Jump to content

kadapa politics


sonykongara

Recommended Posts

డప జిల్లా విషయంలో టీడీపీ వేసిన పక్కా స్కెచ్ ఇది..!
16-09-2018 13:20:28
 
636727008249785765.jpg
  • ఆరు నియోజకవర్గాల్లో కొలిక్కి వచ్చినట్లే
  • నాలుగుచోట్ల వీడని పీటముడి
  • వచ్చే నెలలో సీఎం చంద్రబాబు రాక
  • సర్వే ద్వారా అభ్యర్థుల బలాబలాలు అంచనా
  • ముందుగానే అభ్యర్థుల ఎంపిక
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే టీడీపీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు మొదలైంది. టీడీపీ అధినేత చంద్రబాబు ముందుగానే అభ్యర్థుల ఎంపిక చేపడతామని అంతర్గత సమావేశాల్లో చెప్పినట్టుగానే నియోజకవర్గాల వారీగా చర్చ సాగిస్తున్నారు. కడప జిల్లాలో ఆరు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల ఎంపిక దాదాపు ఓ కొలిక్కి వచ్చినట్టు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆ నాలుగు నియోజకవర్గాలలో పీటముడి వీడక పోవడంతో అభ్యర్థుల ఎంపిక మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉన్నట్టు సమాచారం. వచ్చే నెలలో సీఎం చంద్రబాబు రెండు రోజుల పర్యటన జిల్లాలో కొనసాగించి నియోజకవర్గాల వారీగా సమీక్షలు జరపనున్నారు.
 
కడప (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తరువాత నామినేషన్‌కు ముందు మాత్రమే అభ్యర్థులు జాబితాను టీడీపీ విడుదల చేస్తూ వస్తోంది. ఈసారి అభ్యర్థులను ముందుగానే ప్రకటించాలని అధినేత చంద్రబాబు అంతర్గత సమావేశాల్లో వెల్లడిస్తూ వస్తున్నారు. ఇప్పటికే అధిష్ఠానం నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులు బలాబలాలు, వివిధ సామాజికవర్గాల మద్దతు, అభ్యర్థి గెలుపునకు అనుకూలించే అంశాలు అన్నింటినీ పరిగణలోకి తీసుకునేలా వివరాలు సేకరిస్తున్నారు. జిల్లాలో పది నియోజకవర్గాల్లో ప్రస్తుతం సిట్టింగ్‌ ఎమ్మెల్యేలతో పాటు ఇనచార్జిలుగా వ్యవహరిస్తున్న వారు కొత్త వారికి అవకాశంపై పరిశీలించి ఎవరు పోటీ చేస్తే బాగుంటుందన్న దానిపై కసరత్తు చేపట్టారు. బద్వేల్‌, పులివెందుల, రాయచోటి, కడప, కోడూరు, రాజంపేట నియోజకవర్గాలలో అభ్యర్థుల ఎంపిక దాదాపు ఓ కొలిక్కి వచ్చినట్లు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది.
 
కమలాపురం, మైదుకూరు, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు నియోజకవర్గాల్లో ఎవరికి టిక్కెట్‌ ఇవ్వాలనే దానిపై అధిష్ఠానం ఆలోచన చేస్తోంది. నేతల మధ్య పోటీ తీవ్రంగా ఉండడంతో ఈ నాలుగు నియోజకవర్గాల్లో ఎంపికపై పీటముడి వీడనంటోంది. కొన్ని నియోజకవర్గాల్లో ఆశావహుల్లో పోటీ తీవ్రంగా ఉండడంతో ఒకరికి టీడీపీ టిక్కెట్‌, మరొకరికి నామినేటెడ్‌ పదవి లేదా ఎమ్మెల్సీ వంటి వాటిని కట్టబెట్టేలా చర్చలు సాగుతున్నాయి. టిక్కెట్‌ ఇచ్చిన వారిని ఎట్టి పరిస్థితిలో గెలిపించేలా నేతలందరినీ ఏకతాటిపై తీసుకువచ్చేలా సీఎం చంద్రబాబు నియోజకవర్గాల వారీగా సమావేశమై నేతలతో నేరుగా మాట్లాడుతున్నారు. ఇలా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని ముందస్తుగానే అభ్యర్థుల పేర్లను వెల్లడించాలని టీడీపీ అధిష్ఠానం నిర్ణయించింది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా కలిసికట్టుగా పనిచేసి ఏకతాటిపై నడిచే నియోజకవర్గాలను ఎంపిక చేసి తొలిదశలో అభ్యర్థుల పేర్లు ప్రకటించి వీరే రేపటి ఎన్నికల్లో గెలుపుగుర్రాలని వెల్లడించనున్నారు.
 
 
ఆరింటిలో ఓకే - నాలుగింటిలోనే
జిల్లాలో పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆరు నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేపట్టి త్వరలో ప్రకటించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. పులివెందుల నుంచి ఈసారి సతీష్ రెడ్డే మళ్లీ పోటీ చేస్తారని, ఆయనకే టిక్కెట్‌ ఖరారు అవుతుందని పార్టీలో చర్చ సాగుతోంది. ఎమ్మెల్సీ బీటెక్‌ రవి పోటీ చేస్తే ఎలా ఉంటుందన్నది ఆలోచన చేసినా సతీష్రెడ్డికే ఎక్కువ అవకాశం ఉంది.
 
ఇక బద్వేల్‌ ఎస్సీ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్‌చార్జి విజయమ్మ ఎవరి పేరు సూచిస్తే వారికే టిక్కెట్‌ అని ప్రచారం సాగుతోంది. వైవీయూలో మొక్కలు నాటే కార్యక్రమానికి విచ్చేసిన సీఎం చంద్రబాబు విజయమ్మ తనయుడు కె.రితీష్ కుమార్‌రెడ్డితో మాట్లాడుతూ అభ్యర్థులను ఎంపిక చేసి పూర్తి వివరాలు అందించాలని సూచించినట్లు సమాచారం. రాయచోటి ఇన్‌ఛార్జి రమే్‌షకుమార్‌రెడ్డి, సుగవాసి ప్రసాద్‌బాబు పోటీ పడుతున్నా వివిధ సమీకరణలతో రమే్‌షరెడ్డికే టిక్కెట్‌ ఖరారయ్యే అవకాశాలు మెండుగా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. కడప నియోజకవర్గంలో ఈసారి ముస్లిం మైనార్టీలకు టిక్కెట్‌ ఇవ్వాలని అధిష్ఠానం ఆలోచిస్తుండగా మొదటి నుంచి పార్టీలో కొనసాగుతున్న ఒకటి, రెండు ముఖ్యనేతల పేర్లు పరిశీలిస్తున్నట్లు సమాచారం. కోడూరు ఎస్సీ నియోజకవర్గంలో కస్తూరి విశ్వనాధనాయుడు, బత్యాల చెంగల్‌రాయులు కలిసి ఎవరిపేరు చెబితే వారికే టిక్కెట్‌ అన్నట్లు సమాచారం. వీరిద్దరూ ఒకటి రెండు పేర్లు పరిశీలిస్తున్నా ఆ వివరాలు అధిష్ఠానానికి అందిస్తారని తెలిసింది.
 
 
రాజంపేటలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డికే టిక్కెట్‌ ఇస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఒకవేళ వారు వైసీపీకి వెళితే మాజీ ఎమ్మెల్సీ చెంగల్‌రాయులును రాజంపేట నుంచి పోటీ చేయిస్తే ఎలా ఉంటుందన్న దానిపై చర్చ సాగుతోంది. ఇలా ఈ ఆరు నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు దాదాపు పూర్తయినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. కమలాపురం నియోజకవర్గ ఇనచార్జి పుత్తా నరసింహారెడ్డి, మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి, మైదుకూరులో టీటీడీ చైర్మన పుట్టా సుధాకర్‌యాదవ్‌ పోటీ చేయాలని ఆలోచన చేస్తుండగా మాజీ మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డికి టిక్కెట్‌ ఇచ్చి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయిస్తే ఎలా ఉంటుందన్న దానిపై చర్చ సాగుతోంది. జమ్మలమడుగులో మంత్రి ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిలు, ప్రొద్దుటూరులో మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి, లింగారెడ్డి వీరితో పాటు మరో కొత్త వ్యక్తికి అవకాశం ఇస్తే ఎలా ఉంటుందనే దానిపై పార్టీలో చర్చ సాగుతోంది. ఇలా పది నియోజకవర్గాల్లో అభ్యర్థుల పేర్లను ముందుగానే వెల్లడించి ఎన్నికల బరిలో దిగాలని టీడీపీ అధిష్ఠానం చేస్తున్న ఆలోచనలకు జిల్లా నాయకులు కూడా గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు.
 
 
వచ్చే నెల సీఎం పర్యటన
జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన అక్టోబరు మొదటివారంలో జరుగుతుందని పార్టీ నేతలు చెబుతున్నారు. బద్వేల్‌ నియోజకవర్గంలో ఆగిన గ్రామదర్శిని-గ్రామవికాసం కార్యక్రమాలలో సీఎం పాల్గొని జిల్లాలోని నాయకులతో ముఖాముఖిగా చర్చించనున్నారు. గత నెలలో అనుకున్నట్లు రెండు రోజుల కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొని ప్రతి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి గెలుపొందేలా నేతలు కృషి చేయాలని గట్టిగా చెప్పనున్నారు.
 
ఈ ఎన్నికల్లో గెలుపు అనివార్యమని అన్న సంగతి పార్టీ నేతలకు వెల్లడించి ఆశావహులతో ప్రత్యేకంగా సమావేశమై ప్రస్తుతం ఒకరికే టిక్కెట్‌ అని, పోటీ పడే వారిని ఏదోరకంగా గౌరవమైన పదవులే ఇస్తామని నచ్చజెప్పనున్నారు. ఈ సమావేశం తరువాత కొలిక్కి వచ్చిన నియోజకవర్గాల అభ్యర్థుల జాబితా ప్రకటించనున్నట్లు సమాచారం. గతం కన్నా భిన్నంగా ఈసారి ముందుగానే టిక్కెట్లు ప్రకటించి కొత్త ఒరవడికి టీడీపీ శ్రీకారం చుడుతుండడం, తమ్ముళ్లు మరి ఎలా వ్యవహరిస్తారన్నది ప్రస్తుతం పార్టీలో చర్చనీయాంశమవుతోంది.
Link to comment
Share on other sites

  • 2 weeks later...
టీడీపీలో మొత్తానికి ఒక గొడవ వదిలిపోయింది !
01-10-2018 16:17:11
 
636740074300918745.jpg
  • ఆ ఇద్దరి మధ్య ‘సయోధ్య’
  • ఒకరికి ఎంపీ.. మరొకరికి ఎమ్మెల్యే టిక్కెట్లు
  • కలిసి పనిచేసేలా రాజీ ఫార్ములా
  • నాలుగు నియోజకవర్గాల్లో ఫలితాలపై ప్రభావం
  • కడప లోక్‌సభ కైవసానికి వ్యూహం
  • రాజీబాటలో కోర్టు కేసులు
  • అధినేత చంద్రబాబు జోక్యంతో సర్దుబాటు
కడప జిల్లా టీడీపీ రాజకీయాలు జమ్మలమడుగు నియోజకవర్గ కేంద్రంగా తిరుగుతున్నాయంటే అవునంటున్నారు ఆ పార్టీ నేతలు. మంత్రి ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ, మండలి విప్‌ రామసుబ్బారెడ్డిల మధ్య కుదిరిన ’సయోధ్య’ టీడీపీకి అనుకూలించే అంశంగా పేర్కొంటున్నారు. ఒకరు ఎమ్మెల్యేగా మరొకరు ఎంపీగా పోటీ చేసేలా ఆలోచన సాగుతున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఆ ఇద్దరు నేతలు కలిసి పనిచేస్తే నాలుగు నియోజకవర్గాల ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపుతుందని దీంతో కడప లోక్‌సభ స్థానాన్ని టీడీపీ కైవసం చేసుకుంటుందని అంచనా. ఇటీవల అధినేత చంద్రబాబు ఆ ఇద్దరు నేతలతో చర్చించడంతో స్థానిక కార్యక్రమాల్లో వారు పాల్గొంటున్నారు. మరోవైపు కోర్టుల్లో నడుస్తున్న కేసులు కూడా రాజీతో సర్దుబాటు చేసుకున్నట్లు సమాచారం.
 
