అక్కడి ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును పొట్టన పెట్టుకున్నారా? ఆ ఘాతుకానికి అదే ప్రధాన కారణమా?
 
భూమికోసం, భుక్తికోసం అన్న నినాదంతో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని నక్సల్బరి అనే ప్రాంతంలో 1964లో పార్టీ పురుడు పోసుకుంది. ఉద్యమానికి శ్రీకారం చుట్టింది చారుమజుందార్. భూస్వాముల కబంద హస్తాలలో చిక్కుకున్న పీడిత ప్రజల విముక్తి కోసం తుపాకీ ద్వారా రాజ్యాధికారం సాధించడమే ఉద్యమం లక్ష్యం. కాలక్రమంలో అనేక పరిణామాల నేపథ్యంలో...1967లో ఆంధ్రప్రదేశ్‌లోకి అడుగుపెట్టింది. అప్పటి నుంచి ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది. తూర్పుగోదావరి, విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతాల్లోకి విస్తరించింది. 2004 వరకు కూడా ఏపీలో పతాక స్థాయిలో ఉద్యమం కార్యకలాపాలు సాగించింది.
 
గత ప్రభుత్వ హయాం నుంచి విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా ఉద్యమం కొనసాగుతోంది. బాక్సైట్ తవ్వకాలను నిలిపేయాలంటూ ఆదివాసీలతో పాటు మావోయిస్టులు కూడా పెద్ద ఎత్తున డిమాండ్లు చేస్తూ వస్తున్నారు. ఏజెన్సీలోని నేతలను పలుసార్లు మావోయిస్టులు హెచ్చరించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో గిరిజనుల అభిష్టానికి వ్యతిరేకంగా ప్రభుత్వం ఎలాంటి చర్యలకు పాల్పడదని చంద్రబాబు పలుమార్లు ప్రకటించారు. ఉత్తరాంధ్ర పర్యటనలకు వచ్చినప్పుడు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు.
 
నిజానికి విశాఖ ఏజెన్సీలోని జెర్రెల బ్లాక్-1, 2, 3పాటు, గూడెం కొత్తవీధిలోని బాక్సైట్ కొండల్లో తవ్వకాలు జరపడానికి 2017లోనే నాల్కో కంపెనీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు దరఖాస్తు చేసుకుంది. గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ తవ్వకాలకు సంబంధించి జీవో జారీ చేసింది. ఆ తరువాత కాంగ్రెస్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో అధికారం కోల్పోయింది. ఆ తరువాత వచ్చిన ఏన్డీయే, టీడీపీ ప్రభుత్వాలు తరువాత ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాల అంశాన్ని పూర్తిగా పక్కన పెట్టాయి.
 
2004కి ముందు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గిరిజనుల మనోభావాలకు వ్యతిరేకంగా బాక్సైట్ తవ్వకాలు జరపబోమని తేల్చి చెప్పారు. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన యూపీఏ ప్రభుత్వం, రాష్ట్రంలోని వైఎస్‌ ప్రభుత్వం సహకారంతో బాక్సైట్ తవ్వకాలపై రస్‌ ఆల్ ఖైమా సంస్థను ఇక్కడికి తీసుకువచ్చింది. విశాఖ జిల్లా మాకవరపాలెం మండలం రాచపల్లిలో అన్‌రాక్ కంపెనీని నెలకొల్పారు. ఆరువేల కోట్లతో ఈ కర్మాగారాన్ని నిర్మించారు. ఈ సమయంలోనే మావోయిస్ట్‌లు రంగంలోకి దిగారు. తవ్వకాలను వ్యతిరేకిస్తూ ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు.
 
బాక్సైట్ తవ్వకాలతో పచ్చని అడవులు నాశనమవుతున్నాయనేది ఆదివాసీల ఆందోళన. మరోవైపు తమ మనుగడ కష్టమవుతుందని కూడా మావోయిస్టులు భావించారు. అప్పటి నుంచే ప్రభుత్వంపై మావోయిస్టులు ఆగ్రహంగా ఉన్నారు. అందుకే ప్రజా ప్రతినిధులను టార్గెట్‌ చేసి ఇప్పుడు కిడారిని హత్య చేసినట్టు భావిస్తున్నారు. కేవలం ఉనికిని చాటుకోవడం కోసమే మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారని మంత్రి నక్కా ఆనందబాబు విమర్శించారు.
 
కొద్ది రోజులకు ముందు బాక్సైట్ తవ్వకాలు జరపొద్దనే డిమాండ్‌తో మావోయిస్టులు... ముగ్గురు టీడీపీ నాయకులను కూడా కిడ్నాప్ చేశారు. ఆదివాసీల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ తవ్వకాలు జరపబోమని ప్రభుత్వం కూడా హామీ ఇచ్చింది. చంద్రబాబు పలుమార్లు ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్లినప్పుడు ఇదే విషయాన్ని స్థానికులకు స్పష్టం చేశారు . అయినప్పటికీ... మావోయిస్టులు దాడులకు దిగుతున్నారు. అయితే అవి... బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగానా? లేక ప్రతీకార చర్యల్లో భాగంగానా? అనేది తేలని ప్రశ్నగా మిగిలింది.
Link to comment
Share on other sites

3 minutes ago, sonykongara said:

inko bedirupu letter appudu  BW5bTzi.jpg

Naxalite me mavayya gari Polam lo jendalu paathi ee lands Anni maave ani annaru antaga bro.. paiga Manchi lands lo jendalu pathaaru antaga..

Me Pani vallu and kuda info ichetollu antaga Naxalites ki me gurinchi..

