Jump to content

ప్రేమ పెళ్లిపై పడగెత్తిన కులోన్మాదం


sonykongara

Recommended Posts

ప్రేమ పెళ్లిపై పడగెత్తిన కులోన్మాదం
20-09-2018 03:01:02
 
636730092598513796.jpg
  • కూతురు దళితుడిని పెళ్లి చేసుకుందని తండ్రి ఆగ్రహం
  • బొండాల కత్తితో దాడి.. చావు బతుకుల్లో కూతురు
  • పోలీసులు కౌన్సెలింగ్‌ ఇచ్చినా మారని నైజం
  • మారినట్లు నటిస్తూ కూతురికి రోజూ ఫోన్‌
  • రిసెప్షన్‌ జరిపిస్తానని మాయమాటలు
  • కొత్తబట్టల కోసం రావాలని పిలుపు
  • వచ్చీరాగానే కూతురు, ఆమె భర్తపై భీకర దాడి
  • చేయి తెగి.. గొంతుకు గాయమైన ఆమె
  • గాయాలతో తప్పించుకున్న ఆమె భర్త
  • హైదరాబాద్‌ ఎర్రగడ్డ వద్ద పట్టపగలు దారుణం
అమీర్‌పేట, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): అదే ఘోరం.. అదే కులోన్మాదం! ‘ప్రేమపెళ్లి’పై మళ్లీ కత్తి ఎగసింది! కాళ్లపారాణి కూడా ఆరని వధూవరులపై నెత్తురు చిమ్మింది! మొన్నటికి మొన్న మిర్యాలగూడలో ప్రణయ్‌ హత్య ఘటనను మరువకముందే అదే తరహాలో హైదరాబాద్‌ నడిబొడ్డున దారుణం జరిగింది. కూతురు తక్కువ కులం వాడిని పెళ్లి చేసుకుందని తీవ్ర ఆగ్రహంతో రగిలిపోయాడా తండ్రి! అయితే, మారుతీరావులా కూతురిని బెదిరించలేదు.. హత్య కోసం ఎవరికీ సుపారీ ఇవ్వలేదు. అతడిలానే అల్లుడినే టార్గెట్‌ చేసుకున్నాడు. ఇందుకు.. తాను మారినట్లు నటించాడు. అప్పటిదాకా తిట్టిపోసిన నోటితోనే కూతురి పెళ్లిని స్వాగతించాడు. తన కళ్లతో పెళ్లిని చూడలేకపోయానని.. రిసెప్షన్‌ను అయినా ఘనంగా జరిపిస్తానని నమ్మబలికాడు. కొత్తబట్టలు ఇప్పిస్తానని.. బట్టల దుకాణానికి రావాలని చెప్పాడు. నమ్మి ఇద్దరూ వెళ్లగా.. వెంట తెచ్చుకున్న కొబ్బరిబోండాలను నరికే కత్తితో అల్లుడిపై విచక్షణారహితంగా దాడి చేశాడు.
 
ప్రమాదాన్ని గుర్తించిన అల్లుడు.. గాయాలతో తప్పించుకోగా.. ఆ కోపాన్నంతా కూతురిపైనే చూపాడు! ఆమె చేయిని తెగనరికాడు. మెడపైనా దాడి చేశాడు! కూతురు నెత్తుటి మడుగులో కొట్టుకుంటుండగా.. తనను అడ్డుకునేందుకు ప్రయత్నించిన వారిని కత్తితో బెదిరిస్తూ అక్కడి నుంచి పరారయ్యాడు! హైదరాబాద్‌ ఎర్రగడ్డ గోకుల్‌ థియేటర్‌ వద్ద బుధవారం పట్టపగలు నడిరోడ్డుపై జరిగిన ఈ దారుణం స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది.
 
 
బోరబండ వినాయకరావు నగర్‌కు చెందిన మాధవి (22)ది విశ్వబ్రాహ్మణ సామాజికవర్గం. ఎర్రగడ్డ ప్రేమ్‌నగర్‌కు చెందిన సందీప్‌ (24)ది ఎస్సీ-మాల సామాజిక వర్గం. ఇద్దరి మధ్య ఐదేళ్ల క్రితం ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది. సందీప్‌ కూకట్‌పల్లిలో బీకాం ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్నాడు. మాధవి హిందూ కాలేజీలో చదువుతోంది. మాధవి తండ్రి మనోహరాచారి అమీర్‌పేటలోని గణేశ్‌ జువెలరీస్ లో గోల్డ్‌స్మిత్‌గా పనిచేస్తున్నాడు. మాధవి, సందీప్ లు తమ ప్రేమను పెద్దల దృష్టికి తీసుకెళ్లగా.. మనోహరాచారి ఒప్పుకోలేదు. ఆమెకు వేరే సంబంధం చూసి పెళ్లి చేయాలని నిశ్చయించాడు. దీంతో 10రోజుల క్రితం ఇద్దరూ ఆర్య సమాజ్‌లో పెళ్లి చేసుకున్నారు. మనోహరాచారి నుంచి తమకు ప్రాణహాని ఉందని పోలీసులను ఆశ్రయించారు. దీంతో సీఐ వెంకటేశ్వరరావు కుటుంబసభ్యులకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు.
 