కడప (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జమ్మలమడుగు నియోజకవర్గంలో మొదటి నుంచి ఫ్యాక్షన్‌ రాజకీయాలు జోరుగా సాగేవి. మంత్రి ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ, విప్‌ రామసుబ్బారెడ్డిల మధ్య విబేధాలు తీవ్రస్థాయిలో ఉండడం, ఒకరంటే మరొకరికి పడేది కాదు. 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా రామసుబ్బారెడ్డి, వైసీపీ అభ్యర్థిగా ఆదినారాయణరెడ్డిలు పోటీ చేయగా ఆది గెలుపొందారు. టీడీపీ ఇన్‌చార్జిగా రామసుబ్బారెడ్డి పార్టీ ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటూ వచ్చారు. రెండేళ్ల క్రితం ఆదినారాయణరెడ్డి వైసీపీని వీడి టీడీపీలో చేరేందుకు ఆసక్తి చూపగా రామసుబ్బారెడ్డి పూర్తిగా వ్యతిరేకించారు.
 
 
సీఎం చంద్రబాబు రామసుబ్బారెడ్డితో చర్చించి ఆదినారాయణరెడ్డిని పార్టీలోకి తీసుకొని మంత్రిగా అవకాశం ఇచ్చారు. దీనిని తీవ్రంగా వ్యతిరేకించిన రామసుబ్బారెడ్డిని శాంతింపచేసి ఎమ్మెల్సీ, మండలి విప్‌గా అవకాశం ఇచ్చారు. ఒకే పార్టీలో ఇద్దరు ఉన్నా నియోజకవర్గంలో మాత్రం ఎవరికి వారు కార్యక్రమాల్లో పాల్గొంటూ వచ్చేవారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జిల్లాలో మెజార్టీ స్థానాలు టీడీపీ గెలుచుకోవాలని అధినేత చంద్రబాబు నియోజకవర్గాల వారీగా నేతలతో ముఖాముఖి చర్చించే కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగా జమ్మలమడుగు నియోజకవర్గం నేతలతో చర్చించినప్పుడు ఆది, రామసుబ్బారెడ్డిలు కలిసి పనిచేస్తే జమ్మలమడుగులో ఎదురే ఉండదని ఏకపక్షంగా ఎన్నికలు జరిగి టీడీపీ అభ్యర్థి విజయకేతనం ఎగుర వేస్తారని వెల్లడించారు. ఇదేకాకుండా ఆ ఇద్దరు నేతలు కలిసి పనిచేస్తే ప్రొద్దుటూరు, మైదుకూరు, పులివెందుల నియోజక వర్గాల్లో ఫలితాలపై ప్రభావం చూపుతుందని దీంతో కడప లోక్‌సభ స్థానం గెలుపు నల్లేరుపై నడకేనని ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. జమ్మలమడుగు నియోజకవర్గంలో ఆ ఇద్దరు నేతల గ్రూపులు బలంగా ఉండడం, నేతలు కలిస్తే ఆ గ్రూపులన్నీ ఒక్కటై పనిచేస్తాయని దీంతో జమ్మలమడుగులో భారీ మెజార్టీ టీడీపీకి వస్తుందన్నది పార్టీ పెద్దలు ఆలోచన చేస్తున్నారు.
 
 
అధినేత చంద్రబాబుతో చర్చలు
మంత్రి ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిలతో పలు దపాలుగా సీఎం చంద్రబాబు చర్చలు జరిపారు. ఇద్దరి మధ్య ఉన్న విభేదాలు, వర్గపోరు పక్కన పెట్టి కలిసి పనిచేయాలని సూచన చేశారు. ఒకరు ఎమ్మెల్యేగా, మరొకరు కడప లోక్‌సభ నుంచి పోటీ చేయాలని, ఎవరికైనా నష్టం జరిగితే ఏదో ఒకరూపంలో భర్తీ చేస్తామని పూర్తి స్థాయి భరోసా ఇచ్చినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇద్దరు కూడా జమ్మలమడుగు నుంచి పోటీ చేయాలని ఆసక్తి చూపుతుండగా చివరకు అధినేత చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటే అలా నడుచుకుంటామని ఆ ఇద్దరు నేతలు వెల్లడిస్తున్నట్లు సమాచారం. గత ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గంలో వైసీపీకి 75 వేల ఓట్ల మెజార్టీ రావడంతో కడప లోక్‌సభ స్థానం ఆ పార్టీకే దక్కింది.
 
రానున్న ఎన్నికల్లో జమ్మలమడుగులోనే 50 వేల మెజార్టీ తీసుకువస్తే మైదుకూరు, ప్రొద్దుటూరు, పులివెందుల నియోజకవర్గాల్లో వైసీపీ మెజార్టీ తగ్గించి టీడీపీకి ఓట్ల శాతం పెరిగితే లోక్‌సభ స్థానాన్ని టీడీపీ అభ్యర్థి సునాయాసంగా గెలుస్తారని అధిష్టానంలో చర్చ జరిగినట్లు సమాచారం. ముఖ్యంగా కడప లోక్‌సభ స్థానం టీడీపీ దక్కించుకోవాలంటే ఈ ఫార్ములాను అమలుచేస్తే ఆశాజనకంగా ఫలితాలు ఉంటాయన్నది ఆలోచన. గతంలో ఫ్యాక్షన్‌ రాజకీయాలతో ఇరువర్గాలలో హత్యలు జరిగి ప్రస్తుతం ఆ కేసులు కోర్టుల్లో నడుస్తున్నాయి.
 
 
ఈ కేసులన్నింటినీ పరిష్కరించుకుంటే ఆది, రామసుబ్బారెడ్డిల వర్గాలు కలిసి పనిచేసే అవకాశం ఉందని పార్టీ అధిష్టానం భావిస్తోంది. ఇదే అంశంపై అధినేత చంద్రబాబు కూడా దృష్టిపెట్టినట్లు తెలిసింది. 28 ఏళ్ల క్రితం జరిగిన షాద్‌నగర్‌ జంటహత్యల కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టులో నడుస్తోంది. ఇప్పటికే పలు వాయిదాలతో ఈ కేసుపై కోర్టు తీర్పు వెలువడించలేదు. అక్టోబరు 24న ఈ కేసుపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకోనున్నదని సమాచారం. ఈ కేసుతో పాటు ఇరువర్గాలపై నమోదైన కేసులన్నీ రాజీతో సర్దుబాటు చేసుకునేలా మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి. ఇద్దరు నేతలు కలిసి పనిచేయడం, కేసులు రాజీ చేసుకోవడం వంటి పరిణామాలు జమ్మలమడుగు నియోజకవర్గం టీడీపీ కేడర్‌లో కొంత ఉత్సాహాన్నిస్తోంది.
 
 
కలిసే పర్యటనలు
ఒకే పార్టీలో ఉన్నా చాలా సందర్బాల్లో ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాల్లో ఎవరికివారుగా ఆది, రామసుబ్బారెడ్డిలు వ్యవహరించేవారు. జిల్లా కార్యక్రమాల్లో మాత్రం కలిసి పాల్గొని కార్యక్రమాలు ముగిసిన తరువాత నిష్క్రమించేవారు. కొన్ని కార్యక్రమాల్లో ఇద్దరు నేతలు బలప్రదర్శనలకు దిగిన సందర్భాలు ఉన్నాయి. సీఎం చంద్రబాబుతో చర్చించిన తరువాత ఇద్దరు నేతలు మెత్తబడడంతో క్రమేణా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రెండు రోజుల క్రితం జరిగిన ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్బంగా ఆ ఇద్దరు కలిసి పాల్గొనడమే కాకుండా మైలవరంలో బోటుషికారు చేసి, కలిసి భోజనం చేయడం వంటివి చోటుచేసుకున్నాయి. ఇది ఎంతో శుభపరిణామమని పార్టీ నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆ ఇద్దరు నేతలు కలిసి పనిచేస్తారన్న సంకేతాలు జిల్లాలోని ఇతర నియోజకవర్గాల్లో చర్చనీయాంశమవుతోంది.
 
 
ఒకరంటే మరొకరు తీవ్రంగా విభేదించి వ్యవహరించిన ఆది, రామసుబ్బారెడ్డిలు ఒక్కటై వ్యవహరిస్తున్నారన్న సమాచారం జిల్లా టీడీపీ రాజకీయాల్లో మంచి ఫలితాలే వస్తున్నాయి. నియోజకవర్గాల వారీగా నేతల మధ్య వున్న అనైక్యతను రూపుమాపి రానున్న ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేసేలా అధినేత చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలు మంచి ఫలితాలు ఇస్తుండడంతో మిగిలిన నియోజకవర్గాల్లో కూడా నేతలు కలిసి నడిచే అవకాశాలు ఉన్నాయి. ఇదే ఫార్ములా అన్ని నియోజకవర్గాల్లో అమలు చేసి రానున్న ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు జిల్లాలో సాధించాలన్న అధినేత చంద్రబాబు ఆలోచనలకు మెల్లమెల్లగా అడుగులు పడుతున్నాయి.
Link to comment
Share on other sites

  • 1 month later...
టీడీపీలో చేరనున్న మాజీ మంత్రి అహ్మదుల్లా
26-11-2018 19:02:02
 
636788557233315908.jpg
అమరావతి: కడప జిల్లాకు చెందిన మాజీ మంత్రి అహ్మదుల్లా సోమవారం సాయంత్రం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్నారు. వైఎస్‌ హయాంలో ఆయన మంత్రిగా పనిచేశారు. కడప అసెంబ్లీ స్థానం నుంచి గతంలో అహ్మదుల్లా ఎన్నికయ్యారు. ఆయన తండ్రి మహమ్మద్ రెహత్ముల్లా మాజీ పార్లమెంట్ సభ్యులు కాగా ఆయనకు జిల్లాలో బలమైన వర్గం ఉంది. వైఎస్‌కు అనుచరుడిగా ఆయనకు మంచి పేరుంది.
Link to comment
Share on other sites

అప్పట్లో జగన్ పార్టీలో చేరని ఆయన ఇప్పుడు టీడీపీలోకి..!
27-11-2018 14:52:58
 
636789271798337932.jpg
  • సైకిలెక్కనున్న అహ్మదుల్లా ?
  • కడప జిల్లా నేతలకు తెలియకుండానే అమరావతి పయనం
  • సీఎం చంద్రబాబుతో కలసి చర్చలు
  • రాజకీయ నేపథ్యం ఉన్న సీనియర్‌ నేత
  • టీడీపీలోకి మరిన్ని వలసలు
కడప (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి అహ్మదుల్లా సోమవారం సీఎం చంద్రబాబును కలిశారు. పార్టీ అధిష్టానం పిలుపు మేరకు అహ్మదుల్లా హుటాహుటిన అమరావతికి వెళ్లి టీడీపీ అధినేతతో చర్చించారు. ఈ వ్యవహారం మొదటి నుంచి గోప్యంగానే ఉంచి చివరికి జిల్లా పార్టీ నేతలకు కూడా సమాచారం లేకుండా చంద్రబాబును కలవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.
 