Link to comment
Share on other sites

2 minutes ago, Raaz@NBK said:

ma polame panchmannaru adi ma nana ki rasina letter ne

Link to comment
Share on other sites

2 minutes ago, Raaz@NBK said:

Ohkk :shakehands:

naxalites meda case lu pettichamu ani ,ma nana kosam try chesaru dorkala first time mama ni kotti ma intlo  tractor 2tagala  tagala bettaru,party ki rajinam cheyyamani paper ki news ichharu  cbn alipiri blast ki samdandam unna vallani lepesaru dani ki nirasana ga na  house blast chesaru , taruvtha polam ni 70 acres panchi ouri nundi vellipommaru,ma nana avi nenu sampadichinavi emi kadu, ma mama garu na koduku ki 1year unnappudu icchina asthulu veelunama chupedu,polam matram nenu ivvanu chamupukunte chamupukondi annadu, appudu ysr govt vacchinadi appudu kalpula viramana oppandam undi, andukani aroju ma nana vadilesaru madiga vallu maku maddathu ga chalamadi kuda vaccharu

Link to comment
Share on other sites

28 minutes ago, Raaz@NBK said:

Naxalite me mavayya gari Polam lo jendalu paathi ee lands Anni maave ani annaru antaga bro.. paiga Manchi lands lo jendalu pathaaru antaga..

Me Pani vallu and kuda info ichetollu antaga Naxalites ki me gurinchi..

BW5bTzi.jpg edi ma nana ki rasinde dani panchmani undi adi polame

Link to comment
Share on other sites

4 minutes ago, sonykongara said:

naxalites meda case lu pettichamu ani ,ma nana kosam try chesaru dorkala first time mama ni kotti ma intlo  tractor 2tagala  tagala bettaru,party ki rajinam cheyyamani paper ki news ichharu  cbn alipiri blast ki samdandam unna vallani lepesaru dani ki nirasana ga na  house blast chesaru , taruvtha polam ni 70 acres panchi ouri nundi vellipommaru,ma nana avi nenu sampadichinavi emi kadu, ma mama garu na koduku ki 1year unnappudu icchina asthulu veelunama chupedu,polam matram nenu ivvanu chamupukunte chamupukondi annadu, appudu ysr govt vacchinadi appudu kalpula viramana oppandam undi, andukani aroju ma nana vadilesaru madiga vallu maku maddathu ga chalamadi kuda vaccharu

Tfs bro.. but too scary.. 

Too much chesthunnaru villu.. okapudu Prajala kosam poradutunnaru eni edho oka muula simpathy vundedhi.. adhi mottham pogottukuni domestic terrorist laga behave chesthunnaru..

Link to comment
Share on other sites

29 minutes ago, Raaz@NBK said:

Naxalite me mavayya gari Polam lo jendalu paathi ee lands Anni maave ani annaru antaga bro.. paiga Manchi lands lo jendalu pathaaru antaga..

Me Pani vallu and kuda info ichetollu antaga Naxalites ki me gurinchi..

pani vallu evaru evvla,ouri godavalu unnayi avathala party vallu, e vedavala laki bojanalu mosi  duvveru ma meda paga tiruchukovatanaiki, house balst chese roju pani vallau vacchi chepparu eroju intlo padukovaddu ani cheppandi ani ma ammmma daggara ki vacchi chepparu, blast cheseka nenu bhutulu tidutunte advallu andaru labor ne oka muslim ame ayya ni kallau pattuayya champutaru ayyaantu na chuttumutteru valle na noru museru.

Link to comment
Share on other sites

4 minutes ago, sonykongara said:

pani vallu evaru evvla,ouri godavalu unnayi avathala party vallu, e vedavala laki bojanalu mosi  duvveru ma meda paga tiruchukovatanaiki, house balst chese roju pani vallau vacchi chepparu eroju intlo padukovaddu ani cheppandi ani ma ammmma daggara ki vacchi chepparu, blast cheseka nenu bhutulu tidutunte advallu andaru labor ne oka muslim ame ayya ni kallau pattuayya champutaru ayyaantu na chuttumutteru valle na noru museru.

?? Ala Ela vunnaru bro vurulo Naxalites ki opposite ga.. Meku info ichina valu :super:

Link to comment
Share on other sites

6 minutes ago, Raaz@NBK said:

Tfs bro.. but too scary.. 

Too much chesthunnaru villu.. okapudu Prajala kosam poradutunnaru eni edho oka muula simpathy vundedhi.. adhi mottham pogottukuni domestic terrorist laga behave chesthunnaru..

first lo undevi,ippudu antha leki lanjakodu le unnaru ,deni kosam fight chesthunaro valla ke theliyadu,ok ex memu chinnappudu ma nana pilpicharu memu ela prajala kosam poradutunnamu miru chandha ivvali annaru anta,10k ichharu ma nana,appudu suryam ani chandravanka dalam ani undedi,naxalite evado bidi tragutunnadu anta,ma nana konchem ibbandi paddadu vasana ki,ayana ventane bhutulu tittadu vadini, ni daggra thupaki undi ani ayana ni bidi vasana barichala ani edi jarigindi na chinnapppudu,ippdu andharu vedavala kulam peru na kodaka add chesi pilustharu

Link to comment
Share on other sites

2007 నుంచి టార్గెట్‌!
24-09-2018 02:33:07
 
636733531846762460.jpg
  •  కిడారిని వెంటాడిన మావోయిస్టులు
  •  చైనా క్లే వివాదంతో హిట్‌లిస్ట్ లో సోమ
విశాఖపట్నం, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): కిడారి సర్వేశ్వరరావును మావోయిస్టులు 2007లోనే టార్గెట్‌ చేశారు. అప్పట్లో కాంగ్రెస్‌ ఎమ్మెల్సీగా ఉన్న కిడారి సర్వేశ్వరరావును, జడ్పీ వైస్‌ చైర్మన్‌ సమిడ రవిశంకర్‌ను మావోయిస్టులు హిట్‌లి్‌స్టలో చేర్చారు. 2007 జూన్‌ 28న హుకుంపేటలో మోదకొండమ్మ ఉత్సవాల్లో పాల్గొన్న రవిశంకర్‌ను హతమార్చారు. అదేరోజు కిడారి సర్వేశ్వరరావు కోసం కూడా కాపుకాశారు. కానీ ఆయన రాలేదు. ఆ విషయం తెలిసినప్పటి నుంచి సర్వేశ్వరరావు జాగ్రత్తలు తీసుకుంటూ విశాఖపట్నంలోనే ఎక్కువగా ఉంటున్నారు. ఒకవేళ ఏజెన్సీకి వచ్చినా, అవసరాన్ని బట్టి అక్కడ బసచేయాల్సి వచ్చినా స్థానిక పోలీస్‌ స్టేషన్‌లోనే ఉండేవారు.
 
ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఆదివారం మావోయిస్టులు మాటువేసి ఆయన్ని హతమార్చారు. ఇక సివేరి సోమ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కండ్రూం ప్రాంతంలోని విలువైన ఖనిజం చైనా క్లే తవ్వకాలకు ప్రయత్నించారు. దీంతో 2010లో గిరిజనులు ఎమ్మెల్యే సివేరి సోమ, డుంబ్రిగుడ ఎంపీపీ దన్నేరావులపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనతో సోమాను మావోయిస్టులు హిట్‌లి్‌స్టలో చేర్చారు. హతమార్చుతామని పలుమార్లు హెచ్చరికలు జారీచేశారు. దీంతో సివేరి అప్రమత్తంగా ఉంటున్నారు. అయినా ఆదివారం మావోయిస్టుల దాడిలో బలయ్యారు.
 
DS56.jpgకార్లు చుట్టుముట్టి.. తుపాకీ గురిపెట్టి..!
గ్రామదర్శిని కార్యక్రమం కోసం అరకు వ్యాలీ నుంచి కండ్రుం వెళ్తుండగా.. లివిటిపుట్టు గ్రామంలో 40-50 మంది నక్సల్స్‌ వచ్చి ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ కార్లను చుట్టుముట్టారు. మొదటగా ఎమ్మెల్యే కిడారిని చేతులు వెనక్కి కట్టేసి తీసుకెళ్లారు. ఇంతలో నేను కారు వెనక్కి తిప్పాను. కానీ మా కారును కూడా చుట్టుముట్టి నాకు తుపాకీ గురిపెట్టారు. పారిపోవడానికి ప్రయత్నిస్తే పరిస్థితి దారుణంగా ఉంటుందని హెచ్చరించారు. ఇంకేం చేయలేని పరిస్థితుల్లో కారును ఆపేశాను. సోమను చేతులు కట్టేసి తీసుకెళ్లారు. ‘గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చర్చలకు పిలిస్తే రాకుండా.. పోలీస్‌ కూంబింగ్‌ పార్టీలను పంపావు. ఆ సమయంలో తృటిలో తప్పించుకున్నాం’ అంటూ సోమపై మావోయిస్టులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మమ్మల్ని కదలనివ్వకుండా ఆరేడుగురు నక్సల్స్‌ నిర్బంధించారు. గన్‌మెన్‌ దగ్గర ఆయుధాలు, బుల్లెట్లు తీసేసుకొన్నారు. కాసేపటికే తపాకీతో కాల్చిన శబ్ధం వినిపించింది. దగ్గరకు వెళ్లి చూస్తే సోమ చనిపోయి ఉన్నారు.
 -కె.చిట్టిబాబు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ కారు డ్రైవర్‌
 
కళ్లెదుటే కాల్చేశారు
లివిటిపుట్టు వద్ద వాహనాలను మావోయిస్టులు ఆపారు. ఏమైనా సమస్యలు ఉంటే మాట్లాడుకుందాం.. అప్పటికీ కాదంటే మీ ఇష్టం అని సర్వేశ్వరరావు మావోయిస్టులకు చెప్పారు. సరే మాట్లాడదాం పదండి అని ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను విడివిడిగా తీసుకెళ్లారు. కొద్దిసేపు మాట్లాడిన తర్వాత మాకళ్లెదుటే తుపాకితో కాల్చేశారు.
- అప్పారావు, ఎమ్మెల్యే కిడారి పీఏ
 
GSG-5.jpgభయభ్రాంతులయ్యాం!
ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సోమను చేతులు కట్టేసి మావోయిస్టులు వెంట తీసుకెళ్లారు. ముందుకొస్తే చంపేస్తామని బెదిరించడంతో మేం లివిటిపుట్టలోనే ఉండిపోయాం. మేం ఎమ్మెల్యే వద్దకు వెళ్లకుండా ఐదుగురు మహిళా మావోయిస్టులు, ఒక మగ మావోయిస్టును కాపాలాగా ఉంచారు. దీంతో ఏ క్షణాన ఏమౌతుందోనని భయభ్రాంతులయ్యాం.
- వెంకట్రావు, అరకు మాజీ సర్పంచి,
లావణ్య, సంధ్య, రత్నాలమ్మ మాజీ ఎంపీటీసీ సభ్యులు
(వీరంతా ఎమ్మెల్యే కిడారితోపాటు కారులో గ్రామదర్శినికి వెళ్తున్నారు)
Link to comment
Share on other sites

మళ్లీ నక్సల్స్ పంజా!
24-09-2018 02:21:23
 
636733524816046661.jpg
 
అంతా ప్రశాంతం అనుకుంటున్న వేళ హఠాత్తుగా అలజడి చెలరేగింది.
 మావోయిస్టు తుపాకుల శబ్దం సద్దుమణిగిందని భావిస్తున్న సమయంలో... తూటా పేలింది.
 ప్రస్తుతం ఒడిసా, ఛత్తీస్ గఢ్‌లకే పరిమితమనుకుంటున్న వామపక్ష తీవ్రవాద హింస... నవ్యాంధ్రలో, విశాఖ మన్యంలో బుసలు కొట్టింది.
 ఏకంగా అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలపైనే నక్సలైట్ల తుపాకీ గర్జించింది.
 అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను ఆదివారం మావోయిస్టులు కాల్చి చంపారు.
 ఈ సంఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. పోలీసులను ఉలిక్కి పడేలా చేసింది.
 మన్యంలో మైనింగ్‌ రేపిన మంటలకే ఈ ఇద్దరు నేతలు బలైపోయినట్లు తెలుస్తోంది! మైనింగ్‌ లావాదేవీలను ఆపివేయాలన్న హెచ్చరికలను పట్టించుకోలేదంటూ కిడారి, సోమను మావోయిస్టులు కాల్చి చంపినట్లు చెబుతున్నారు.
 అయితే... ‘మాట్లాడుకుందాం’ అంటూ మావోయిస్టులు పన్నిన వలలో నేతలు ఇరుక్కున్నారని, వీళ్లే వారి వద్దకు చర్చలకు బయలుదేరారనే కథనం కూడా వినిపిస్తోంది.
 
