Jump to content

prabodhananda


sonykongara

Recommended Posts

శాంతిభద్రతల విషయంలో ఎవరినీ ఉపేక్షించం
తాడిపత్రి ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష

11404017BRK73A.JPG

అమరావతి: అనంతపురం జిల్లా తాడిపత్రి పరిధిలోని చిన్నపొలమడలో చోటుచేసుకున్న ఘటనపై పోలీసు ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ భేటీలో అనంతపురం జిల్లా తెదేపా నేతలు కూడా పాల్గొన్నారు. శాంతిభద్రతలు కాపాడే విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీపడేది లేదని సీఎం స్పష్టం చేశారు. శాంతిభద్రతలు అదుపులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అధికార పార్టీల నేతలు ఎవరైనా శాంతిభద్రతల ఉల్లంఘనకు పాల్పడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. కరవు జిల్లా అయిన అనంతపురంలో కియా లాంటి పరిశ్రమల వల్ల మంచిపేరు వస్తుంటే.. కొందరి తీరు వల్ల అక్కడ చెడ్డపేరు వచ్చే పరిస్థితి తలెత్తరాదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. పార్టీలకు అతీతంగా పోలీసులు అక్కడ పరిస్థితులు అదుపులో ఉండేలా ఎలాంటి నిర్ణయాలైనా తీసుకోవాలని సీఎం స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

 
 
Link to comment
Share on other sites

తాడిపత్రిలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితి
ప్రబోధానంద శిష్యులను తరలించేందుకు పోలీసుల సన్నాహాలు
రాత్రంతా పోలీస్‌స్టేషన్‌ ఎదుటే ఉన్న ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి

11580217BRK75A.JPG

తాడిపత్రి: అనంతపురం జిల్లా తాడిపత్రి పరిధిలోని చిన్నపొలమడలో శనివారం గణేశ్‌ నిమజ్జనం సమయంలో గ్రామస్థులకు, ప్రబోధానంద భక్తులకు చెలరేగిన వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. దీంతో పోలీసులు, రెవెన్యూ అధికారులు అప్రమత్తమయ్యారు. శనివారం నాటి వివాదం ఆదివారం మధ్యాహ్నం పెద్దది కావడం, ఆశ్రమ భక్తులు బయటకు వచ్చి కొందరిపై దాడి చేయడం, ఆ తర్వాత అందులో ఒకరు చనిపోవడంతో పోలీసులు దీనిని తీవ్రంగా పరిగణించారు. దీంతో ఆశ్రమం నుంచి భక్తులను వారి స్వస్థలాలకు తరలించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

అదనపు ఎస్పీ మల్యాద్రి, కొందరు డీఎస్పీల ఆధ్వర్యంలో పోలీసులు లోపలికి వెళ్లేందుకు ప్రయతించగా భక్తులు గేట్లు తెరవకుండా అడ్డుకున్నారు. ఎస్పీ అశోక్‌కుమార్‌ ఆదివారం సాయంత్రం ఆశ్రమంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా ఆయన్ని కూడా అడ్డుకున్నారు. లోపలకు రానివ్వమని అడ్డుతగిలారు. ఎస్పీ అయితే మాకేంటని వాదించారు. అందరితో మాట్లాడతామని చెబితే కేవలం ఎస్పీ, ఒక్క గన్‌మెన్‌ను మాత్రమే లోపలికి అనుమతించి, వారు లోపలికి వెళ్లగానే బయట ప్రధాన గేటుకు తాళాలు వేసేశారు. అక్కడున్న వారంతా సొంత ఊళ్లకు వెళ్లిపోవాలని ఎస్పీ నచ్చజెప్పినా వారెవరూ వినలేదు. తాము ఇక్కడే ఉంటామనీ, తమ జీవితం స్వామికి అంకితమంటూ ఖరాకండిగా చెప్పారు. మరోవైపు వీరికి ఎవరు మద్దతుగా ఉన్నారు? ఈ ఆశ్రమానికి పెద్దఎత్తున నిధులు ఎలా అందుతున్నాయి? వీరు ఇతరులకు భిన్నంగా వ్యవహరిస్తున్న తీరు, ప్రాణాలు అయినా అర్పించుకుంటామని పేర్కొంటున్న వైనం.. తదితరాలన్నీ పోలీసులు, అధికారులకు అంతు చిక్కనివిగా మారాయి.

తొలుత శనివారం నిమజ్జనం సమయంలో వివాదం చెలరేగడంతో పోలీసులు పెద్ద సంఖ్యలో అదే రోజు రాత్రి ఆశ్రమ ప్రాంతానికి చేరుకున్నారు. అప్పుడు పెద్దసంఖ్యలో భక్తులు రహదారిపై బైఠాయించి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారందరినీ సొంత ఊళ్లకు వెళ్లిపోవాలంటూ పోలీసులు ఎలాగోలా సర్దిచెప్పారు. అలాగే ఆర్టీసీ అధికారులతో మాట్లాడి దాదాపు 20 బస్సులను రాత్రి ఒంటి గంట సమయంలో రప్పించారు. అందులో చాలా వరకు భక్తులను పంపించారు. అలాగే ఇతర ప్రాంతాల నుంచి సొంత వాహనాల్లో వచ్చిన భక్తులను కూడా పంపించారు. గణేశ్‌ నిమజ్జన ఊరేగింపులో ఉన్న ఆయా గ్రామాలకు చెందిన వారిపై దాడిచేసిన ఆశ్రమ భక్తుల్లో 10 మంది కీలకమైన ఆశ్రమ కమిటీ సభ్యులను అరెస్ట్‌ చేశారు. దీంతో ఇక పెద్దగా వివాదం ఉండదని పోలీసులు భావించారు.

