Jump to content

అయ్యో పాపం... అయినా సాయం!


Saichandra

Recommended Posts

లక్షా 39వేల రూపాయలు..15 ఏళ్లపాటు పనిమనిషిగా రెక్కలు ముక్కలు చేసుకుని కూడబెట్టిన కష్టార్జితం. ఇప్పుడు ఆ డబ్బు ఆమె దగ్గర లేదు. నోట్లరద్దు ఆమె నోటి దగ్గర బువ్వను ‘గంగ’పాలు చేసింది. పనిమనిషి మీనాక్షి బతుకు రోడ్డు పాలైంది. అయితేనేం... ఒక వెలుగు రేఖ ఆమెకు దారి చూపింది. చిన్నసాయం ఆమె చిరునవ్వుకు జీవం పోసింది.
 
 
కర్ణాటకలోని హసన్‌ పట్టణం మీనాక్షి (40) స్వస్థలం. 15 ఏళ్లుగా ఎన్నో ఇళ్లల్లో పనిమనిషిగా చేస్తోంది. వచ్చే కొద్దిపాటి ఆదాయాన్ని జాగ్రత్తగా ఖర్చు చేస్తూ, రూపాయి రూపాయి కూడబెట్టింది. రూ. 1.39 లక్షలు పొదుపు చేసింది. వాటితో చిన్న ఇల్లు కట్టుకోవాలని ఇంట్లోనే దాచి ఉంచింది. మంచి ముహూర్తం చూసుకొని సొంత ఇంటి నిర్మాణం పని మొదలెడదామని బజారుకెళ్లింది. 
 
అక్కడ షాపులో ఒక పెద్దనోటు బయటకు తీసింది. ‘ఈ నోట్లు చెల్లవు’ అని పిడుగు లాంటి వార్తను యజమాని చాలా మామూలుగా చెప్పాడు. ‘పెద్ద నోట్లు రద్దు’ దానికి కారణం అని కూడా చెప్పాడు. పెద్ద నోట్ల రద్దు గురించి బయట గందరగోళం జరుగుతున్నా, ఆ సెగ మీనాక్షిని ఎందుకు తాకలేదు? తన డబ్బులు ఎందుకు మార్చుకోలేదు? దానికో కారణం ఉంది. కాదు... కష్టం ఉంది. దేవుడు ఆమె పుట్టినప్పటి నుంచి చేస్తున్న వెట్టి చాలదని... పుట్టుకతోనే కొన్ని కష్టాలనిచ్చాడు.
 
 
ఆమెకు వినికిడి లోపం ఉంది. దానికి తోడు మాటలు రావు. కష్టాలను ఆమె దేవుడిచ్చిన బహుమతులు అనుకుంది. ఎవరు దేని గురించి చెప్పినా మీనాక్షికి వినపడదు. తను తిరిగి బదులు చెప్పలేదు. అందుకే నోట్లరద్దు గురించి ఆమెకు తెలియలేదు. తెలిసిన తరువాత తన నోట్లను మార్చుకోవటానికి కుటుంబ సభ్యులను వెంటబెట్టుకొని ఏడాది కాలం పాటు బ్యాంకు అఽధికారుల చుట్టూ తిరిగింది. కానీ అధికారులు చేతులెత్తేశారు. ఇంతలో పెద్ద నోట్ల రద్దు జరిగాక కూడా పాతనోట్లను దగ్గరపెట్టుకోవటం చట్టరీత్యా నేరం అవుతుందని ఇరుగుపొరుగు మీనాక్షిని హెచ్చరించారు. దాంతో మీనాక్షి భయపడింది. కష్టపడి సంపాదించిన డబ్బును తీసుకెళ్లి హసన్‌ పట్టణం మీదుగా ప్రవహించే ‘హిమవతి’ నదిలో కలిపింది. అలా ఆమె 15 ఏళ్ల శ్రమ గంగలో కలిసింది.
 
 
మానవత్వ పరిమళం...
మీనాక్షి కష్టానికి ఆ గంగ హృదయం ద్రవించిందేమో తెలియదు గానీ ఊహించని రీతిలో సహాయం ఆమె తలుపు తట్టింది. మీనాక్షి డబ్బును నీటి పాలు చేసిన సంఘటన గురించి ఒక ఆంగ్ల దినపత్రికలో ప్రచురితమైన కథనం చదివిన ఎ. రామకృష్ణ అనే బెంగళూరు వాసి ఆమెను ఆర్థికంగా ఆదుకునేందుకు ముందుకొచ్చాడు. మీనాక్షి బ్యాంకు ఖాతాలో రూ. 25 వేలు జమ చేశాడు. మూడు నెలల పాటు నెలకు రూ. 5 వేల చొప్పున ఆమె ఖాతాలో జమచేస్తానని తెలిపాడు. జీవితాంతం కష్టపడి సంపాదించుకున్న సొమ్మును పోగొట్టుకున్న పెద్ద నోట్లరద్దు బాధితులు మరెంతో మంది తనకు తెలుసన్నాడు.
 
 
మీనాక్షి చేతులెత్తి దణ్ణం పెడుతుంటే ‘నేను చేసిన సహాయం చిన్నది’ అన్నాడు. మీనాక్షికి అతను చేసిన సహాయం చిన్నదా? పెద్దదా? అని తేల్చే తూనికలు లేకపోవచ్చు.. కానీ సాటి మనిషికి వచ్చిన కష్టాన్నించి ఆదుకునే పెద్దమనసు అతనిదని మాత్రం తెలిసింది. అతని దృష్టిలో చేసింది చిన్న సాయం మాత్రమే కావచ్చు.. కానీ ‘కష్టేఫలి’ అని నమ్మే మీనాక్షి లాంటి కోట్లాది శ్రమజీవుల నమ్మకానికి మాత్రం ప్రాణం పోశాడు. గొప్ప వ్యక్తులెప్పుడూ పైకి సామాన్యుల్లానే కనబడతారు ..అది కష్టపడి పనిచేసే మీనాక్షి అయినా, అవతలివారి కష్టాన్ని గుర్తించే మంచి మనసున్న రామకృష్ణ అయినా!!
Link to comment
Share on other sites

6 minutes ago, RamaSiddhu J said:

ఒరేయ్ మోడీగా కుక్క చావు చస్తావ్ పంచె రెడ్డి లాగా

 

mana society lo unna tara tamyalu and diversified sectors major fault and chuttu unna okarukoda ameki ardamayyetlu cheppakapovadam 

 

 

idi kada ilantivi chala teliyavu weaker sections lo which may also be helpful to them

Link to comment
Share on other sites

1 hour ago, BalayyaTarak said:

 

mana society lo unna tara tamyalu and diversified sectors major fault and chuttu unna okarukoda ameki ardamayyetlu cheppakapovadam 

 

 

idi kada ilantivi chala teliyavu weaker sections lo which may also be helpful to them

How would they know she had 1.5 lakh saved money? Why do you think she will tell everyone that she has 1.5 lakh cash in her house ?

Link to comment
Share on other sites

3 minutes ago, sskmaestro said:

How would they know she had 1.5 lakh saved money? Why do you think she will tell everyone that she has 1.5 lakh cash in her house ?

Dabbulu unnayi ani cheppakapoyina aa jeetham ichevallo evaro okalu cheppali kada ardamayetlu if deaf and dumb antunna

 

Ilanti vallu entha mandini munchado Modi tatha vadi chai knowledge tho

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...