  • కిడారి కాల్చివేత 
డుంబ్రిగుడ, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): మన్యంలో మళ్లీ అలజడి రేగింది. నక్సలైట్లు రెచ్చిపోయారు. ఒక ఎమ్మెల్యేను, మాజీ ఎమ్మెల్యేను పొట్టనపెట్టుకున్నారు. ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు, ఇతర వర్గాల కథనం ప్రకారం అసలేం జరిగిందంటే.. ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘గ్రామదర్శిని’లో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ సభ్యుడు సోమ చురుగ్గా పాల్గొంటున్నారు. కిడారి ప్రభుత్వ విప్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. వీరు శనివారం పెద్దబయలు, అనంతగిరి మండలాల్లోని గ్రామాల్లో పర్యటించారు. ఆదివారం డుంబ్రిగుడ మండలంలో పర్యటించాలని నిర్ణయించుకున్నారు. ఉదయం 10.30కి అరకు లోయ నుంచి గ్రామదర్శిని కోసం బయలుదేరారు. మొత్తం నాలుగు వాహనాలు! ఒక వాహనంలో ఎమ్మెల్యే కిడారి, ఆయన ఇద్దరు గన్‌మన్‌లు, డ్రైవర్‌ ఉన్నారు. మరో వాహనంలో మాజీ ఎమ్మెల్యే సోమ, ఆయనకు కేటాయించిన ఒక గన్‌మన్‌, మరికొందరు ఉన్నారు.
 
మరో రెండు వాహనాల్లో స్థానిక నేతలు, మండలస్థాయి ప్రజాప్రతినిధులు దాదాపు పది కిలోమీటర్లు ప్రయాణించి... 11 గంటల సమయానికి డుంబ్రిగుడ మండల కేంద్రం చేరుకున్నారు. అక్కడి నుంచి కండ్రూం, సర్రాయిలో జరిగే గ్రామదర్శినిలో వీరు పాల్గొనాల్సి ఉంది. ఆ దిశగా కిలోమీటరున్నర ప్రయాణించారో లేదో... లివిటిపుట్టు గ్రామం వై-జంక్షన్‌ వద్ద, రోడ్డుకు అడ్డంగా మావోయిస్టులు కనిపించారు. ఆ తర్వాత...
 
మాట్లాడి పంపిస్తామని...
అందరూ మహిళలే... అందరి చేతుల్లో ఆయుధాలున్నాయి! అంతా ఆలివ్‌గ్రీన్‌ యూనిఫామ్‌లో ఉన్నారు. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల వాహనాలను ముగ్గురేసి చొప్పున చుట్టుముట్టారు. వెనుకనున్న రెండు వాహనాలకు ఐదారుగురు చొప్పున అటూ ఇటూ నిల్చున్నారు. ‘మాతో రండి. మాట్లాడాలి’ అని కిడారి, సోమలను ఆదేశించారు. ఈలోపే గన్‌మన్‌ అప్రమత్తమయ్యారు! ప్రతిఘటించేందుకు కూడా సిద్ధమయ్యారు. అయితే... వారిని ఎమ్మెల్యే నిలువరించారు. ‘‘వాళ్లు వచ్చింది నాకోసం. మీరు కాల్పులు జరిపితే వాళ్లూ జరుపుతారు. సంబంధంలేని వాళ్లు చనిపోతారు. వాళ్లతోపాటు వెళతాం. అదృష్టం బాగుంటే తిరిగి వస్తాం’’ అంటూ గన్‌మన్‌ను కిడారి నిలువరించారు. ‘ఎలాంటి హానీ తలపెట్టం. మాట్లాడి పంపిస్తాం’ అంటూ ముగ్గురు గన్‌మన్‌ల వద్ద ఉన్న ఆయుధాలను మావోయిస్టులు స్వాధీనం చేసుకున్నారు. మరో రెండు వాహనాల్లో ఉన్న టీడీపీ నేతలు, స్థానిక ప్రజా ప్రతినిధులకు హెచ్చరికలు జారీ చేశారు. ‘మీరు ఇక్కడే ఉండండి. పక్కకు కదలొద్దు’ అని చెప్పారు. ఆ తర్వాత ఆ ఇద్దరు నేతలను పక్కకు తీసుకెళ్లారని చెప్పారు.
 