 
రాజకీయ నేపథ్యం..
కడప నగరానికి చెందిన కాంగ్రెస్‌ నేత రహంతుల్లా నాటి ప్రధాని ఇందిరాగాంధీకి ప్రధాన అనుచరుడు. 1976-82 మధ్య రాజ్యసభ సభ్యుడిగా, ఆ తరువాత ఏపీ పీసీసీ అధ్యక్షుడిగా వ్యవహరించారు. కడప ఎమ్మెల్యేగా, మున్సిపల్‌ చైర్మన్‌గా గెలుపొంది జిల్లా రాజకీయాల్లో పేరు సంపాదించుకున్నారు. ఆయన తనయుడిగా 2000 సంవత్సరంలో రాజకీయ రంగ ప్రవేశం చేసిన అహ్మదుల్లా మొదట మున్సిపల్‌ చైర్మన్‌గా గెలుపొందారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా కడప నుంచి పోటీ చేసి విజయం సాధించారు. రెండోసారి 2009లో మళ్లీ పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొంది వైఎస్‌ క్యాబినెట్‌లో రాష్ట్ర మంత్రిగా ఆ తరువాత రోశయ్య, కిరణ్‌ క్యాబినెట్‌లో కూడా మంత్రిగానే కొనసాగారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డికి అహ్మదుల్లా ఎంతో దగ్గరగా ఉంటూ వచ్చినా వైఎస్‌ జగన్‌కు మాత్రం దూరంగానే ఉన్నారు.
 
కాంగ్రెస్‌ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలు రాజీనామా చేసి వైఎస్‌ జగన్‌ పార్టీలో చేరినా అహ్మదుల్లా మాత్రం కాంగ్రెస్‌లోనే కొనసాగారు. ఓటమి ఎరుగని వ్యక్తిగా అహ్మదుల్లాకు పేరుంది. 2014 ఎన్నికల్లో పోటీ చేయకుండా దూరంగా ఉంటూ వచ్చిన ఆయన ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయాలని ఆలోచన చేశారు. ఆయన తనయుడు అష్రఫ్‌ను రాజకీయాల్లోకి తీసుకురావాలని మరోవైపు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల టీడీపీలో చేరడంపై ఆయన సన్నిహితులతో కలిసి చర్చించారు. కొందరు ముఖ్యనేతల ఇళ్లకు వెళ్లి టీడీపీలో చేరితే భవిష్యత్తు ఎలా ఉంటుందన్నది చర్చించారు.
 
 
అధిష్టానం పిలుపు మేరకే
కడప నియోజకవర్గంలో 1994 నుంచి ముస్లిం అభ్యర్థులనే ప్రజలు గెలిపిస్తున్నారు. 1994, 1999లో ఖలీల్‌బాష తెలుగుదేశం పార్టీ నుంచి రెండుసార్లు గెలుపొందారు. 2004, 2009లో అహ్మదుల్లా కాంగ్రెస్‌ అభ్యర్థిగా గెలుపొందగా, 2014లో అంజద్‌బాష వైసీపీ నుంచి గెలిచారు. వీరందరూ ముస్లిం సామాజిక వర్గానికి చెందినవారే. ఈసారి టీడీపీ సైతం ముస్లింలకు టిక్కెట్‌ ఇవ్వాలని ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అహ్మదుల్లాకు సోమవారం ఉదయం టీడీపీ అధిష్టానం నుంచి పిలుపు అందింది. అహ్మదుల్లాతో పాటు ఆయన తనయుడు అష్రఫ్‌ హుటాహుటిన అమరావతికి వెళ్లి సీఎంను కలిశారు. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచిన అధిష్టానం కనీసం జిల్లా టీడీపీ నేతలకు కూడా సమాచారం అందించలేదు. నేతలు లేకుండా అహ్మదుల్లా వెళ్లి సీఎం చంద్రబాబుతో మాట్లాడడం జిల్లాలో చర్చనీయాంశమైంది. త్వరలో సీఎం జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు అహ్మదుల్లా సైకిలెక్కుతారని లేదా భారీగా వాహనాలతో వెళ్లి సీఎం సమక్షంలో పార్టీ కండువా వేసుకుంటారని సమాచారం.
 
కడప జిల్లాలోని వివిధ పార్టీల్లో ఉన్న సీనియర్‌ నాయకులు కొందరు టీడీపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. ఓ మాజీ మంత్రితో పాటు మరికొందరు ముఖ్య నేతలు టీడీపీలో చేరుతారని ఆ పార్టీ ముఖ్య నేత ఒకరు తెలిపారు. వచ్చే నెలలో సీఎం చంద్రబాబు జిల్లా పర్యటనకు విచ్చేసే సందర్భంలో పార్టీలో చేరికలు ఉంటాయని ఆ నేత తెలిపారు.

కడప అభివృద్ధి కోసమే...
కడప అభివృద్ధి కోసమే సీఎం చంద్రబాబును కలిశాను. కడప ప్రజలు ఎప్పుడూ నన్ను ఆశీర్వదిస్తుంటారు. వారి రుణం తీర్చుకోవాలంటే రానున్న ఎన్నికల్లో మళ్లీ పోటీ చేసి కడప సమస్యలను పరిష్కరించాల్సి ఉంది. నాలుగున్నరేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నాను. ఆత్మీయులు, అనుచరులతో చర్చించే భవిష్యత్‌ కార్యాచరణను నిర్ణయించకుంటా. కడప ప్రజలు నాపై పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయను. ప్రజాసేవతో ఆ రుణం తీర్చుకుంటా.
 అహ్మదుల్లా, మాజీ మంత్
Link to comment
Share on other sites

On 11/26/2018 at 9:01 PM, baggie said:

kadapa eesari 6 kottali ettaina

Ahmadulla ni cherchukovatam could be a very good move. I am not exactly sure how much he can draw the votes in Kadapa. But, this should benefit party in Loksabha too. If you ask me i see it like this YCP had taken their attack to Jammalamadugu. Now we had taken to other constituencies. 

Link to comment
Share on other sites

1 hour ago, JAYAM_NANI said:

Ahmadulla ni cherchukovatam could be a very good move. I am not exactly sure how much he can draw the votes in Kadapa. But, this should benefit party in Loksabha too. If you ask me i see it like this YCP had taken their attack to Jammalamadugu. Now we had taken to other constituencies. 

 

aadi ni kottentha scene ledemo ga

Link to comment
Share on other sites

TDP kadapa meedha entha focus pedithe, antha gaa jaffa kadapa ki restrict avuthaadu prestige kosam.. (if he is serious abt elections)

naakenduko vaadi strategy anthaa dabbu emo, not serious abt elections anipisthundhi okkosari

party members tho karchu pettinchi paadayaatralu etc naatakaalu vesi, mallee vaallake tickets ammukovatam, eppudo (even after 2/3 terms) oka saari anti gov sentiment tho adhee jebu lonchee em thiyyakundaa free gaa shiyyem avaalani ani aasa anukonta.. appatidaakaa bosha lantollani maaya chesi case lu escape ayyi, + rendu chethulaa sampaadana.. idhe karthavyam emo..

Link to comment
Share on other sites

  • 3 weeks later...
  • 3 weeks later...
రేపు కడపకు వైఎస్ జగన్.. సిట్టింగుల్లో గుబులు..!
10-01-2019 13:59:41
 
636827261535913791.jpg
  • 424 రోజుల తరువాత కడప గడపలో అడుగు
  • భారీగా స్వాగత ఏర్పాట్లు.. శ్రేణుల్లో ఉత్సాహం
  • ఇక టికెట్లపై నేతల్లో ఉత్కంఠ
  • కడప ఎంపీ, జమ్మలమడుగు పైనే దృష్టి
 
ఇన్నాళ్లుగా స్తబ్దుగా ఉన్న జిల్లా వైసీపీ శ్రేణుల్లో సందడి నెలకొంది. పాదయాత్రలో భాగంగా జిల్లాను దాటిన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి రాష్ట్రమంతా చుట్టి 424 రోజుల తర్వాత శుక్రవారం స్వస్థలంలో అడుగు పెట్టనున్నారు. మూడు రోజులపాటు జిల్లాలోనే ఉండనున్నారు. ఈ ఏడాది ఎన్నికలు ఎంతో కీలకం కావడంతో అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి వ్యవహరించే అవకాశం ఉంది. దీంతో ఇప్పటి నుంచే వైసీపీ నేతల్లో అలజడి నెలకొంది. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు తమకే సీటు అనే ధీమా వ్యక్తం చేస్తున్నా సర్వేల్లో ఏమి తేలిందో అనే గుబులు వారిని వెంటాడుతోంది. జమ్మలమడుగు, కడప ఎంపీ స్థానాలపై జగన్‌ ప్రత్యేక దృష్టిసారించనున్నారని సమాచారం.
 
 
కడప: ‘ప్రజా సంకల్ప యాత్ర’ పేరుతో వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన పాదయాత్రను ముగించుకుని శుక్రవారం కడప గడపలో అడుగు పెడుతున్నారు. 424 రోజుల తరువాత జిల్లాకు విచ్చేస్తున్న జగన్‌కు పెద్ద ఎత్తున స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇక సార్వత్రిక ఎన్నికలపైనే దృష్టి పెట్టి పార్టీ శ్రేణుల్ని సమాయత్తం చేసే పనిలో జగన్‌ బిజీబిజీగా ఉంటారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలే బరిలో ఉంటారా లేదా ఏదైనా మార్పులు చేర్పులు ఉంటాయా అన్న చర్చ కొనసాగుతోంది. పీకే సర్వేతో పాటు ఇతర సర్వేలలో గెలుపుగుర్రాలు ఎవరన్నది తేలిందో వారికే సీట్లు అంటూ ప్రచారం సాగుతోంది. జగన్‌ రాకతో ఇక జిల్లాలో రాజకీయాలు గరంగరంగా మారనున్నాయి.
 
 
341 రోజులు పాదయాత్ర
ప్రజా సంకల్ప యాత్ర పేరుతో 2017 నవంబరు 6న ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన పాదయాత్ర జిల్లాలో ఏడు రోజుల పాటు సాగింది. 93.8 కిలోమీటర్లు పాదయాత్ర జరిపిన జగన్‌ ఐదు నియోజకవర్గాలు, ఐదు మండలాల్లోనే పర్యటించారు. ఆ తరువాత కర్నూలు, అనంతపురం, చిత్తూరు మీదుగా ఇచ్ఛాపురం వరకు కొనసాగి, బుధవారం పాదయాత్రకు ముగింపు పలికారు. పాదయాత్ర మొదలైన నాటి నుంచి నేటి వరకు 429 రోజులు గడిచినా 341 రోజులే పాదయాత్ర కొనసాగించారు. కోర్టు కేసులు, ఇతరత్రా వ్యవహారాలతో 90 రోజుల వరకు పాదయాత్రకు విరామం ఇచ్చారు. జిల్లాలో పాదయాత్ర ముగింపు రోజు నుంచి లెక్కిస్తే మొత్తం 424 రోజుల తరువాత శుక్రవారం జిల్లాలో జగన్‌ అడుగు పెడుతున్నారు. సుదీర్ఘ విరామం తరువాత ప్రజాసంకల్ప యాత్రను విజయవంతం చేసుకుని జిల్లాకు విచ్చేస్తున్న జగన్‌కు పెద్ద ఎత్తున స్వాగతం పలికేందుకు నేతలు, శ్రేణులు సిద్ధమవుతున్నారు.
 
