Jump to content

ప్రణయ్ హత్య కుట్రలో టీఆర్‌ఎస్ నేత ప్రమేయం: అమృత అనుమానం


sonykongara

Recommended Posts

ప్రణయ్ హత్య కేసులో కాంగ్రెస్ సంచలన నిర్ణయం
17-09-2018 13:51:58
 
636727892538435316.jpg
నల్గొండ: కులాంతర వివాహం చేసుకుని హత్యకు గురైన ప్రణయ్ కేసు వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ పార్టీ దిద్దుపాటు చర్యలకు ఉపక్రమించింది. ప్రణయ్ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మిర్యాలగూడ కాంగ్రెస్ నేత కరీంను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రణయ్ కుటుంబాన్ని కాంగ్రెస్ నేత జానారెడ్డి పరామర్శించారు. ప్రణయ్ కుటుంబసభ్యులను ఓదార్చారు. ప్రణయ్ భార్య అమృతకు అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు. ఈ హత్య కేసులో భాగస్వామ్యం ఉందని తెలిసిన వెంటనే స్థానిక కరీంను పార్టీ నుంచి సస్పెండ్‌ చేశామని, ఈ కేసులో ఎంతటివారున్నా కఠినంగా శిక్షించాలని జానారెడ్డి ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
 
 
ప్రణయ్ హత్య కేసులో అమృత తండ్రి మారుతిరావు, అతడి తమ్ముడు శ్రావణ్‌కుమార్‌తో పాటుగా మిర్యాలగూడకు చెందిన కాంగ్రెస్ నేత కరీంను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కరీం మిర్యాలగూడ పట్టణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు.
 
 
ప్రణయ్‌ని హత్య చేసేందుకు మారుతిరావు అనేక సార్లు ప్రయత్నించినట్లు సమాచారం. మిర్యాలగూడలో పీడీ యాక్ట్‌ కింద అరెస్టైన ఓ వ్యక్తితోపాటు నల్లగొండలోని రౌడీ షీటర్‌తో ఒప్పందం చేసుకున్నాడు. ఆ ప్రయత్నం విఫలమైంది. దీంతో ప్రణయ్‌ హత్యకు భారీ మొత్తం ఇస్తానని నల్లగొండకు చెందిన కిరాయి హంతకుడితో ఒప్పందం చేసుకున్నాడు. అతడు మిర్యాలగూడలో రెక్కీ నిర్వహించాడు. విషయం తెలియడంతో పోలీసులు అతనికి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. దాంతో రెండో ప్రయత్నం కూడా విఫలమైంది. ఫలితంగా మరింత పట్టుదల పెంచుకున్న మారుతీరావు మూడో ప్రయత్నంలో మాజీ ఉగ్రవాదిని సంప్రదించినట్టు తెలిసింది. భూ వివాదంలో గతంలో అతడు మారుతీరావును కిడ్నాప్‌ చేశాడు. ఆ కేసు కోర్టులో నడుస్తోంది. తనను కిడ్నాప్‌ చేసిన మాజీ ఉగ్రవాదితోనే కోటి రూపాయలకు సుపారీ కుదుర్చుకున్నాడని ప్రచారం జరుగుతోంది.
Link to comment
Share on other sites

మారుతీరావు వంద కోట్ల అధిపతిగా ఎలా ఎదిగాడో చూడండి..!
17-09-2018 14:00:12
 
636727896090593019.jpg
మిర్యాలగూడ: కులాంతర వివాహం నేపథ్యంలో కన్న కూతురి భర్తనే కసాయితో చంపించిన బిల్డర్ తిరునగరి మారుతీ రావుకి (56) సంబంధించిన చీకటి కోణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకొస్తున్నాయి. సరుకుల రవాణాకు సంబంధించి ఓ చిరు వ్యాపారిగా మొదలైన మారుతీరావు కోట్లకు అధిపతిగా ఎదగడం వెనుక చాలా పెద్ద కథే ఉంది. మారుతీరావు తండ్రి రేషన్ డీలర్. కొన్ని సంవత్సరాల క్రితం అతని కుటుంబం కాకినాడ నుంచి మిర్యాలగూడ వచ్చి స్థిరపడింది. కొన్నాళ్లు కిరోసిన్ వ్యాపారం చేశాడు.
 
ఆ తర్వాత బెల్లం రవాణా చేస్తూ.. బెల్లం సిండికేట్ చేయించి ఎక్కువ ధరలకు విక్రయించి ఆర్థికంగా స్థిరపడ్డాడు. ఆ డబ్బులతో వడ్డీ వ్యాపారం చేశాడు. అలా మిర్యాలగూడలో రాజకీయ నేతలతో పరిచయాలు పెంచుకున్నాడు. మొత్తం మీద వంద కోట్లకు పైగానే ఆస్తులు కూడబెట్టాడు. రాజకీయ నేతల అండ చూసుకుని భూ కబ్జాలకు పాల్పడినట్లు అతనిపై ఆరోపణలున్నాయి. అంతేకాదు, గ్యాంగ్‌స్టర్ నయీంతో కూడా మారుతీరావుకు సన్నిహిత సంబంధాలున్నట్టు తెలిసింది. నయీం భూకబ్జాలకు పాల్పడిన సమయంలోనే మారుతీరావు కూడా భూములను కబ్జా చేయడం మొదలుపెట్టాడు. మిర్యాలగూడకు సమీపంలోని ఓ ల్యాండ్‌ విషయంలో నయీంకు, మారుతీరావుకు మధ్య గొడవలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో నయీం మారుతీరావును కిడ్నాప్ చేశాడు.
 