చేతులు వెనక్కి కట్టేసి...
కిడారి సర్వేశ్వరర రావు, సివేరి సోమలను మహిళా మావోయిస్టులు వాహనాల నుంచి కిందికి దించారు. వారు ప్రతిఘటించేందుకు వీల్లేకుండా చేతులు వెనక్కి కట్టారు. ఒకరిని ఒక బృందం, మరొకరిని ఇంకో బృందం చెరోవైపు తీసుకెళ్లాయి. సివేరి సోమను వాహనం నుంచి 20 మీటర్ల దూరంలో గుంటసీమ వైపు తీసుకెళ్లారు. ‘ప్రజా వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నావు’ అంటూ పెద్దగా ఎక్కువసేపు మాట్లాడకుండానే సోమను కాల్చి చంపేశారు. కణతమీద, ఛాతీ మీద అతి సమీపం నుంచి కాల్చిచంపారు. మొత్తం మూడు రౌండ్లు పేల్చారు. సోమ విగతజీవుడై రహదారిమీదే పడిపోయారు. అటు... ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును సుమారు పాతిక మీటర్ల దూరం తీసుకెళ్లి ఓ చెట్టుకింద నిలబెట్టారు. సుమారు 20 నిమిషాలపాటు చర్చలు జరిపారు. బాక్సైట్‌ తవ్వకాలు, ఎమ్మెల్యే హుకుంపేటలో నిర్వహిస్తున్న గ్రానైట్‌ క్వారీ, అరకు ఎంపీపీ అవిశ్వాసం వివాదంలో వ్యహరించిన తీరు తదితర అంశాలను నక్సల్స్‌ ప్రస్తావించినట్లు తెలిసింది. తనను ఏమీ చేయవద్దని, ప్రజానుకూలంగా నడుచుకుంటానని ఎమ్మెల్యే వేడుకున్నారు. అయినా, మావోయిస్టులు వినిపించుకోలేదు. ఆయన ఛాతీ, తలలోకి రెండు తూటాలు దింపారు. దీంతో ఆయన అక్కడికక్కడే చనిపోయారు. ఇద్దరినీ రివాల్వర్లతో పాయింట్‌ బ్లాంక్‌ రేంజ్‌ నుంచి చంపేశారు. ఎమ్మెల్యేల వాహనాలు ఆపిందీ, వారిని తమతో తీసుకెళ్లిందీ, చంపిందీ... అందరూ మహిళా మావోయిస్టులే కావడం గమనార్హం.
 
‘చనిపోవడం ఎవరికైనా తప్పదు...ఒకరోజు ముందు వెనకా అంతే. చావు అనివార్యం. ఎవరికైనా తప్పదు’
(ఇటీవల నియోజక వర్గంలో జరిగిన ఒక కార్యక్రమంలో సర్వేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు)
 
చంపిన దళం ఇదే...
ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలను చంపింది మాచ్‌ఖండ్‌-కోరాపుట్‌-విశాఖ బోర్డర్‌ డివిజన్‌ కమిటీయే అని నిర్ధారణ అయ్యింది. ఈ ఆపరేషన్‌లో దాదాపు 60 మంది పాల్గొన్నారు. వీరిలో సగంమంది మహిళలే. బృందాలుగా విడిపోయి ‘ఆపరేషన్‌’ను పక్కాగా నిర్వహించారు. తర్వాత అక్కడి నుంచి ఐదారు కిలోమీటర్ల దూరంలోని సరిహద్దు దాటి ఒడిసా వైపు వెళ్లిపోయారు.
Link to comment
Share on other sites

