Jump to content

జగన్‌ డబ్బు మనిషి! - నెల్లూరు జడ్పీ చైర్మన్‌ బొమ్మిరెడ్డి ఫైర్‌


koushik_k

Recommended Posts

  • 50 కోట్లు ఖర్చు చేసేవారికే టికెట్టా!?
  • విపక్షనేతగానే ఇంత నియంత ధోరణి
  • సీఎం గానీ అయితే ప్రజల గతేంటో
  • నెల్లూరు జడ్పీ చైర్మన్‌ బొమ్మిరెడ్డి ఫైర్‌
  • వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటన
నెల్లూరు, సెప్టెంబరు 22: వైసీపీ అధినేత జగన్‌ డబ్బుకే విలువ ఇస్తారని నెల్లూరు జిల్లా పరిషత్‌ చైర్మన్‌ బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి ఆరోపించారు. ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మాటమాత్రం చెప్పకుండా వెంకటగిరి నియోజకవర్గ ఇన్‌చార్జిగా తన స్థానంలో మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని నియమించడంపై ఆక్రోశం, ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ జగన్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. ‘‘40 ఏళ్ల రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబం మాది. ఒకప్పుడు ఎమ్మెల్సీనయ్యా. ఆ తర్వాత జడ్పీ చైర్మన్‌గా ఎన్నికయ్యా. మాట మాత్రం చెప్పకుండా నన్ను ఇన్‌చార్జి పదవి నుంచి తొలగించారు.
 
ప్రతిపక్ష నాయకుడి హోదాలోనే నియంతలా వ్యవహరిస్తున్న జగన్‌... రేపు పొరపాటున ముఖ్యమంత్రి అయితే నాయకులు, ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. పార్టీ నాయకులకు కనీస మర్యాద ఇవ్వని జగన్‌ నాయకత్వంలో పని చేయడం ఇష్టంలేకే వైసీపీకి రాజీనామా చేస్తున్నా’’ అని రాఘవేంద్ర రెడ్డి తెలిపారు. మూడేళ్లపాటు ఎంతో శ్రమించి నియోజకవర్గంలో పార్టీ గెలిచే స్థాయికి తీసుకొచ్చానన్నారు. పార్టీ పరంగా చేసిన సర్వేల్లో కూడా మంచి ఫలితాలు వచ్చాయని తెలిపారు. అన్నీ బాగున్నాయనుకున్న సమయంలో జగన్‌ అన్యాయం చేశారని ఆక్రోశించారు. ‘‘నెలన్నర క్రితం ఆనం రామనారాయణరెడ్డి లోట్‌సపాండ్‌కు వెళ్లి జగన్‌ను కలిసి వచ్చారు. ఆ మరుసటి రోజే నేను వెళ్లాను. ఆ రోజు జగన్‌ సమక్షంలో జిల్లా ఇన్‌చార్జి సజ్జల రామకృష్ణారెడ్డి ఒక మాట అన్నారు. ఆనం ఆర్థిక మంత్రిగా చాలా సంపాదించారు. ఎన్నికల్లో 50 కోట్లు ఖర్చు పెడతారట! మీరు పెట్టగలరా!? అని అడిగారు. నాకు అన్యాయం జరగబోతోందని ఆ రోజే అర్థమయ్యింది. జగన్‌ డబ్బుకే విలువ ఇస్తున్నారని స్పష్టమైంది. ఆరోజు కూడా ఆనం రామనారాయణరెడ్డిని వెంకటగిరి ఇన్‌చార్జిగా నియమిస్తామని మాట మాత్రంగా కూడా చెప్పలేదు’’ అని రాఘవేంద్ర రెడ్డి ఆరోపించారు.
 
వద్దన్నా అప్పగించారు...
గత ఎన్నికల ఫలితాల తర్వాత జగన్‌ స్వయంగా పిలిచి వెంకటగిరి ఇన్‌చార్జిగా ఉండాలని కోరినట్లు రాఘవేంద్ర రెడ్డి తెలిపారు. తాను అప్పటికే జడ్పీ చైర్‌ చైర్మన్‌గా ఉన్నందున, మరొకరికి అవకాశం ఇవ్వాలని కోరానన్నారు. కానీ... తననే ఇన్‌చార్జిగా నియమించి, ఎమ్మెల్యేగా పోటీ చేయవచ్చునని జగన్‌ చెప్పారని తెలిపారు. ‘‘ఆ రోజు నుంచి వెంకటగిరిలో పార్టీ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేశాను. జగన్‌ పాదయాత్ర వెయ్యి కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా స్థూపం కూడా కట్టించాను. పార్టీ కోసం ఇంత చేస్తే ఒక్క మాట కూడా చెప్పకుండా అవమానకరంగా బయటకు వెళ్లేలా చేశారు. వెంకటగిరి టికెట్‌ దక్కలేదనే బాధ నాకు లేదు.
 
రాజకీయ సమీకరణల్లో భాగంగా కొంతమందికి సీట్లు రాకపోవచ్చనే విషయం నాకూ తెలుసు. అయితే ఆ విషయం నాకు చెప్పకపోవడమే బాధ కలిగించింది’’ అని రాఘవేంద్ర రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖలో జరిగిన పార్టీ ఇన్‌చార్జీల సమావేశానికి తనకు తప్ప మిగిలిన వారందరికీ అధ్యక్షుడి నుంచి ఆహ్వానం అందిందని తెలిపారు. ‘‘ఆ రోజు నుంచి నేను పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నానని, తీవ్ర మనస్తాపానికి గురయ్యాననే విషయం తెలిసి కూడా జగన్‌ ఒక్కసారి కూడా పలుకరించలేదు. విధిలేని పరిస్థితుల్లో ఇన్‌చార్జిని మార్చుతున్నామని పిలిపి చెప్పినా, ఫోన్‌ చేసినా బాధపడే వాడిని కాను. ఒక్క ఫోన్‌ కాల్‌కు నోచుకునే అర్హత కూడా నాకు లేదా? పార్టీ కోసం కష్టపడిన నాయకుడికి ఇచ్చే మర్యాద ఇదేనా!’’ అని ప్రశ్నించారు.
 
 
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...