దీంతో వెనక్కి తగ్గిన మారుతీరావు.. నయీం జోన్‌లోకి ఎంటర్ కానని చెప్పినట్లు తెలిసింది. అయితే తండ్రి తర్వాత పీడీఎస్ డీలర్‌షిప్ కూడా మారుతీరావు చేజిక్కించుకున్నాడు. దీంతో పాటు ట్రాన్స్‌పోర్ట్ బిజినెస్ కూడా చేశాడు. ఆ సమయంలో పలువురు రెవెన్యూ, పోలీస్, ప్రభుత్వ అధికారులతో పరిచయాలు పెంచుకున్నాడు. అప్పటి నుంచి బిల్డర్‌గా ఎదిగాడు. కూతురంటే విపరీతమైన ప్రేమ పెంచుకున్న మారుతీరావు ఆమె పేరుతో మిర్యాలగూడలోని రెడ్డి కాలనీలో అమృత ప్లే స్కూల్‌ను కట్టించాడు.
Link to comment
Share on other sites

ప్రణయ్ హత్య కేసులో తాజా అప్డేట్...
17-09-2018 11:55:01
 
636727820978208849.jpg
 
నల్లగొండ: జిల్లాలోని మిర్యాలగూడకు చెందిన ప్రణయ్ హత్య కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ హత్యలో రౌడీ షీటర్ అబ్దుల్ బారీ హస్తం ఉందని పోలీసులు నిర్దారించినట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. గతంలో ఓ భూ వివాదంలో మారుతీరావును అబ్దుల్‌ బారీ కిడ్నాప్ చేశాడు. అప్పటి పరిచయంతోనే ప్రణయ్‌ని చంపేందుకు సుపారి ఇచ్చినట్లు విచారణలో తేటతెల్లమైంది. పాత నేరస్థుడు షఫీని రంగంలోకి దించి ప్రణయ్‌ని హత్య చేయించినట్లుగా రౌడీషీటర్‌ అబ్దుల్‌ బారీ ఒప్పుకున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ కేసులో మారుతీరావుతో పాటు మరో ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Link to comment
Share on other sites

వంద కోట్ల అధిపతి మారుతీరావు
చిరు వ్యాపారి నుంచి అనూహ్యంగా ఎదుగుదల
వివాదాస్పద భూముల క్రయవిక్రయాలతో భారీగా ఆర్జన
17brk48a.jpg

మిర్యాలగూడ: పరువు హత్యకు పురికొల్పిన మారుతీరావుది సాధారణ మధ్యతరగతి కుటుంబం. అయితే చట్టాల్లోని లొసుగులను ఆధారంగా చేసుకుని రకరకాల వ్యాపారాలు చేసి దాదాపు రూ.వంద కోట్ల ఆస్తిపరుడయ్యాడు. తండ్రి రేషన్‌ డీలర్‌ కావడంతో మారుతీరావు చిన్నప్పటి నుంచి కిరోసిన్‌ వ్యాపారంలో ప్రావీణ్యం సంపాదించాడు. క్రమంగా పౌరసరఫరాల గుత్తేదారుగా మారాడు. మిర్యాలగూడ నుంచి ఇతర ప్రాంతాలకు నల్లబెల్లం సరఫరా చేయటంతో పాటు బెల్లం సిండికేట్‌ చేయించి ఎక్కువ ధరలకు విక్రయిస్తూ భారీగా సంపాదించాడు. ఈ సొమ్ముతో కొంతకాలం వడ్డీ వ్యాపారం చేసి ఆర్థికంగా నిలదొక్కుకున్నాడు.

ప్రభుత్వ భూములపై కన్నేసి..
చట్టపరంగా ఎలాంటి వివాదాలు లేకుండా భూములను దక్కించుకోవటంలో మారుతీరావుది అందెవేసిన చేయి. పట్టణంలో పదవీ విరమణ పొందిన తహసీల్దారు సాయంతో రెవెన్యూ దస్త్రాలు, రెవెన్యూ చట్టంపై పట్టు సాధించాడు.  స్వాతంత్య్ర సమరయోధుల పేరిట మిర్యాలగూడలోని ప్రధాన కూడళ్ల వద్ద ఉన్న విలువైన భూములను దక్కించుకున్నాడు. ప్రభుత్వ భూములను మృతి చెందిన స్వాతంత్య్ర సమరయోధులకు గతంలోనే ప్రభుత్వం కేటాయించినట్లు ధ్రువపత్రాలు సృష్టించేవాడు. ఆ భూములను సమరయోధులు తనకు అమ్మినట్లు పత్రాలు సృష్టించి భారీగా భూములు సంపాదించాడు.

స్థిరాస్తి వ్యాపారంలోకి..
స్థిరాస్తి వ్యాపారంలో ఆదాయం బాగా వస్తుందని గ్రహించిన మారుతీరావు అద్దంకి- నార్కట్‌పల్లి ప్రధాన రహదారి వెంట పెద్ద వెంచర్‌ వేశాడు. మిర్యాలగూడ పట్టణంలో వివాదాలున్న భూములకు పత్రాలు సృష్టించి, వాటికి రెవెన్యూ దస్త్రాల్లో సవరణలు చేయించేవాడు. భూముల పంచాయితీలో మధ్యవర్తిగా ఉంటూ భూములు దక్కించుకున్నాడు. ఇలా సంపాదించిన సొమ్ముతో పట్టణంలో థియేటర్లను కొన్నాడు. వివాదాస్పద స్థలాలను కొని, వివాదాలు తీర్చి దాన్ని ఎక్కువ ధరకు అమ్ముతూ భారీగానే సంపాదించాడు. ప్రస్తుతం మారుతీరావు ఆస్తుల విలువ వంద కోట్లకు పైగా ఉన్నట్లు సమాచారం.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...