మన్యంలో మావోల పంజా
అరకు ఎమ్మెల్యే కిడారి దారుణ హత్య
మాజీ ఎమ్మెల్యే సోమనూ చంపేశారు
చర్చిద్దామన్నా చలించలేదు
ఆరు రౌండ్లు పేల్చి ఘాతుకం
విశాఖజిల్లా లివిటిపుట్టువద్ద పట్టపగలే దాష్టీకం
కాపుకాసిన 60 మంది మావోయిస్టులు
వారిలో 30 మంది మహిళలే
నేతల క్వారీల తవ్వకంపై ఆగ్రహం
ఎమ్మెల్యే మృతితో అభిమానుల ఆందోళన
2 పోలీస్‌ ఠాణాలకు నిప్పు
23ap-main1a.jpg
60 మంది సాయుధ మావోయిస్టులు... సగంమంది పాతికేళ్ల లోపువారే... వీరందరికీ ఓ మహిళ నాయకత్వం... చేత చిక్కిన ఇద్దరు ప్రజాప్రతినిధుల్ని ఆమె ‘మీ ఖేల్‌ ఖతం’ అనగానే సాయుధులు కాల్చేశారు..
రక్తపు మడుగులో అచేతనంగా ఉన్న వారిపై కసిగా మరో రెండు రౌండ్లు పేల్చారు.. ప్రజల సమక్షంలోనే తూటా తీర్పునిచ్చారు.. ప్రశాంత విశాఖ మన్యంలో దాడి చేసి ... రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించారు.
ఈనాడు డిజిటల్‌- విశాఖపట్నం, డుంబ్రిగుడ, అరకులోయ-న్యూస్‌టుడే
విశాఖ మన్యం వణికింది. మావోయిస్టుల తూటాలకు అరకు ప్రాంతం దద్దరిల్లింది. కొంతకాలం స్తబ్దుగా ఉన్న మావోయిస్టులు ఆదివారం ఉరుములేని పిడుగులా విరుచుకుపడ్డారు. ఒక్కసారిగా ఇద్దరు ప్రజాప్రతినిధులపై పంజా విసిరారు. తెదేపాకు చెందిన అరకు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను కాల్చి చంపారు. ఆరు రౌండ్లు కాల్పులు జరపడంతో నేతలిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. మావోయిస్టుల దాడిపై ఆగ్రహించిన ఎమ్మెల్యే అనుచరులు, స్థానికులు ఆందోళనలకు దిగారు. పోలీసుల నిర్లక్ష్యమే ఈ పరిస్థితికి కారణమని ఆరోపిస్తూ అరకు, డుంబ్రిగుడ ఠాణాలపై దాడులు చేశారు. ఫర్నిచర్‌ను ధ్వంసం చేసి స్టేషన్లకు, వాహనాలకు నిప్పుపెట్టారు. దీంతో మన్యంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. దాడి ఘటనపై అటు ప్రభుత్వ యంత్రాంగం, పోలీసులు అప్రమత్తమయ్యారు.
23ap-main1c.jpg
ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు అరకులోయలోని తన అతిథి గృహం నుంచి ఆదివారం ఉదయం 11.30 గంటలకు గ్రామదర్శినిలో పాల్గొనడం సరాయి గ్రామానికి కోసం బయలుదేరారు. విశాఖ జిల్లా డుంబ్రిగుడ మండలం కండ్రుం పంచాయతీలో ఈ గ్రామం ఉంది. ఎమ్మెల్యే వెంటే మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ మరో వాహనంలో వస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో డుంబ్రిగుడ మండల కేంద్రాన్ని దాటి లివిటిపుట్టు చేరుకున్నారు. ఇంతలో పొదలు చాటున దాక్కున మావోయిస్టులు ఒక్కసారిగా ఆయుధాలతో రహదారిపైకి వచ్చి నాయకుల వాహనాలను అడ్డగించారు. వాహనాలను చుట్టుముట్టి ముగ్గురు గన్‌మన్‌ల నుంచి ఆయుధాలు లాక్కున్నారు. నేతలిద్దరితో పాటు వచ్చిన అరకులోయ జడ్పీటీసీ సభ్యురాలి భర్త రమేష్‌, తాజా మాజీ సర్పంచి వెంకటరావు, వ్యక్తిగత సహాయకులు, గన్‌మన్‌లను ఓ చెట్టు కిందకు తీసుకెళ్లి కొందరు మావోయిస్టులు వారితో మాట్లాడారు. డుంబ్రిగుడ నుంచి అటుగా వెళ్లే వాహనాలను నిలిపేశారు. రహదారికి అడ్డంగా రాళ్లు పెట్టారు. జనాలను ఒక చెట్టుకింద సమావేశ పరిచారు. సుమారు 60 మంది వరకు మావోయిస్టులు ఈ ఘటనలో పాల్గొన్నట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. వారిలో 30 మంది వరకు మహిళలే ఉన్నారు. ఎక్కువ మంది 25 ఏళ్లలోపు వారే. వీరంతా ఆదివాసీ తెగకు చెందిన భాషలోనే మాట్లాడుతున్నారు.
23ap-main1b.jpg
మీ ఖేల్‌ ఖతం..
ముందుగా ప్రభుత్వ విప్‌ కిడారి సర్వేశ్వరరావు వాహనం నుంచి కిందకు దిగిన వెంటనే చేతులను వెనక్కి కట్టేశారు. వెనుక వాహనంలో ఉన్న సివేరి సోమను కిందకు దించి, ‘ఇటీవల ఒడిశాలోని గొల్లూరి వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌కు సంబంధించి నువ్వే పోలీసులకు సమాచారం ఇచ్చావంటా’ అంటూ గద్దించారు. మావోయిస్టుల బృందానికి నాయకురాలిగా భావిస్తున్న ఓ 38ఏళ్ల మహిళ గట్టిగా తెలంగాణ యాసలో మాట్లాడింది. ఎమ్మెల్యే కిడారి హుకుంపేట మండలంలోని గూడ క్వారీ వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోకుండా ధన దాహంతో వెంపర్లాడుతున్నాడని ఆమె మండిపడింది. పార్టీలు మారి అధికారంలోకి వచ్చాక బాక్సైట్‌ని తవ్విస్తూ గిరిజన ద్రోహులుగా మారారని నిందించింది. మాజీ ఎమ్మెల్యే సోమ ఒడిశా సరిహద్దుల్లోని గొల్లోరి వద్ద గతేడాది మావోయిస్టుల శిబిరంపై పోలీసులు జరిపిన కాల్పులకు కారణమని, కాల్పుల్లో తాము త్రుటిలో తప్పించుకున్నామని, తమని చంపించేందుకు పోలీసులతో చేతులు కలిపిన సోమ ద్రోహి అని ఆవేశపూరితంగా  చెప్పింది. సుమారు 15 నిమిషాలు ఆమె మాట్లాడింది. ఆయుధాలతో చుట్టుముట్టేసి కాల్చేయడానికి సిద్ధమవుతున్న సమయంలో ‘ఆయుధాలతో వద్దు.. మాట్లాడుకుని పరిష్కరించుకుందామ’ని ఆ మహిళా మావోయిస్టును ఎమ్మెల్యే కిడారి బతిమలాడారు. ఎమ్మెల్యే మావోయిస్టులతో మాట్లాడుతుండగానే ‘మీ ఖేల్‌ఖతం’ అని మహిళా మావోయిస్టు అరిచింది. వెంటనే మాజీ ఎమ్మెల్యే సివేరి సోమా దగ్గర ఉన్న మావోయిస్టులు ఆయనపై రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. ఆయన అక్కడికక్కడే చనిపోయారు. ఎమ్మెల్యే కిడారి కాల్పులు వద్దని వేడుకుంటుండగానే ఆయనపైనా రెండు రౌండ్లు కాల్పుల జరిపారు. ఇద్దరు నేతలూ రక్తమడుగులో నేలకొరిగిన తరువాత ఓ యువతి వారి దగ్గరకు వచ్చి... మరో రెండు రౌండ్లు కిడారిపై కాల్పులు జరిపింది. ‘చనిపోయాడు కదా, ఇంకెందుకు బుల్లెట్లు వృథా చేస్తావ’ంటూ ప్రధాన మహిళా మావోయిస్టు ఆ యువతిని వారించినట్లు తెలిసింది.
23ap-main1d.jpg
క్వారీ మూసేయలేదని..
ఎమ్మెల్యే కిడారితో పాటు మాజీ ఎమ్మెల్యే సివేరి సోమకు కూడా మన్యంలో నల్లరాయి, కాల్సైట్‌ క్వారీలున్నాయి. వీటిలో నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్‌ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా హుకుంపేట మండలంలోని గూడలో కిడారికి చెందిన నల్లరాయి క్వారీయింగ్‌పై స్థానికులు గత 85 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. వీరికి తెదేపా మినహా మిగతా అన్ని పార్టీల నాయకులు మద్దతిచ్చారు. మావోయిస్టులు కూడా ఈ విషయమై గతంలోనే హెచ్చరికలు జారీచేసినట్లు తెలిసింది. దీంతో తాత్కాలికంగా ఈ క్వారీని అధికారులు మూయించారు. అయితే శాశ్వతంగా ముసివేయ్యాలని గ్రామస్థులు ఆందోళన చేస్తూనే ఉన్నారు. ఆదివారం  కిడారి, సివేరి సోమతోనూ ఈ విషయమై మావోయిస్టులు వాదించారు. క్వారీ మూసేయాలని చెప్పినా ఎదురించి ఎందుకు నిర్వహిస్తున్నారనినిలదీశారు. ఆ క్వారీ మూసేశామని, ఆయుధాలు వాడ వద్దని, శాంతియుతంగా మాట్లాడుకుందామని అంటుండగానే తుపాకీలు ఎక్కుపెట్టి కాల్పులు జరపడంతో నేతలిద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు.
23ap-main1e.jpg