dhadi-badhithulu-25.jpg 
 
హత్యకు స్కెచ్‌
పోలీసుల కౌన్సెలింగ్‌తో మనోహరాచారి తాను పూర్తిగా మారిపోయినట్లు నటించాడు. కూతురు మాధవికి రోజూ ఫోన్‌చేసి ఆప్యాయంగా మాట్లాడేవాడు. వినాయక చవితి ఉత్సవాల అనంతరం పెద్దఎత్తున రిసెప్షన్‌ నిర్వహిస్తానని కూతురుకు చెప్పాడు. బుధవారం ఉదయం మాధవికి ఫోన్‌ చేశాడు. నూతన వస్త్రాలు ఇప్పిస్తాను.. అల్లుడిని తీసుకొని ఎర్రగడ్డ గోకుల్‌ థియేటర్‌ వద్దకు రావాలని చెప్పాడు. విషయాన్ని భర్తకు చెప్పడంతో అతడూ అంగీకరించాడు. ఇద్దరూ వచ్చి గోకుల్‌ థియేటర్‌ వద్ద రోడ్డుపై నిల్చున్నారు. సాయంత్రం 4 గంటల సమయంలో మనోహరాచారి ఫూటుగా మద్యం తాగి ద్విచక్ర వాహనంపై అక్కడికి వచ్చాడు. దిగుతూనే కత్తితో సందీప్ పై వేటు వేశాడు. తేరుకునేలోపే కొడవలి గాటు గదవకు తగలడంతో నెత్తురు చిందింది. మాధవి భర్తను కాపాడుకునేందుకు తండ్రితో ప్రతిఘటించింది.
 
 
దీంతో ఆమెపైనా కత్తి దూశాడు. వేటు నేరుగా పడడంతో ఆమె చేయి పూర్తిగా తెగి పోయింది. కత్తి చెవి పక్కన కూడా దిగడంతో ఆమె కుప్పకూలింది. అనంతరం మనోహరాచారి అక్కడి నుంచి పారిపోయాడు. మాధవిని స్థానికులు నీలిమ ఆస్పత్రికి.. అక్కడి నుం చి యశోద ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. స్వల్ప గాయాలైన సందీప్‌ చికిత్స పొందుతున్నాడు. సమాచారం అందుకున్న పంజాగుట్ట ఏసీపీ విజయ్‌కుమార్‌ ఘటనాస్థలికి చేరుకున్నారు. రెండు గంటల తర్వాత ఖైరతాబాద్‌లో మనోహరాచారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని పరీక్షించగా 370 బ్లడ్‌ ఆల్కహాల్‌ కంటెంట్‌ నమోదైంది. తన కూతురు కులం తక్కువ వాడిని పెళ్లి చేసుకోవడం... తన భార్య, కుమారుడు కూ డా వారికి సహకరించడాన్ని జీర్ణించుకోలేకనే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు విచారణలో అతడు వివరించాడు.
 
 
30 సెకన్లు.. 4 వేట్లు..
బుధవారం సాయంత్రం 4 గంటలు.. ఎస్‌ఆర్‌నగర్‌ ప్రధాన రహదారి.. ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు.. మాధవి తన భర్త సందీప్ తో కలిసి రోడ్డు పక్కన బైక్‌పై కూర్చొని ఉంది. అప్పుడే వారి వెనుక నుంచి వచ్చిన మనోహరాచారి వారి పక్కనే బైక్‌ ఆపి కిందకి దిగాడు. వెంటనే బ్యాగులోంచి కొబ్బరి బోండాల కత్తి తీశాడు. బైక్‌పై కూర్చున్న అల్లుడిపై ఒక్క వేటు వేశాడు. రెండో వేటు వేయబోతుంటే మాధవి తండ్రిని లాగేసింది. వెంటనే తేరుకున్న సందీప్‌.. బైక్‌ను అక్కడే పడేసి తప్పించుకున్నాడు. ఆవేశాన్ని ఆపుకోలేని మనోహరాచారి.. రోడ్డుమీద పడ్డ కూతురిపైనా వేటు వేశాడు. అడ్డుకోవడానికి వచ్చిన వారిని బెదిరించాడు. మరోసారి మాధవిపై కత్తితో దాడి చేశాడు. ఈ దారుణమంతా కేవలం 30 సెకన్లలోనే జరిగిపోయింది.
 
