Jump to content

ఎవరు వదిలిన బాణం పవన్‌?


sonykongara

Recommended Posts

ఎవరు వదిలిన బాణం పవన్‌?

 
 

ఆ బాణం ఎటు వెళుతోందో తెలియదు. ఆ బాణం ఎవరు వదిలారో తెలియదు. ఆ బాణం లక్ష్యం వైపు వెళ్లట్లేదు. పదే పదే దిశను మార్చుకుని పయనిస్తూ ఆగుతూ పడుతూ లేస్తూ ఎటు వెళుతోందో తెలియట్లేదు. ఆ బాణం పేరు పవర్‌ స్టార్‌ పవన్ కళ్యాన్‌. పాపం ఇప్పుడు ఆయనలో పవర్ తగ్గింది. ఎందుకో తెలియదు. స్టార్‌డమ్ మునుపటిలా లేదు. మొత్తంగా పవన్‌ గ్రాఫ్‌ క్రమేపి కిందకి పడిపోతోంది. అతనివి అన్నీ స్వయంకృతాపరాథాలే అనిపిస్తోంది.

 

pawan22292.jpg

పవన్‌ కల్యాణ్‌ ఇప్పుడు ఎవరితో యుద్ధం చేస్తున్నారో తెలియట్లేదు. కొద్ది రోజులు మీడియాతో యుద్ధం చేశారు. ఆపేశారు మధ్యలోనే. పైగా తాను సుదీర్ఘ న్యాయ పోరాటం చేయనున్నట్టు కూడా చెప్పారు అప్పుడు. కానీ అది అంతలోనే ఆపేశారు. పవన్‌ కల్యాణ్‌ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నాయకురాలు రోజా మా పవన్‌ కల్యాణ్‌ అంది. దానిని బట్టి ఆయన వైకాపా వదిలిన బాణం అనుకోవాలా? మెగా ఫ్యామిలీ అంతా పవన్ కళ్యాణ్‌కు మద్దతు ప్రకటించారు. అంటే ప్రజారాజ్యం -2 అనుకోవాలా? ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే విషయమై కేంద్ర ప్రభుత్వాన్ని ఒకనాడు తీవ్రంగా విమర్శించిన పవన్‌ కల్యాణ్‌ మౌనంగా ఉంటున్నారు కాబట్టి ఆయన బీజేపీ విడిచి పెట్టిన బాణం అనుకోవాలా? లేకపోతే పవన్‌ కల్యాణ్‌పై తీవ్ర వత్తిడి తెచ్చి ఆయన కేంద్రాన్ని విమర్శించకుండా నిలువరించిన రాజ్యంగ పదవిలో ఉన్న పెద్ద మనిషి వదిలిన బాణమా?

pawan383933-1024x683.jpg

ఒకప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుటుంబాన్ని విమర్శించిన పవన్‌ కల్యాణ్‌ కొంత కాలం నుంచి కేసీఆర్‌ను కలిసి పొగడ్తలతో ముంచెత్తడం, తెలంగాణలో ఘోర సంఘటనలు జరిగినా ప్రభుత్వాన్ని కనీసం పల్లెత్తి మాట అనకపోవటం వెనుక ఏమి జరిగిందో పవన్‌ కల్యాణ్‌ చెబితే బాగుంటుంది. మరి ఆయన ఏపీపై తెలంగాణ రాష్ట్ర సమితి విడిచిన బాణం అనుకుందామా? మీకు మీరు దైవాంశ సంభూతులమని భ్రమిస్తుంటారు. ఒక సందర్భంలో నాగబాబు, అల్లు అరవింద్‌ వంటివారు కూడా పవన్‌ కల్యాణ్‌కు కోపం వస్తే అందరి దూల తీరుస్తారని హెచ్చరించారు. మరి ఏపీకి ఇంత అన్యాయం చేసిన కేంద్రంపై ఎందుకు కోపం రావట్లేదు? మోడీ దూల ఎందుకు తీర్చట్లేదు అని మాత్రం మనం అడగకూడదు. కులం అనేది నాకు లేదని, నేను చేగువేరాలా కమ్యునిస్టు భావాలు కలవాడిని అని చెబుతూ కాపు కుల సంఘం మీటింగ్‌ పెట్టి చందాలు ఎందుకు వసూలు చేశావు అని అనకూడదు మనం. ఎందుకంటే పవన్‌కి కోపం వస్తుంది. కోపం వస్తే మన దూల తీర్చేస్తారట!

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...