ఈ రోజు మావోయిస్టుల చేతిలో చచ్చాం రా
కిడారి చివరి మాట అదే
‘పన్నెండేళ్లుగా కిడారి సర్వేశ్వరరావు కారు డ్రైవర్‌గా పని చేస్తున్నా. చిన్నతనంలోనే ఆయన వద్దకు వచ్చేశా. ఆయనతోపాటు కుటుంబ సభ్యులూ నన్ను సొంత మనిషిలా చూసుకునే వారు. ఎక్కడకు వెళ్లినా వెంట తీసుకువెళ్లే వారు. ఈ రోజు ఇలా జరుగుతుందని ఊహించనే లేదు. వాహనం ఒక్కసారిగా మావోయిస్టుల వలయంలో చిక్కుకుంది. ఎవరం ఏమీ చేయలేని పరిస్థితి. వేగంగా దూసుకుపోదామనుకున్నా వీలుకాలేదు. మా ముందు పావు కి.మీ. దూరం వరకు ఆయుధాలతో మావోయిస్టులు ఉన్నారు. ముందు కొందరు, వెనుక కొందరు ఉండి మధ్యలో మేం చిక్కుకుపోయేలా వల పన్నారు. నెమ్మదిగా వెళ్తున్న మా వాహనం ఎదురుగా  మావోయిస్టులు రావడంతో బ్రేకులు వేయాల్సి వచ్చింది. గమనించిన ఎమ్మెల్యే ‘అరే.. ఈ రోజు మావోయిస్టుల చేతిలో చచ్చాం రా’ అన్నారు. మావోయిస్టులు దగ్గరకు రాక ముందే ఆయనే వాహనం దిగారు. అనంతరం మావోయిస్టులు నన్ను బాక్సైట్‌ తవ్వకాల గురించి అడిగారు. తవ్వకాలు జరుగుతున్నాయి తెలుసా? అన్నారు. తెలియదని చెప్పా. వైకాపా నుంచి తెదేపాలోకి మారినందుకు ఎంత తీసుకున్నారో తెలుసా?అని అడిగారు తెలియదని చెప్పా’.
- రవి, ఎమ్మెల్యే కారు డ్రైవరు
గిరిజన ద్రోహులైనందునే చంపుతున్నామన్న మావోయిస్టులు
23ap-main1g.jpg23ap-main1f.jpg‘‘పార్టీలు మారి అధికారంలోకి వచ్చారు. ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుని బాక్సైట్‌ను తరలించేందుకు పన్నాగాలు పన్నుతున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని రూ.కోట్లు దండుకుంటున్నారు. గొల్లోరిలో మమ్మల్ని ఎన్‌కౌంటర్‌ చేయించేందుకు ప్రయత్నించారు. గూడ క్వారీ విషయంలో గిరిజనులను సమిధలను చేశారు. ఇన్నాళ్ల నుంచి క్వారీకి వ్యతిరేకంగా గ్రామస్థులు..గిరిజనులు నిరసన దీక్షలు చేస్తున్నా పట్టించుకోకపోవటం మీ ధన దాహానికి నిదర్శనం. ప్రజలు ఆందోళనలను అధికారాన్ని అడ్డం పెట్టుకుని అణిచివేస్తున్నారు. ప్రభుత్వంతో కుమ్మక్కై గిరిజనుల సంపదను దోచుకుంటున్నారు. మీరు గిరిజన ద్రోహులు’’ ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సోమలను చుట్టుముట్టిన అనంతరం మావోయిస్టులు అన్నమాటలివి.
- స్వామి, ప్రత్యక్ష సాక్షి, మాజీ ఎమ్మెల్యే సోమ గన్‌మెన్‌
- అప్పారావు, ప్రత్యక్ష సాక్షి, ఎమ్మెల్యే కిడారి వ్యక్తిగత సహాయకుడు
చెట్టుకింద సమావేశం.. ఆ తర్వాత కాల్పుల శబ్దం
23ap-main1h.jpgమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సోమ ప్రయాణిస్తున్న వాహనాలను చుట్టుముట్టారు. వాహనాల్లో నుంచి మమ్మల్నందర్నీ కిందకు దింపేశారు. మీరెవరంటూ ప్రశ్నించారు. కార్యకర్తలమని చెప్పగా పక్కకు తీసుకెళ్లారు. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేని మాత్రం కొద్ది దూరం కాలినడకన తీసుకువెళ్లారు. స్థానికులతో కొంతమంది మావోయిస్టులు చెట్టు కింద సమావేశం నిర్వహించారు. తర్వాత కాల్పులు జరిపిన శబ్దం వినిపించింది.
- చటారి వెంకటరాజు, తాజా మాజీ సర్పంచి, అరకు
 