 
సర్వమత సమానత్వం కింద మొదట హిందూ ధార్మిక సంస్థ అయిన తిరుమలేశుని దర్శనం, ఆ తరువాత శుక్రవారం (ఈ నెల 11) సాయంత్రం కడపలోని పెద్ద దర్గాను సందర్శించుకుని అదే రోజు జగన్‌ పులివెందులకు వెళతారు. ఈ నెల 12న ఇడుపులపాయలో వైఎస్‌ సమాధికి నివాళి, ఆ తరువాత పులివెందులలోని చర్చిలో ప్రార్థనలు నిర్వహించి 13 వరకు పులివెందులలోనే గడుపుతారు. ఈ సందర్భంగా ప్రజాదర్బార్‌ నిర్వహిస్తారని ఆ పార్టీ నేతలు పేర్కొన్నారు. 14 నెలల పాటు జిల్లా రాజకీయాలు, పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉన్న జగన్‌ ఇక సార్వత్రిక ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టి అభ్యర్థులు ఎవరన్నది తేలుస్తారని సమాచారం. సంక్రాంతి తరువాత తిరిగి బస్సు యాత్ర ప్రారంభిస్తారని, జిల్లాలో కూడా మిగిలిన నియోజకవర్గాల్లో జగన్‌ పర్యటన ఉంటుందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
 
 
సిట్టింగ్‌లకే సీట్లు దక్కేనా..?
జిల్లాలో 2014 ఎన్నికల నాటికి వైఎస్‌ సానుభూతి ప్రభంజనంతో పాటు జగన్‌పై ఉన్న అభిమానం ఓట్లు కురిపించాయి. ఈ నాలుగున్నరేళ్లలో అధికార పక్షం జిల్లాలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి బలపడినట్లు రాజకీయవర్గాలు పేర్కొంటున్నాయి. పులివెందులకు కృష్ణా జలాలు, ఉక్కు పరిశ్రమ ఏర్పాటుతో పాటు పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడంతో టీడీపీ బలం బాగానే పుంజుకుంది. ఈ పరిస్థితుల్లో ఉన్న సిట్టింగ్‌ అభ్యర్థులు గెలుపు సాధిస్తారా అన్న చర్చ ఆ పార్టీలో నడుస్తోంది. ఈసారి ఎన్నికలు ఆర్థిక వనరులతో ముడిపడి ఉండడంతో రూ.కోట్లు అవసరం ఉంటుందని అన్ని పార్టీలు అంచనా వేస్తున్నాయి.
 
 
చాలా మంది ముఖ్య నేతలు అధికార పార్టీలోకి చేరడం వల్ల వైసీపీ ఉన్న నేతలతోనే సర్దుకునే పరిస్థితి ఉంది. పీకే సర్వేతో పాటు వివిధ సర్వేలు నిర్వహించిన జగన్‌ గెలుపు గుర్రాలు ఎవరన్నది ఓ అంచనాకు వచ్చినట్లు ఆ పార్టీ నేతలే బహిరంగంగా చర్చించుకుంటున్నారు. పార్టీ కార్యక్రమాలను మొక్కుబడిగా నిర్వహించడం వంటి సంఘటనలతో ఇప్పటి వరకు జిల్లాలో పార్టీ స్తబ్దుగా ఉంటూ వస్తోంది. అధినేత జగన్‌ 14 నెలలు పాటు జిల్లాలో లేకపోవడం మరో కారణంగా మారింది. వెరసి ఈ సారి పది అసెంబ్లీ, రెండు లోక్‌సభ స్థానాలు దక్కించుకుని టీడీపీకి తమ సత్తా ఏమిటో చూపాలని జగన్‌ గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. అందుకే ఈసారి గెలుపు గుర్రాలకే సీట్లు అన్న చర్చ పార్టీలో నడుస్తోంది. ఈ నేపథ్యంలో సిట్టింగుల్లో ఏదైనా మార్పు ఉంటుందా అన్న చర్చ కూడా జోరుగానే వినిపిస్తోంది. ఇప్పటి వరకు అధినేత తమకే సీట్లు అంటూ గట్టిగానే హామీ ఇచ్చారని సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
 
 
కొన్ని స్థానాల్లో మార్పులకు అవకాశం
2014 ఎన్నికల్లో తొమ్మిది అసెంబ్లీ, రెండు లోక్‌సభ స్థానాలు వైసీపీ గెలుచుకుంది. జమ్మలమడుగు, బద్వేలు వైసీపీ ఎమ్మెల్యేలు ఆదినారాయణరెడ్డి, జయరాములు ఆ పార్టీని వీడి టీడీపీలో చేరారు. ప్రస్తుతం ఈ రెండు నియోజకవర్గాల్లో సుధీర్‌రెడ్డి, డాక్టర్‌ వెంకటసుబ్బయ్యలను ఇన్‌చార్జిలుగా పెట్టారు. రాజంపేటకు ఇన్‌చార్జిగా ఆకేపాటి అమరనాథరెడ్డి కొనసాగుతున్నారు. మిగిలిన ఏడు నియోజకవర్గాల్లో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలే పార్టీ ఇన్‌చార్జిలుగా కొనసాగుతుండగా పులివెందులలో మాజీ ఎంపీ అవినాష్‌ ఆ బాధ్యతలు చూస్తున్నారు. కడప ఎంపీ స్థానాన్ని ఎట్టి పరిస్థితుల్లో టీడీపీ గెలుచుకోవాలని ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. అందుకని వైసీపీ కూడా వ్యూహ ప్రతివ్యూహాల్లో మునిగితేలుతూ ఈసారి కడప లోక్‌సభ అభ్యర్థి మార్పు ఉంటుందని పార్టీలో చర్చ సాగుతోంది. వైఎస్‌ కుటుంబంలోనే ఎవరో ఒకరు పోటీ చేసే అవకాశం ఉందని అవినాష్‌కు ఎక్కడైనా ఎమ్మెల్యేగా అవకాశమిస్తారని సమాచారం.
 
ఇక జమ్మలమడుగు నియోజకవర్గంలో సుధీర్‌రెడ్డి ధీటైన అభ్యర్థి కాదని, అక్కడ కూడా కొత్త వారికి అవకాశమివ్వాలని ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా జగన్‌ వ్యవహరిస్తూ ఇక పూర్తిస్థాయిలో జిల్లా రాజకీయాలపై దృష్టి పెట్టనున్నారని పార్టీ నేతలు వెల్లడిస్తున్నారు. జగన్‌ జిల్లాకు వస్తున్నారన్న సమాచారంతో జిల్లాలోని ఆ పార్టీ నేతలు, శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.
 
ఇక జిల్లా రాజకీయాలు కూడా అధికార పక్షానికి ధీటుగానే వ్యవహారాలు ఉంటాయని ప్రచారం సాగుతోంది. సంక్రాంతి తరువాత వైసీపీ పూర్తి స్థాయిలో సార్వత్రిక ఎన్నికలపై దృష్టి పెట్టి అడుగులు వేయనుండడంతో జిల్లా రాజకీయాలు గరంగరంగా మారనున్నాయి. కాగా, జగన్‌ పాదయాత్ర పూర్తి అయిన నేపథ్యంలో బుధవారం కడపలోని వైసీపీ జిల్లా కార్యాలయంలో ఎమ్మెల్యే అంజాద్‌బాషా, మేయర్‌ సురేష్‌బాబు ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు.
Link to comment
Share on other sites

చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన మాజీ మంత్రి
17-01-2019 19:43:56
 
636833512741999251.jpg
అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు సమక్షంలో మాజీ మంత్రి, కడప జిల్లా కీలకనేత అహ్మదుల్లా టీడీపీ కండువా కప్పుకున్నారు. గురువారం సాయంత్రం ఆయనకు కండువా కప్పిన చంద్రబాబు పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కాంగ్రెస్‌ హయాంలో మంత్రిగా పనిచేసిన అహ్మదుల్లా 2014 నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ ఆయన టీడీపీతోనే రీ-ఎంట్రీ ఇవ్వాలని భావించి కీలక నేతలతో చర్చించిన అనంతరం సైకిలెక్కేందుకు సిద్ధమయ్యారు.
 
ఇప్పటికే ఈయన టీడీపీ అధినేత చంద్రబాబుతో ఒకసారి భేటీ అయిన విషయం విదితమే. ఈ భేటీలోనే టికెట్ వ్యవహారంపై చర్చించారని.. కడప అసెంబ్లీ ఫిక్స్ చేశారని సమాచారం. కాగా.. 2004, 2009 ఎన్నికల్లో అహ్మదుల్లా ఇదే కడప అసెంబ్లీ నుంచి పోటీ చేసి రెండుసార్లూ గెలుపొందారు. అప్పట్లో ఒక దఫా ఏపీ కేబినెట్‌‌లో మంత్రిగా కూడా ఆయన పనిచేశారు.
 
 
టీడీపీలోకి రాజశేఖర్..
మాజీ మంత్రి అహ్మదుల్లాతో పాటు సత్యవేడుకు చెందిన ఏడీఆర్ ఫౌండేషన్ అధినేత జేడీ రాజశేఖర్ కూడా టీడీపీ కండువా కప్పుకున్నారు. గురువారం సాయంత్రం వీరిద్దరూ చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. కాగా రాజశేఖర్ చిత్తూరు జిల్లాకు చెందిన నేత.
Link to comment
Share on other sites

కడప జిల్లాలో ఎన్నికల కయ్యానికి కాలుదువ్వుతున్నది వీళ్లే..!
20-01-2019 15:07:59
 
636835937524197709.jpg
  • రాజకీయ పార్టీల్లో మొదలైన సీట్ల సిగపట్లు
  • ఒకటి, రెండు నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఖరారు
  • 22న రాజంపేట టీడీపీ నేతలతో సీఎం చంద్రబాబు సమీక్ష
  • శరవేగంగా మారుతున్న సమీకరణలు
 
రాజకీయపార్టీల్లో ఎన్నికల వేడి రాజుకుంటోంది. సార్వత్రిక ఎన్నికలు దగ్గర్లో ఉండడంతో ప్రధానపార్టీల ఆశావహులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఒకటి రెండు చోట్ల అభ్యర్థులను ప్రకటించినా మిగిలిన చోట్ల ఉత్కంఠ తొలగలేదు. ప్రధాన పార్టీల అధ్యక్షులకే అభ్యర్థుల ఎంపిక తలనొప్పిగా మారింది. వైసీపీలో పెద్ద మార్పులు ఉండవని అంటున్నారు. టీడీపీలో మాత్రం తీవ్ర పోటీ నెలకొంది. కొన్నిచోట్ల ముగ్గురు నలుగురు కూడా టికెట్టుకోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అనూహ్యంగా కొందరు తెరపైకి వచ్చి పాతకాపులకు ఆందోళన కలిగిస్తున్నారు. ఇతర పార్టీల సీనియర్‌ నేతలు సైతం పెద్దల పిలుపుకోసం ఎదురుచూస్తున్నారు. దీంతో సమీకరణలు శరవేగంగా మారుతున్నాయి.
 