సీన్‌ రివర్స్‌...

మరోవైపు రాత్రివేళ భక్తులను పంపేస్తున్న సమయంలోనే అదే ఆశ్రమంలో ఉన్న ప్రబోధానంద కుమారుడు కూడా ఓ కారులో ఎక్కి వెళ్లిపోయేందుకు సిద్ధమైనట్లు పోలీసులు తెలిపారు. అయితే ఓ డీఎస్పీ అతడిని గుర్తించి ఆపేందుకు వెళ్లడంతో ఆశ్రమ భక్తులు అప్రమత్తమయ్యారు. వెంటనే స్వామీజీ కుమారుడికి రక్షణగా ఏర్పడి అతడిని క్షేమంగా మళ్లీ ఆశ్రమంలోకి తీసుకెళ్లిపోయినట్లు ఓ పోలీసు అధికారి తెలిపారు. మొత్తానికి ఆదివారం తెల్లవారుజామున 4 గంటల వరకు భక్తుల తరలింపు, కీలక సభ్యులను అరెస్ట్‌ చేయడంతో.. ఇక ఆదివారం ఎటువంట వివాదాలు ఉండమని పోలీసులు భావించారు. కానీ సీన్‌ రివర్స్‌ అయింది. ఆదివారం మధ్యాహ్నం కొందరు భక్తులు బీభత్సం సృష్టించారు. చివరకు పోలీసులు వారిపై బాష్పవాయువు ప్రయోగించి, లాఠీఛార్జి చేయడంతో భయంతో ఆశ్రమంలోకి వెళ్లి గేట్లు వేసుకున్నారు.

అందరినీ పంపేందుకు సన్నద్ధం...

ఆశ్రమ భక్తులు ఆదివారం కర్రలు, ఇనుప గొట్టాలతో బయటకు వచ్చి, బీభత్సం సృష్టించడం.. ఇందులో పలువురికి గాయాలు కావడం, ఒకరు మృతి చెందడం.. ఆశ్రమాన్ని సీజ్‌ చేయాల్సిందే అని ఎంపీ దివాకర్‌రెడ్డి పట్టుబట్టి రోజంతా ధర్నా చేపట్టారు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి ఎలాగైనా ఆశ్రమంలో ఉన్న భక్తులందరినీ పంపేయాలని పోలీసులు నిర్ణయానికి వచ్చారు. మరిన్ని బలగాలను తాడిపత్రికి రప్పించారు. ఆక్టోపస్‌ను బృందాలు కూడా రప్పిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో అందరినీ బయటకు పంపేస్తామని ఎస్పీ అశోక్‌కుమార్‌ తెలిపారు. ఆయా గ్రామస్థులపై దాడులు చేసిన వారిపైనా, ఒకరి మృతికి కారణమైన వారిపై చర్యలు తప్పవని చెప్పారు. సంయుక్త కలెక్టర్‌ డిల్లీరావు ఆదివారం రాత్రి ఆశ్రమం ప్రాంతాన్ని పరిశీలించారు. సమీపంలోని చిన్నపొలమడ గ్రామంలో కూడా పర్యటించి గ్రామస్థులతో మాట్లాడారు. ఆశ్రమ తీరుపై సమగ్ర విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు.

రాత్రంగా స్టేషన్‌ బయటే ఎంపీ

మరోవైపు స్వామి ప్రబోధానంద శిష్యుల అరాచకాలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ఆదివారం రాత్రంగా తాడిపత్రి పోలీస్‌స్టేషన్‌ బయటే ఆందోళన చేపట్టారు. భక్తులను తరలించి ఆశ్రమాన్ని మూసివేసేంత వరకు ఆందోళన విరమించేది లేదని ఆయన పట్టుబడుతున్నారు.

Link to comment
Share on other sites

6 minutes ago, MSDTarak said:

Veedu oo lafoot gaadu, traita siddantham na bonda siddantam ani hindu dharmanni nashanM chestunnadu, first arrest chesi dobbali ee bevrse edava ni

Veedini join chesukunna BJP & support chestunna YSRCP/Jagan (Want to divide Hindus) ni emi cheyyali?

Link to comment
Share on other sites

2 minutes ago, RKumar said:

Veedini join chesukunna BJP & support chestunna YSRCP/Jagan (Want to divide Hindus) ni emi cheyyali?

If he is really into bjp first expel cheyyali, i doubt he is into it basically. Veedi gurinchi chala hindu dhaarmika samsthalu 1 year nunchi poradutunnai....xxxxxxxxxx mudanastapu ideology ni follow avutu savagodutunnadu janalani. 

 

Link to comment
Share on other sites

  • 2 weeks later...

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...