 
గుట్టుగా కత్తి చోరీ
అల్లుడిని చంపేందుకు మనోహరాచారి ముందుగానే పథకం సిద్ధం చేసుకున్నాడు. సందీప్ ను చంపేస్తానని వారం క్రితమే సన్నిహితుల వద్ద చెప్పుకున్నట్టు తెలిసింది. బుధవారం కూతురుకు ఫోన్‌చేసే ముందే పూటుగా మద్యం తాగాడు. కూతురు, అల్లుడిని గోకుల్‌ థియేటర్‌ వద్ద ఉండాలని చెప్పి.. ద్విచక్రవాహనంపై ఎర్రగడ్డ వైపు బయలుదేరాడు. మైత్రివనం సిగ్నల్‌ వద్ద ఆగాడు. పక్కనే కొబ్బరి బొండాలు అమ్ముతున్న బండి వద్దకు చేరుకున్నాడు. అక్కడ బొండాలను అమ్ముతున్న వ్యక్తి లేకపోవడంతో బండిపై ఉన్న కత్తిని గుట్టుగా తీసుకొని బ్యాగులో పెట్టుకున్నాడు. తర్వాత నేరుగా ఎర్రగడ్డ గోకుల్‌ థియేటర్‌ వద్దకు చేరుకున్నాడు.
 
 
మంచివాడే..ఇలా చేస్తాడనుకోలేదు
కన్నకూతురును నిర్దాక్షిణ్యంగా నరికి.. ఆమెను ప్రాణాపాయస్థితిలోకి నెట్టిన మనోహరాచారి ఇంతటి దారుణానికి ఒడిగట్టాడంటే స్థానికులు నమ్మలేకపోతున్నారు. అతడు చాలామంచివాడని.. అందరితో సౌమ్యంగా నడుచుకుంటాడని అంటున్నారు. మనోహరాచారి గణేశ్‌ జువెలరీలో పనిచేస్తున్నాడు వారు కూడా ఆయన మంచివాడని, తనపనేదో తాను చేసుకుపోయేవాడంటున్నారు. అతడు ఇంతటి ఘోరానికి ఒడిగట్టడం దిగ్ర్భాంతికి గురిచేసిందని చెబుతున్నారు.
 
 
సందీప్ ను చంపాలనుకున్నా
‘‘నా కూతురును ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్నాను. ఆమె ప్రేమవివాహం చేసుకోవడం నాకు అస్సలు నచ్చలేదు. తీవ్ర మానసిక ఆందోళనకుగురయ్యా. నాకూతురుకు రెండేళ్లు ఉన్నప్పుడు హైదరాబాద్‌కు వచ్చాను. కుటుంబాన్ని బాగా చూసుకోవాలనే ఉద్దేశంతో ఏళ్లుగా కష్టపడుతున్నా. కూతురు ప్రేమ పెళ్లి నా ఆశల్ని కూల్చేసింది. ఐదురోజులుగా మద్యం తాగుతున్నా. నా కూతురును పెళ్లి చేసుకున్న సందీప్ ను చంపాలనుకున్నా. అందుకే.. కత్తితో దాడిచేశాను’’
- మాధవి తండ్రి మనోహరాచారి
 
 
బోర్డు పరీక్షల్లో కలిశారు
‘‘బోరబండలో ఉన్న డాన్‌బాస్కో స్కూల్లో బోర్డుపరీక్షల్లో సందీప్‌, మాధవికి పరిచయం ఏర్పడింది. ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ఈ విషయం నాకు తెలిసింది. నా కొడుకును తీవ్రంగా మందలించాడు. ఈ వయసులో ప్రేమంటూ భవిష్యత్తు పాడు చేసుకోవద్దని నేనూ హెచ్చరించాను. మాధవి కుటుంబ సభ్యులకు కూడా ఈ ప్రేమ విషయం తెలిసింది. మాధవి తల్లిదండ్రులను అమ్మాయి విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పాను. కానీ వారు ఆమెను అదుపులో పెట్టుకోలేకపోయారు. నేను చెప్పినా సందీప్‌ విన్లేదు. ఇద్దరినీ ఇలా చూస్తానని అనుకోలేదు’’
-సందీప్‌ తల్లి రమాదేవి
Link to comment
Share on other sites

13 minutes ago, adithya369 said:

Lover boy abscond from the place,  he not even worried about her it seems. 

 

Ippudu aa ammaayi ki oka hand leduga,  aa love continue avuthundo ledo choodaali

Abbai ni Katti tho dhaadi chesetapudu Ammai addu padi 2 Katti debbalaki gurayindhi.. Ammai Pai dhaadi chesetapudu Abbai jump akkada nunchii..

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...