 
కడప (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ పార్టీల్లో ఎన్నికల వేడి రగులుకుంటోంది. కొన్ని నియోజకవర్గాల్లో నేతల మధ్య సీట్ల సిగపట్ల వివాదాలు పార్టీలకు పెద్ద తలనొప్పిగా మారుతున్నాయి. ఇప్పటి వరకు ఒకటి, రెండు నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ఖరారు చేయడంతో వారు అప్పుడే ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. రాజంపేట టీడీపీ నేతలతో ఈ నెల 22న సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇటు టీడీపీ, అటు వైసీపీ అభ్యర్థుల ఎంపిక పై ఆయా పార్టీ అధ్యక్షులే స్వయంగా రంగంలో దిగి కసరత్తు సాగిస్తుండడంతో ఎవరికి టికెట్‌ దక్కుతుందన్న చర్చ సాగుతోంది. దీనికి తోడు నియోజకవర్గాలలో రాజకీయ సమీకరణలు శరవేగంగా మారుతున్నాయి. మార్చిలో ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటిస్తారన్న సమాచారంతో పార్టీ నేతల్లో సందడి నెలకొంది. ఇక ఎన్నికల సీజన్‌ మొదలు కావడంతో టికెట్లు ఆశిస్తున్న వారిలో ఉత్కంఠ పెరుగుతోంది.
 
 
అభ్యర్థుల ఎంపికపై కసరత్తు
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండడంతో గెలుపుగుర్రాల కోసం ప్రధాన పార్టీలు దృష్టి పెట్టాయి. ఇప్పటికే వివిధ సర్వేలలో గెలుపునకు అవకాశం ఉన్న అభ్యర్థుల జాబితాను ప్రధాన పార్టీలు సిద్ధం చేశాయి. గత ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో గెలిచిన వైసీపీ ఈసారి తమ స్థానాలను పదిలం చేసుకునేందుకు వ్యూహరచన చేస్తోంది. జిల్లాలో మెజార్టీ స్థానాల్లో టీడీపీ జెండా ఎగురవేసి పట్టును పెంచుకోవాలని టీడీపీ నేతలు పావులు కదుపుతున్నారు. ఇప్పటికే చంద్రబాబు నియోజకవర్గాల వారీగా సర్వేలు నిర్వహించి సామాజిక వర్గాలు, అభ్యర్థుల బలాలు, బలహీనతలు బేరీజు వేసుకొని ఓ ఆలోచనకు వచ్చినట్లు సమాచారం. 14 నెలల పాదయాత్ర అనంతరం జిల్లాలో అడుగుపెట్టిన వైసీపీ అధినేత జగన్‌ కూడా వివిధ సర్వేలతో గెలిచే అభ్యర్థులు ఎవరన్నది అంచనా వేసి వారికే ఈసారి టికెట్లు ఇవ్వాలని నిర్ణయించినట్లు ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. పైకి మాత్రం సిట్టింగ్‌లకే సీట్లు అంటూ వైసీపీలో ప్రచారం సాగుతున్నా వారిలో గెలిచే వారెందరు అన్న చర్చ పార్టీలో సాగుతోంది.
 
 
వైసీపీలో పులివెందుల నుంచి వైఎస్‌ జగన్‌, జమ్మలమడుగు నుంచి సుధీర్‌రెడ్డి, మైదుకూరు నుంచి రఘురామిరెడ్డి పోటీ చేస్తారని స్వయంగా జగనే ప్రకటించడంతో ఈ మూడు నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు ఎవరన్నది తేలిపోయింది. మిగిలిన 7 నియోజకవర్గాలలో సిట్టింగ్‌లకే సీట్లు ఇస్తారా లేదా కొత్త వారికి అవకాశం ఉంటుందా అన్న చర్చ వైసీపీలో సాగుతోంది. ఇక టీడీపీలో పులివెందుల నుంచి సతీ్‌షరెడ్డి పేరు దాదాపు ఖరారు చేశారు. అనూహ్య రీతిలో కడప నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి అహ్మదుల్లా ఆయన తనయుడు అష్రఫ్‌ పార్టీలో చేరడం, కడప ఇన్‌చార్జిగా అష్రఫ్‌ పేరును సీఎం చంద్రబాబు ప్రకటించడంతో రానున్న ఎన్నికల్లో ఆయనే పోటీ చేస్తారని ఆ పార్టీలో ప్రచారం సాగుతోంది. ఇంకా 8 నియోజకవర్గాల అభ్యర్థులు ఎవరన్నది టీడీపీలో తేల్చాల్సి ఉంది. ఈ నెల 22న రాజంపేట నియోజకవర్గ టీడీపీ నేతలతో సీఎం సమావేశం జరిపి అభ్యర్థిని ఖరారు చేస్తారన్నది సమాచారం. ఇలా నియోజక వర్గాల వారీగా వైసీపీ, టీడీపీ అగ్రనేతలు టిక్కెట్లు ఆశిస్తున్న ఆశావహులతో చర్చిస్తుండడంతో ఎవరికి టికెట్‌ దక్కుతుందన్న ఉత్కంఠ పార్టీ నేతల్లో కొనసాగుతోంది. నియోజకవర్గాల వారీగా ఒకసారి పరిశీలిస్తే...
 
  • రాయచోటి నియోజకవర్గంలో వైసీపీ నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి తిరిగి పోటీ చేస్తారని ప్రచారం సాగుతున్నా మాజీ ఎమ్మెల్యే నాగిరెడ్డి తనయుడు రాంప్రసాద్‌రెడ్డి, వైసీపీలో కీలకనేతగా వ్యవహరిస్తున్న విజయసాయిరెడ్డి బావమరిది మాజీ ఎమ్మెల్యే ద్వారకనాధరెడ్డి వైసీపీ టికెట్టు ఆశిస్తున్నారు. ఎక్కువ అవకాశం శ్రీకాంత్‌రెడ్డికే అన్న చర్చ పార్టీలో వినిపిస్తోంది. ఇక టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే రమే్‌షరెడ్డి తనకు టికెట్‌ ఖరారైందని ప్రచారం సాగిస్తుండగా మాజీ ఎంపీ పాలకొండ్రాయుడి తనయుడు ప్రసాద్‌బాబు తనకు లోకేష్‌ టికెట్‌ ఇస్తామని హామీ ఇచ్చారని ప్రచారం చేస్తున్నారు. ఇటీవల జిల్లా నేతలతో సీఎం సమావేశమైనప్పుడు రాయచోటి టికెట్‌ రమే్‌షకుమార్‌రెడ్డికే ఇస్తామని చెప్పినట్లు ఆ పార్టీలో చర్చ సాగుతోంది.
 
  • మైదుకూరు నియోజకవర్గంలో టీడీపీ ఇన్‌చార్జి, టీటీడీ చైర్మన్‌ పుట్టా సుధాకర్‌యాదవ్‌ టికెట్‌ను ఆశిస్తున్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన పుట్టా ఇప్పటికే నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ప్రచారం చేస్తున్నారు. మాజీ మంత్రి కాంగ్రెస్‌ నేత డీఎల్‌ రవీంద్రారెడ్డిని టీడీపీలోకి ఆహ్వానించి పోటీ చేయించాలని మంత్రి ఆదినారాయణరెడ్డి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇటీవల వైసీపీ అధినేత జగన్‌ను డీఎల్‌ అనుచరులు కలిసి ఈసారి టికెట్‌ ఇవ్వాలని కోరగా సిట్టింగ్‌ ఎమ్మెల్యే రఘురామిరెడ్డికే టికెట్టు ఇస్తున్నామని ఆయనే పోటీ చేస్తారని, డీఎల్‌కు ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని జగన్‌ బహిరంగంగా వెల్లడించారు. ఇది డీఎల్‌కు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఎమ్మెల్సీ పదవి కోసం ఎప్పుడూ ఆశించనని గౌరవంగా ఆహ్వానించి పోటీచేయమంటే చేస్తామని వెల్లడించారు. ఒకవేళ డీఎల్‌కు టీడీపీ టికెట్‌ ఇస్తే మరో రెండేళ్లు టీటీడీ చైర్మన్‌ పదవిని పొడిగించడం లేదా రాజ్యసభకు అవకాశం ఇచ్చేలా పుట్టాతో మంతనాలు జరుపుతున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
  • జమ్మలమడుగు నియోజకవర్గంలో మంత్రి ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిల పంచాయతీ ఇంకా కొలిక్కి రాలేదు. సీఎం చంద్రబాబు ఇప్పటికే రెండు, మూడు సార్లు ఇద్దరు నేతలు, వారి కుటుంబాలతో చర్చలు సాగించారు. ఇద్దరూ ఎమ్మెల్యే టికెట్‌ కోరుతుండడంతో చివరకు సీఎం చంద్రబాబు జోక్యం చేసుకొని ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలో చెబుతానని వెల్లడించారు. ఇక వైసీపీ అభ్యర్థిగా సుధీర్‌రెడ్డి పేరును వైసీపీ అధినేత జగన్‌ ప్రకటించారు. దీంతో సుధీర్‌రెడ్డి అనుచరులు నియోజకవర్గంలో సంబరాలు చేసుకొని ప్రచారం ప్రారంభించారు. మాజీ ఎంపీపీ అల్లెప్రభావతి ఇదే నియోజకవర్గం నుంచి వైసీపీ టికెట్‌ ఆశిస్తుండగా ఆమెకు టికెట్‌ నిరాకరించడంతో ఇండిపెండెంట్‌గా పోటీకి దిగుతానని హెచ్చరిస్తున్నారు.
  • ప్రొద్దుటూరు నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి, లింగారెడ్డిలు టీడీపీ టికెట్‌ ఆశిస్తున్నారు. ఇటీవల వరదరాజులరెడ్డి బీసీ కార్డు తెరపైకి తెచ్చి రూ.30కోట్లు ఎవరు పెట్టుకుంటారో వారికి టీడీపీ టికెట్‌ ఇప్పిస్తానని బహిరంగంగా ప్రకటించారు. దీంతో బీసీ ఐక్యవేదిక రెండు రోజుల క్రితం ప్రొద్దుటూరులో భారీ ర్యాలీ నిర్వహించి బల నిరూపణకు దిగింది. బీసీలకు ఇస్తే తన పేరు పరిశీలించాలని బొర్రె రామాంజనేయులు కోరుతున్నారు. వైసీపీ నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ఈసారి కూడా పోటీ చేస్తారని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. ఎమ్మెల్యేను కాదని టికెట్‌ ఇవ్వరన్న ఉద్దేశ్యంతో వైసీపీ నేతలెవరూ కూడా ఈ నియోజకవర్గం నుంచి టికెట్‌ను ఆశించడం లేదు.
 
