Jump to content

Jc దమ్మున్న మొగోడు & hatsoff to dasari kiran in provide issue


MSDTarak

Recommended Posts

దాదాపు 4ఏళ్ల నుండి గమనిస్తున్నాను.. అప్పటి నుండి ఇప్పటిదాకా పట్టిన పట్టు ఏమాత్రం సడలించలేదు. ఏ దశలోనూ నిరాశ చెందలేదు. నిజానికి ఈ అంశంలో Dasari Kiranకి ఎలాంటి సహాయం చేయలేకపోయాము. ఈ అంశంలో ఇతడు వన్ మాన్ ఆర్మీ. ఎవరూ సహాయం చేయలేదని కోపం కానీ, అసంతృప్తి కానీ వ్యక్తం చేయలేదు. ఎపుడు ఫోనులో మాట్లాడుకున్నా ఈ అంశం గురించే ఎక్కువ చర్చ. 
దుష్ట ప్రబోధానందని హ్యాండిల్ చేయడంలో కిరణ్ కృషి అసమానమైనది. 
ఇక "హిందూ" పార్టీ అయిన బీజేపీ ప్రబోధానంద కొడుకులను పార్టీలో చేర్చి పదవులు కూడా కట్టబెట్టి, నమ్ముకున్న హిందువుల ఆశలపై నీళ్లు పోసిన సందర్భంలో పెద్ద దిక్కుగా నిలిచి, ప్రత్యక్షంగా పోరాటంలో పాల్గొన్న జేసీ దివాకర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు.

-by a close source 

Link to comment
Share on other sites

Agenda tweet/FB post laaga vundi. Prabhodananda 14-15 years nunchi akkade asramam erpatu chesukunte last 4 years lone kanapadinda.

4 years nunchi evariki compliant chesaru, not even 0.1% people know about this issue outside that village.

 

Why no one mentioning BJP & YSRCP hidden agenda to split Hindus for their vote bank politics.

Link to comment
Share on other sites

ప్రబోధానంద జీవితంపై రకరకాల ప్రచారాలు జరుగుతున్న నేపథ్యంలో ఆయన మూడో కుమారుడు యుగంధర్‌ చౌదరిని ‘ఈనాడు’ సంప్రదించగా.. ప్రబోధానంద అసలు పేరు గుత్తా పెద్దన్న చౌదరి అని చెప్పారు. 1971లో పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధంలో ఆయన ఆర్మీ తరఫున రేడియో ఆపరేటర్‌గా విధులు నిర్వహించారని, ఆర్మీలో మూడేళ్ల విధుల తర్వాత బయటకు వచ్చారని వివరించారు. ‘మా నాన్న ఆర్‌ఎంపీగా ఈ ప్రాంతంలోనే ఉంటూ ఆయుర్వేదం, హోమియోపతిలపై పలు పుస్తకాలు రాశారు. తర్వాత ఓ స్వామీజీ సూచనలతో ఆధ్యాత్మికంవైపు మళ్లారు. 1990లో తాడిపత్రి రైల్వే స్టేషన్‌కు సమీపంలో నందలపాడులో ఆశ్రమం ఏర్పాటు చేశారు. మేం ఐదుగురు కుమారులం. రెండో కుమారుడు యుగంధర్‌ చౌదరిని ప్రత్యర్థులు చంపడంతో మళ్లీ నాకు ఆ పేరే పెట్టారు. కొంత కాలంగా అన్ని విషయాల్లో తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి అడ్డుకుంటున్నారు. గత ఏడాది మా మొదటి సోదరుడు యోగానంద్‌ భాజపాలో చేరడంతో జేసీ సోదరులు కక్ష పెంచుకున్నారు. ఆశ్రమానికి 6 నెలలు విద్యుత్తు నిలిపేయడం, నీటి సరఫరా లేకుండా చేయడం, నిర్మాణ పనులకు ఇసుక రాకుండా చేయడంతో కోర్టును ఆశ్రయించి అనుమతులు తెచ్చుకున్నాం’ అని వివరించారు. ఎలాగైనా ఆశ్రమాన్ని మూయించాలనే ఉద్దేశంతో జేసీ అందరినీ బయటకు పంపిస్తున్నారని ఆరోపించారు. మంగళవారం అధికారులు తనిఖీ పేరిట లోపలికి వచ్చి పోలీసుల ద్వారా భక్తుల గదుల్లోని లాకర్లనూ పగలగొడుతున్నారని విమర్శించారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...