Link to comment
Share on other sites

10 hours ago, sonykongara said:

first lo undevi,ippudu antha leki lanjakodu le unnaru ,deni kosam fight chesthunaro valla ke theliyadu,ok ex memu chinnappudu ma nana pilpicharu memu ela prajala kosam poradutunnamu miru chandha ivvali annaru anta,10k ichharu ma nana,appudu suryam ani chandravanka dalam ani undedi,naxalite evado bidi tragutunnadu anta,ma nana konchem ibbandi paddadu vasana ki,ayana ventane bhutulu tittadu vadini, ni daggra thupaki undi ani ayana ni bidi vasana barichala ani edi jarigindi na chinnapppudu,ippdu andharu vedavala kulam peru na kodaka add chesi pilustharu

Maree worest ga tayaru ayyaru le

Link to comment
Share on other sites

ఎమ్మెల్యే హత్య కేసును ఒక్క రోజులోనే చేధించిన పోలీసులు
24-09-2018 19:20:53
 
636734137276879887.jpg
విశాఖ: అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హత్య కేసును పోలీసులు చేధించారు. జిల్లాలోని డుంబ్రిగూడ మండలం లిసిటిపుట్టు వద్ద ఆదివారం కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోమ హత్యలో పాల్గొన్న మావోయిస్టులను ప్రత్యక్ష సాక్షులు ఇచ్చిన సమాచారంతో నలుగురిని పోలీసులు గుర్తించారు. జునుమూరి శ్రీనుబాబు అలియాస్‌ సునీల్‌, రైనో, మహిళా మావోయిస్టు కామేశ్వరి అలియాస్‌ స్వరూప, సింద్రి చంద్రి, మరో మహిళా మావోయిస్టు వెంకట రవిచైతన్య అలియాస్‌ అరుణగా గుర్తించారు. వీరి కోసం కూంబింగ్‌ను ముమ్మరం చేశామని ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ తెలిపారు.
 
అయితే హత్యలో ఆర్కే సారధ్యంలో ఈ హత్య జరిగిందని మొదటగా ప్రచారం జరిగింది. ఈ ప్రచారం జరుగుతున్న తరుణంలోనే చలపతి తెరపైకి వచ్చాడు. రామకృష్ణ కాదు అసలు సూత్రదారి చలపతే అంటూ ప్రచారం జరిగింది. మరోవైపు చలపతి భార్య అరుణ ఆధ్వర్యంలో ఆపరేషన్‌ జరిగిందని, ఆ హత్యలో ఆమెనే పాల్గొందని పోలీసులు ప్రచారం చేశారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... సుమారు 60 మంది మావోయిస్టులు దాడిలో పాల్గొన్నారని సమాచారం. వీరిలో సగం మంది మహిళలే కావడం గమనార్హం. వీరంతా శనివారం రాత్రే లివిటిపుట్టు సమీపానికి చేరుకున్నారు. ఆదివారం ఉదయం 9 గంటలకల్లా గ్రామంలోకి వెళ్లారు. గ్రామాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారని పోలీసులు చెబుతున్నారు.
 
మరోవైపు ఏవోబీలో మావోల వైపు నుంచి ఎలాంటి ఘటన జరిగినా చలపతే తెరపైకి వస్తుంటాడు. గెరిల్లా దాడి వ్యూహ రచనలో చలపతికి మంచి పేరుంది. 2003లో చంద్రబాబుపై అలిపిరి వద్ద జరిగిన హత్యాయత్నం కేసులోనూ చలపతి నిందితుడు. ఆయనపై రూ. 25 లక్షల రివార్డు ఉంది. చలపతి అసలు పేరు ప్రతాప్‌ రెడ్డి. ఆయన స్వగ్రామం చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలంలోని ముత్యంపైపల్లె. ఆయన ఎమ్మెస్సీ వరకు చదువుకున్నాడు. మొదట ఈయనకు పట్టుపరిశ్రమల శాఖలో ఉద్యోగం వచ్చింది. చిత్తూరు జిల్లాలోని బంగారుపాళ్యం క్లస్టరులో సుమారు రెండున్నర సంవత్సరాలు పనిచేశాక మదనపల్లెకు బదిలీ చేశారు. ఇక్కడ పనిచేసే సమయంలోనే నక్సలైట్లతో సంబంధాలు ఏర్పడ్డాయి.
Link to comment
Share on other sites

1 hour ago, sonykongara said:

aaa news paper evadooo kani aaa heading pettadaniki siggundali 60 members Maoists 10 days mundheee vachi aaa area lo MLA kosam map vesthuteeee telusukoleka poyaru 

Ippudu malli 1 day lo names telusukunnam ani cover drive poni arrest or encounter chesi unteee adi veru just names telusukuni em pikutharu ata

Asalu state devide ainappati nunchi mana intelligence performance disaster vote ki note,tuni,ippudu mla murder 

Aaaa intelligence DG lu evarooo kani demullu swami

Repu eppudu aina malli leader paina attack chesthee maku cheppakunda bayataki velladu ani cheppi chethulu dulupukuntaru

Ilanti bafoon gallani nammukuni CBN govt run chesthunnadu em chestham karma

Link to comment
Share on other sites

3 minutes ago, krish2015 said:

aaa news paper evadooo kani aaa heading pettadaniki siggundali 60 members Maoists 10 days mundheee vachi aaa area lo MLA kosam map vesthuteeee telusukoleka poyaru 

Ippudu malli 1 day names telusukundam ani cover drive poni arrest or encounter chesi unteee adi veru just names telusukuni em pikutharu ata

Asalu state devide ainappati nunchi mana intelligence performance disaster vote ki note,tuni,ippudu mla murder 

Aaaa intelligence DG lu evarooo kani demullu swami

Repu eppudu aina malli leader paina attack chesthee maku cheppakunda bayataki velladu ani cheppi chethulu dulupukuntaru

Ilanti bafoon vallani nammukuni CBN govt run chesthunnadu em chestham karma

4 sates adulu unatayi IB main role adi central govt di oka state akkada emi pikaledu,anni states kalisi chesthe use avuthundi,orissa 15km akkadiki chesi orissa loki potharu anni states govt kalasi operation cheyyali.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...