  • బద్వేల్‌ ఎస్సీ నియోజకవర్గం నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే జయరాములు, విజయజ్యోతి టీడీపీ టిక్కెట్‌ ఆశిస్తుండగా మాజీ ఎమ్మెల్యే విజయమ్మ డాక్టర్‌ రాజశేఖర్‌, లాజరస్‌ పేర్లను అధిష్టానానికి సిఫారసు చేసినట్లు సమాచారం. టీడీపీ టికెట్‌ను విజయమ్మ సూచించిన వ్యక్తికే ఇస్తామని అధినేత చంద్రబాబు వెల్లడించినట్లు పార్టీ నేతల పేర్కొంటున్నారు. ఇక వైసీపీ నుంచి డాక్టర్‌ వెంకటసుబ్బయ్యను ఇన్‌చార్జిగా నియమించడంతో ఆయన ప్రచారం ముమ్మరంగా సాగిస్తున్నారు.
  • రాజంపేట సిట్టింగ్‌ ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి టీడీపీని వీడతారన్న ప్రచార నేపథ్యంలోఈ నెల 22న సీఎం చంద్రబాబు ఈ నియోజకవర్గ టీడీపీ నేతలతో ప్రత్యేకంగా సమావేశమవుతున్నారు. ఒకవేళ సిట్టింగ్‌ ఎమ్మెల్యేకు టికెట్‌ నిరాకరిస్తే తన పేరు పరిశీలించాలని ఆకేపాటి మురళి, మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్‌రాయులు కోరుతున్నారు. వైసీపీ ఇన్‌చార్జిగా ఉన్న ఆకేపాటి అమరనాధరెడ్డి ఈసారి వైసీపీ టికెట్‌ తనదేనని ప్రచారం చేస్తున్నారు. మేడా రఘునాధరెడ్డికి వైసీపీ టికెట్‌ ఇస్తారని ఆయనే రాజంపేట వైసీపీ అభ్యర్థిగా ఈ ఎన్నికల్లో పోటీచేస్తారని వైసీపీ నేతలే ప్రచారం చేస్తున్నారు.
  • రైల్వేకోడూరు ఎస్సీ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా సిట్టింగ్‌ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులే ఈసారి పోటీ చేస్తారు. టీడీపీ నుంచి బత్యాల చెంగల్‌రాయులు సూచిస్తున్న అన్నపూర్ణమ్మ, కస్తూరి విశ్వనాధనాయుడు సిఫారసు చేస్తున్న నరసింహప్రసాద్‌లు టికెట్‌ కోసం పోటీ పడుతున్నారు. ఆ ఇద్దరు నేతలు కలిసి ఒకరి పేరు సూచిస్తేనే వారికే టికెట్‌ అంటూ ఇప్పటికే అధినేత చంద్రబాబు వెల్లడించారు.
  • పులివెందుల నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ తిరిగి పోటీ చేస్తారు. టీడీపీ కూడా ముందస్తుగానే సతీష్ రెడ్డి పేరును ప్రకటించి ప్రచారం చేసుకోవాలని సూచించడంతో వేంపల్లి నుంచి ఆయన పులివెందులకు మకాం మార్చి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నారు.
  • కమలాపురం వైసీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే రవీంద్రనాధరెడ్డికే ఈసారి టికెట్‌ దక్కుతుందని ప్రచారం సాగుతోంది. గత ఎన్నికల్లో మల్లికార్జునరెడ్డి టికెట్‌ ఆశించినా దక్కలేదు. ఈసారి గట్టిగానే ప్రయత్నించి టికెట్‌ తెచ్చుకోవాలనే ప్రయత్నంలో మల్లికార్జునరెడ్డి ఉన్నట్లు వైసీపీ నేతలు పేర్కొంటున్నారు. ఇక టీడీపీ నుంచి ఇన్‌ఛార్జి పుత్తా నరసింహారెడ్డి తనకే టికెట్‌ ఖరారైందని పోటీ చేస్తున్నట్లు ప్రచారం చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి కూడా టికెట్‌ ఆశిస్తూ ప్రయత్నాలు చేస్తున్నారు.
  • కడప నియోజకవర్గంలో అనూహ్యంగా తెరపైకి వచ్చిన మాజీ మంత్రి అహ్మదుల్లా, ఆయన తనయుడు అష్రఫ్ రెండు రోజుల క్రితం టీడీపీలో చేరారు. అష్రఫ్‌ను నియోజకవర్గ ఇన్‌చార్జిగా సీఎం చంద్రబాబు ప్రకటించడంతో రానున్న ఎన్నికల్లో వారికే టికెట్‌ అని తేలిపోయింది. దీంతో టికెట్‌ ఆశిస్తున్న పలువురు టీడీపీ నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక వైసీపీ నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే అంజద్‌బాషాకే టికెట్‌ దక్కుతుందని, ఆయనే పోటీ చేస్తారని వైసీపీ నేతలు పేర్కొంటున్నారు.
ఇలా జిల్లాలో పది నియోజక వర్గాల్లో టీడీపీ, వైసీపీ నేతలు అభ్యర్థులను ఖరారు చేస్తూ కసరత్తు ప్రారంభించడంతో ఆశావహుల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. ఇక బీజేపీ, కాంగ్రెస్‌, జనసేన పార్టీలు కూడా తమ అభ్యర్థులను ఎన్నికల బరిలో దింపేందుకు సన్నాహాలు చేస్తున్నాయి.
Link to comment
Share on other sites

టిక్కెట్లు.. ఇక్కట్లు!
 

జిల్లా తెదేపా, వైకాపా నాయకుల మధ్య అంతర్గత యుద్ధం
రాజంపేటలో టిక్కెట్టు కోసం పట్టుబడుతున్న వర్గాలు
జగన్‌తో భేటీకి పలువురి ప్రయత్నం.. ‘సజ్జల’తోనే సమాలోచనలు
జమ్మలమడుగుకు చెందిన పలువురు వైకాపాలో చేరిక
రేపు వైకాపా గూటికి మేడా.. క్షేత్రస్థాయిలో సమీకరణలు

kdp-gen1a_52.jpg

కడప, ఈనాడు : టిక్కెట్ల కేటాయింపుల పర్వం ఇక్కట్లతో సాగుతోంది. పార్టీల మధ్య వలసలు సాగుతున్నాయి. జిల్లాలో గత కొద్దిరోజులుగా జరుగుతున్న పరిణామాలు, రాజకీయాలు ఇరుపక్షాల్లోనూ ఆందోళన కలిగిస్తున్నాయి. పార్టీ టిక్కెట్టు తమకే కావాలంటూ పట్టు పడుతున్న నేతలు, తమ వర్గీయుడికే వస్తుందంటూ ధీమాగా చెబుతోన్న శ్రేణులు.. ఈ స్థితిలోనే కొందరు పార్టీలు మారుతుండటం చర్చకు దారితీస్తోంది. మున్ముందు ఏం జరగబోతోందన్న దానిపై ఉత్కంఠ రేపుతోంది.. ప్రస్తుతం రెండు పార్టీలకు సంబంధించి రాజంపేట అంశమే కీలకంగా మారింది. ఇక్కడ రెండు పార్టీలకు అభ్యర్థి ఎంపిక ఎడతెగని సమస్యగా తయారైంది. ప్రతిపక్ష వైకాపాకు సంబంధించి ఆకేపాటి అమరనాథరెడ్డి ఏళ్ల తరబడి సేవలందిస్తుండగా.. ప్రస్తుతం మేడా వైకాపాలో చేరనుండటంతో ఆయన డైలమాలో పడటం గమనార్హం. ఓ దశలో మేడాకే వైకాపా టిక్కెట్టు ఇస్తారన్న ప్రచారం సాగుతుండటం..ఆకేపాటి వర్గీయులు తమ నాయకుడికే టిక్కెట్టు ఇవ్వాలని పట్టుబట్టడంతో ఆ పార్టీ అధిష్ఠానం రాజంపేటకు చెందిన సీనియర్‌ నేతలను హైదరాబాద్‌కు రప్పించారు. మంగళవారం వారు జగన్‌తో భేటీ అవుతారనుకోగా చివరిక్షణంలో వాయిదా పడ్డట్లు సమాచారం. జమ్మలమడుగు నియోజకవర్గానికి చెందిన కొందరు కీలక నాయకులు వైకాపాలో చేరారు. ఆయన ఆ హడావుడిలో ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ నేపథ్యంలో రాజంపేట నియోజకవర్గంలోని రాజంపేట, ఒంటిమిట్ట, నందలూరు ప్రాంతాలకు చెందిన సుమారు 40 మంది నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డితో భేటీ అయినట్లు ఆ పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. పార్టీకోసం శ్రమిస్తోన్న ఆకేపాటికి అవకాశమివ్వాలని ముక్తకంఠంతో ప్రస్తావించగా.. కలసి కట్టుగా పనిచేయాలన్న సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. బుధవారం జగన్‌తో భేటీ అయ్యే అవకాశం ఉంటుంది. మంగళవారం జమ్మలమడుగు నియోజకవర్గానికి చెందిన కొందరు ముఖ్య నాయకులు వైకాపాలో చేరడం చర్చనీయాంశంగా మారింది. కొండాపురం, ముద్దనూరు, జమ్మలమడుగుకు చెందిన తెదేపా శ్రేణులు.. జగన్‌ సమక్షంలో వైకాపా కండువాలు కప్పుకొన్నారు. రోజురోజుకు జరుగుతున్న పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి.

తెదేపాలోనూ అంతే : తెలుగుదేశం పార్టీకి సంబంధించి రాజంపేట వ్యవహారమే కీలకమైంది. ఈ ప్రాంతానికి చెందిన బత్యాల, బ్రహ్మయ్య తదితరులు ఇప్పటికే అమరావతి చేరుకొన్నారు. మంగళవారం అధినేతతో భేటీ కావాల్సి ఉంది.  చంద్రబాబు అనంతపురం జిల్లా పర్యటనకు వెళ్లడంతో వారికి అవకాశం దొరకలేదు. ఈ నేపథ్యంతో పార్టీ ముఖ్య నాయకులతో సమావేశమై నియోజకవర్గ పరిస్థితులపై చర్చించినట్లు ఆ పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఇక్కడా స్థానికులకే టిక్కెట్టు ఇవ్వాలన్న వాదన వ్యక్తీకరించేందుకు ఉద్యుక్తులవగా.. ప్రస్తుతానికి ఇక్కడ గుంభనంగా మారింది. ఈ క్రమంలోనే ఇద్దరు రాజంపేట నేతల మధ్య స్థానిక, స్థానికేతర అంశంపై వాదులాడుకున్నట్లు విశ్వసనీయవర్గాలు స్పష్టం చేస్తున్నాయి. సవాళ్లు, ప్రతిసవాళ్ల వరకు వ్యవహారం వెళ్లిందన్నది ప్రధానంగా వినిపిస్తున్న మాట. ప్రొద్దుటూరు టిక్కెట్టు ఆశిస్తున్న బొర్రా రామాంజనేయులు సైతం చంద్రబాబును కలిసేందుకు ప్రయత్నించినా మంగళవారం అవకాశం లభించనట్లు తెలుస్తోంది. మాజీ ఛైర్మన్‌ గురివిరెడ్డి సైతం అధినేతను కలిసేందుకు సన్నద్ధమైనట్లు తెదేపా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

రేపు మేడా వైకాపాలోకి..:  రాజంపేట ఎమ్మెల్యేగా ఉన్న మేడా మల్లికార్జునరెడ్డి తన పదవికి రాజీనామా చేసి స్పీకర్‌ ఫార్మాట్‌లో పంపడంతో పాటు.. వైకాపా తీర్థం పుచ్చుకోనున్నారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీని వీడి బయటకొచ్చిన ఆయన.. జగన్‌ను కలసి పార్టీలో చేరుతామని స్పష్టం చేశారు. అంతకుముందే తెదేపా అధిష్ఠానం సస్పెన్షన్‌ వేటేయగా.. 31న వైకాపాలోకి వస్తామని స్పష్టం చేశారు. ఆ మేరకు నాలుగు రోజులుగా నియోజకవర్గ పరిధిలోని మండలాల్లో కార్యకర్తలు, నాయకులతో సమావేశమవుతున్నాయి. ఎక్కడికక్కడ తన వెంట నడవాలన్న సంకేతాలు ఇస్తుండగా.. కొందరు వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే బుధవారం మరోమారు తన అనుచరగణంతో సమావేశమయ్యేందుకు నిర్ణయించారు. ఉదయం 10 గంటలకు రాజంపేటలోని మేడా భవన్‌కు రావాలంటూ సందేశాలు పంపారు. అక్కడి నుంచి లోటస్‌పాండ్‌కు చేరుకుని గురువారం వైఎస్‌ జగన్‌ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకునే అవకాశం కనిపిస్తోంది. మేడాతో ఆయన కుటుంబీకులు సైతం వైకాపా కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది.

తమ నాయకుడికే టిక్కెట్టు ఇవ్వాలని పట్టుబట్టడంతో ఆ పార్టీ అధిష్ఠానం రాజంపేటకు చెందిన సీనియర్‌ నేతలను హైదరాబాద్‌కు రప్పించారు. మంగళవారం వారు జగన్‌తో భేటీ అవుతారనుకోగా చివరిక్షణంలో వాయిదా పడ్డట్లు సమాచారం. జమ్మలమడుగు నియోజకవర్గానికి చెందిన కొందరు కీలక నాయకులు వైకాపాలో చేరారు. ఆయన ఆ హడావుడిలో ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ నేపథ్యంలో రాజంపేట నియోజకవర్గంలోని రాజంపేట, ఒంటిమిట్ట, నందలూరు ప్రాంతాలకు చెందిన సుమారు 40 మంది నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డితో భేటీ అయినట్లు ఆ పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. పార్టీకోసం శ్రమిస్తోన్న ఆకేపాటికి అవకాశమివ్వాలని ముక్తకంఠంతో ప్రస్తావించగా.. కలసి కట్టుగా పనిచేయాలన్న సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. బుధవారం జగన్‌తో భేటీ అయ్యే అవకాశం ఉంటుంది. మంగళవారం జమ్మలమడుగు నియోజకవర్గానికి చెందిన కొందరు ముఖ్య నాయకులు వైకాపాలో చేరడం చర్చనీయాంశంగా మారింది. కొండాపురం, ముద్దనూరు, జమ్మలమడుగుకు చెందిన తెదేపా శ్రేణులు.. జగన్‌ సమక్షంలో వైకాపా కండువాలు కప్పుకొన్నారు. రోజురోజుకు జరుగుతున్న పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి.

తెదేపాలోనూ అంతే : తెలుగుదేశం పార్టీకి సంబంధించి రాజంపేట వ్యవహారమే కీలకమైంది. ఈ ప్రాంతానికి చెందిన బత్యాల, బ్రహ్మయ్య తదితరులు ఇప్పటికే అమరావతి చేరుకొన్నారు. మంగళవారం అధినేతతో భేటీ కావాల్సి ఉంది.  చంద్రబాబు అనంతపురం జిల్లా పర్యటనకు వెళ్లడంతో వారికి అవకాశం దొరకలేదు. ఈ నేపథ్యంతో పార్టీ ముఖ్య నాయకులతో సమావేశమై నియోజకవర్గ పరిస్థితులపై చర్చించినట్లు ఆ పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఇక్కడా స్థానికులకే టిక్కెట్టు ఇవ్వాలన్న వాదన వ్యక్తీకరించేందుకు ఉద్యుక్తులవగా.. ప్రస్తుతానికి ఇక్కడ గుంభనంగా మారింది. ఈ క్రమంలోనే ఇద్దరు రాజంపేట నేతల మధ్య స్థానిక, స్థానికేతర అంశంపై వాదులాడుకున్నట్లు విశ్వసనీయవర్గాలు స్పష్టం చేస్తున్నాయి. సవాళ్లు, ప్రతిసవాళ్ల వరకు వ్యవహారం వెళ్లిందన్నది ప్రధానంగా వినిపిస్తున్న మాట. ప్రొద్దుటూరు టిక్కెట్టు ఆశిస్తున్న బొర్రా రామాంజనేయులు సైతం చంద్రబాబును కలిసేందుకు ప్రయత్నించినా మంగళవారం అవకాశం లభించనట్లు తెలుస్తోంది. మాజీ ఛైర్మన్‌ గురివిరెడ్డి సైతం అధినేతను కలిసేందుకు సన్నద్ధమైనట్లు తెదేపా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

రేపు మేడా వైకాపాలోకి..:  రాజంపేట ఎమ్మెల్యేగా ఉన్న మేడా మల్లికార్జునరెడ్డి తన పదవికి రాజీనామా చేసి స్పీకర్‌ ఫార్మాట్‌లో పంపడంతో పాటు.. వైకాపా తీర్థం పుచ్చుకోనున్నారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీని వీడి బయటకొచ్చిన ఆయన.. జగన్‌ను కలసి పార్టీలో చేరుతామని స్పష్టం చేశారు. అంతకుముందే తెదేపా అధిష్ఠానం సస్పెన్షన్‌ వేటేయగా.. 31న వైకాపాలోకి వస్తామని స్పష్టం చేశారు. ఆ మేరకు నాలుగు రోజులుగా నియోజకవర్గ పరిధిలోని మండలాల్లో కార్యకర్తలు, నాయకులతో సమావేశమవుతున్నాయి. ఎక్కడికక్కడ తన వెంట నడవాలన్న సంకేతాలు ఇస్తుండగా.. కొందరు వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే బుధవారం మరోమారు తన అనుచరగణంతో సమావేశమయ్యేందుకు నిర్ణయించారు. ఉదయం 10 గంటలకు రాజంపేటలోని మేడా భవన్‌కు రావాలంటూ సందేశాలు పంపారు. అక్కడి నుంచి లోటస్‌పాండ్‌కు చేరుకుని గురువారం వైఎస్‌ జగన్‌ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకునే అవకాశం కనిపిస్తోంది. మేడాతో ఆయన కుటుంబీకులు సైతం వైకాపా కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది.

Link to comment
Share on other sites

విజయసాయిరెడ్డి బావమరిదికి చంద్రబాబు చెప్పిన మాటేంటంటే..
30-01-2019 16:33:17
 
636844628920722668.jpg
  • సీఎంను కలిసిన ద్వారక.. రసవత్తరంగా రాయచోటి రాజకీయం
రాయచోటి రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ఇప్పటికే టీడీపీ నుంచి ఇద్దరు టికెట్టు ఆశిస్తుండగా మరో బలమైన నేత, మాజీ ఎమ్మెల్యే సీఎం చంద్రబాబును కలిశారు. ఈ వ్యవహారం వైసీపీలో సైతం చర్చనీయాంశంగా మారింది. సీఎంను కలిసిన గడికోట ద్వారకనాధరెడ్డి వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డికి స్వయాన బావమరిది కావడం విశేషం.
 
 
రాయచోటి(కడప జిల్లా): లక్కిరెడ్డిపల్లె మాజీ శాసనసభ్యుడు గడికోట ద్వారకనాధరెడ్డి సోమవారం రాత్రి పొద్దుపోయిన తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును రాజధాని అమరావతిలో కలిసినట్లు తెలిసింది. రానున్న 2019 సార్వత్రిక ఎన్నికల్లో రాయచోటి అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ టిక్కెట్‌ తనకు ఇవ్వాలని ఆయన కోరినట్లు సమాచారం. ప్రస్తుతం వైఎ్‌సఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో జగన్‌మోహన్‌రెడ్డి తరువాత స్థానంలో ఉన్న రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి ఈయన స్వయాన బావమరిది. దీంతో ముఖ్యమంత్రిని ద్వారకనాధరెడ్డి కలవడం రాజకీయంగా రాష్ట్ర స్థాయిలో ప్రాధాన్యత సంతరించుకుంది. అదే సమయంలో ఈ కలయిక రాయచోటి నియోజకవర్గంలో అనేక రాజకీయ పరిణామాలకు కీలకం కానుంది.
 
 
ద్వారకనాధరెడ్డి రాజకీయ జీవితం...
1994లో ఈయన తొలిసారిగా లక్కిరెడ్డిపల్లె అసెంబ్లీ స్థానానికి తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి గెలుపొందారు. అయితే సిట్టింగ్‌ ఎమ్మెల్యే అయినప్పటికీ 1999లో టీడీపీ ఇతనికి టిక్కెట్‌ను నిరాకరించింది. 2004లో కూడా తెలుగుదేశం పార్టీ ఇతనికి టిక్కెట్‌ ఇవ్వకపోవడంతో అప్పట్లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి చొరవ తీసుకుని ఇతన్ని కాంగ్రె్‌సలో చేర్చుకున్నారు. అప్పటి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి గడికోట మోహన్‌రెడ్డి గెలుపుకోసం పనిచేయాలని, భవిష్యత్తులో మంచి అవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో మోహన్‌రెడ్డి గెలుపొందారు. ద్వారక ఆర్టీసీ జోనల్‌ చైర్మన్‌గా పనిచేశారు. అనంతరం 2009 ఎన్నికల్లో ఆయన టిక్కెట్‌ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. అయితే అప్పట్లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జోక్యంతో శ్రీకాంత్‌రెడ్డికి టిక్కెట్‌ ఇచ్చారు. దీంతో పార్టీ మారాలనుకున్న ద్వారకను ఇతని బావ విజయసాయిరెడ్డి బుజ్జగించినట్లు అతని అనుచరులు పేర్కొంటారు. అనంతరం వైఎస్‌ రాజశేఖరరెడ్డి మరణించడం, కాంగ్రెస్‌ పార్టీ నుంచి జగన్‌మోహన్‌రెడ్డి బయటకు వచ్చి వైఎ్‌సఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ స్థాపించడం తెలిసిందే. దీంతో ఈయన కూడా జగన్‌వెంటే నడిచారు.
 
 
అయితే 2012 ఉప ఎన్నిక, 2014 సార్వత్రిక ఎన్నికల్లో సైతం వైసీపీ టిక్కెట్‌ కోసం ఈయన శక్తివంచన లేకుండా ప్రయత్నించారు. అయినా ఫలితం లేకపోయింది. శ్రీకాంత్‌రెడ్డికే టిక్కెట్‌ దక్కింది. టిక్కెట్‌ రాకపోయినా పార్టీకోసం పనిచేసిన ద్వారకనాధరెడ్డి ప్రస్తుతం 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ టిక్కెట్‌ కోసం పెద్ద ఎత్తున ప్రయత్నించారు. అయితే సిట్టింగ్‌ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డికే జగన్‌ అవకాశం ఇవ్వనున్న నేపథ్యంలో ద్వారక ప్రత్యామ్నాయ మార్గాల కోసం వెతుకుతున్నారు. ఈ నేపథ్యంలో తన బంధువైన చిత్తూరు జిల్లాకు చెందిన మంత్రి అమరనాధరెడ్డి ద్వారా తెలుగుదేశం పార్టీలోకి చేరి టిక్కెట్‌ తెచ్చుకునేందుకు ద్వారక ప్రయత్నిస్తున్నారు.
 
ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి ద్వారకనాధరెడ్డి ముఖ్యమంత్రిని కలిశారు. తనకు 2019 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ టిక్కెట్‌ ఇవ్వాలని కోరినట్లు సమాచారం. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ నియోజకవర్గంలో ఉన్న నాయకులతో ఓసారి మాట్లాడి చెబుతానని అన్నట్లు తెలిసింది. సర్వే ప్రకారం టిక్కెట్‌ ఇస్తానని అన్నట్లు తెలిసింది. అదేవిధంగా పార్టీలో చేరి పార్టీ బలోపేతానికి పనిచేయాలని కూడా ముఖ్యమంత్రి ఆహ్వానించినట్లు సమాచారం. ఏది ఏమైనా ప్రస్తుతం నియోజకవర్గంలో నెలకొన్న రాజకీయ వేడి నేపథ్యంలో ద్వారకనాధరెడ్డి ముఖ్యమంత్రిని కలవడం అనేక పరిణామాలకు కారణమవుతుందని ఖచ్చితంగా చెప్పవచ్చు.
Link to comment
Share on other sites

వైసీపీలో చేరేందుకు సిద్ధమైన మేడాకు ఝలక్ !
30-01-2019 17:08:19
 
636844649752068060.jpg
  • మేడా ఇంట.. తమ్ముని మంట..!
రాజంపేట(కడప జిల్లా): మేడా మల్లికార్జునరెడ్డి పార్టీ ఫిరాయింపు వ్యవహారం జిల్లాలో హాట్‌ టాపిక్‌గా మారింది. అయితే అదే స్థాయిలో ఆయన సోదరుడు మేడా విజయశేఖర్‌రెడ్డి అన్న బాటలో నడవకపోవడం కూడా విశేషం సంతరించుకుంది. మేడా మల్లికార్జునరెడ్డికి చిన్నాన్న కుమారుడు మేడా విజయశేఖర్‌ రెడ్డి(బాబు) తాను తెలుగుదేశంలోనే కొనసాగుతానని, ఎవ్వరూ ఎమ్మెల్యే వెంట వెళ్లవద్దని చెప్పడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. మేడా మల్లికార్జునరెడ్డి కుటుంబంలో ఆయన చిన్నాన్న కుమారుడు ప్రముఖ కాంట్రాక్టర్‌ మేడా బాబు కీలక పాత్ర పోషించేవారు. ఆయన గతంలో తన అన్నతో పాటు అనేక కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషించారు. సుండు పల్లెలో మండల పార్టీ బాధ్యతలను తన అన్న తరపున గత ఎన్నికల నుంచి నిర్వ హిస్తున్నారు. ఇటీవల సుండుపల్లె అధికారుల సమావే శంలో ఎమ్మెల్యే మేడా ఎదుటే తమ పనులు కావడం లేదంటూ అక్కడి అధికా రులను గట్టిగా బాబు నిలదీశారు.
 
 
ఒంటిమిట్టలో జరిగిన కల్యాణ మండప నిర్మాణ పనుల్లో తనకు సహకరించడం లేదని అక్కడి అధి కారులపై ప్రధానంగా తహశీల్దార్‌పై చిందు లేశారు. అటువంటి కీలకమైన తమ్ముడు ప్రస్తుత రాజకీయాల్లో అన్న మేడా వెంట లేక పోవడం పెద్ద చర్చనీయాంశమైంది. ఇటీవల సుండుపల్లె, వీరబల్లినాయకులతో ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తిరిగి మంగళవా రం సాయంత్రం సుండుపల్లె నాయకులతో సమావేశం నిర్వహించారు. ఎవ్వరూ మేడా మల్లికార్జునరెడ్డి వెంట వెళ్లవద్దని, తాను తెలుగుదేశం పార్టీ లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. ఈ నెల 31వ తేదీన ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి తన అనుచరులతో హైదరాబాద్‌కు వెళ్లి జగన్‌ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకునోనున్నారు. ఇటువంటి సమ యంలో కీలకమైన తమ్ముడు విజయ్‌శేఖర్‌రెడ్డి అన్న మేడాకు రాజకీయ ఝలక్‌ ఇవ్వడం పెద్ద చర్చనీయాంశమైంది.
Link to comment
Share on other sites

  • 3 weeks later...
కడపలో ఖరారు!

 

కసరత్తు ముమ్మరం చేసిన చంద్రబాబు
తెదేపా అభ్యర్థుల ఎంపిక దాదాపు కొలిక్కి
ఏడెనిమిది స్థానాలపై స్పష్టత
కడప లోక్‌సభ స్థానానికి ఆదినారాయణరెడ్డి పోటీ

శాసనసభ స్థానాలు 10: కడప, రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు, బద్వేలు, మైదుకూరు, జమ్మలమడుగు, పులివెందుల, కమలాపురం, ప్రొద్దుటూరు
లోక్‌సభ స్థానాలు 2: కడప, రాజంపేట

ఈనాడు, అమరావతి: సాధారణ ఎన్నికల షెడ్యూల్‌ వెలువడే నాటికే శాసనసభ, లోక్‌సభ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను కొలిక్కి తేవాలని భావిస్తున్న తెదేపా అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ దిశగా కసరత్తు ముమ్మరం చేశారు. కొన్ని లోక్‌సభ, శాసనసభ స్థానాల అభ్యర్థులపై రమారమి ఓ స్పష్టతకు వచ్చారు. కొన్నిచోట్ల ఎంపిక చేసినవారిని వెళ్లి నియోజకవర్గంలో పనిచేసుకోమని చెబుతున్నారు. ప్రతిపక్ష నాయకుడు జగన్‌ సొంత జిల్లా కడపలో వచ్చే ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలుచుకోవాలన్న పట్టుదలతో ఉన్న చంద్రబాబు.. అక్కడ ఏడెనిమిది శాసనసభ స్థానాలతో పాటు, కడప లోక్‌సభ స్థానం అభ్యర్థుల్ని దాదాపుగా ఖరారు చేశారు.

కడప జిల్లాలో మొత్తం 10 శాసనసభ స్థానాలుండగా.. ప్రొద్దుటూరు, బద్వేలు తప్ప మిగతా స్థానాలకు అభ్యర్థులు ఇంచుమించు ఖరారైనట్టేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కడప లోక్‌సభ స్థానం నుంచి మంత్రి ఆదినారాయణరెడ్డి అభ్యర్థిత్వం ఖరారైంది. రాజంపేట లోక్‌సభ అభ్యర్థిపై ఇంకా స్పష్టత రాలేదు.

అభ్యర్థులు వీరే?
కడప జిల్లాలో చాలా శాసనసభ నియోజకవర్గాల్లో టికెట్ల కోసం సీనియర్‌ నాయకుల మధ్య తీవ్ర పోటీ ఉంది. చంద్రబాబు వారందరికీ సర్దిచెబుతూ.. స్థానిక పరిస్థితులు, రాజకీయ సమీకరణాల దృష్ట్యా అభ్యర్థుల ఎంపికపై ఒక నిర్ణయానికి వస్తున్నారు.
* కడప శాసనసభ స్థానాన్ని ముస్లిం మైనారిటీలకు కేటాయించనున్నారు. ఇటీవలే తెదేపాలో చేరిన మాజీ మంత్రి అహ్మదుల్లా కుమారుడు అష్రాఫ్‌ను కడప అభ్యర్థిగా ఇంచుమించు ఖరారు చేశారు. వ్యాపారిగా స్థిరపడిన అష్రాఫ్‌ తండ్రి బాటలో రాజకీయాల్లోకి వస్తున్నారు. ఆయన ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే తొలిసారవుతుంది.
* రాయచోటి టిక్కెట్‌ కోసం.. ఆ నియోజకవర్గ ఇన్‌ఛార్జి రమేష్‌రెడ్డి, మాజీ మంత్రి పాలకొండరాయుడి కుమారుడు సుగవాసి ప్రసాద్‌బాబుల మధ్య తీవ్ర పోటీ ఏర్పడింది. రెండు వర్గాల వారినీ ముఖ్యమంత్రి పిలిపించి మాట్లాడారు. పాలకొండరాయుడు మంగళవారం కూడా ముఖ్యమంత్రిని కలసి తన కుమారుడికి టిక్కెట్‌ కోరారు. రమేష్‌రెడ్డికే అక్కడ టిక్కెట్‌ ఇస్తున్నట్టుగా ముఖ్యమంత్రి స్పష్టంచేసినట్టు సమాచారం.
* రాజంపేట టిక్కెట్‌ కోసం బత్యాల చెంగల్రాయుడు, మాజీ మంత్రి పసుపులేటి బ్రహ్మయ్య పోటీ పడుతున్నారు. చెంగల్రాయుడి అభ్యర్థిత్వాన్నే సీఎం ఖరారు చేసే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
* రిజర్వుడు నియోజకవర్గం రైల్వే కోడూరులో చిత్తూరు ఎంపీ శివప్రసాద్‌ అల్లుడు పంతగాని నర్సింహప్రసాద్‌ని బరిలో దించాలని తెదేపా యోచిస్తోంది.
* మరో రిజర్వుడు నియోజకవర్గం బద్వేలులో మాజీ ఎమ్మెల్యే విజయమ్మ ఎవరి పేరు సూచిస్తే వారికి టిక్కెట్‌ ఇవ్వనున్నారు. ఆమె లాజరస్‌ అనే వ్యాపారవేత్త పేరుని సూచిస్తున్నట్టు సమాచారం.
* మైదుకూరులో మాజీ మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డి, తితిదే ఛైర్మన్‌ పుట్టా సుధాకర్‌ యాదవ్‌ల పేర్లను అధిష్ఠానం పరిశీలిస్తోంది. అక్కడ రవీంద్రారెడ్డివైపే మొగ్గుచూపే అవకాశమున్నట్టు తెలుస్తోంది.
* జమ్మలమడుగు టిక్కెట్‌ విషయంలో మంత్రి ఆదినారాయణరెడ్డి, శాసనమండలిలో ప్రభుత్వ విప్‌ రామసుబ్బారెడ్డి తీవ్రంగా పోటీపడ్డా చివరకు ఇద్దరి మధ్య కుదిరిన అంగీకారంలో భాగంగా ఆ టిక్కెట్‌ రామసుబ్బారెడ్డికి ఖరారైంది.
* పులివెందుల నుంచి వచ్చే ఎన్నికల్లోనూ సతీష్‌రెడ్డే పోటీ చేయనున్నారు.
* కమలాపురం టిక్కెట్‌ కోసం వీరశివారెడ్డి, పుత్తా నరసింహారెడ్డి మధ్య పోటీ ఉంది.
* ప్రొద్దుటూరు అభ్యర్థిపై స్పష్టత రాలేదు. అక్కడ బలమైన బీసీ అభ్యర్థిని బరిలోకి దించే ప్రతిపాదనను పార్టీ వర్గాలు పరిశీలిస్తున్నట్టు సమాచారం. మాజీ ఎమ్మెల్యే వరదరాజులురెడ్డి కూడా టిక్కెట్‌ ఆశిస్తున్నారు.

ఎక్కువ స్థానాలు గెలవడమే లక్ష్యం..
కడప జిల్లాలో గత ఎన్నికల్లో రాజంపేటలోనే తెదేపా గెలుపొందింది. అక్కడ గెలిచిన మేడా మల్లికార్జునరెడ్డి ఇటీవలే వైకాపా గూటికి చేరారు. గత ఎన్నికల్లో వైకాపా నుంచి గెలిచినవారిలో జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, బద్వేలు ఎమ్మెల్యే జయరాములు తెదేపాలో చేరారు. పులివెందులకు కృష్ణా జలాలను తీసుకెళ్లడం సహా, ఈ ఐదేళ్లలో కడప జిల్లాలో అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలుచేశామని, అక్కడ వచ్చే ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్ని గెలవాలని నాయకులకు చంద్రబాబు చెబుతున్నారు.

 

Link to comment
Share on other sites

  • 2 weeks later...

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...